14, మే 2016, శనివారం

నిన్ను చూడక నేనుండగలనా

ఫేస్బుక్  చూడక నెలరోజులు అయ్యింది .కొన్నాళ్ళు దూరంగా ఉందామనే నెల క్రితం ఆలోచన చేసి  మూసేశాను  పెద్ద నష్ట పోయింది యేమిలేదు
ఖాళీగా  సమయం దొరికినప్పుడు మంచి పుస్తకాలు చదువుతున్నాను చాలా చదివేశాను కూడా
  ప్రస్తుతం మరోసారి వెయ్యిపడగల తో మునిగిపోయాను .
ఇంతకీ ఆలోచిస్తే ఫేస్బుక్ మన కాలాన్ని యిట్టె హరించేస్తుందని  చెప్పుకోదగ్గ ఉపయోగాలు అంతగా లేవని :)  

9, మే 2016, సోమవారం

చరిత్ర వినేసాను

నేను  రెండో తరగతిలో చూసాను ఈ ఖిల్లా ని అప్పుడు ఇప్పుడు  యే మార్పు లేదు సాయంకాలం చూపించే రంగుల మెరుపుల కథ తప్పించి ,నాన్న  మా అందర్నీ   తెలిసి తెలియని వయస్సులో తీసికెళ్ళి ప్రతిది వివరించి చెబుతూ సాయంత్రం వరకు త్రిప్పి చూపించారు  బహుశా అదే మాకు అందరికి పునాది అనుకుంటా చరిత్ర అంటే చచ్చేంత ఇష్టం  అదే నన్ను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టింది  నాడు చూసిన  గోల్కొండ నేడు అలాగే హుందాగా    వుంది ఇన్నేళ్ళలో  ఎన్నోసార్లు అనుకునే దాన్ని గోల్కొండ చూడాలని కాని అస్సలు కుదరలేదు  ఇక్కడ ఉద్యోగం పుణ్యమాని  బొత్తిగా భాద్యత లేమి లేకపోవడాన నా భాల్యంలోకి  ఒక్కొక్కటిగా తొంగి చూస్తున్నా మొన్న సంధ్యా సమయంలో చిరు  జల్లుల్లొ తడుస్తూ  (ఇక్కడ రోజు వర్షం కరెంటు కష్టాలే మా  విజివాడే బాగుంది  ) రంగుల్లో చరిత్ర వినేసాను చూసేసాను .