31, మార్చి 2009, మంగళవారం

వకుళ పూలు

మీకు వకుళ పూలు తెలుసా? ఈ పుష్పం లేత ఆకుపచ్చ రంగు లో వుండి ,తెల్లదనం ఎక్కువ పాలు కలిగి వుంటుందట తాజా స్థితిలో వృత్తాకారపు ఆకర్షక పత్రాల అంచులు లేత గోధుమ రంగులో వుంటాయట .పువ్వు ఎండిన తరువాత పూర్తిగా గోధుమ రంగులో కి మారుతుందట .ఈ పుష్పాలు సుగంధం వెదజల్లుతూ అన్ని కాలాలు పూస్తుంటాయి అని రెండు గంటల క్రితం ఒక నవల లో చదివాను .ప్రాచిన కథల్లో వకుళ పుష్పానికి ,ప్రణయానికి గట్టి భంధముందని ,నమ్మేవారటపూర్వం దూర దేశాల్లో ఎక్కువ రోజులు గడిపే ప్రేమికులు ప్రియు రాళ్ళను తరుచు జ్ఞాపకం తెచ్చేందుకు చిన్న చిన్న వస్తువులను తమతో బాటు తీసుకుపోయేవారట .అలాటి వాటిల్లో వకుళ పుష్పం ఒకటి ,పుష్పం వాడిపోయిన పరిమళం చేడదటప్రియురాలిపై ప్రియుడి ప్రేమ వసివాడనట్లు. మీకుఎవరికైనా తెలిస్తే చెప్పరు ఆ పూలు ఎక్కడ దొరుకుతాయో ....ఇది కన్నడ కథ తెలుగు అనువాదం .

నా స్నేహితులు -1

మా ఇంట్లో ఆరుగురి పిల్లల్లో ఎక్కువ వ్యవహారాలు ఫ్రెండ్స్ గ్యాంగ్ ను మైంటైన్ చేసే వాళ్లేవరఅని ఆలోచిస్తే ముందు మనముంటాము ఆ తరువాత పెద్ద తమ్ముడుంటాడు.ఇప్పటి కథే కాదు చిన్నప్పటి నుండి వున్నఅలవాటు.ఎప్పుడు సెలవలు రాని ఏవి రాని మేము ఇంట్లో ఆడుకోవాల్సిందే వస్తే మా స్నేహితులు మా ఇంటి కి వచ్చి ఆడుకోవాల్సిందే .మేము వెళ్ళ లంటే బోల్డన్ని ఆంక్ష లు వుండేవి ,ఇందు లో అబ్బాయిలకు ఏమి మినహాయిమ్పు వుండేయి కాదు :-(ఎక్కువగా పక్కింటి పిల్లలో ఎదురింటి పిల్లలో మాతో వచ్చి ఆడుతుండే వాళ్లు .స్కూల్ స్నేహితులు స్కూల్ వరకే పరిమితం అయ్యేవాళ్ళు . పరిస్తతులవల్ల కాని మా అమ్మ శిక్షణ కాని మేము ఆరుగురం మంచి స్నేహితులమే అన్ని విషయాలు షేర్ చేసుకునే వాళ్ళం. మనస్సుకు దగ్గరగా వచ్చిన స్నేహితులు నాకు గుర్తున్నంత వరకు ఆరవ తరగతి వరకు ఒక్కలిద్దరు మాత్రమె .
వేసవి సెలవలకో ,సంక్రాంతి పండుగకో అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ల ఊరు వెళ్ళినప్పుడు కొందరు చుట్టాల పిల్లలతో కలసి ఆడేదాన్ని వాళ్ల ఇళ్ళకు తిరిగేదాన్ని అలానే మా పెద్ద తమ్ముడు అందరితో కలిసి ఆడేవాడు .ఇప్పటికి ఊర్లు వెళ్ళితే మాకు స్నేహితుల కొదవ లేదు మిగిలిన నలుగురికి స్నేహితులు తక్కువ అనే చెప్పవచ్చు.
నాకు బాగా గుర్తున్నంత వరకు నాన్నమ్మ వాళ్ల ఊర్లో మా ఇంటి వెనుకనే బోడి {అన్నపూర్ణ అస్సలు పేరు }అనే అమ్మాయి నా వయస్సుది నేను వున్నన్ని రోజులు వదలక అంటిపెట్టుకుని వుండేది ,ఊరంతా తిప్పేది ,సంక్రాంతి ఎప్పుడు నాన్నమ్మ ఊర్లోనే జరుపుకునే వాళ్ళం ,తెల్లవారు ఝాము భోగి మంటలు దగ్గర్నుండి గట్ల పైన పూసే ముల్లగోరింత పూలు కోసుకోవడం బంతి పూలు కోసుకుని గుమ్మలకి దండలు కట్టడం వరకు పోటీలు పడేవాళ్ళం ,పాపం అన్నిటికి తనే వెనక్కి తగ్గేది .మేము సెలవలు అయ్యి తిరుగు ప్రయాణం అవ్వుతుంటే ఆ వుదయం నుండి భిక్కముఖం పెట్టేది .బోడి ని ఆఖరి సారి చూసింది నా సెవెంత్ క్లాసు సంక్రాంతి సెలవల్లో , వేసవి సెలవలు మొదలయ్యేప్పటికి బోడి చనిపోయిందని కబురు వచ్చింది .పిడకలు గుడు వద్ద పురుగు కుట్టిందని చెప్పిందని ,వాళ్లు పసరు వైద్యం చేయడం రాత్రికల్లా చనిపోవడం జరిగిందట , చనిపోవటం అంటే ఏమిటో మొట్టమొదటి సారి తెలుసుకున్నాను .అప్పటివరకు చావు మీద సరైన అవగాహన వుండేది కాదు ,మా ఊరు వెళ్ళినప్పుడు వాళ్ల ఇంటి వైపు వెళ్లడానికి భాదగా వుండేది , వాళ్ల అమ్మ {శకుంతల పిన్ని }నన్ను ఇప్పటికి చూసిన కంట తడి పెట్టుకుంటది ,వాళ్ల అమ్మాయిని తలుచుకుని , నాకు ఇప్పటికి సంక్రాంతి ,ముల్లగోరింత పూలు ,మినప ,పెసరకాయలు అనగానే స్మ్రితి పదంలో బోడి మెరుస్తది ఒక "మెరుపులా".
నేను ఎనిమిదవ తరగతిలో హాస్టల్ కి వెళ్ళాక చాల మంది స్నేహితులయ్యారు మాదొక పెద్ద గ్రూప్ అయిన అందులోనే సబ్ గ్రూప్ మల్లి అందులో ఇంకో సబ్ గ్రూప్ దాన్లో ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ వుండేవాళ్ళం నాగు నాకు చాల ఇష్టమయిన స్నేహితురాలు మనం ఎంత డామినేట్ చేసిన ఫీల్ అయ్యేది కాదు చాల నెమ్మదిగా వుండేది తనతో సరదాకి కూడా ఎప్పుడు గొడవ పడలేదు ,తనకి నాన్న చిన్నతనం లోనే పోయారని విని నాకు తనంటే ఎంతో జాలిగ వుండి అస్సలు భాద పెట్టడం ఇష్టం వుండేది కాదు.తను నాకు కోపం తెప్పించిన అస్సలు పట్టించుకునేదాన్ని కాదు ఇంటర్ బయాలజీ కలిసే చదివాము ,ఇంటర్ లో తనకి నాకు ఒకటే సెక్షన్ వస్తాదో రాదోనని ఆందోళన కూడా పడ్డాను. మా స్కూల్ గ్యాంగ్ అంత అదే కాలేజీ లో చేరారు అంత డిగ్రీ లు కలిసే ,మనం మాత్రం మిడ్ ఇంటర్ లో నా బృందాన్ని వదిలి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది .అప్పటి మా స్నేహం ఇప్పటికి కొనసాగుతూనే వుంది ప్రతి దినం మాట్లడుకో పోయిన మా మద్య చిన్నప్పటి చనువు వాతావరణం వుంటుంది .ప్రతి ఇయర్ ఏదొక సమయంలో మేము కలుస్తుంటాము ,మా పిల్లలకు ఆశ్చర్యంగా ఉంటది ,ఇంత పెద్ద గ్రూప్ ఇప్పటికి ఎలా వుంటారా అరమరికలు లేకుండా అని .అందరం రకరకాల ప్రదేశాల్లో వున్నాం విదేశాల్లో ముగ్గురున్నారు .అయిన ఎవరు వచ్చిన తీరిక కల్పించుకుని కలుస్తుంటాము .
నేను విజయవాడ వెళ్ళాక అక్కడ కెమిస్ట్రీ ,ఫిజిక్స్ ప్రైవేటు లలో పెద్ద గ్యాంగ్ తయారయింది .అందులలో ఇదివరకులా కాకుండా అబ్బాయిలు కూడా వుండేవారు ,మొత్తం పదకొండు మందిమి . అమ్మాయిలు ఐదు అబ్బాయిలు ఆరు దాదాపు వారంతా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు ,వాళ్ళలో ఫాతిమా నహీద్ అని నాకు అత్యంత ఇష్టమైన స్నేహితురాలు వుండేది ,మనకులాగా తనకిపుస్తకాల పిచ్చి ,ఆఖరికి డిటెక్టివ్ నవల కనబడిన ప్రవేట్ లోనే వెనక కూర్చుని చదివేది .
{తరువాత రాస్తాను }

