23, డిసెంబర్ 2010, గురువారం

ఇదీ మన పరిస్థితి

ప్రజల కోసం మేము అని చెప్పుకునే నాయకులు జన జీవనానికి ఇబ్బంది కలిగిస్తున్నాం అని ఎందుకు అనుకోరో! గాంధేయ మార్గం అనుసరిస్తున్నాం అని చెప్తూనే తమ స్వలాభం కోసం ఉనికిని చాటుకోవడానికి రాస్తారోకో ,రైల్ రోకో ...ఒక ప్రక్క శాంతిమార్గం లో నిరాహార దీక్ష మరో ప్రక్క ముట్టడి పేరుతో హింసాయుత మార్గం ప్చ్.
జాతీయ రహదారుల్లో ప్రయాణించే వాహనచోధకులకి తీవ్రమయిన అంతరాయం గంటలు గంటలు ...ప్రాణాల మీదకి వచ్చి మెరుగయిన వైద్యం కోసం వెళ్తున్న రోగులు సైతం జాతీయ రహదారుల్లో నిర్దాక్షిణ్యంగా పడిగాపులుపడవలసి వచ్చింది.రాజకీయ స్వార్ధలకోసం సామాన్య మానవులు మూల్యం చెల్లించాల్సివస్తుంది .
థూ వెధవ దాహం

18, డిసెంబర్ 2010, శనివారం

నా షిర్డీ యాత్ర

అప్పుడెప్పుడో ఉత్తుత్తి తీర్ధయాత్రనా అమరనాథ్ యాత్ర


చేసి అందర్నీ నమ్మించేసానుకాని ఈ సారి మాత్రం నిజంగానే వెళ్ళివచ్చాను .అసలే చాలామంది మిత్రులు మొత్తుకుంటున్నారు ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే యాత్రలు చెయ్యాలని ముఖ్యంగా అలనాటి సుప్రసీద్ద కవి "ధూర్జటి "కూడా మొత్తుకున్నాడని:-) ఇరవయ్యి ముప్పయ్యి ఏళ్ళ మద్య విహార విజ్ఞానతీర్థయాత్రలు చేసి అలసిన నాకు తిరిగి కొంత దైవ చింతన (అప్పుడెప్పుడో దేవుళ్ళకి వున్నా నా బాకీ లుతీర్చే నెపము )కలిగి కొత్త అప్లికేషన్లు పనిలో పని పెట్టించడానికి నా ముద్దుల కూతురు నిమిత్తమై కదిలాము కుటుంబం అంతా (ముగ్గురం ).ఈ నాలుగు రోజులు నాలుగు గంటల్లా గడిచిపోయాయి .
షిర్డీ చాల చాల మారిపోయింది చాలా కాలం తరువాత వెళ్ళడం వలన (గతం లో ప్రతి యాడాది వెళ్ళేవాళ్ళం ) రూపురేఖలే మారినట్లు కనబడింది.ఒకప్పుడు బాబా వారి సమాధి అతి దగ్గరగా తాకే అవకాశం వుండేది.సునాయాస దర్శనం వుండేదిఇప్పుడు కనీసం రెండుగంటలు తప్పదురద్దీ సమయం లో ఇంకా ఎక్కువే.కళ్ళ ముందు పూరిపాకలు చిన్న ఊరు సరయిన ఆహారం వుండేది కాదుఇప్పుడు పెద్ద పెద్ద హోటల్స్ ప్రాంతాలవారి రుచులతో భోజన సదుపాయంరవాణాసదుపాయంఆ ప్రాంతాన్ని చూస్తుంటే పెద్ద నగరం లా అనిపించింది .మిగిలిన దేవాలయాల్లో వున్నట్లు ఇంకా శిర్దికి కొన్ని తాకలేదు .సామాన్యులు కి కూడా ఎన్నో సౌఖర్యాలు అందుబాటులో వున్నాయి వి.ఐ.పి దర్శనాలు కొంత ఇబ్బంది కలిగిస్తున్న మిగిలిన దేవాలయాలతో పోలిస్తే లెక్కలోనికి రాదు .భక్తులతో నిత్యం కిటకిటలాడుతున్న షిర్డీ,కనీసం రూపాయి దర్శనం టికెట్ పెట్టిన చాలా ఆదాయం సమకూరుతుంది,కాని ఇటువంటివి ఏవి లేకుండానే ఆలయం చక్కగా నిర్వహించబడుతుంది.ఎన్ని ఒత్తిడులతో వున్నా బాబా ని చూడగానే మనస్సంత ప్రశాంతం గా కొండంత అండ మనకోసం అన్నట్లు అనిపిస్తుంది.వెళ్ళిన రోజే సాయంత్రం హారతికి అందుకున్నాం.చాలా సంతోషం అనిపించింది లేకపోతె అరగంట బాబా ముందు వుండటం కుదరదు కదా ! ఒకప్పటి షిర్డీ యే నాకు బాగున్నట్లు అనిపించింది..అప్పుడు స్వేచ్చ స్వచ్చత అపారంగా ఉండేవి .


12, డిసెంబర్ 2010, ఆదివారం

ప్రియం అయిన స్నేహం

కొంతమంది తో జీవితాంతం స్నేహం నిలిచిపోతుంది .అలాంటి వాళ్ళ లిస్టు లో మా "నాగు " చేరుతుంది.నాగు అంటే నా ఎనిమిదవ తరగతి స్నేహితురాలు.నేను అక్క తో పాటు ఏలూరు తెరిసాహాస్టల్లో చేరగానే నా క్లాస్స్ వాళ్ళు పది మంది చుట్టూ చేరి ఎక్కడి నుంచిఏ స్కూలి నుండి వచ్చానో వివరాలు అడుగుతూ నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే అక్కడున్న వాళ్ళలో ఒకమ్మాయి (నాగమణి )మాత్రం స్వీట్ గా నవ్వుతు చూస్తూ నన్ను ఆకర్షించింది .అప్పట్లో కొత్తగా వచ్చిన వాళ్ళని ఒక వారం కాస్త టీజింగ్ గా చూసేవాళ్ళు (నేను తరువాత అలానే చేసాను ). కాని నాగమణి మాత్రం అస్సలు అలా చేసేది కాదు.ఎవర్ని నొప్పించడం తనకి తెలీదు.చాల మితంగా మాట్లాడేది నేను మాత్రం తనకి అపోజిట్ అయిన మా ఇద్దరికీ స్నేహం కుదిరింది .చెప్పాలంటే నేను తన వెనుకపడి మైత్రి కుదుర్చుకున్నానేమో..నాకు నచ్చితే అలానే చేస్తాను ...గుర్తు రావడం లేదు .ఎవ్వరితోనయిన అభిప్రాయ బేధాలు వస్తే మాట్లాడటం మానేదాన్నికాని 'నాగు 'తో మాత్రం సర్దుకోవడం నేర్చుకున్నానుఎందుకో తెలీదు తనకి నచ్చని పని కి (స్టడీ అవర్ లో సిస్టర్స్ చూడకుండా పుస్తకాల్లోపెట్టి నవలలు చదవడం లాంటివి ) దూరం వుండేదాన్ని.నాగు కూడా నా అల్లరిని నవ్వుతు ఎంజాయ్ చేసేది, స్కూల్లో మా ఇద్దరి సెక్షన్స్ వేరయినా హాస్టల్లో ఉన్నంతసేపు కలిసే వుండేవాళ్ళం.నాగు కి చిన్నప్పుడే నాన్న లేరు ,అది తెలిసి తానంటే ఒకరకమైన కన్సర్న్ అంతర్లీనంగా వుండేది.ఇంటర్ మొదటి సంవత్సరం వరకి తనతోనే కలిసి చదివాను ,ఆ తరువాత నేను విజయవాడ వచ్చిన మా ఇద్దరి మద్య ఏ మాత్రం దూరం పెరగలేదు ,ఎప్పుడైనా ఫోనులో పలకరింపులు (హాస్టల్లో రేస్త్రిక్షన్స్ )చాలా వరకు ఉత్తరాలు ...నేను నాలుగు రాస్తే తను ఒకటి రాసేది అందులోనే ఎన్నో కబుర్లు ....దశాబ్దాలు గడచినా అదే ప్రేమ ,అదే ఆప్యాయత.ఇప్పటికి మెరుపులా మెరుస్తుంది. నాగు ఎవరితో టచ్ లో వున్నా లేకపోయినా నాతో మాత్రం కనీసం ఆరు నెలలకి ఒకసారయిన మెయిల్ రాయడమో ,మాట్లడటమో చేస్తుంది :-) చెప్పా పెట్టకుండా ఇండియా వచ్చి మెరుపులా కనబడి మాయం అవుతుంది .నా స్నేహితులకి నాగు విశేషాలు తెలియాలంటే నన్ను అడగవల్సిందే...పదిసార్లు కాల్ చేస్తే ఒక్కసారే తిరిగి కాల్ చేస్తే ఎవరు మాత్రం ఓపిక పడతారు :-)ఎవరో నాలాంటి వాళ్ళు తప్పించి . రెండు నెలల క్రితం హటాత్తుగా ప్రొద్దున్న ప్రొద్దున్నే కాల్ చేసింది ,నేను మినిస్టర్ ప్రోగ్రాం హడావిడిలో వున్నాను,అయిన అన్నీ ప్రక్కన పెట్టి అరగంట మాట్లాడాను.అప్పుడు అర్ధం అయ్యింది తను నాకు ఎంత ముఖ్యమో....స్నేహం కాని ,ప్రేమ కాని ఇవ్వటమే కోరుకుంటుంది కాని అవతలి వారి నుంచి ఏమి కోరుకోదు అనుకుంటాను ..
నిన్న నాగు కి ఎందుకు గుర్తుకు వచ్చానో..ఒకే ఒక్క లైన్ ఎలా వున్నావు అని.రాసింది,అదే నాకు కొండంత సంభరం.రాత్రి విజ్జి కి వెంకట్ కి చెబితే ఒకటే నవ్వు ...ఆ ఒక్క లైన్ రాయడానికి దానికి ఎన్ని రోజులు పట్టిందో అంటూ ...మరి నాగు అంతే :-)

30, నవంబర్ 2010, మంగళవారం

మమ్మీ డోంట్ వర్రీ

వారం నుండి అనుభవిస్తున్న టెన్షన్ కి మధ్యాహ్నం తెరపడింది .నిజానికి నిన్న మధ్యాహ్నం నుండి ఎదురుచూస్తూనే వున్నాం ...ఉదయం బయటికి వెళ్తూ కూడా ఈ రోజు ఇంట్లో వుంటే బాగుండేదేమో అటు ఇటు అయిన ఎలా ..తను కూడా సమయానికి లేకపోయే అనిపించింది . ..తప్పనిసరి వెళ్ళాల్సిన పరిస్థితి .మొబైల్ మొగినప్పుడల్లా గుండె దడదడ .....అటుఇటు యేరు ...ఎగురుతున్న కొంగలు ..నీలగగన గానవిచలన.....ధరణిజ శ్ర్రేరమణ
..మధురవదన నళిననయన మనవి వినరా రామ .....(నా మొబైల్ రింగ్ టోన్) అనుకున్నట్లే హోం అని డిస్ప్లే ...మమ్మీ ...స్వీట్ గా ....డోంట్వర్రీ .
హమ్మయ్య ఈ సారి ష్యూర్ ....గట్టినమ్మకం .

