14, అక్టోబర్ 2012, ఆదివారం

బుజ్జులు తప్పిపోయింది .

బుజ్జులు తప్పిపోయింది .ఇంట్లో నుండి బయటికి అడుగు పెట్టదు కానీ ఎలా వెళ్లిందో మిస్టరీగా వుంది .బుజ్జులుకి పాలు పోసి కాసిని పెడిగ్రిలు వాటిలో పోసి "బుజ్జులమ్మ  బువ్వ తిందువు గాని రామ్మా "అంటూ ఎంత పిలిచినా ఉలుకు పలుకు లేదు మంచాల క్రింద  వంగి చూసి పిలిచినా జాడ కనబడలేదు ఇక శోకాలు పెట్టుకుంటూ గది గది లోను బాత్ రూం లో ఇంటి వెనుక మెట్ల క్రింద వెదికిన బుజ్జులు కనబడలేదు  మేడ పైకి పరుగులు తీసి రెండంతస్తుల ఇళ్లన్నీ గాలించాను .కాళ్ళ కి చెప్పులు కూడా లేకుండా పిచ్చిదానిలా వీధి లోని ప్రతి గడప తలుపు తట్టాను నా ఏడుపుకి కోరస్ నా చెల్లి కూతురు తోడయింది మరిది చెల్లి ఇంట్లో అద్దెకి వున్నా వాళ్ళు ఎదురు పిల్లడు ప్రక్క వీధిలో కాపురం వుండే పనమ్మాయి వాళ్ళ పిల్లలు మూడు కిలో మీటర్లు దూరం లో వున్నా మా భావగారి అబ్బాయి ,మావారు సిక్కుల కాలనీ ఫన్ టైమ్స్ భారతినగర్ బ్యాంకు కొలని బాబా గుడి రోడ్ ఆటో నగర్ స్టెల్ల వెనుక రోడ్స్ ఎనిమిదింటి నుండి పదకొండు వరకు చీకట్లో 'బుజ్జులు ' బుజ్జులు 'బంగారు తల్లి ఎక్కడ ఎక్కడమ్మా అంటూ తిరిగాము చైతన్య హాస్టల్ వాచ్ మన్లకి ,కాలనీల వాచ్ మన్లకి జాడ తెలిస్తే చెప్పమన్నాము బహుమతులు ఇస్తామని చెప్పాము ...అలిసి వరండ మెట్ల మీద కూర్చుని పొగిలి పొగిలి ఏడ్చాము ..నా కూతుర్కి నేనేమని సమాధానం చెప్పాలి పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని మాట ఇచ్చాను నుదురు కొట్టుకుంటూ ఏడుస్తున్న మావార్ని చూస్తె ఎలా సముదాయించాలో తెలియక నేను చైతు భోరుమన్నాము .....తిరిగి ఆశ చావక వెదికిన వీదులే తలొక ప్రక్క పోయాము బాబా గుడి ముందు ఆగిన నేను బుజ్జులు ఇంటికి వస్తే నిన్ను చూస్తాను లేకుంటే జన్మలో నిన్ను చూడ అనుకుంటూ వెనక్కి తిరిగిన నాకు ఫోన్ రింగ్ వచ్చింది ...ఇంటికి వచ్చేయ్  బుజ్జు వచ్చింది  అని .......కాలనీ మూడో రోడ్ లో బుజ్జు మెడ బెల్ట్ పుచ్చుకుని ఎవరో ఇద్దరు పైకి లేపుతుంటే అదేమో కుయ్ కుయ్ అని అరిసిందట అది మా వారి కంటబడి  పరుగున అక్కడ చుస్తే బుజ్జమ్మ డాడి మీదికి దూకిందట .......అల కథ సుఖాంతం ..ఇంటికి వచ్చి పండగల స్వీట్స్  పంచుకున్నాము ...బుజ్జమ్మ పాలు త్రాగి అలసి పడుకుంది ....చెప్పకుండా ఎక్కడికి వెళ్ళవే  అంటుంటే మమ్మల్ని చుసిన ఆనందం తో గంతులు వేస్తుంది ....బుజ్జులు తిరిగి రాకపోతే మా చిన్ని కి ఇద్దరం ఏం సమాధానం చెప్పేవాలమో అసలు అది తట్టుకోగలిగేద ...అసలు ఊహే భయంకరంగా వుంది ...బాబా మాపై దయ చూపాడు . http://himabinduvulu.blogspot.in/2010/11/blog-post_13.html
http://himabinduvulu.blogspot.in/2012/04/blog-post_30.html