30, మార్చి 2009, సోమవారం

ఈనాడు కథ

ఆదివారం ఈనాడు పుస్తకం లో వచ్చిన కథ నేటి మానవసంభందాలు కి అద్దం పడుతుంది .తమ కెరీర్ అంటు పెద్ద వారైన తల్లితండ్రులని వారి మానన వారిని వదిలేసినాఆస్తి లో మాత్రం హక్కులు కోర్టులు అంటు తిరిగే బిడ్డలు నేటి సమాజం లో పెరిగి పోతున్నారు . డబ్బు కోసం {తమ కష్టార్జితం కాపోఇన }వ్రుద్దులైన తల్లితండ్రులను చంపడానికి ,వదిలేయడానికి వెనకాడడం లేదు . పెన్మత్స శ్రీకాంత్ రాసిన కథ చదివినంతసేపూ ఆ కొడుకు పాత్ర ను అస్సహ్యిన్చుకుంటూ చదువుతాము. చాల బాధగా అన్పించింది ఆ తల్లి పాత్ర .నిన్నటి ఆదివారం పుస్తకం ఇప్పుడు తీరికగా చదివి మనస్సు పాడు చేసుకున్నాను.మూడ్ పాడు చేసుకోవాలని ఎవరికైనా అనిపిస్తే ఈ కథ చదవండి.