26, నవంబర్ 2010, శుక్రవారం

దేశవాళి తిండ్లు -రేగువడియాలు


ఈ రోజు ఇంకొకరకం దేశవాళి తిండి పరిచయం చేస్తున్నాను .పైన ఫోటోలోని చక్రం ఆకారం చూసి పిడక అని భ్రమ పడతున్నారేమో కానేకాదు ,దీనిని "రేగుపండు వడియం "అంటారు .ఒక సంవత్సర కాలం నిలువ వుంటాయి.ఇవి ఎక్కవగా గోదావరి జిల్లవాళ్ళు అక్కడక్కడ మావంటి కృష్ణా జిల్లా వాళ్ళు కూడా పట్టి నిలువ ఉంచుతారు .పైన చూసేది కొన్న రేగువడియం ..ఇంట్లో చేస్తే ముద్దగా ఇంకొంచెం చిన్నగా రంగు పండు మిరప కలిగి వుంటాయి .
రుచి ఎలా ఉంటుందంటే పుల్ల పుల్లగా ,కారం కారంగా కొంచెం తియ్యగా వుంటుంది .నేను అత్యంత ఇష్టపడే ఫుడ్ లో రేగువడియాలు ఒకటి .అమ్మ మాకోసం తప్పనిసరిగా సీసన్ లో తయారు చేసేది .మా చిన్న తమ్ముడు శ్రీను కి ప్రాణం ఇవి వుంటే వేరే ఫుడ్ గురించి ధ్యాస వుండదు ...వాడి కి సప్తసముద్రాల అవతల వున్నా కొరియర్ చేయడం మరిచిపోము .
రుచి చూస్తారా ?అడ్రెస్స్ ఇవ్వండీ పంపిస్తాను :-)

24, నవంబర్ 2010, బుధవారం

దేశవాళిచిరుతిండ్లు
ఇక్కడ ఫోటోలలో చూస్తున్నది తేగా అంటారు .రుచి చాల బాగుంటుంది .కొత్తగా ట్రై చేసేవాల్లకి అస్సలు నచ్చదనుకొండీ .ఇవి తాటి పండు ను భూమిలో నాటితే తయారవుతాయి త్రవ్వకుండా వదిలేస్తే బుల్లి తాటిచెట్టు వచ్చేస్తుంది .దీనిని తినడం కూడా కొంచెం కష్టమే ...కాని నేను మాత్రం నేర్చేసుకున్నాను ,ఎలా అంటారా ...చిన్నప్పుడు ముత్యాలముగ్గు సినిమా చూసి తెలుసుకున్నాను :-) అన్నట్లు తెగలు అన్ని చోట్ల దొరకవండీ దొరికిన అంత రుచి వుండవు ...రుచిగల తెగలు తినాలి అనుకుంటే గోదారి జిల్లాకి అడుగు పెట్టాల్సిందే .అక్కడ కూడా ఎర్రమట్టి ఇసుకనేలలో దొరికేవి పొడి పొడిగా చాలా బాగుంటాయి ఊనగట్ల చాగల్లు ప్రాంతాల్లోవి అధిక డిమాండ్ వుంటాయి .అటు ప్రాంతం వెళ్ళడం జరిగితే నా కూడా ఇంటికి తేవడమే కాక అదేదో నేనే పండించినట్లు అందరకి పంపిస్తాను .తినాలి అనుకున్న వాళ్ళు ఒకసారి అటు వెళ్ళినపుడు ట్రై చేయండీ .

దేశవాళి తిండ్లు-జున్ను

ఇక్కడ ఫోటోలో వున్నది స్వచ్చమైన దేశవాళి జున్ను .మొదటి రోజు తీసిన పాలతో నేనే స్వయంగా వండాను .ఎక్కడిదంటే మా చిన్నత్తగారు పెరట్లో బుల్లి బుజ్జాయి పుట్టింది ,అదే సమయంలో గోదారి ఒడ్డున వున్నా ఆ ఊరు పనిమీద వెళ్ళడం జరిగింది .నాకోసం జాగ్రత్తగా దాచి ఉంచింది అత్తయ్య ,కావలసినప్పుడల్లా కొన్ని పాలల్లో ఈ జున్ను పాలు కలుపుకుని ,మిరియాలు ,అల్లం ,యాలక పొడి ,బెల్లం కొంచెం పంచదార కలిపి కుక్కర్ లో పావుగంట పెడితే కమ్మటి జున్ను రెడీ ,ఫ్రిజ్ లో పెట్టుకుని తింటే ఆ రుచి అద్భుతం .
నిన్న రాసిన టపా ఎగిరిపోయింది ,అందుకే మళ్ళి రాసా కష్టపడి :-(21, నవంబర్ 2010, ఆదివారం

కార్తీకం-నా ఉపవాసపూజ

ప్రతి సంవత్సరం కార్తిక పౌర్ణమి రోజు మనకి గొప్ప భక్తి శ్రద్దలు వున్నా లేకపోయినా పూర్తిగా ఆహారం మానేసి (ఒకటి రెండు సార్లు టీ) ఉదయం సాయంత్రం శివాలయ దర్శనం చేసుకుని చుక్కని చూసి ఆవేల్టికి మన భక్తి చాలించి శుభ్రంగా తినల్సినవన్నితినేయడం రివాజు .ఒకవేళ మనం మరిచి పోయిన మా భక్తి చెల్లి (పెద్దది )ముందు రోజునుండే మొదలు పెడ్తుంది "రేపు చీకటితో నాలుగ్గంటలకి గుళ్ళో ఉందామా లేక అయిదు గంటలకి సరిపోతుందా అని ...ఆవు నెయ్యి తెప్పించావ ,లేక అక్కడే కొందామ ,పెద్ద ప్రమిదలు అయితే బాగుంటాయి చిన్నవి మరీ ఇరుకు అనుకుంటా ఇలా వుంటాది ఒకప్పుడు అమ్మ చేసేది ఇంత హడావిడి ,బహుశ అమ్మ వారసత్వం పుచ్చుకుని వుంటుంది .
ఈ రోజు రెండే రెండుసార్లు టీ తాగాను మద్యలో మనకి ఫ్రిడ్జ్ లో వున్నా చాక్లెట్స్ మీద కమల (అమ్మాయి కాదు )మీద మనసు లాగినా చా ....వద్దులే అని మనసుకి సరిపెట్టుకున్నాను ...హమ్మయ్య ఈ రకంగా అయిన ఒక అరకిలో అన్న తగ్గుతానులే అనే దురాశ తో నిన్న నాతో తెచ్చుకున్న బండెడు ఫైల్స్ పైన మనస్సు లగ్నం చేసి హ్యాపీగా హోం వర్క్ పూర్తి చేసి నా కళ్ళు కాళ్ళు డైనింగ్ రూం వైపు వెళ్ళకుండా జాగ్రత్తపడి మొత్తానికి దిగ్విజయంగా కార్తికపౌర్ణమి ఉపవాస దీక్ష పూర్తిచేసాను అప్పటికి ఇంట్లో వున్నా దుష్టశక్తులు నా దీక్ష భగ్నం చేయాలనుకున్న వారి కోరిక ఫలించలేదు .గుడినుండి సరాసరి అమ్మవాల్లింటికి వెళదామనుకున్న (వాళ్ళింట్లో వెయిట్ చూసే మెషిన్ వుంది ,నా దగ్గర లేదు ) ప్రసాదం ఇద్దామని కాని అమ్మే ఎదురొచ్చింది :-(
గుడికి వెళ్ళిన నా మనసు కళ్ళు నేను చేసే పనికన్నా(పూజ ) గుడి ప్రాంగణం లో దేదీప్య మానంగా వెలుగుతున్న దీపలమీద అక్కడ మిలమిల మెరిసిపోయే అందమైన అమ్మాయిల కట్టుబొట్టు పరిశీలనతోనే సరిపోయింది .అక్కడ గంటపైన గడిపిన ప్రశాంతంగా ఓ మూల అరుగుపైన అలానే వుండి పోవాలన్పించింది .విశాలమైన ఆవరణలో రామాలయం శివాలయం ప్రక్క ప్రక్కనే కట్టారు,మా కాలనీ ప్రక్కనే వున్నా సింధిస్ కాలనీ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న గుడి అది ,చుట్టుప్రక్కల కాలనీ వాళ్ళంతా ఇక్కడికే వస్తుంటారు ...మొదట్లో పలుచగా వచ్చేవారు ఇప్పుడు విపరీతమైన తాకిడి ,బహుశ ఆ గుడికి ఆదాయ వనరులు ,వితరణలు సమకూరుతున్నట్లు అక్కడి నిర్వహణ తీరు తెలుస్తుంది. గుడికి వెళ్ళినప్పుడల్లా అనుకుంటుంటాను వీలైనప్పుడల్లా కొంత సేపైనా కూర్చుని వెళ్ళాలి అని ...నా నిర్ణయం ఆ గుడి ఆవరణ దాటి ఇవతలికి రాగానే చల్లటి చలిగాలిలో కలిసిపోతుంది ప్చ్..
పూజ ముగించుకుని గుడి బయటికి వస్తూనే అక్కడ వచ్చే సాంబ్రాణి కర్పూర హారతుల సువాసనకి తోడు గుప్పుమనే మల్లెపూల పరిమళం ఆవరించింది ...ప్రక్కనే బుట్టెడు మల్లిపూలు ...నా కాళ్ళు అప్రయత్నంగా అటేసి కదిలాయి ,నా వెనుకే నా చెల్లి ,రత్నాలు ...మూర ముప్పయ్యి రూపాయలంట ! పావలా అర్ధరూపాయిలు పోయి ,రెండు రూపాయల మూర ఏకంగా ముప్పయ్యి ...కాలంకాని కాలం కదా అని సరిపెట్టుకుని కోనేసాం హ్మ్మం ఎందుకో తెలిదు ఏ కాలం పూలు ఆ కాలం లో వస్తేనే బాగుంటాయని అనిపిస్తుంది.ఈ మల్లెపూలంటే తగని పిచ్చి నిజం చెప్పాలంటేఒక పూవు అందం ఇంకో పువ్వుకి వుండదు ...మల్లెల వాసన ..వేసవి రోజులు ఊరు వెళ్ళితే చిన్నాన్నమాకోసం ప్రతిరోజు గుడివాడ నుండి తీసుకు రావడం ,నానమ్మ పర్యవేక్షణలో మాలలు కట్టడం ...మల్లెల పరిమళాలు అంటే మా ఊరి జ్ఞాపకాలు భాల్యంలో నన్ను అల్లుకున్న పరిమళం ముఖ్యం నా పుట్టినరోజు న నా జడంతా మల్లెపూలతో నిండిపోయేది .........ఏవి నాటి పరిమళాలు ......నానమ్మ ,బాబాయి ఇద్దరు లేరు ....
బంతిపూలు వాసనలకి నా భాల్యానికి బోల్డంత భంధం ...సంక్రాంతి కి నానమ్మ ఊర్లో మేము ఉండాల్సిందే ముద్దబంతులు ,ఊక బంతులు ,బియ్యపు బంతులు ,కారపుబంతి ,ఒంటిరెక్క ....అమ్మమ్మ వాళ్ళ పెరట్లో పొలాల గట్ల మీద కూడా ఉండేవి ...ఆ బంతి పూల వాసన దీర్ఘంగా ఆఘ్రానిస్తే రెక్కలోచ్చే ఊర్లో వాలిపోతాం ....వర్షా కాలం లో వచ్చే చేమంతులు ,చిట్టి చేమంతులు ,గడ్డి చేమంతులు నాన్న వాళ్ళ చెక్ పోస్ట్ నుండి గంపలు గంపలు వచ్చేవి వాటికి నా భాల్యపు వాసనలే ...ఇకపోతే శీతాకాలం లో వచ్చే లిల్లీ (నిషిగంధ ) అదొక గమ్మత్తయిన పరిమళం ..లిల్లీ పూల గుత్తులు ఇంట్లో వుంటే ఎన్నిరోజులయిన పరిమళం ఆ గదిని వీడదు ...ఎక్కడ లిల్లీ పూలను చుసిన వాటి పరిమళం నన్ను తాకిన నా పెళ్లి రోజు గుర్తొస్తుంది ...మా ఇల్లంతా లిల్లీ పూలవాసనలతో ఉండేది ....కాలం కాని కాలం లో ఇప్పట్లా అన్ని రకాల పూలు వచ్చేయి కాదు ........హ్మం కార్తిక పౌర్ణమి.....ఎక్కడ్నుంచి ఎక్కడికో పంపేసింది .

నచ్చిమెచ్చినవి

20, నవంబర్ 2010, శనివారం

13, నవంబర్ 2010, శనివారం

బుజ్జులు దాని చెల్లి ఖయూ

కొన్నాళ్ళ క్రితం బ్లాగ్ మిత్రులు జయ గారు తదితరులు బంగారం(బుజ్జులు )కబుర్లు అడిగారు ...వాళ్ళకోసం :-)

12, నవంబర్ 2010, శుక్రవారం

కాల చక్రం లో

కాల చక్రం గిర్రున తిరగటం అంటే ఇదే కాబోలు ....నిన్నగాక మొన్న జరుపుకున్నట్లు అనిపిస్తుంది .అంతలోనే సంవత్సరం అయిపొయింది ..అనుకున్నవి జరగలేదు అనుకోని మార్పులు ఎన్నో ఎన్నెన్నో ...నిరంతర ప్రయాణంలో నిన్ను గూర్చినీవు ఇసుమంత కూడా ఆలోచించకుండా మా ఇద్దరికోసం మా ఆనందం కోసం అలుపెరగని యోధుడిలా నిరంతరం తపనపడ్తున్ననీకు మేము ఏమిచ్చిన తక్కువే ......
నిండు ఆరోగ్యంతో మొక్కవోని ఆత్మవిశ్వాసం తో జీవనయానం సాగిపోవాలని ....ఇలానే మరిన్ని జరుపుకోవాలని ......

4, నవంబర్ 2010, గురువారం

క్షమించు (మన్నిపాయ )

ఓ మన పెన్నే

1, నవంబర్ 2010, సోమవారం

నమ్మకం

హమ్మయ్య !నిలబడ్డాను .

