19, నవంబర్ 2023, ఆదివారం

ఒక లాలన ఒక దీవెన  సడి చేయవా ఎద   మాటున ... ..

చాలా. ......రోజుల తరువాత బ్లాగు రాయాలి అనే  ఆశ వెంటాడుతుంది . నా కోసం సమయం కేటాయించడం అనేది మరల మరుగున పడిపోతుంది ... వయస్సు పెరిగేకొద్దీ నాకు ఎదో కొత్తకొత్త విషయాలు తెలుస్తూ వున్నాయి ...నిన్న మొన్న ప్రేమలు దూది పింజాలు విడిపోతున్నట్లు  పోతున్నాయి ...మార్పు ఎటునుండి వస్తుంది ..మనం చూడటం లో లోపమా  గతంలో ఇలానే ఉన్నారేమో  బహుశా నాకు అర్ధం  కాదేమో ...ముఖ్యంగా ఒక రక్తం పంచుకుని పుట్టి ఒకరి కంచంలో ది నిరభ్యంతరంగా తినగలిగిన ఒక మంచంలో అందరం ముడుచుకుని ఒదిగి ఒదిగి పడుకుని కబుర్లు చెప్పుకున్న వైనం అంతా ఏమై పోయిందో  మన పిల్లలు ఎదిగే కొద్దీ పోల్చుకోవడం మొదలు అవుతుంది కాబోలు  .. సంవత్సరాలు గడిచే కొద్దీ మరింత దూరం పెరిగిపోతుంది తప్ప దగ్గర కావడం మృగ్యం అవుతుంది .... ఒక లాలన ఒక దీవెన  సడి చేయవా ఎద   మాటున ... అమ్మ నాన్న పూలదండలో దారం లాంటి వారు ఆ దారం ఎప్పుడు తెగిపోయిందో అప్పులే పూలన్నీ చెల్లా చెదురు అయిపోయాయి ..మీరు ఆరుగురు ఎప్పుడు కలిసి మెలసి ఉండాలి అనే అమ్మ నాన్న కోరిక  వాళ్ళతోనే తీసుకు వెళ్లిపోయారు 

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Yes

అజ్ఞాత చెప్పారు...


There is a song which laments about the disappearance of some of the traditional values in today's society.

సంస్కృతిలత విరియబూసినా,
జ్ఞానకాంతి విస్తరించినా
మనుజుని స్వార్థం యుగయుగమ్మున
మహాప్రళయమై ధరిత్రి నిండి
మరుగుపడిందొక మహీధరం

మనిషి మనిషి నడుమ గోడలై
కనలు పగలు చెదలు కీడలై
మనుజధర్మ మహావృక్షరాజం
కణుపు కణుపు తొలిచివేయగా
మరుగుపడిందొక మహీధరం

సమాజమే ఒక సౌధమ్మై
ప్రతి మానవుండొక స్తంభమ్మై
సమాన భారమ్ము మోయకుండ
విషమ భావమ్ముల సమసిపోవగా
మరుగుపడిందొక మహీధరం

Hima bindu చెప్పారు...

thankyou for your immediate respose
.