27, మార్చి 2009, శుక్రవారం

శుభాకాంక్షలు

బ్లాగ్ మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు

శుభాకాంక్షలు

బ్లాగ్ మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు

26, మార్చి 2009, గురువారం

మా అమ్మ చుట్టాలు -2

అక్క వాళ్ల డ్రైవర్ కి చెప్పింది ,కాలనీ లో వున్నాఆంధ్ర బ్యాంకు కి తెసుకొని వెళ్ళమని . మాతో పాటు మా పాప కూడా వుంది అదేమో ఏదో అద్బుతం చూడబోతున్నట్లువుంది .{మేము కథలు కథలు గ చెప్పే కబుర్ల వల్ల } నాకు గుర్తున్నంత వరకు నాలుగు రోడ్ల కూడలి లో బ్యాంకు ఉంటుంది అన్నాను .నిజంగానే నాలుగు రోడ్ల కూడలిలో బ్యాంకు ముందు ఆపాడు.అక్కడినుండి మేము కార్ దిగి మారిపోయిన కాలనీ ,బహుళ అంతస్తుల ఇళ్ళుచూసి పద్మ వ్యూహం లో చిక్కుకున్నట్లు వుక్కిరిబిక్కిరి అయ్యాము .ఇంటి నంబెర్ కూడా మాకు తెలిదు .
ఒకప్పుడు విశాలమైన రోడ్లతో చక్కటి డాబా ఇళ్ళు కూలిపోయి వాటి స్థానంలో అగ్గిపెట్టేలాంటి పొడవైన బిల్డింగ్లు ,traffic ranagonalu .ఒకప్పుడు మేము aadukunna చక్కటి కమ్యూనిటి హాల్ ,పార్క్ ,మేము రోజు సాయంత్రం బ్యాంకు పక్క నుండి నడుచుకుంటూ పోయే పాండురంగారావు సార్ ట్యుషన్ఎక్కడో గుర్తు పట్టలేక పోయాం .మేము నడుచుకుంటూ కార్ ని వెనుకనే రమ్మని ఒక్క నిమషం నేను కళ్లు మూసుకుని నేను ఇంటి నుండి బ్యాంకు కి వచ్చిన దారి తలుచుకుని కళ్లు మూసుకునే కొంత దూరం వెళ్ళాను {నిజంగా కళ్లు మూసుకునే} తిన్నగా మా ఇంటి ముందాగాము.ఇదే అక్క మన ఇల్లు అన్నా నా మాట నమ్మలేకపోయింది . {నేను కూడా }అస్సలికి కాదు మన ఇంటి వెనుక వీధి లో రావూరి భరద్వాజ వుండే వాళ్లు vaallaku ,మనకు పెరటి గోడ అడ్దటఅని మళ్ళిచెప్పింది ,అయన అక్కడే వుండి వుంటారని నమ్మకం ఏమిటి అన్నా నా మాటలకి అడ్డమొచ్చి ,లేదు ఆయనది సొంత ఇల్లు ,ఇదే కాలనీ లో వున్నట్లు విన్నానంది .ఇక మేము మళ్ళి కార్ డ్రైవర్ ని ఒక వైపు పంపి మేము అక్కడక్కడ ఆయన గారి ఇంటి కోసం వాకబు చేస్తుంటే ఇంతలో డ్రైవర్ అడ్రెస్స్ దొరికిందమ్మా ,కార్ ఎక్కండి అని పక్క వీధి వైపు కార్ పోనిచ్చి అయన ఇంటి ముందు ఆపాడు .మేము దిగి ఆయన పక్క ఇల్లు దాటి వెనుక వీధి కి వస్తే ఏముంది .మేము మొదట ఆగిన ఇల్లే .మాకైతే ఒకటే ఆచ్చార్యం ఇంత రూపు రేఖలు మారిపోయాయ అని ,మా అక్కకి ఇంక జీర్ణించుకోలేక పోయింది .మా అమ్మాయి మా వంక నిరసనగా చుసిన చూపు మర్చిపోలేదు .
విశాలమైన ఆవరణలో చక్కటి డాబా ఏది ,?ఇంటి గేటు ముందు వచ్చిన వారికి వొయ్యారంగా స్వాగతం చెప్పే జాజి పూల పందిరి ఏది?ఇంటికి ఎడమ బాగం లో సాయమ్త్ర్మవ్వగానే కమ్మని వాసనలతో కళ్లు చెదిరే రంగులతో నునుసిగ్గుతో విచ్చుకునే చద్రకాంత లేవి? పక్కింటి వాళ్ల ఇంట్లోకి భారంగా వొరిగి పోయిన తియ్యని ఎర్ర జామి చేట్టేది ? ఇల్లునంత దాచేస్తూ ,నా నీడ లో నీకేమి భయం లేదు అంటు అభయ హస్తం ఇస్తున్నట్లు పెద్ద దిక్కుగా పెరటిలో వున్నా మామిడి చేట్టేది? మామిడి నీడలో పెరుగుతున్న మల్లె ,సన్నజాజి కనకాంబరాలు ...అయ్యో ఇది మేము వున్నా ఇల్లేనా ..ఇంక పచిగా ,నిన్న మొన్న జరిగినట్లున్న భాల్యపు జ్ఞాపకాలూ ,అద్దాలమందిరం పగిలి బీటలు వారిందే మా ఇద్దరికీ గొంతులు పోయాయి .
ఆ ఇల్లు రూపురేఖలు ఇసుమంతలేవు ,ఆవరణ అంత పిచుక గూడుల్ల అడ్డ దిడ్డంగా ఇల్లు ,గదులు ,ముక్కలు చెక్కలు బహుశా పంపకాల్లో ఏమిటో . నిలబడ లేక పక్కకి కదిలాము . అమ్మ నాన్న లకు ఆప్తులైన ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ మా ఇంటికి కుడి చేతి వైపు చివర్లో వుండేవాళ్ళు . చాలాకాలం వుత్తరాలు రాసుకుని ఇప్పుడు ఎవ్వరేక్కడో తెలీని పరిస్థితి.వాళ్ల ఇల్లు నేను గుర్తు పట్టగాలనని నడుచుకుంటూ ,ఆ ఆంటీ పేరు సావిత్రి అని మా అమ్మాయికి చెప్తూ పార్క్ దాటి సరిగ్గా ఆ ఇంటి ముందాగి ఇదే ఇల్లు అని నేను అనడం నేమ్ బోర్డ్ లో సావిత్రి అని అమ్మాయి చదవడం జరిగిందీ . మా అక్క ఏకంగా చిన్నప్పట్ల ఆంటీ అంటు లోపలికి సరాసరి వెళ్ళడం , ఆవిడనే సావిత్రి ఆంటీ ఏరి అని మేము ఫలాని ఫలానా అనగానే ఒక్కసారే తెల్లబోయి ,తబ్బిబ్బు అయ్యి ,yemtho aanandhapaddaru అమ్మకి ఫోన్ చేసి ఎవరు మాట్లాడతారో విను అని మా అమ్మ కి షాక్ ఇవ్వడం వారితో ,ఆవిడ కోడలు ,పిల్లలతో గడిపి , రాత్రికి సంతోషంగా ఇల్లు చేరాము ,వచ్చే దారిలో ఇంటి వైపు చూడకుండా వచ్చేసాముకనీసం మా అమ్మ వొదిన గార్ని కలిసోచ్చం అన్నా తృప్తి తో .