30, అక్టోబర్ 2010, శనివారం

AASARA

"ఆసరా"

రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ ఒకటవ తారికున ఈ స్కీం లాంచ్ చేస్తుంది .నిజంగానే వృద్దుల పాలిట వరమే.నానాటికి క్షీణిస్తున్న రక్త భందాలు ,పెరిగిపోతున్న వృద్దాశ్రమాలు ఒకరకంగా "నిర్లక్ష్యం "చేయబడుతున్న మన సీనియర్ సిటిజన్స్ కొరకి రూపొందించిన కార్యక్రమం .

29, అక్టోబర్ 2010, శుక్రవారం

నా అద్దాల గోల -2

సంవత్సరం నుండి రీడింగ్ గ్లాస్సెస్ తో నడుపుతున్న నాకు అవి కూడా ఇబ్బంది పెట్టేస్తున్నాయి ఇక లాభం లేదని నిన్న కళ్ళడాక్టర్ దర్శనం చేసుకున్నాను ,కేవలం చదివేప్పుడే కాకుండా పెర్మనెంట్ గా వాడండీ కంఫర్ట్ ఉంటుందని సెలవిచ్చారు డాక్టర్ గారు అదనంగా ఈరోజు నుండి మనతోనే ఈ రెండు కళ్ళు .
డిగ్రీ మొదటి సంవత్సరం చదివే రోజుల్లో మా కాలేజిలో సగం పైనే కళ్ళద్దాలు పెట్టుకునేవాళ్ళు అదేంటో అలాటి వాళ్ళను చూస్తే మేధావుల్లా కనబడేవాళ్ళు(చదువుల్లో ఎంత మొద్దు వాళ్ళయిన ) గొప్ప ఆరాధనగా చూసేదాన్ని.నిజానికి అప్పట్లో ఫాషన్ కూడా :-) మా క్లాస్స్ లోను చెప్పాలంటే మా కాలేజీలోను (మారిస్ స్టెల్ల కాలేజివిజయవాడ ) గ్లాస్సెస్ వాడేవాళ్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందికారణం మా కాలేజికి దగ్గరలో కొత్తగా కంటి హాస్పిటల్ పెట్టారని తెలిసింది .
ఆ డాక్టర్ చాల అందంగా ఉంటారని కథలు కథలుగా చెప్పుకునేవాళ్ళు .
నేను ఇంకొంతమంది ఫ్రెండ్స్ కలిసి ఆ డాక్టర్ ని చూసి రావాలని నిర్ణయించుకుని వురకనే వెళ్తే బాగోదని కళ్ళు టెస్ట్ అనో తలనొప్పి అనో కారణం చెప్దాము అని మద్యాహ్నం లంచ్ సమయం లో నలుగురం వెళ్ళాము తీరా ఏంటి ప్రాబ్లం అని డాక్టర్ అడిగితె అందరం తలనొప్పి అని చెప్పాము (ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంది )మా లలితా అయితే ఆయనేమి అడిగిన గుడ్లప్పగించి చూసింది డాక్టర్ కి మా ప్రాబ్లం అర్ధం అయినట్లుంది నవ్వుకుంటూ మా నలుగురికి గ్లాస్సెస్ రాసారు .
రెండ్రోజుల తరువాత మా నలుగురి ఫ్రెండ్స్ కి స్క్వేర్ టైపు అద్దాలు అమరాయి (నన్ను ఇంట్లో అమ్మ తిట్టింది చెప్పకుండా నా అంతట నేను ఫ్రెండ్స్ తో వెళ్ళినందుకు )...అవి కళ్ళకి పెట్టుకోవాలంటే చిరాగ్గా వుండేది అవి తీసి ఎప్పుడు తలపైన తగిలించుకునే దాన్ని...కొన్నాళ్ళు కష్టం మీద భరించానుమిగిలిన వాళ్ళ పరిస్థితి ఇదే ...నా పెళ్లినాటికి కి వున్నాయి కంటి చూపు ప్రాబ్లం ఉందేమో అని అనుకున్నారట మావారు,..తరువాతరువాత అవి తీసి అవతల పడేసాను ....ఇక ఇప్పుడు నిజంగా పెట్టుకోక తప్పడం లేదు .
ఆ డాక్టర్ చాల అందంగా వున్నాడు అప్పట్లో మా కళ్ళకి సినిమా హీరోలానే వున్నాడు ఆ క్లినిక్ పేరు గొర్రెపాటి క్లినిక్ ..కళ్ళ డాక్టర్ అనగానే మా అందరికి ఆయనే గుర్తొస్తారు తలుచుకుని నవ్వుకుంటాము .

21, అక్టోబర్ 2010, గురువారం

మా గ్రీమ్స్ పేట మునిసిపాలిటి స్కూలు

గత యాడాది జూలై నెలలో రెక్కలొచ్చి ఎగిరిపోయిన నా చిన్నప్పటి బహుమతి పుస్తకం గురించి వాపోతూ పోస్ట్ రాసుకున్నాను ..ఆ పుస్తకం తీసుకుని వెళ్ళిన మా టీచర్ని ఓ పాలి అడిగేస్తే అని బ్లాగ్లో అనుకోకుండా తగిలిన మైత్రివనం మిత్రులు అనేసారు ...చాలా సంతోషంగా అనిపించింది .నిజంగా బ్లాగ్స్ విడిపోయిన పరిచితుల్ని ,అస్సలే తెలియని అపరిచితుల్ని ఒక దగ్గరికి చేర్చడానికి వారధిగా సహాయపడుతున్నాయి .http://mhsgreamspet.wordpress.comబ్లాగ్ నేను చిన్నతనం లో అయిదు ఆరు తరగతులు చదివిన గ్రీమ్స్పేట మునిసిపల్ స్కూల్ పిల్లలు (ఒకప్పుడు )రాస్తున్న బ్లాగ్ .వాళ్ళ జ్ఞాపకాలు,చిన్ననాటి మిత్రులన్దర్నీ ఒక దగ్గరికి చేర్చుకునే ప్రయత్నాలు చుస్తే మనస్సు తడిఅవ్వక మానదు .ఈ బ్లాగ్ చూస్తూ నేను అత్యంత ఇష్టపడే భాల్యం లోకి వెళ్ళిపోతున్నాను.ఎన్నో జ్ఞాపకాలు ఎన్నో ఎన్నో ...
భూచక్రగడ్డ రుచి చూసింది ఆ స్కూల్ లోనే అది తింటూ అమ్మతో మూతిమీద కొట్టించుకున్నది అక్కడే "అడ్డమైన గడ్డి తింటున్నాను అని ...తాటి చెక్కలు అక్కడే చవి చూసాను ...బలే రుచిగా ఉండేయి ...పరిగిపళ్ళు అక్కడే తెలుసు ....తలుచుకుంటుంటే మళ్ళి ఆ రోజుల్లోకి వెళ్ళిపోవాలని ..............

18, అక్టోబర్ 2010, సోమవారం

అమ్మ కి జేజేలు

ఒక్కో యాడాది గడిచే కొద్ది దిగులుగా వుంటుంది ..మరల వచ్చే యేడు ఇలానే "అమ్మ " మా అందరి సమక్షం లో తన పుట్టినరోజు జరుపుకోవాలని చాలా ఆశ .నాకు ఊహ వచ్చినప్పటినుండి చూస్తూనే వున్నాను అమ్మ పిల్లలందరికీ ఘనంగా పుట్టినరోజు పండుగ చేయడమే కాకుండా తనది కూడా శ్రద్దగా జరిపేది (నాన్న జరిపించేవారు )ప్రతినెల మా ఇంట్లో ఎవరిదోకరిది పుట్టినరోజు వుంటుంది ,మామూలు పండగకంటే వీటికే మాఇంట్లో ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది .ఈ భూమి మీద సంతోషముగా ఇన్ని సంవత్సరాలు ఆత్మీయులందరి తో కలసి జీవించడం అదృష్టంగానే భావిస్తుంటాం ..ఇలాటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో రావాలని కోరుకుంటాం .

అమ్మ అరవయ్యిలో వుంది ,ఇంతమందిని పెంచిన ,తనకి ఎంత అనారోగ్యం వున్నా ముఖంలో లేశమాత్రం విసుగు చూపక నవ్వుతు కళకళ లాడుతుంది "అమ్మ" .అమ్మ ముఖం లో వార్ధాఖ్యం చాయలు తొంగి చూస్తున్నాయి ఇప్పుడిప్పుడే ముంగురులు వెండి తీగల్ల మార్పు చెందుతున్నాయి .తన ఆరోగ్యంలో చాల తేడా వచ్చింది .అమ్మ లో ఈ మార్పులు చూస్తున్నప్పుడల్లా మనస్సంతా భాద తో నిండిపోతుంది .

ఈ రోజు పూర్తిగా అమ్మ తో చెల్లి వాళ్ళందరితో పాటు గడపాలనుకున్న కాని నాకున్న భాద్యతలతో అవకాశం లేకపోయింది..చిరు జల్లుల్లో మసక చీకట్లో అందరికంటే ముందే నేనే అభినందనలు చెప్పివచ్చాను ....అమ్మకి ఎప్పుడు ఇచ్చే గులాభి గుత్తులు మాత్రం ఇవ్వలేకపోయాను ....

.సాయంత్రం .....

మనుమరాళ్ళ సమక్షంలో పిల్లలంతా హ్యాపీ బర్త్ డే పాడుతుండగా అమ్మ మా అందరి నోళ్ళు తీపి చేసింది .

కనిపించని ఆ దేవుడ్ని వేడుకుంటున్న "అమ్మ ఆరోగ్యం తో తన మనవల పెళ్ళిళ్ళు కూడా తన చేతుల మీద జరిపించాలని ,ఆ నివాసం (నా పుట్టిల్లు )ఎప్పటికి కళ కళ లాడాలని ...................

"అమ్మ రియల్లీ యూ ఆర్ గ్రేట్ "

7, అక్టోబర్ 2010, గురువారం

కొత్త భాద్యత

కొత్త ఉజ్జోగంలోకి వెళ్లి ఓనమాలు నేర్చిహమ్మయ్య చాల్లే తెలిసిన ఈ అక్షరాలతో బండి నడిపించేద్దాం అనుకుంటూ కులాసాగా బ్లాగులు బుక్కులు చదువుకుంటు గడిపేస్తున్న నాకు ఈ ప్రత్యెక అధికారం నన్ను ఉక్కిరిబిక్కి చేసేస్తుంది :-(.ఒక ప్రక్క అనుకోకుండా వచ్చిన అవకాశం అని ఆనందపడిన ఈ జవాబుదారీతనం నన్ను ఊపిరి పీల్చుకోనియడం లేదు.

ఏది ఏమైనా అన్ని పనులు ప్రక్కనపెట్టి దీనికి న్యాయం చేయాలనే .........

24, సెప్టెంబర్ 2010, శుక్రవారం

నా అమరనాథ్ యాత్ర

"అమ్మాఅమరనాథ్ యాత్ర కి వస్తావేమో రాజిపిన్ని కనుక్కోమంది " సాయంత్రం కాస్త త్వరగా ఇల్లు చేరిన నన్ను అడిగింది నా పుత్రికారత్నం .
హు ...ఇంకా తీర్థయాత్రలు చేసే వయస్సుకి చేరలేదేమోనని నా అనుమానం రిటైర్ అయ్యాక ఆలోచిస్తాను అని చెప్పు "అని నవ్వుతూ అనేసాను ఒక ప్రక్క ఇదేవిటి ఇంత సడెన్గా అమరనాథ్ మీద ద్రుష్టి మళ్ళింది ఎందుకాఅని ఆలోచిస్తూ ...
"నువ్వు వస్తావని మేము వెళ్ళకుండా ఎదురు చూస్తున్నాం రా మమ్మీ "కొంచెం బ్రతిమాలుతూనా జూనియర్ .
"నువ్వు వెళ్తావా !"నేను .
"నీకు మన ఊర్లో ఏమి జరుగుతుందో నీకు తెలీదు కదూ,అచ్చు అమరనాథ్ యాత్ర ఫీలింగ్ కలుగుతుందట ఎగ్జిభిషన్ గ్రౌండ్ లో పెట్టారట చాల బాగుందట ఒక్క అరగంట "అమ్మాయి .
పావుగంటలో తయారయ్యి అక్కడున్నాంఎంట్రీ ఫీజ్ తో కలిపి అరవయ్యి రూపాయిలు,చక్కటి సృష్టి నిజంగా హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేస్తున్న అనుభూతి కాస్త విజయవాడ వేడిగాలి తప్పించి :-) కొండల్లో జలపాతాల హోరులో వాగు నీళ్ళు దాటుకుని గుహలోని స్పటిక లింగం దర్శనం చేసుకున్నాం .అక్కడ మాత్ర ఏ.సి పెట్టారు,అక్కడ తమిళ స్వామి భక్తులకి వివరిస్తున్నారు.
తప్పక చూడండి విజయవాడలో వున్నవారు .