25, మార్చి 2009, బుధవారం

మా అమ్మ చుట్టాలు {స్నేహితులు}

మా అక్క చెల్లి తమ్ముళ్ళు అంతాకలిస్తే మా బాల్యం లోకి వెళ్ళిపోతాంఅంటే నెమరు వేసుకోవడం అన్నమాట .ఇప్పుడు ఆరుగురం వుద్యోగ రీత్యా కాని ,వివాహ రీత్యా కాని దేశ రాజధాని ,ఆంద్ర రాజధాని రకరకాల ప్రదేశాలలో వుంటున్నాము .మేము చిన్నతనం లో చాల ఊర్లలో చదివాము .ఒక్కొక్క ఊర్లో సంవతరం లేక రెండు సంవత్చారాలే వుండేవాళ్ళం .కొత్త ప్రదేశంలో సెట్టల్అయ్యే లోపే మరో ఊర్లో కొత్తగఅడుగుపెట్టల్సి వచ్చేది .అయిన వెళ్ళిన చోటల్లామంచి స్నేహితులు ఎర్పడేవాళ్ళుముఖ్యమ్గా మా అమ్మ కి ,చుట్టూ పక్కల వాళ్ల తో మంచి రిలేషన్స్ ఏర్పడి అక్కడి వాళ్ళని వదిలి రావడానికి భాద పడేది ,తరుచు ట్రాన్స్ఫర్ అయ్యే మా నాన్న వుద్యోగాన్ని తిట్టుకునేది .నాకు ఊహ రాక ముందు జహీరాబాద్ ,అక్కడినుండి తిరుపతి, హైదరాబాద్,కొత్తగూడెం,చిత్తూర్ కొవ్వూరు రాజమండ్రి ఏలూరు మచిలీపట్టణం నెల్లూరు విజయవాడ ఇలా తిరిగి బోల్డంతమంది చుట్టాలు ఏర్పడే వాళ్లు {మా అమ్మకే పిన్నిగారు ,బాబాయి గారు , అక్కయ్యగారు }:) అమ్మ అని కాదు కాని మంచి స్నేహితురాలని చెప్పవచ్చు .

మేము ఎవరమైన వుద్యోగ రీత్యా మేము చిన్నతనం లో గడిపిన ఊరు వెళ్ళడం తటస్థిస్తే తప్పకుండ మేము అద్దె కున్న ఇంటికెళ్ళి చూసోస్తాము .అక్కడి వారిని కలిసి ఫలానా వాళ్ళెక్కడ వున్నారు అని తెలుసుకుని వాళ్ళ ఇళ్ళకు వెళ్లి వాళ్ల కు అమ్మ కబుర్లు చెప్పి ,వాళ్ల కబుర్లు అమ్మ కి మూట కట్టుకేల్తాము. అమ్మ ఎంత ఆనంద పడ్తుందో వర్ణించలేము . రెండేళ్ళ క్రితం అక్క చిత్తూర్ వెళ్లి గ్రీమ్స్ పేట లో వున్నా మా ఇంటిని చూసి , అక్కడ వున్నా అమ్మ చుట్టాలతో ఒక పూట గడిపి వాళ్ల కబుర్లు ఫోన్ నంబర్ తో వచ్చి మా అమ్మ కు సర్ప్రిసే ఇచ్చింది .అలానే విసాధము మోసుకోచింది మా ఇంటి పక్కనే వున్నా గణపతి వాళ్ల అమ్మ వాళ్ల నాన్న పెట్టె భాదలకి భావి లో దూకి చనిపోయారని ,అప్పుడు అమ్మ చాల ఏడ్చింది .అల అప్పుడప్పుడు మా తమ్ముళ్ళ సహా మా జ్ఞాపకాలు తవ్వుకోడానికి అప్పటి త్రుల్లిన్తలు ఏరుకోవడానికి వేల్తోంటాము .