నాలోనే పొంగెను నర్మదా

నా లోనే పొంగెను నర్మదా
నీళ్ళల్లో మురిసిన తామరా
అంతట్లో మారెను ఋతువులా
పిల్లా నీ వల్ల ...............
కంటి నిద్రే దోచుకేల్లావ్
ఆశలన్నీ జల్లి వెళ్ళావ్
నిను దాటి పోతువుంటే
వీచే గాలి దిశలు మారు
సుర్యలో పాట ఇటీవల వెంటాడుతుందిఎందుకో:-)

21, సెప్టెంబర్ 2010, మంగళవారం

మీకు తెలుసా?

"గోధూళివేళ "అంటే ఏమిటో ఈ మద్య చతురలో ఒక నవలలో తెలుసుకున్నాను ,అలాగే "ముసురు "పట్టడం అంటే కూడా తెలిసింది .గోధూళి అంటే గోధుమపిండిని జల్లిన్చేప్పుడు లేచే పిండి :-)
ముసురు అంటే దోమలు ముసురేసమయం అంట.:-)
ఒక టీచర్ పిల్లల్ని తెలుగులో అర్దాలు అడిగితె చెప్పిన సమాధానాలు .

19, సెప్టెంబర్ 2010, ఆదివారం

బుజ్జులు మొరుగుతుంది

మా బుజ్జులు (మా బుజ్జి కుక్కపిల్ల)కి దొంగల్ని పట్టుకోవడం వచ్చేసింది .నాలుగు నెలల నుండి చూస్తున్న కొత్తవార్నిచూసి కనీసం తన లక్షణం చూపడానికి అయిన మొరుగుతాదేమో అని ఎదురుచూసేదాన్నిఅబ్బే వుహు అస్సలు మొరగడం అటుంచి చాన్నాళ్ళు నుండి తెలిసినట్లు వెళ్లి వల్ల దగ్గర తన అందమైన కుచ్చు జడని ఆడిస్తూ కొత్త వాళ్ళ దగ్గర సెటిల్ అయ్యేది మనల్ని ఏమాత్రం పట్టించుకోకుండా .అబ్బ ఇది కుక్క పిల్లా లేక పిల్లిపిల్లా అని తెగ విసుక్కునే దాన్ని అలా అంటుంటే మా అమ్మాయికి చాల కోపం వచ్చేది అది పిల్లి కాదు కుక్కే అని తేల్చడానికి తాపత్రయపడేది.
మొన్న రాత్రి నిద్రలో నుండి ఉలిక్కిపడి లేచాను అప్పటికే మా శ్రీవారు,పుత్రిక హాల్ లో కిటికీ నుంచి బయటికి ఎవర్తోనో మాట్లాడుతున్నారు బుజ్జులు ఆపకుండా దాని బుల్లిగొంతు తో వువ్ వువ్ అనిరెట్టించిన ఉత్షాహం తో అరుస్తోంది.పోర్టికో లో కార్ వెనుక ఇద్దరు వ్యక్తులు నిలబడి వున్నారు గేట్స్ వేసే వున్నాయి పొరపాటు న వారి ఇల్లు అనుకుని వచ్చాము అని చెబుతున్నారు,టైం చూస్తె మూడు అవుతుంది మావారి కేకలకి చెట్ల లోకి మాయం అయ్యారు రెండు నిమిషాల్లో మా ఇంటి పైన వున్నా చెల్లి వాలింట్లో కేయూ (బుజ్జులు సిస్టర్)అరవడం వినబడింది.చెల్లికి ఫోన్ చేయడం వాళ్ళు లేవటం దొంగలు గప్చుప్ అయ్యారు .మా ప్రక్క లేన్ లో ఒక ఇంట్లో లాప్ టాప్ మనీ కొన్ని వస్తువులు పట్టుకు పోయారు.మా బుజ్జులు అలికిడికి మొరగడం మా పాపకి ముందుగా మెలకువ వచ్చి బుజ్జుకి ఏమైందో ఆని గాబరాగా వెళ్లి చూడగా అదేమో తలుపు వైపు తిరిగి అరుస్తుందట ఈలోపు ఈయన లేవడం కథ సుఖాంతం అయ్యింది .దాని బుల్లి అరుపులకి మురిసిపోయి అందరం తెగ మురుసుకున్నం.ఇప్పటికయినా అర్ధం అయ్యిందా నేనేను ఎవర్నో అన్నట్లుబుజ్జులు నా వైపు లుక్ ఇచ్చింది వాళ్ళ అక్క భుజల పై తల వాల్చి .

5, సెప్టెంబర్ 2010, ఆదివారం

నటించాలని వుంది

నాకు నటించాలని వుంది.కాని నిజ జీవితంలో చేతకావడం లేదు .చిన్నప్పటినుంచి చేతకానిది ఇప్పుడు నేర్చుకుందాం అనుకున్న లెక్కలు నేర్చుకున్నంత కష్టంగా వుంది .అదేంటోగాని వున్నది వున్నట్లు మాట్లడడం నా బలహీనత అలా అని ఇతరుల మనోభావాల్ని గాయపరచాలి అనుకోనుఅస్సలు ప్రయత్నించను అలాగే ఎదుటివారు అలానే వుండాలి అనుకుంటాను.అంత అంటూ వుంటారు నా ముఖం సులువుగా చదివేయోచ్చని నా స్టేట్ఆఫ్ మైండ్ తెలిసిపోతుందట.సంతోషాన్ని,భాద ని,కోపాన్ని,రంగు రంగులాగా చుపించేస్తనట.ప్చ్ ఇవ్వేమి ఎదుటివారు చదవకుండా నటించడం నేర్చుకోవాలి.ఇవ్వాళ్ళ రేపు ఉద్యోగంలో కాని సామాజిక సంభందాల్లో నటించడం చాలా అవసరం అని నెమ్మది నెమ్మదిగా అవగతం అవుతుంది ఇంత లేటు వయస్సులోనయిన కొంతయిన నేర్చుకోక తప్పదేమో .
స్కూల్లోను కాలేజీల్లో ను రంగస్థలం మీద నటించి ప్రత్యెక బహుమానాలే పొందాను నా నటన తో ప్రేక్షకుల కళ్ళలో నీళ్ళు తెప్పించిన సందర్బాలు వున్నాయి . కాని నిజజీవితంలో నటించడం రానందుకు నా మనసు తడి చూడాలి అనుకుంటారు కొందరు.అందుకే అలాటి వారికొరకైననేను 'నటించడం'నేర్చుకోవాలి.

1, సెప్టెంబర్ 2010, బుధవారం

ఈ రోజు నాదే

''రేపటి సెలవు రోజు నాది కదా ''అంటూ రాబోయే ఆఫ్ ని తలచుకుంటూ ,ఆ రోజు చేయవలసిన పనులు లిస్టు చెబుతుంటే నాకు అసలు అర్ధం అయ్యేది కాదు ఇంతల సెలవురోజు కొరకు ఎదురు చూస్తారా అని .
పది ఏళ్ళు నా సమయం నా చేతి లో వుండేది నా పై కమిషనర్ భాగ్యనగరం లో వుండటం మా పై జిల్లా కలెక్టర్ కి ఎటువంటి నియంత్రణ లేకపోవడం ఒక విధంగా స్వేచ్చగా వుద్యోగం వెలిగింది.ఇప్పుడు కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు నా సమయం నా చేతిలో లేకుండా పోయింది,కదలాలి అంటే పెర్మిషన్ ,జ్వరం వచ్చిన ఇష్టం వచ్చినట్లు ఇంట్లో వుండే పనిలేదు అందరికి సెలవయిన మాకు ఉంటుందో ఉండదో అని ఆలోచన ....హమ్మో సెలవు అంటే ఎంత ప్రియమో ప్రాక్టికల్గా అర్ధం అవుతుంది ...ఈ రోజు కృష్ణాష్టమి ఈ రోజు వేరే పనేమీ ,ప్రోగ్రాం కాని లేదు ..ఈ రోజు నాదే .

7, ఆగస్టు 2010, శనివారం

మా బెజవాడ అందమైన నగరం
మా బెజవాడ అందమైన నగరం.సహజసిద్దంగా కొండ కొనలమద్య ఏర్పడింది.ఎంతో ప్రశాంతంగా ,ఆహ్లాదంగా సహజ సౌందర్యం తో మా నగరాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలవు.ఈ జిల్లాలో పుట్టినందుకు ఈ ఊర్లో నా చదువు సంధ్యలు జరిగినందుకు నా ఊరు ఇదే అని చెప్పుకోవడానికి గర్వపడతాను.ఉదయం సాయంత్రం రాత్రుళ్ళు అలా మేడ పయికి ఎక్కి చుట్టూ ప్రకృతిని చుస్తే ................ఈ జన్మకి ఇది చాలు అన్పిస్తుంది .


హై వే వస్తుంది (విజయవాడ -హైదరాబాద్ )

కొన్ని నెలల క్రితం హై వే ఎప్పుడు వస్తుందో అని భాద పడిపోతూ నా బ్లాగ్ లో నా వ్యధ వెళ్ళబోసుకున్నాను.మొత్తానికి నా కోరిక నాలాటి ప్రజల కోరిక ముఖ్యంగా విజయవాడ వాసుల కోరిక తీరుతుంది.కొన్నాల్లక్రితం పని మొదలు పెట్టినట్లున్నారుజనావాసాలు లేని చోట్ల చాల పనిపూర్తయ్యిందిట్రాఫిక్ జామ్ అయ్యిన చోట్ల ప్రక్కనే వేస్తున్న గ్రావెల్ రోడ్ లోకి దిశ మార్చుకుని వాహనాలన్నీ వెళ్లి పోతున్నాయి బహుశ ఈ యాడాది చివరికల్లా ఫోర్వే ముస్తాబు అయ్యే సూచనలు కనబడుతున్నాయి.నిన్న ఉదయం వెళ్ళే ప్పుడు సాయంత్రం వచ్చేప్పుడు ఆనందంగా చూస్తువచ్చాను.ఇక ఇంట్లోవాళ్ళు టెన్షన్ పడరు బుల్లి కారు ప్రయాణం అంటే అలానే బోల్డంత సమయం కలసి వస్తుంది .
అంతా బానే వుంది కాని ఒక విషయం మనస్సు ని కలచివేసింది.ఎన్నో తరాలకి సాక్షిబూతంగా నిలబడి గుర్రాలకి,ఎడ్ల బండ్లకి,గోర్రేలకి,మేకలకి,పశువుల కాపర్లకి,పశుపక్షాదులకి సేద తీర్చి,ఆవాసమై నీడనిచ్చిన ఆ మహా వృక్షాలు అన్నీ నేలకొరిగిచిద్రమై వాటి ఆనవాళ్ళు మొదళ్ళుగత వైభవానికి సాక్షిగా ఇంకా దారిపొడవునా దర్శనం ఇచ్చాయి కొన్ని చోట్ల ప్రోక్ల్యినర్ ఆ భారికాయాల్ని లారి కి ఎత్తి పెడ్తుంటే నా కళ్ళలో అప్రయత్నంగానే నీళ్ళుమనస్సంతా భారం అయ్యింది ...కానిమానవ ప్రాణాలు మరింత నష్టపోకుండా వుండాలి అంటే ఈ హై వే తప్పదు.
అంతే కదా కొన్ని కావాలి అనుకుంటే కొన్ని వదులుకోవాలి ..................

26, జులై 2010, సోమవారం

ఆషాడం -గోరింటాకు

ఆషాడం లో గోరింట పుట్టింటికి వెళ్తుందట ,అని మా నాయనమ్మ చెబుతుండేది అందుకే అడిగినంత పండుతుందట ,అందుకని తప్పనిసరిగా శాస్త్రనికయినా పెట్టుకోవాలనేది ,ఇప్పుడు ఇలా గుర్తుచేయడానికి దగ్గరుండి మా అందరికి పెట్టడానికి నాయనమ్మ లేదు కాని ఆషాడం రాగానే ఆ మాటలు పదే పదే గుర్తొస్తాయి .
మా అమ్మ కూడా అంతే తప్పనిసరిగా పెట్టుకోవాలి అంటుంది ,లేత చిగురుటాకులు తెప్పించి కాటుకలా రుబ్బించి మా అందరికి పంపిస్తుంది .చిన్నప్పుడైతే ఇష్టంగా పెట్టుకునేవాళ్ళం ,పెద్దయ్యాక ఆ ఇంటరెస్ట్ లు తగ్గిపోయాయి కాని అమ్మ మాత్రం వెంటపడి మరచిపోకుండా మా చేత గోరింటాకు పెట్టిస్తుంది .
నిన్న ఆదివారం సాయంత్రం అమ్మ గోరింటాకు పంపి మరల మేం ఎక్కడ పెట్టుకోకుండా మరచిపోతామో అని రాత్రి ఫోన్ చేసి మరీ గుర్తు చేసి మా చేత చేతికి రంగులు అద్దించింది ,ప్రొద్దున్నే నిద్రకళ్ళ తో లేచి అరచేతులు చూసుకుంటే యంత మురిపెంగా అనిపించిందో చిన్నప్పుడు నాది బాగా పండింది అంటే నాది పండింది అని పోటీలు పెద్దోల్ల దగ్గర తీర్పులు ...... ఆ పచ్చివాసనలో ఎన్నెన్నిజ్ఞాపకాలో ........