ఆరు నెలల క్రితం మా అక్క నేను హైదరాబాద్ లోని విజయనగర్ కాలనీ లోని మా ఇంటిని {సొంతం కాదు ,అద్దె }చూద్దామని అక్క ఆఫీసు అయ్యాక ప్లాన్ చేసుకుని వెదకటానికి వెళ్ళాము ,అక్క కార్ డ్రైవర్ కి ఆ ఏరియా మొత్తం తెలుసని చెప్పాడు .మేము అక్కడ ఒకటి రెండు తరగతులు చదివాము .అక్క నేను ఎలా కనుక్కోవాలో గుర్తులు ఊహిస్తూ , మా ఇంటి వెనుక రేడియో లో పని చేసే రావూరి భరద్వాజ ఇల్లు వుండేదని ,అమ్మ ,నాన్న తరుచు అనడం తెలుసని "అక్క చెప్పింది . నేను " ఆంద్ర బ్యాంకు కి వెళ్తే కళ్లు మూసుకుని మనమున్న ఇంటి దగ్గర ఆగుతా అని "అన్నాను. {నిద్ర వస్తోంది మిగతాది వీలైనపుడు}

16, మార్చి 2009, సోమవారం

కొత్త అలవాటు

రెండు రోజులనుండి ఏం తోచడం లేదు రెండో శనివారం కావడం తో ఆఫీస కి వరుసగా సెలవలు వచ్చాయి .చేయడానికి చాల పనులున్నాయి ,కాని వాటి మీద మనసుపెడ్తేకదా ,చదవాల్సిన నవలలు ,వారపత్రికలు నాకోసం ఎదురు చూస్తున్నాయి .నేను పెంచే గారలపట్టిలు{మొక్కలు}నా మీద కినుక వహించాయని తెలుసు ,కాస్త వేసులబటుదోరికితేవాటికి స్నానం చేయిస్తూ కొత్త చిగుర్లు ,కొత్త మొగ్గలు తొడిగాయోమోనని వెదుక్కునే దాన్ని ,ఇప్పుడు వాటి పోషణ పనమ్మాయి కి పురమాయిస్తూ వెళ్ళేప్పుడు వచేప్పుడు వాటిని వాకిటనే పరామర్శిస్తూ వున్నాను ,ఎక్కడో ఓ మూలా సన్నగా వినిపించే పాటలు కూడా మ్రోగడం లేదు .
నాలో ఏదో మార్పు నా దినచర్యలో కూడా మార్పు ,నన్ను అంతగా ఆకర్షించి భంగం కలిగించేదేవిటి అని ఆలోచిస్తే నేను కొత్తగా అడుగు పెట్టిన బ్లాగ్ ప్రపంచం .ఖాళి దొరికితే "జల్లెడ",కూడలి" కొందరి మిత్రుల బ్లాగ్ లు చూడడం . ఇదొక వ్యసనం గ మారే ప్రమాదం కనిపిస్తుంది. ఆఫీసు లో కూడా ఏదో సమయం లో బ్లాగ్ లోకి వెళ్తున్నాను .
నేను ఇంత బుద్దిగాఆలోచిస్తానికి కారణం మన లాప్ టాప్ లో ప్రాబ్లం వచ్చి నన్ను నేను తరచి చుసుకునేట్లు చేసింది . సమ న్యాయం పాటించాలని తీర్మానం చేసుకున్న. ఈ కొత్త ప్రపంచం నన్ను వేటికి దూరం చేయకూడదని కోరుకుంటున్నాను .
మన సిస్టం బాగు అయ్యింది . నా మానసిక సంఘర్షణ నా మొదటి టపా అయ్యింది..

12, మార్చి 2009, గురువారం

నా పెళ్లి ముచ్చట్లు

నిన్న రాత్రి ఒక పెళ్ళికి వెళ్లి వచ్చాను .అది అర్ధరాత్రి ముహూర్తం వధువరులిద్దరు చక్కగా పక్కపక్కనే కూర్చొని ,విందుభోజనం ఆరగించి వచ్చిన ,భందుమిత్రులనుండి ఆశిస్సులు తీసుకుంటూ పెళ్లి ముహూర్తం కోసం ఎదురు చూస్తూ కనబడ్డారు .అస్సలు ముహూర్తం వదిలేసి భందుమిత్రులు వెళ్ళిపోతారు ,పెళ్లిముహూర్తం వరకు వుండలేరని ఇలాంటి ఏర్పాట్లు మన అవసరానికి అనుగుణం గా చేసుకుంటూ పోతున్నాం .నిజంగా పరికించి చూస్తుంటే ఎన్ని మార్పులు వస్తున్నాయి .మన బ్లాగ్ మిత్రుడు "నెమలికన్ను"చాల చక్కగా విశ్లేషణ చేసారు వాళ్ళభామ్మ పెళ్లి మొదలుకుని సమకాలిన అంశాలను స్పృశించారు .

ఏదైనా వ్యవస్థ లో మార్పు అనివార్యమని తెలియచెప్పారు .ఖదీర్ వాళ్ళ జరీనాఆంటీపెళ్లి తో మారిన సాంప్రదాయం తన రచనల ద్వారా ముస్లిం కుటుంబం లోని మార్పు చెప్పారు.
ఇవన్ని చర్చిస్తుంటే నా జ్ఞాపకాల పోదిలోని కబుర్లు తళుక్కు మంటున్నాయి . సరదాగా మీతో చెప్పాలనుకుంటున్నాను .