8, జులై 2010, గురువారం

మార్పు

కొన్ని నెలల క్రితం తెగ భాదపడి పోయేదాన్ని ''బ్లాగులకి "తెగ ఎడిక్ట్ అయిపోతున్నాను అని ఎలా తగ్గించాల అనికూడా ఆలోచనలు చేయడం ,వాటిని ఆచరించడానికి ప్రయత్నించడం కూడా జరిగింది .బ్లాగుల వలన నేను రెగ్యులర్ గా చదివే పుస్తకాలు ,నవలలు కూడా తగ్గాయి అలానే కొన్ని పెర్సనల్ రిలేషన్స్ మీద కూడా ప్రభావం పడింది .
ఎట్టకేలకు నా ప్రయత్నం లేకుండానే ఈ మధ్యకాలం లో బయటకి రాగలిగాను .కారణం విపరీతమైన పని ఒత్తిడి ,ఉదయం ఇంటినుండి బయట పడ్డాను అంటే ఇల్లు చేరేవరకి వేరే ధ్యాస వుండటం లేదు .ప్రయాణం లో ఒక మూడుగంటలు చదువుకోవడానికి అవకాశం కలుగుతుంది .ప్రస్తుతానికి అయితే వృత్తీపరమైన జి.ఓలు సంభందిత సమాచారం చదువుకోవడం తో గడుపుతున్నాను ,ఒక నెలపోతే ప్రయాణం లో బోల్డన్ని పుస్తకాలు చుట్టి రావచ్చు.కళ్ళ ఎదురుగా ఇంటా-బయట సిస్టం వున్నా ఓపెన్ చేసిన ఇదివరకు వలె కూడలో,హారమో ,జల్లెడో,మాలికో చూడాలని అనిపించడం లేదు .నాకు అర్ధం అయ్యింది ఏవిటంటే చేతికి ,మనసుకి తగినంత పనిలేకపోతే రకరకాల ఎడిక్షన్స్ వస్తాయని :-) అంటే ఇన్నాళ్ళు పనిపాట లేకుండా కాలక్షేపం చేసానుఅని అంతా అనుకునే ప్రమాదం వుందని తెలుసు ,బట్ అదేమికాదు ,ఇప్పుడు ఇంకా భాధ్యతలు మరింతపెరగడం మాత్రమె ఈ మార్పుకి కారణం .ఎనీ హౌ ఈ బంగారులోకం మాయ నుండి బయటకి రాగలిగాను .:-)

26, జూన్ 2010, శనివారం

సొగసు చూడ తరమా !

రెండ్రోజుల క్రిందట ఒక మిత్రుని వివాహం జరిగితే వాళ్ళ ఊరు వెళ్లాను .నిజంగా మరో కేరళ చూసినట్లుంది. కేరళ వెళ్ళినపుడు 'అయ్యో మనవైపు ఇంత అందంగా లేవే' అని తెగ భాద పడిపోయాం.అప్పుడప్పుడు ఈ ప్రాంతం వెళ్ళడం జరిగింది కాని ,ఎప్పుడు ఆఫీసు హడావిడి ,పని ఆలోచనలతో పూర్తిగా ఎంజాయ్ చేయలేక పోయేదాన్ని .చుట్టూ పచ్చగా కొబ్బరి తదితర చెట్లతో ,సన్నటి వర్షపు తుంపర్ల తో ఆ సౌందర్యాన్ని వర్ణించడం సాహసమే సుమా అనిపించింది . దేవుడికి ఇంత బయాస్ ఎందుకో కొన్నిటిని మాత్రమె అధ్బుతంగా సృష్టించి మరి కొన్నిటిని నిర్లక్ష్యం చేయడం ,వెళ్ళేప్పుడు మసక చీకటిలో 'గోదారి 'అందాలు వచ్చేప్పుడు కళ్ళార్పకుండా వయ్యరాలుపోతు వంపులు తిరిగి వెళ్తున్న కాలువలు ,పొలాలు వాటికి కాపలా గా క్రమశిక్షణ గల సైనికుల్ల కొబ్బరి చెట్లు .... అద్బుతమయిన కోనసీమ .అప్రయత్నంగా నా నోటినుండి ఈ పాటా ..."బలే బలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు ...................ప్రభు మాకేల నీయవూ ..

22, జూన్ 2010, మంగళవారం

WEDDING BELLS

మా అమ్మ 'బుల్లి ఫ్రెండ్ 'పెళ్లి
వెళ్తున్నాము మేము పడి పడి
అరటిపువ్వు ,పనసపొట్టు తినాలని మరీమరీ .
యేబట్టలు కట్టాల అని ఆలోచించి చించి
షాపింగులు చేస్తున్నాము విరగబడి
ప్రతి యేడు ఇలా పిలవాలి మళ్ళిమళ్ళి...
అడ్వాన్సు విషెస్ టు అవర్ బిలవేడ్ ఫ్రెండ్
By
chinni daughter

20, జూన్ 2010, ఆదివారం

అడుగులో అడుగులు

మీ 'అడుగులో 'అడుగులు వేస్తూ మీరు చూపిన బాటలో నడుస్తున్నాం నాన్న!
పసితనం లో మాతో వల్లే వేయించిన 'సుమతీ ,వేమన ,బాస్కర 'శతకాలకి
భాష్యం వెదుకుతూనే మా వెనుక నడిచే వారికి దిశానిర్దేశం చేస్తున్నాం నాన్న!
నానమ్మ ద్వారా మీరందిపుచ్చుకున్న 'మానవత్వం' అనే ఆస్తిని మేమందుకుని
ఇంతింతని అంత చేసి ముందు తరాలకి అందించగాలమనే మొక్కవోని విశ్వాసం తో
ముందుకు సాగుతున్నాం మేము "ఆరుగురం ".

16, జూన్ 2010, బుధవారం

మనసు మాట వినదే..ప్చ్

ఈ పది సంవత్సరాలలో నేను పోగు చేసుకున్న ఆస్తి (డైరీలు ,జి.వో లు ,పేపర్ క్లిప్పింగ్స్ కార్డ్స్ ,డిపార్టుమెంటు పేపర్స్ ,నానాజాతి సమితి (కథలు ,కవితలు )మొత్తం సర్దితే పెద్ద అట్టపెట్టేడు అయ్యాయి ,అవసరం లేనివి చింపగా)బద్రంగా ఇంట్లోకి చేర్చాను రెండుగంటల క్రితం .నా సంస్థానం ,నా సింహాసనం వైపు చివరిచూపు చూస్తున్నపుడు మసకబారిన నా కళ్ళకి మొత్తం అలికేసినట్లు అక్కడేమో కనబడలేదు .ఇన్నాళ్ళు ఇరవయ్యినాలుగు గంటలు నన్నంటిపెట్టి వున్నా నా మొబైల్ నంబర్ వేరేవారికి ఇవ్వడానికి నా ప్రాణం విలవిల లాడింది .
.ప్రాణం లేని వాటిమీద నాకెందుకు ఈ మమకారం ఎందుకో అర్ధం కావడం లేదు
దేవుడా త్వరగా వీళ్ళందర్నీ ,ఇక్కడ వున్నా అనుబంధాలని మరచిపోయే వరమివ్వు .

15, జూన్ 2010, మంగళవారం

ప్రయాణం

పాత ప్రపంచం వదిలి కొత్త ప్రపంచంలోకి నా అడుగులు .............అన్యమనస్కంగా ................

3, జూన్ 2010, గురువారం

ఇదీ అసలు కథ

ట్రింగ్ ట్రింగ్ ...ట్రింగ్ ట్రింగ్ అంటూ ల్యాండ్ ఫోన్ ఒకటే గగ్గోలు ..చేతిలో చదువుతున్న పుస్తకం తీసి ప్రక్కన పడేసి టైం చూసాను ఇంచుమించు చిన్న ముల్లు పెద్దముల్లుపన్నెండు దగ్గర కలుసుకుంటున్నాయి...ఈ టైం లో ఎవరు చేస్తారా అనుకుంటూ ఫోన్ వైపు కదిలి నంబర్ డిస్ప్లే వైపు చూసాను .....రెండు వీదులవతల వున్నా అమ్మ నుంచో లేక ఇంటి పైన ఉంటున్న చెల్లి ఇంటి నుండో అని ఊహిస్తూ ..నా ఊహ నిజం చేస్తూ అమ్మ నుండే ...ఏంటమ్మా ఈ టైములో ఒకింత కంగారుగా అడిగాను .సాయంత్రం మొదలైన తలనొప్పి ఇప్పటివరకు తగ్గలేదని ,బి.పి టాబ్లెట్ వేసుకున్న అలానే వుందని , క్రోసిన్ టాబ్లెట్ పడితేనే తగ్గోచ్చని ,వేసుకుందాం అంటే ఇంట్లో లేవని కాస్త ఇంట్లో వుంటే పంపమని సారాంశం .గబగబా మందుల డబ్బా వెదికి క్రోసిన్ షీట్ దొరకబుచ్చుకుని ఈయన గాని మెలకువగా వుంటే పంపిద్దాం అని బెడ్రూం తలుపు తెరచి చూసాను గాడంగా నిద్రపోతున్న తనని చుస్తే లేపాలి అనిపించక స్టాండ్ మీదున్న చున్ని తీసి బుజాలపై పడేసుకుని మెయిన్ డోర్ తీసి లాక్ చేసి అమ్మ వాళ్ళింటి వైపు కదిలాను .
బజారు నిర్మానుష్యంగా వుంది .మా వీది కి అటు ఇటు పెద్ద పెద్ద చెట్లు ,అమ్మ వాళ్ళ ఇల్లు రెండు వీధులు దాటితే వస్తుంది ఆ కాలనీ అంతా చెట్లతో వీధిలో వున్నా దీపాల కాంతికూడా సరిగ్గా పడదు ,కొంచెం దూరం నడిచానో లేదో పక్క బజార్ నుండి ఒక అమ్మాయి గాజులు గలగలా లాడించుకుంటూ నా ముందు నడుస్తూ వెళ్తుంది.హమ్మయ్య నాకు ఒక తోడున్నారు కదా అనుకుంటూ కాలికి అడ్డం పడుతున్న నెయిటితో అవస్థపడుతూ కాస్త వేగంగా నడిచే ప్రయత్నం చేస్తూ ముందు వెళ్తున్న అమ్మాయి వైపు చూసాను నడక వింతగా అనిపించింది భూమి మీద కాళ్ళు ఆని ఆననట్లు వున్నాయి ....తేరిపార చూద్దును కదా కాళ్ళు వెనక్కి తిరిగి వున్నాయి ...అంతే గుండె జల్లుమని గొంతులో కేక గొంతులోనే వుండగా ఆమెను దాటుకుని వేగంగా పరుగు పెట్టాను..నా వెనుక కొంత దూరం వస్తున్నట్లు గాజుల సవ్వడి ఎక్కడిలేని ధైర్యం తో అమ్మ వాళ్ళ గేటు లో అడుగు పెట్టాను .ఇంటిముందున్న లాన్ ని దాటుకుంటూ గుమ్మం వైపు చూడగా గుమ్మంలో అమ్మ నాకోసం ఎదురుచూస్తూ ......
అయ్యో నువ్వు వచ్చావేంటి తల్లి అబ్బాయి లేడా.....అయిన ఏవిటా చెమటలు అంత కంగారుగా వున్నవేంటి అంటూనే నా చేతిలో టాబ్లెట్స్ తీసుకుంది ,నేను ఒగురుస్తూ దారిలో జరిగిన విషయం చెప్పాను వీధిలోకి చూస్తూ ...."అమ్మఆ అమ్మాయి కాళ్ళు వెనక్కి తిరిగి వున్నాయి ,దేయ్యలకేగా అలా వుండేది "అన్నాను .
అమ్మ నా వైపు తేరిపార చూస్తూ ......అవునా ఎలా ఉన్నాయమ్మ ...ఇలా ఉన్నాయా అంటూ చీర కుచ్చిళ్ళు కొంచెం పైకి జరిపింది .....
ఒక్కసారే కెవ్వున కేక వేసి వెనక్కి పరుగు తీశాను వెనక్కి తిరిగి వున్నా ఆ పాదాలను చూసి ......నా కేకలకి చెళ్ళుమని బుజం ఒక్కదెబ్బ వేసి లేపెసారు మావారు ...త్రుళ్ళి పడి లేచి చుట్టూ చూసాను .....మంచం మీద వున్నాను ....మంచి నీళ్ళు త్రాగి పడుకో పీడకల వచ్చినట్లుందని నీళ్ళ సీస చేతికిచ్చారు .........(ఇదండి మనం చుసిన దయ్యం ....పిచ్చి కథలు విని ఇలా కలవరపడటం అలవాటే )

28, మే 2010, శుక్రవారం

WHO WILL CRYWHEN YOU DIE?

నిజంగా నా కోసం వీళ్ళంతా ...వీళ్ళుఅంతా నా వాళ్ళేనా ! ఇంతమందిని బాధ పెడుతుందా నా ఎడబాటు ...నాకోసం ఇంతమంది ...ఇంకా డైజస్ట్ కావడంలేదు ఎప్పటికైనా ఇటువంటి సందర్భం వస్తుందని తెలుసు కాని దానిని ఇలా ఎదుర్కుంటాను అని ఊహించలేదు.మనకి ఏదైనా జరిగిన ,ఎడబాటు కలిగిన మన కుటుంబ సభ్యులు ,బంధువులు ,ఆప్తమిత్రులు కన్నీరుపర్య్వంతం అవడమే తెలుసు ...కాని ఇంతలా ఏమి కాని నాకోసం వెక్కిళ్ళు పెట్టి కళ్ళన్నీ కెంపులు చేసుకుని బెంగగా ,జాలిగా చూస్తున్న ఈ అమ్మాయిలూ ,.ఈ అబ్బాయిలు మాత్రం ...వీళ్ళ మొహం లో ఇంత వేదన ,నైరాశ్యం మునుపు ఎన్నడు చూడలేదే.!.ఎవరు వీళ్ళు .యేమవుతానని నాకోసం ఇంత దిగులు .ఇంకా ఎవరికోసం మేం పని చేయాలనీ అంటున్నారు పిచ్చివాళ్ళు నేనే అంటే నాకంటే సెంటిమెంట్ ఫూల్స్ లా వున్నారు .చెదిరిన నా మనసుకి సూటిగా వారి వైపు చూడలేని నా కళ్ళు ,మూగబోయిన నా గొంతు చెప్పకనే చెప్పాయి వీళ్ళు అందరు ఎప్పటికి నావాళ్ళేనని . .

25, మే 2010, మంగళవారం

ఆదివారం అబిడ్స్ లో వెయిటింగ్

చాలా సంవత్సరాల తరువాత పని పాట లేకుండా వచ్చేపోయే జంటలని ,జనాన్ని ,బస్సుల్నిచూస్తూ అభాగ్యనగరం లో అబిడ్స్ సెంటర్ లో ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం నాలుగున్నర వరకి గడిపాను.ఉదయం ఇంటి దగ్గర నుండి బయలుదేరేప్పుడే చదువుతానికి ఏమైనా పుస్తకాలు పెట్టుకోమని ఇంట్లో వాళ్ళు చెప్పిన నా మనస్సు పుస్తకం మీద చచ్చిన లగ్నం కాదని ముందే తెలిసి ఒక్క న్యూస్ పేపర్ మాత్రం వెంట తెచ్చుకున్నాను .మా పాప రాసే ఒక పరీక్ష కి మనం ఎస్కార్ట్ అన్నమాట .ఉదయం రెండుగంటలు మద్యాహ్నం రెండుగంటలు జరిగే ఈ పరీక్ష మద్యలో మూడుగంటలు విరామం .ఇంటికి వెళ్లి రావడానికి ముప్పావుగంట సమయం వృధా అందుకే పూర్తి సమయం అక్కడే గడపడానికి నిర్ణయించుకుని మావాళ్ళని పంపించేసాను సాయంత్రం వచ్చి పిక్ అప్ చేసుకోమని ఒక ఆర్డర్ పడేసాను నన్ను చూసి మా పిన్ని కొడుకు ఇంటర్ చదివేవాడు నాతో ఉంటానని ఆగిపోయాడు .
.పరీక్ష హాల్లోకి తొమ్మిది గంటలకే అంతా పరుగులు తీసారు .క్యాంపస్ లో చెట్టు కిందో లేక వరండాలోనో కూర్చుందామని ప్లాన్ చేసుకున్నాను ..ఈ లోపు అక్కడికి సెక్యురిటి కి వచ్చిన పోలీసు అధికార్లు హింది ఉర్దుల్లో ఏమేమో మాట్లడేసుకుంటున్నారు ..మనకి కొంచెం కొంచెం మాత్రమె అర్ధం అవుతాదాయే (ఇదర్ ఆయియే లాటివన్నమాట ) పేరెంట్స్ ని ఇతరులను పంపించేద్దాం అని అనుకుంటున్నట్లు అనిపించి వెళ్లి అడిగాను" మేము ఇక్కడే కూర్చుంటాం "అని ."ఎగ్జం ఇస్టాట్ అయ్యింది మీరు ఉరుకున్ద్రి "అని నా వైపు జాలిగా చుస్తూపక్కనే వున్నా ఒక సెక్యురిటి హెచ్చరించాడు .ఓహో మనం పరీక్షలు రాసేవాళ్ళ కనబడుతున్నామా అని కాసింత మనసులో మురిసిపోయి (మా బంగారం పుణ్యానా దాని వెనుక పరుగులు తీస్తూ నెల రోజుల్లో నాలుగు కేజీలు తగ్గిపోయానయ్యే) అబ్బే నేను రాయడం లేదు మా వాళ్ళు లోపలి వెళ్ళారు ఇక్కడ వెయిట్ చేస్తాము అని ,నాలాటి వాళ్ళు చాలా మంది చేరారు ,కాని కాంపస్ లో ఉండటానికి వీలు లేదనేసారు.
.ఉస్సృమంటూ నిట్టూర్చి నా కూడా వున్నా మా కజిన్ తో రోడ్ ఎక్కాను .ఎదురుగా mcdonald's వుంది కాని అది పదకొండు గంటలకి ఓపెన్ చేస్తారాయే ,ఏ ఇంటికి పోవాలన్నా చాలా దూరం ...కాలేజి బయటనున్న బస్సు స్టాపులో కూర్చున్నాం వచ్చేపోయే బస్సుల్ని చూడొచ్చని...అలా కూర్చున్నామో లేదో బస్సులు ఆగే ప్రదేశం అంతా మురుగు కాల్వ ఒక్కసారే ఏరులా పొంగి ప్రవాహం ....అదే నీళ్ళలో దిగి ప్రయాణికులు బస్సు ఎక్కడం దిగటం ...భయంకరమైన దుర్గంధం నీళ్ళు చిమ్మి పైకి మా మీద పడేంత ,అక్కడినుండి లేచి కొంచెం ప్రక్కకి నడిచేసరికి జార్జ్ చర్చి అని పూరాతన భవనం కనబడింది జనం లోపలి కి బయటికి తిరుగుతున్నారు అప్పుడే వాళ్ళ ప్రార్ధనలు అయ్యినట్లున్నాయి ..లోపలికి పోయి ఏదొక చెట్టుకింద కూర్చోవచ్చులేమ్మని ఇద్దరం లోపలి కి వెళ్లి ఆ ప్రాంగణం లో వాళ్ళ కోసం వేసివున్న ప్లాస్టిక్ చైర్స్ లో కూర్చున్నాం .నేను సీరియస్ గా సాక్షి పేపర్ తో ,వాడేమో వాడి మొబైల్ లో గేమ్స్ ఆడుతూ ....వాళ్ళేమో ప్రార్ధనలు అయ్యి ఆడవాళ్ళు గుంపులుగా కబుర్లు గోల గోల ...పది దాటేక ఓపిక నశించి మరల రోడ్ మీదికి వచ్చేసరికి ఎదురుగా macdonald's తెరచి వుంది ..హమ్మయ్య ఏ.సి లో కూర్చోవచ్చని రోడ్ కస్టపడి దాటి (మనకి అసలే భయం )లోపలి కి వెళ్లేసరికి ..ఇంకా సర్విస్ స్టార్ట్ కాలేదు వెయిట్ చేస్తామంటే కూర్చోండిఅని నమ్రతగా......అదే మాకు కావాల్సింది అంటూ ఆనందంగా సెటిల్ అయ్యి ....ఇక చూడండి టి.వి లో వచ్చే మాధవన్ సినిమా సఖి చూస్తూ వాళ్ళ స్పీకర్ల హోరులో నుండి వచ్చే పాశ్చాత్య సంగీతం వింటూ ఇటు సినిమా డైలాగులు వినబడక ...చీమల దండులా నెమ్మదిగా జంటలుగా వస్తున్న టీనేజి పిల్లల్ని చూస్తూ ...బురకాల్లో వచ్చిన హిందూ గాళ్స్ ని చూస్తూ .....చేసే పనిని ఆ మాత్రం దైర్యం లేక తెగువ చూపిస్తున్న అమ్మాయిల్ని చూసి మెచ్చుకోవాలో నోచ్చుకోవాలో అర్ధం కాని పరిస్థితి ...మొత్తం ఫ్లోటింగ్ ఈ వయస్సు వారిదే ....అసలు వీళ్ళు ఖర్చు పెట్టడానికి ఇంతింత డబ్బులు ఎలా వస్తున్నాయో ,పేరెంట్స్ ఎందుకు ఇంతింత ఇస్తున్నారో ...ఏ మాత్రంఆ పిల్లలు కష్టపడకుండా వచ్చిన డబ్బు ఇలా దుర్వినియోగం....ఆ అమ్మాయిలూ మరల లేచి బయటికి వెళ్ళే ముందు నల్లటి ముసుగులు తగిలించుకుని వెళ్తుంటే నాకు సంభంధం లేకపోయినా మనస్సు చివుక్కుమంది .ఈ మాటలు నా డాటర్ తో అంటుంటే అయ్యో మమ్మీ ఇక్కడ ఇది చాల సహజం చాలామంది ఇలానే చేస్తారు ...ముస్లిమ్స్ వాడే పరదాలు మన వాళ్లకి ఇలా పనికివస్తాయి అంది .పూర్వం యవనులు అరబ్బులు ,టర్కిష్ వారినుండి మన స్త్రీలను కాపాడుకొవాడానికి వాడిన పరదా నేటి ఆధునిక యుగం లో ఇంకొకరకంగా............ఇలా..ప్చ్...
సాయంత్రం వరకి మాకు వేదికగా ఉపయోగపడిన రెస్టారెంటుకి ఒక వెయ్యిరూపాయలు మూల్యం చెల్లించి (నానా గడ్డి తిన్నందుకు :-)) బయటపడ్డాం.
....-0-.........