మా అక్క కి నాకు ఒక గంట తేడాతో ఒక్కరోజే పెళ్ళయింది . అక్క ,నేను ఇద్దరం డిగ్రీ లో వున్నాం .మంచి సంభంధం అని అక్కకి కుదిరాక ,పనిలోపనిగా సంభంధం రావడం తడవు నాక్కూడా సెట్టిల్ చేసేసారు .మా భందువులని
మంచివాళ్ళని మన ప్రమేయం లేకుండానే కుదిర్చేసారు .
ఒక రోజు మేము కాలేజి నుండి వచ్చేసరికి ఇంట్లో చుట్టాలు వచ్చి వున్నారు .మా అమ్మ రొటీన్ గ ఇది పెద్దమ్మాయి ,ఇది రెండో అమ్మాయి అంటు పరిచయం చేసింది.మేము మర్యాదగా ఒక నమస్కారం పడేసి గది లోకి వెళ్ళాము .వాళ్లు వెళ్ళాక తెలిసింది వాళ్ళలో నాకు చేయబోయే అతను వున్నారని .నేను తనని సరిగ్గా చూసింది లేదు .అప్పట్లో మా ఇల్లు నేటి సినిమా "భొమ్మరిల్లు" .మా నాన్న హిట్లర్ .చదువులు కూడా మా ఇష్టం కాదు ,నేనే సాహసం చేసి మెడిసిన్ కాదని ఆయనికి ఇష్టం లేకుండా ఆర్ట్స్ లో చేరాను ,దానికి గాంధీ మార్గంఅనుసరించి సాధించుకున్నలెండి .నాకు కుదిర్చినది అయిన సంభందమయిన మా పిల్లలేవర్కి ఎవ్వరు తెలియరు . మా నాన్న గారు మమ్మల్ని ఒక్కొక్క క్లాసు ఒక్కొక్క ఊర్లో చదివించారు .మేమేమో "పిల్లి పిల్లల్లా "ఊరూరు తిరిగాము మా నాన్న ట్రాన్స్ ఫర్ వలన .
ఆ విధంగా పెళ్లిచూపులు వగైరా లేకుండానే , షరతుల తో {చదువు ఆపమనకూడదు ,వాళ్ళింటికి పంపకుడదు } అమ్మ దగ్గర వాగ్ధానం తీసుకుని ఒప్పుకున్నాను .శ్రావణం లో నిశ్చితార్ధం ,కార్తికంలో పెళ్లి పెట్టుకున్నారు .మా ఇంట్లో జరుగుతున్నా మొదటి ఫంక్షన్ ,ఇద్దరిది అయ్యేసరికి నిశ్చితార్దం చాల గ్రాండ్గా పెట్టుకున్నారు.
ఆరోజు వుదయం పది గంటల ప్రాంతంలో తాంబూలాలు ,మొదట అక్క వాళ్ళది , వచ్చిన స్నేహితులు పక్కింటి వాళ్లు హాల్ లో కూర్చుని వున్నా పెళ్లికొడుకులను చూసి వచ్చి మాకు లైవ్ ఇవ్వడం చేసారు. రెండో అల్లుడు ఆరడుగుల అందగాడు చాల బాగున్నాడు అని అందరు అంటుంటే ,మనం కిటికీ నుండి పెళ్లి వాళ్ళు కూర్చొన్న దిక్కు నా ఫ్రెండ్స్ ,మా ఇంటి పైన అద్దెకు వున్నా రాధ గారు ప్రోద్బలంతో చూసానండి .అతను "బ్లూ షర్టు "లో మెరిసిపోతున్నాడు .చిరునవ్వులు చిందిస్తూ వచ్చే పోయే వాళ్ళను చూస్తున్నాడు .అతని ప్రక్కన స్నేహితుడు ముభావంగా కూర్చున్నాడు .ఆ ప్రక్కన మా కాబోయే భావ గారు ,భంధువులు వున్నారు.
మా అక్క వాళ్ల తరువాత మాది మొదలయింది .మా అత్తా గారు వాళ్ళు ,అమ్మ వాళ్లు అంత కూర్చున్నాక ,పంతులుగారు ఆయన్ని వచ్చి అక్కడ కూర్చోమనగానే బ్లూ షర్టు అబ్బాయి కాకుండా పక్కనున్న అతని స్నేహితుడు వచ్చి పూజ లో కూర్చున్నాడు .అంతే ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళం చూసుకుని {పైన ఇంటి రాధ ,నా ఫ్రెండ్స్ ]ముసిముసి నవ్వులు నవ్వుకున్నాం . అలా జరిగిందండి మా పెళ్లి .నిశ్చితార్ధం అయ్యాక కూడా ఎప్పుడు మాట్లాడలేదు ఫోన్ లోనైనా .కొంత మంది ఎందుకు చేసుకుంటారో అర్ధం కాదన్నట్లు ,నిజమే నాకు తెలిదు ,అమ్మ వాళ్ల మాట వినాలి కాబట్టి చేసుకున్నానేమో .నేను పెట్టిన షరతుల ప్రకారం పిజి కూడా చేశాను , ..మా చివరి చెల్లి పెళ్లి మాత్రం నచ్చనివి పక్కన పెట్టి కావలసినవాళ్ళను ఎంపిక చేసుకుంది . మా ఇంట్లోనే ఎంత మార్పో ! అప్పుడు ఇప్పుడు కేవలం కొన్ని సంవతరాల్లో తేడ ,
a {సరదాగా }పెళ్ళికాని అబ్బాయిలు మీ పెళ్ళిచూపులకు కాని ,పెళ్ళికి కాని ఎవర్ని వెంట తీసుకెళ్ళ వద్దు .. అన్నట్లు మా వారి ఫ్రెండ్ బ్లూ షర్టు పేరు సతీష్ ,రాజమండ్రి లో తను పని చేసే ఆఫీసు లో ఫ్రెండ్ అట .ఇప్పుడు గుర్తోచినప్పుడల్లా మా హస్బెండ్ ని ఆట పట్టిస్తుంటాను.

]

]

8, మార్చి 2009, ఆదివారం

రివేర్స్గ్ గేరు

ఆదివారమైన మహిళను కావడం వల్ల ,మహిళలదినం కార్యక్రమం లో బిజీ గ గడిపి సాయంత్రంనుండి తీరికగా బ్లాగ్ ముందు కూర్చున్న .అస్సలు ఈరోజు జరుపుకునే కార్యక్రమాల గురించి వారం ముందు నుండి మనకు ఒకటే వత్తిడి ,ఎక్కడెక్కడి వాళ్ళో మనలాటి వాళ్ల మొబైల్ ,అడ్రస్ వెదుక్కుని మరి వచ్చి కనీసం పది నిమిషlలు అయిన వచ్చి వెళ్ళమని ,రిక్వెస్ట్ చేస్తే ,వెళ్ళ దగ్గవి అని అన్పించినవి ఆరిటికి టిక్ పెట్టాను ఒకదాని తరువాత ఒకటి వుండేట్లు మార్చుకుని , కాస్త రన్నింగ్ రేస్ చేస్తూ ,లంచ్ తరువాత వున్నా వాటికి "హ్యాండ్ "ఇచ్చి ఇల్లు చేరాను .ఏమిలేని చోట ఆముద వృక్షంలా మనం కనబడతమాయే ,
మూడు రోజుల క్రిందట ఒక ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్లు నా వద్ద కు వచ్చి ,వుమెన్స్ డే జరుపుకుంటున్నాము , మా స్టూడెంట్స్ మదర్స్ ని పిలుస్తున్నాము ,ఎందుకంటె వారి భర్తల చేతిలో అణిచి వేయబడుతున్నారు ,వారికి మహిళా చట్టాలు ,గృహ హింస చట్టాలు ,ఎలా ఎదుర్కొనాలోచెప్పమని ,కొన్ని సమస్యలు చర్చించి మరి వెళ్లారు ,అనచబడుచున్న స్త్రీ లంత ధనిక వర్గం,బిజినెస్ వాళ్లు ,.
ఈ ప్రోగ్రాం కి వేహికాల్స్ పంపి మరి చిల్ద్రెన్ యొక్క మదర్స్ ని పిలిపిమ్చామన్నారు . నేను మూడు ప్రోగ్రాం లకు వెళ్లి నాలుగో దాంట్లో నా మీద బృహతర భాద్యత వుందికదా ,అని దారి పొడవునా ఏమేమి చెప్పాలో ఆలోచించుకుంటూ చేరాను .అతిధి మర్యదలయ్యాక ఫంక్షన్ హాల్లో కి వెళ్ళగానే ,చాలామంది ఆడవాళ్ళ తో పాటు కొన్ని జంటలు మగవాళ్ళు కనబడ్డారు ,, ప్రోగ్రాం మొదలవుతుండగా వరుసగా భార్య,భర్తలు రావడం ,కొన్ని క్షణాల్లో హాల్ సగ ఆడ,మగ జంటల తో నిండిపోయింది .
నాకైతే చచ్చేంత నవ్వు వచ్చింది ,ప్రిన్సిపాల్ కి ఇది షాక్ లానే వుంది .మనం మహిళా దినోతవం లో మహిళలకు ,హితవులు చెప్పాం ,అవి ఏమనగా సహనం తో మెలగండి ,భర్త తోను ,అత్త గారితోనూ , రేపు మీరు కాబోయే అత్త లు కదా ,,మంచితో మీరు సాధించుకొంది ,పిల్లల పెంపకం వగైరాలు చెప్పి బుద్ధిగా ముగించ ,{అక్కడ భర్త ల మార్కులు కూడా కొట్టేసనులెండి}మరి ఇంతకన్నా ఏమి చేయగలం ,స్కూలు వారు తిరుగుబాటు భావాలు తమ భార్యలకు నేర్పిస్తున్నారు అనుకునే ప్రమాదం వుంది.


గృహ హింస చట్టం మహిళా చట్టాలు తదితరవి చర్చించాలనుకున్న., కాని వారి భర్తలు మహిళా దినోతవం సైతం వదలకుండా ,వారేం నేర్చుకుంటారో అనే భయామ్తో వారి వెన్నంటే వచినట్లు అనిపించింది .ఏమైతేనేం వివాదం లేకుండా ప్రశాంతంగా గ బయటపడ్డాను రివెర్స్ లో వెళ్ళడం వల్ల.

అభిమాన రచయితలు

అభిమాన హీరో గురించి ఇంత క్రితం మీతో పంచుకున్నాను ,.ఇకపోతే అభిమాన రచయితగురించి కూడా చెప్పాలి .నాకు ఒక్కో వయస్సులో ఒక్కొక్కరి మీద అభిమానం పుట్టేది ,వరుసగా నాలుగు పుస్తకాలు చదవగానే ,వారి అభిమానినవడం అన్నమాట !ఇలా చిన్నప్పుడు తరుచు పార్టీలు మారుస్తూ వుండేదాన్ని .టీనేజ్ వరకు ఇదే తంతు.
మా ఇంట్లో మా ఆరుగురు పిల్లలకు చదివే అలవాటు వుంది.వారపత్రికలకోసం,నొవెల్స్ కోసం ఒకరితరువాతఒకరని పోటి పడేవాళ్ళం .చదివాక వాటి మీద చర్చ కూడాఉండేది.మాతో పాటు మా అమ్మ కూడా సభ్యురాలే .
ఇప్పట్ల రచయితల ఫొటోస్ తరుచు వచ్చేయి కాదు ,అరుదుగా కనపడేవి ,వారి అడ్రసులు మాత్రం ప్రచురించేవారు .దాదాపు అందరి ఫొటోస్ చూసాం ,కాని ఒకరు మాత్రం ఎలా వుంటారో ,ఊహలక్కుడా అందేది కాదు .
ఆయన రాసిన కథలు చదువుతూ ,దాదాపు ఆ కథ లో హీరో పాత్ర తో రచయితను వుహించుకునేదాన్ని {నేను మాత్రమె సుమా} మీకు ఇప్పటికి అర్ధం అయ్యే వుంటుంది ,ఏ రచయిత గురించి చెబుతున్నానో .ఆయన రాసినవన్నీ చదివాను ,సీరియల్స్ క్రమం తప్పకుండాను చదివేదాన్ని ,చంద్ర బొమ్మల్లో,కరుణాకర్ బొమ్మల్లో ని హీరో తో రచయితను పోల్చుకున్న ,,అదండీ మన అభిమాన రచయిత పట్ల మనకున్న అడ్మిరషన్.
మా చిన్న చెల్లికి కూడా చాల ఇష్టపడేది ,క్లాస్ పుస్తకాలతో పాటు నొవెల్స్ కూడా పెట్టుకుని మంచం కి గోడ కి మద్య వున్నా స్థలం లో ఇరుక్కుని కూర్చొని చదివేది.{నాన్న కాని గదిలోకి వస్తే కనపడకుండా వుంటానికి }