...
12, మే 2010, బుధవారం

నేను చేసిన తప్పేవిటి? -బంగారు


ఈ రోజు నేను ఏమి చేసిన అమ్మ( చిన్ని) తప్పులు పడుతుంది ...హ్మం ...ఏంచేయాలి :-(
నేను ఏమి చేసిన ముద్దు ముద్దుగా గారం చేస్తూ నన్ను చూడ వచ్చిన వారందరికీ
నేను చేసే పనులు గొప్పగా చెప్తూ నన్ను వాళ్ళ ముందు ప్రదర్శనలు ఇమ్మని బ్రతిమాలి
లాలిచ్చి నాతో పనులు చేయించుకుని ఇప్పుడేమో హు...అయిన నేను గమ్మున వుంటానా!
అమ్మ కి ఘాట్టిగా ఇచ్చాను ...నాకు సపోర్టుఅక్క ( చిన్ని వాళ్ళమ్మాయి) డాడీ వచ్చారు ...అయిన
లెక్కచేయలేదు ,వాళ్ళని నోరుమూసుకోమంది..వాళ్ళని వాళ్ళ పని చూసుకోమంది ,నా పని ఆవిడ
చూస్తోందట...యెం చూస్తుందో నేను చూస్తాను .
అసలు నేను చేసిన తప్పేమిటో చెప్పండి .....
తనని పని చేసుకోనివ్వకుండా కాళ్ళ కి అడ్డం పడుతున్ననట .ఒక్కర్తే పని చేసుకుంటుంది అని జత వెళ్ళడం
తప్పా!అమ్మకన్నా ముందు నడవాలని పోటి పడ్తు ముందుకి వెళ్ళడం తప్పేమిటో .....ముందు వెళ్ళాను అనే
ఆనందం తో కాళ్ళ దగ్గర అందిన చీర కుచ్చిళ్ళ తో ఆడుకున్నాను ...అది తప్పట .మరి తను నాకు అందేట్లు
ఎందుకు కట్టాలో..హ్మం ....తిట్టిన ఏమనకుండా తనకి తోడుగా పనయ్యేదాకా వున్నానా ...అస్సలు కృతజ్ఞత
లేదు.
అమ్మ ఎక్కడుందో కాలి మువ్వలు మనకి పట్టించేస్తాయి .ఏదో పుస్తకం చదువుతుంది కదా తనని డిస్టర్బ్ చేయడం ఎందుకని
తన కుర్చీ పక్కనే కాళ్ళ దగ్గర కూర్చున్నాను ,నా కళ్ళు మువ్వల మీద పడ్డాయి భలే వున్నాయని చూద్దామని ఒకటి పీకాను
అమ్మ పుస్తకం లో వుండి నన్నేమి గమనించలేదు సరికాద ఇంకోటి తీద్దామనుకుని కాలిపట్టి లాగబోయి కాలు కొరికాను
అది తప్పంటా...ఇంకా నయం గట్టిగ కొరకలేదు .అప్పుడు చూసింది నేను ముందు తీసిన మువ్వని ...నేను నేల మీద పడిన
మువ్వని తీద్దాం అనుకునే లోపు తనే తీసేసుకుని నా చెంప మీద ఒక్కటిచ్చింది ,చిన్నదాన్ని అని కూడా చూడకుండా :-(
మువ్వ తింటే నేను చచ్చిపోతానంటా...అంటే ఏంటో ?
అలిగేసి హాల్లోకి వచ్చి డాడీ కాళ్ళ దగ్గర కూర్చుని నా దారిన నేను టి.వి లో క్రికెట్ వస్తుంటే డాడీ తో పాటు చూస్తూ కూర్చున్నాను .
ఇంతలోనే అమ్మ వచ్చేసి "నీకు కూడా ఆ పిచ్చి పట్టిందా,మంచి అలవాట్లు నేర్చుకో "అని నన్ను అక్కడి నుంచి లేపేసింది ,డాడీ వంక
చుర చుర చూస్తూ ...మా ఇద్దర్ని కలిపే తిట్టిందని నా అనుమానం .
అమ్మ అసలే కోపంగా వుందని అక్కడనుంచి లేచి వెళ్లి
అక్క చదువు కుంటుంటే ప్రక్కనే కూర్చున్నాను ,అక్క కి నేనంటే ఎంతో ప్రేమ ,పరీక్షలయ్యాక నాతోనే ఆడతానని చెప్పిందిలే .
అక్క లా చదువుదామని అక్కతో గొంతు కలిపాను,అమ్మ చుస్తే మురిసిపోతదని .. ....అంతే "అసలు నీకు బుద్దివుందా ?అక్కని చదుకోనియవా
ఎందుకు గోల చేస్తున్నావ్ "అంటూ కోప్పడింది .నాకొకటి అర్ధం అయ్యింది అమ్మకి కొంచెం తిక్క వుందని ...
నేనేమి చేసిన తప్పేనా...?...ఏమి చేయలబ్బా :-(

10, మే 2010, సోమవారం

సెంటి -మెంటల్

ఈ వారం అంతా "గులాబి "రంగు దుస్తులే ధరించాలి అనుకున్నాను ...ప్చ్ సందిగ్ధం లో పడ్డాను .ఇలా గులాబి రంగు వాడమని ఎవరు చెప్పారు అంటే నిన్న ఆదివారం" ఫన్ డే "లో రాసి వుంది .అసలు సాక్షి ఆదివారం పేపర్ పొరపాటున మిస్ కాను చివరి ఆ రెండు పేజీలు చదివి మనకి అనుకూలంగా రాసి వుంటే ఇక మనల్ని పట్టలేమో ...ఏమైనా తేడాగా రాసుంటే" అసలు నమ్మాలో వద్దో కూడా అర్ధం కావడం లేదు" అనేస్తాను :-)
ఇంతకి ఏవిటా పేజి ఏమా కథ అని చదివే వారికీ సందేహం రావచ్చు .,అవి "టారో, రాశి ఫలం .అదేంటో నా నక్షత్ర ప్రకారం ,అలానే పుట్టిన తేది ఒకటే రాశి ని సూచిస్తాయి .ఇలా హరోస్కోప్ చదవడం ఇండియన్ ఎక్స్ప్రెస్ లో పీటర్ విడాల్ చదవడం తో అలవాటయ్యాయి ,తరువాత లిండాగుడ్ మాన్ పుస్తకాలు అలా సరదాను పెంచాయి .జ్యోతి ,ఆంధ్రభూమి వార పత్రికల్లో వార ఫలాలు చదవడం అలవాటు అయ్యాయి .అసలు కథలోకి వెళితే
టారో లో ప్రతి వారం మనకి కలిసి వచ్చే రంగు సూచిస్తారు .ఆ రంగులు మనం ధరిస్తే మనపై గ్రహ ప్రభావం అనుకూలంగా ఉంటాయని నమ్మకం .అట్లా ఆ వారం మనం వాడాల్సిన రంగులు గుర్తుపెట్టుకుని పూలు (ఫ్లవర్వాజ్ లోకి )ఆ రంగుకు దగ్గర ఉండేట్లు చూసుకోవడం చేస్తుంటాను .ఒక్కోసారి వరుసగా ఒకే రంగు సూచిన్చొచ్చు .అప్పుడు వుంటాది నా పని :-) ఆ మద్య వరుసగా కలసి వచ్చే రంగు తెలుపు అని రాస్తే రెండు మూడు వారాలు ధవళ వస్త్రాలు ధరించడం జరిగింది ,ఏదో ముఖ్యమైన ఫంక్షన్ కి ఫ్యామిలీ తో వెళ్తూ పార్టీవేర్ తెలుపులో తీయగానే ...అసలీ రంగు వదలవా ఏమైంది నీకు అని క్లాసు చెప్పించుకున్నాను ....అయిన మనం నోరు మెదపలేదు చెప్తే "ఫూల్"అనిపించుకోవాలని .అలానే కాషాయం వరుసగా రెండు సార్లు ....హబ్బ ఆ రంగులో ఎక్కువ చీరలు లేక భలే కష్టపడ్డాను దగ్గర గా వుండేవి కట్టి నడిపెసాను.
నిన్న రాసిన దాన్లో గులాబి రంగు కలిసి వచ్చేది అని చదివాక తీరికగా బౌల్స్ లో గులాబి పూలు వేసి అక్కడక్కడ సర్ది వర్డ్రోబ్ లో వారం కి సరిపోయే పింక్ సారిస్ తీసి వేరేగా సర్దుకున్నాను .నిన్న గులాభి రంగు చీర కట్టిన కాసేపటికి మా అమ్మ తో కాసేపు ఫోన్ లో ఫైటింగ్ పెట్టుకున్నాను .మద్యాహ్నం మా తమ్ముడు వస్తే వాడి తో సరదాగా కబుర్లు చెబుతూనే వాడిని ఫటమని తిట్టేసాను .సాయంత్రం మా పార్వతిని(పని ) పిలిచిమరి పని ఎలా శుబ్రంగా చేయాలో ఘాట్టిగా క్లాస్స్ తీసుకున్నాను .మా అమ్మాయి చదువుకుంటుంటే మద్య మద్యలో తను చదవలేనప్పుడు ప్రక్కనే కూర్చుని చదివి పెడతాను మద్య మద్యలో ప్రశ్నలు వేస్తాను ....నిన్న తను వెంటనే కొన్నిటికి జవాబులు ఇవ్వలేదని నీవల్ల కాదులే అని అనవసరంగా తిట్టేసాను .ఇక చివరిగా మా ఇంటాయనతో (శ్రీవారు)తో కూడా గొడవ అయ్యింది ..ఎప్పుడు అస్సలు బాక్ రిప్లై ఇవ్వను ...తీక్షణంగా ఒక లుక్ లుక్కి ప్రక్కకి వెళ్ళిపోయే నేను ఎదురు నిలబడి మాటకి మాట అన్నాను ....బహుశ డైజస్ట్ అయ్యుండదు :-) నాకేమైనా బ్లడ్ ప్రేస్సర్ షూట్ అయ్యిందేమోనని డౌట్ కాని ఆ చాయలేమి మనల్ని ఇంకా చేరలేదు .
నాకు నేను ఆలోచించుకున్నాను ..ఎందుకింత రెబిలియాస్ గా ప్రవర్తిస్తున్నానో అని ......నో డౌట్ గులాబి రంగు ప్రభావం అని అనుకున్న ....సరయితే రెండో రోజు కూడా చూద్దాం అనిపించింది .ఆఫీసు కి సమయం కంటే రెండుగంటలు ఆలస్యంగా వెళ్లాను .,ఇంటి నుండి ఆఫీసుకి వెళ్ళేదారిలో మా లేన్ నుండి కార్ మెయిన్ రోడ్ ఎక్కుతున్నప్పుడు ఆర్ .టి .సి . సిటీ బస్సు వాయు వేగం తో వచ్చి నూలుప్రోగంత దూరం లో ఆగింది ,ఇక అయిపోయాను అనుకుంటూ తల త్రిప్పెసుకున్నాను ...కాని ఏదో అదృష్టం ఘోరప్రమాదాన్ని తప్పించింది .అది తప్పినా అయిదు నిమిషాల్లో మా ఆఫీసు ప్రాంగణం లో హెయిర్ పిన్ బెండ్ లాటిది వుంటాది ,అక్కడ వాటర్ కాన్స్ తో ఆటో వస్తు కార్ ని కొట్టాల్సింది సడెన్ బ్రేక్ తో ఆపుకున్నాడు .ఆఫీసు రూం లో నా టేబుల్ పైనున్న ఫోటో ఫ్రేం (నా ఫోటో వుంటుంది )గంట క్రితం పడి పగిలిపోయింది ...తీసి గాజుపెంకులు క్లీన్ చేస్తున్నారు .నాకు చాలా భాద అన్పించింది సుమారు అయిదేళ్ళ నుండి వుంది ,ఉద్యోగాసోపానం ఇయర్ బుక్ , ఎగ్జిబిషన్లో నాచేత రిలీజ్ చేయిన్చినపుడు సురేష్ గారు ప్రెజెంట్ చేసింది ,మంచి కొటేషన్స్ తో వుండే ఫ్రేం అది. కొన్ని నచ్చి మనం అపురూపంగా చుసుకున్టున్నప్పుడు ఏమైనా జరిగితే భరించలేము ఇలా ఎందుకు జరుగుతుది అని కాసేపు ఆలోచించగా నాకు హటాత్తుగా 'గులాబి ' గుర్హోచ్చింది .ఆఫీసు లో ఎక్కువ సేపు గడపకుండా ఇంటికి వచ్చేసి ఆహ్లాదమైన నీలం లోకి మారిపోయాకగాని నా మనస్సు శాంతించలేదు .ఈ వారం పొరపాటున గులాభి రంగు బట్టలు కాని గులాభి రంగులోని పూలు కాని అంటరాదని ఘట్టిగా తీర్మానించేసుకున్నా ......ఏం చేద్దాం నేనో "సెంటి -మెంటల్ "............

7, మే 2010, శుక్రవారం

సతుల్,సుతుల్ ,హితుల్ పోనీ !

పోనీ ,పోనీ ,
పొతే పోనీ !
సతుల్,సుతుల్ ,హితుల్ పోనీ !
పొతే పోనీ !

రానీ, రానీ
వస్తే రానీ !
కష్టాల్ ,నష్టాల్ ,
కోపాల్ ,తాపాల్ ,శాపాల్ రానీ !
వస్తే రానీ !
తిట్లూ ,రాట్లూ, పాట్లూ,రానీ !
రానీ , రానీ

కానీ,కానీ !
గానం ,ధ్యానం !
హాసం ,లాస్యం !
కానీ ,కానీ !
కళా రవీ!పవీ!కవీ!

(నా చేత శ్రీ శ్రీ ఇదంతా రాయించాడు ..)