ఒకరోజు చిన్నచేల్లి,పెద్దచేల్లి తబ్బిబ్బుగా ఒక వుత్తరం చదువుతు ,కనబడ్డారు ,వాకబు చేయగా మా చిన్నచేల్లి రచయితకు వుత్తరం రాయటం,ఆయన సమాధానం ఇవ్వడమే కాకుండా ,తను విజయవాడ వస్తోన్నట్లు ,కలవాలంటే మ్యుజ్యమ రోడ్లోని మహాలక్ష్మి బుక్ సెంటర్ కి రమ్మని టైం చెపుతూ రాసారు. మా చెల్లి ని అభినందిస్తూ ,{మనం ఆ పని చేయలేదుకదా ,ఎనిమిదవ తరగతి లో మా నాన్న ఇచిన క్లాసు వల్ల ఎవరికి రాయలేదు ఎంత మనసు లాగుతున్న }ముగ్గురం ఎమైనసరే వెళ్ళాల్సిందే అని నిర్ణయించుకుని అమ్మకి విషయం చెప్పాము .అమ్మ నాన్నకి ఎలాను చెప్పదు.అప్పటికి మేము పెద్దోలం కూడాను.
మేము ముగ్గురం చెప్పిన అడ్రెస్స్ వెదుక్కొంటూ వెళ్ళాం ,మాకు ఏవి సరిగ్గా తెలిసేవి కాదు ,ఆటో అబ్బాయ్ సహాయం తో బుక్ సెంటర్ కి చేరాము. నాకైతే ఒకటే టెన్షన్ ఏదో అద్బుతం చూడబోతున్నాఅన్నంత .బుక్సెంటర్ లో యజమాని ,సేల్స్ కుర్రాడు తప్ప ఎవరు లేరు .మేము వచ్చిన పని చెప్పగానే ,వారు సాదరంగా మమ్మల్ని లోనికి పిలిచి కూర్చోమన్నారు ,,ఆ రచయిత బయట పని మీద వెల్లరని ,మమ్మల్ని వుండమన్నారని చెప్పారు .ముగ్గురం ఆ వుక్కలో,చెమటలు తుడుచుకొంటూ ఎదురు చూస్తో ,ఏ చిన్న అలికిడి అయిన అతనేమోనని చూస్తోండగా ,షాప్ ముందు కీచుమంటూ రిక్షా ఆగింది ,అందులోనుండి తెల్లగా,భారీగా వున్నా వ్యక్తి దిగి లోపలికి వచ్చారు ,మేము ముగ్గురం కబుర్లు చెప్పుకుంట ,హెవీ పర్సనాలిటీ ని ఆసక్తిగా గమనిస్తోండగా ,సదరు యజమాని వచ్చిన వ్యక్తి తో ,,మమ్మల్ని వుద్దేశించి వీరు మీకోసం ఎదురు చూస్తోన్నారు ,మీరు రమ్మన్నారట ,అని అన్నారు.
ఇక చూడండి నా అవస్థ ,వూహలకి ,వాస్తవానికి తేడ తో ,వారితో సరిగ్గా మాట్లాడలేక ,వారు ఆఫర్ చేసిన షోడా ను తాగలేదు ,ఆయన నాది కూడా తాగేసి ,తనకి షోడలంటే చాల ఇష్టమని డిక్లేర్ చేసారు.,మా ఇద్దరి చేల్లిల్ల పరిస్తితి కూడా ఇంచుమించు ఇదే ,కాని నాల గ బయటపడలేదు. అరగంట మాట్లాడి సెలవు తీసుకున్నాం. ఇంటికి వచ్చాక వారం రోజులు ఇదే టాపిక్ ,అందరు నన్నుటీజ్ చేసారు . ఇప్పడు తలుచుకుని నవ్వుకుంటాను , ఈ మద్య సాక్షి ఇంటర్ వ్యూ లో కూడా తన ఫోటో ఇవ్వలేదు .ఇప్పటికి ఆయన నా అభిమాన రచయితే.

4, మార్చి 2009, బుధవారం

ఆలోచించు -ఆచరించు

ఈరోజు మధ్యాహ్నం ఒక షాప్ లో చక్కని సూక్తులు లాటివి చూసానండి .తప్పకుండ నాలానే ఇవి తెలియని వాళ్లు ఉంటారనే చెప్పే ప్రయత్నం .
-సులభమైన పని తప్పులువెదుకుట
-గోప్పగురువు అనుభవం
-వివేకవంతుడు నమ్మినదాన్ని ఆచరించువాడు
-అతి అసహ్యకరమైన ఇతరులను విమర్శించడం
పని
-దుఖబాజకం జీవితం పట్ల నిరాసక్తత
-అతి కష్టమైన పని ఇతరులను ప్రశంసించడం
-అతి నీచలోచన ఆసుయ
-అదృష్టవంతుడు పనులలో నిమగ్నమైనవాడు
-నమ్మదగిన మిత్రుడు స్వ ప్రయత్నం
-గోప్పతప్పు కాలహరణం
ఇంకా చాల ఉన్నాయండి ,కాని నేను నేర్చుకోవలసినవి మాత్రమె ఇక్కడ ప్రస్తావించాను .థాంక్స్ ..దీపక్జువలరీ .