2, మే 2010, ఆదివారం

నిద్ర కరువయ్యింది


గత పదిరోజులనుండి మా ఇంట్లో వాళ్లకి కంటిమీద కునుకు వుండటం లేదు .దీనికంతటికి కారణం మా ఇంట్లోకి వచ్చిన కొత్త ప్రాణి .అది చేసే అల్లరి అంత ఇంత కాదు .వయస్సు చూస్తేనేమో నిండా మూడు వారాలు కూడా లేవు ఎన్నాళ్ళ నుంచో పాప గొడవ చేస్తున్న ఇంట్లో చూసేవాళ్ళు లేరు కష్టం అని వాయిదా వేస్తూ వచ్చాను అదీ కాక దానికి ఏదైనా అయితే తట్టుకునే శక్తి లేదని (మా చిన్నప్పటినుండి మాతో పాటు ఎన్నో పెరిగి కళ్ళ ముందు పోయాయి )నచ్చ చెప్పుకుంటూ వచ్చాను ..కాని అనుకోకుండా ఒక రోజు చెల్లి రెండిటిని వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిందని తీసుకువచ్చి తానొకటి మాకు ఒకటి ఇచ్చింది.బుజ్జిది రోజులపిల్ల అల్లరి చేయదేమోననుకున్న ..హమ్మ మమ్మల్ని నిన్చోనియదు ,కూర్చోనీయదు మేము ,ఎక్కడుంటే అది అక్కడే ...హాల్లో ఒక మూల అమ్మగారికి పడక ఏర్పాటు చేసాను ..ఉహు ...నిద్రపోతున్నట్లే వుండి గంటకోసారి కుయ్యో కుయ్యోమని అరుపులు ..తీసుకొచ్చి గదిలో పడుకోబెట్టాలి ,దానికేమో మద్యలో చలివేసి మళ్లీ అరుపులు మనం అపుడు తీసికెళ్ళి హాల్లో పడుకోబెట్టి అది నిద్రపోయేవరకు ఉండి చప్పుడు చేయకుండా వచ్చి నిద్రపోవాలి ,మరల అరగంటలో దానికి మెలకువ మల్లిపోయి బుజ్జగించి మన గదిలోకి తెచ్చి నిద్రపుచ్చాలి కాసేపటికి దానికి చలి ....అట్టాతెల్లారిపోయి ఇంకేం నిద్రపోతాం అని అమ్మాయిని వరండ లోకి తీసుకొచ్చి ఆడుకుంటూ దాన్ని ఏమార్చి పోయి టి తయారుచేసుకోవాలి ....మన చీర కుచ్చిళ్లో ,పైటకొంగు తోనో అది నోట కరచిమనల్ని కవ్విస్తూ ఆడుతుంటే మనం చచ్చినట్టు ఒంతమ్మ బంగాలు వదులమ్మ అని ముద్దుగా బతిమాలుకోవాల్సిందే ..లేకపోతె మా అమ్మాయితో పడలేము తనతో పాటు సమానంగా చూడట్లేదు ..అది "కుక్క "ని చీప్గా చూస్తున్నారు అంటుంది ..వచ్చిన పది రోజుల్లోనే మా ముగ్గురి మనసు దోచేసింది .ఈ "బంగారాని కి" ఇంకా పేరు స్థిరపడలేదు ..ఎవరికి నచ్చినట్లు వాళ్ళు పిలుస్తున్నాం ...

29, ఏప్రిల్ 2010, గురువారం

నా అభిరుచులు

తరుచు మనం అటు ఇటు తిరిగే క్యాంపు ల ఉద్యోగం కావడంతో ఆయ ఊర్లలో ప్రశస్తమైన పండ్లు ,పూలు అలాగే స్వీట్స్ ఏంటో కనుక్కుని నచ్చిన వాటిని తిరిగి వచ్చేప్పుడు తీసుకోస్తుంటాను..మరచిపోతానేమోనని ముందే ఎవరికైన చెప్తాను వెళ్ళేప్పుడు గుర్తుచేయమని .పూలు విషయం కి వస్తే విశాఖపట్నం లో "సింహాచల సంపెంగ "పూలు లేకుండా తిరుగు ప్రయాణం చేయాలంటే నా మనసొప్పదు .ఎక్కువగా రైల్వే స్టేషన్ లో దొరుకుతాయి ,బయట మార్కెట్ లోను దొరుకుతాయి .బోల్డన్ని గుత్తులు కొని తెచ్చుకుంటాను .తెలుపు పసుపు రంగుల్లో వుండే ఈ పూలు తరగని సువాసననిస్తాయి .సింహాచలం లో మొక్కలు కూడా అమ్ముతారు మనం మొక్క కూడా పెట్టాం కాని ఇంతవరకు పూయలేదు చెట్టు పెరగనే లేదు . మచిలీపట్టణం లో మంగినపూడి బీచ్ దారిలో అమ్మే మొగలిపోత్తుల కొరకు ఆరాటపడతాను . నెల్లూరు వెళ్ళినపుడు పినాకిని లో ప్రయాణం చేస్తే చెన్నయి నుండి తెచ్చి అమ్మే 'చెంబెలిపూలు 'తప్పకుండా కొంటాను ,అరటి నార తో మాలలు కట్టి అమ్ముతారు ..అలానే చెట్టు సంపెంగ పూలు తో పినాకిని పరిమళాలు వెదజల్లుతది,పెదవడ్లపూడి వచ్చేసరికి గంపలు గంపలు మల్లెలు విరజాజులు చేరతాయి ...ఇవన్ని పిచ్చపిచ్చగా కొనిస్తానని వేరేచేప్పక్కరలేదు
. పండ్ల విషయానికి వస్తే ఏలూరులో దొరికే జామకాయ ఇంకెక్కడా దొరకదేమో అనిపిస్తుంది ,అక్కడి కాయలు తిని ఇంకెక్కడా తినాలన్పించదు.అలానే తేగలు నిడదవోలు ,చాగల్లు లోరుచి ఇంకోటి కనిపించదు.అలానే రేగుపళ్ళు గోదావరి జిల్లాలోనే బాగుంటాయి .సీతాఫలాలు తప్పకుండా రాజమండ్రి ,జంగారెడ్డిగూడెం నల్లజర్ల పరిసర ప్రాంతాల్లోనే బాగుంటాయి ,ఒక బుట్టడు మనతో ప్రయాణం చేయాల్సిందే .
చక్కెరకేళి లు రావులపాలెం లో చాలా బాగుంటాయి ..మామిడిపళ్ళు మా జిల్లా లోనే కాకుండా ప్రకాశం జిల్లా లో 'ఉలవపాడు ' అనే ప్రాంతం కాయలు చాల స్వీట్ గా బాగుంటాయి,ఒంగోలు వెళ్ళినపుడు తోటకి పంపించి మరి తెచ్చుకుంటాను .సీసన్ అయ్యాక మార్కెట్ లో ఎక్కువ దొరికేయి ఉలవపాడు కాయలే .
ఇక స్వీట్ విషయానికి వస్తే మచిలీపట్టణం వెళ్తే 'హల్వా ''లడ్డు ''తిరుగు ప్రయాణం లో ఉండాల్సిందే .చాల ప్రసిద్ది తాతారావు స్వీట్స్ అంటే .కాకినాడ వెళ్లి వచ్చేప్పుడు మన కూడా 'కోటయ్యకాజ", తాపేశ్వరం కాజాలు ,ఆత్రేయపురం పూతరేకులు వస్తాయి ..
ఈ రోజు ఒంగోలు వెళ్లాను .ఆఫీసు పనికన్నా ముందు అల్లురయ్య మైసూర్ పాక్ కి ఆర్డర్ పంపాను .అక్కడ ఆర్డర్ చేస్తేనే మనకి దొరుకుతుంది .ఒంగోలులో చాల ప్రసిద్ధిగల స్వీట్ అది .పది యేళ్ళ క్రితం మొదటిసారి అరటిఆకులో నెయ్యోడ్తూ పొట్లం కట్టారు ,ఇప్పుడు మామూలు స్వీట్ డబ్బాలో పెడుతున్నారు ,కొంచెం క్వాలిటీ తగ్గిందనుకోవచ్చు ..ఇలా ఊరుకో స్వీట్ తెచ్చుకుని నేనే మొత్తం తింటాను అనుకుంటున్నారా !మా పాప నేను కొంచం మాత్రం తీసుకుని మా బందుమిత్రులకి తినిపిస్తాను :-)

23, ఏప్రిల్ 2010, శుక్రవారం

మా ఇంట్లో సాయి సంకీర్తన
నేను అనుకున్న రీతిలో మూడున్నర గంటలు ప్రశాంతంగా సాయి సంకీర్తన జరిగింది .ఊహించిన దానికన్నా సాయిభక్తులు తరలివచ్చారు .
సంకీర్తన నేర్పి మాకు సన్మార్గం చూపించిన ఆచార్య దేవులు శ్రీ పోనమల కోటేశ్వర రావు గారికి వందనాలు.దాదాపు పదిహేను సంవత్సరాలు నుండి వారే మా ఇంట సాయి సంకీర్తన చేసేవారు .చక్కని స్వరం వినే కొద్ది వినాలి అనిపిస్తుంది కొంచెం వృద్దాప్యం తో స్వరం లో కొంచెం బిగువు సడలింది .అయిన క్రొత్తవారు గుర్తించలేరు .ఈ రోజు పూజ మొత్తం నా కూతురి మీదే నడిచింది .బాబాని చక్కగా అలంకరించింది .ఇలా ........................................

కృతజ్ఞతలు

నాకు ఎవరైనా సహాయం చేయగానే వారికి తప్పనిసరిగా కృతజ్ఞతలు తెలుపుకుంటాను .ఆ సహాయాన్ని జీవితకాలం లో మరచిపోను ,వారి ఋణం తీర్చుకునే అవకాశం కోసం చూస్తాను .కొన్ని సమస్యలు ఎంత ప్రయత్నించిన పరిష్కారం కావు అటువంటి సమయం లో భగవంతుని పై భారం వేసి నువ్వే పరిష్కరించాలి అని అతి వినయంగా కోరుకుంటాను. వినయం అని ఎందుకు అన్నాను అంటే సమస్యలు వచ్చినపుడే 'దేవుడు'అనేవాడు మనకి గుర్తొస్తారు కాబట్టి .నిజానికి చిన్నప్పుడు నాకు భక్తి తక్కువే ,ఏదో పండుగాపబ్బాలకి అమ్మ ప్రక్కనే పూజ అయ్యేవరకి ఓపికగా కూర్చునేవాళ్ళం త్వరగా అయితే టిఫిన్ గట్రా తినేసేయ్యోచ్చని అన్నీ అయ్యేవరకు ఎదురు చూడాల్సిందే .వినాయక చవితి రోజు మరీ విసుగోచ్చేసేది ,పుస్తకం లో పేజీలు లేక్కపెట్టేదాన్ని అమ్మ గమనించకుండా .అమ్మ పురాణాలు నీతి కథలు తీరిక వేళల్లో ముఖ్యంగా సెలవల్లో ,ఆదివారాల్లో మా ఆరుగురు పిల్లల్ని చుట్టూ కూర్చోబెట్టుకుని ఒకే పళ్ళెం లో అందరికి అన్నం కలిపి తినిపిస్తూ చెప్పేది .నాకు కొందరు దేవుళ్ళు గా మనసుకి అనిపించేవారు కాదు ...వారు మన చరిత్రలో రాజులు లేక ఒక తెగకి నాయకులు లా అనిపించేవారు ,అలా అని అమ్మ తో అంటే తప్పు అనకూడదు అనేది .ఏడెనిమిది తరగతులుకి వచ్చాక మిషనరీ స్కూల్స్ లో చేరడం హాస్టల్ లో ఉండటం తో అక్కడ తప్పనిసరిగా ఆదివారం ఉదయం ప్రేయర్ సర్విస్ వుండేది మానితే పనిష్మెంట్ వుండేది నిశభ్దంగా ఆ గంట గడిపేవాళ్ళం ఆ పూట బ్రేక్ ఫాస్ట్ ఏమి చేసి ఉంటారా అని .,అవకాశం వచ్చినప్పుడల్లా సిస్టర్స్ దేవుడి గురించి ,ఆ మదర్ గొప్పదనం గురించి చెప్పేవారు ,లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించే ఎక్కువ చెప్పేవారు ....ఇప్పుడు బాగుంటే చాలుగా పోయాక మనకి యెం తెలుస్తుంది ,అనుక్షణం చనిపోయాక వెళ్ళే స్వర్గం గురించి మనకి ఎందుకు వేదన అని అనుకునేదాన్ని ..
.ఇప్పుడుకూడా :-)
తరువాత తరువాత పరీక్షలప్పుడు దేవుడు గుర్తు రావడం మరల కనుమరుగవడం నా టీన్స్ లో పరిపాటయ్యింది .
కొన్ని సంవత్సరాలు అసలు దేవుడే లేడు అనుకుని నమస్కరించడం మానేసాను.సాటి మనిషికి హాని చేయకుండా ,దూషణ నెరపకుండాచేయగలిగిన సహాయం చేస్తూ, దయ కలిగి వుంటే చాలు మనకి తెలీని స్వర్గం నరకం గురించి ఆలోచించడం అనవసరం అనుకున్నాను
కొన్ని విపత్కర పరిస్థితుల్లో మనస్సును ప్రశాంతత వైపు మళ్ళించడానికి 'భావాతీతధ్యానం 'వైపు దృష్టి సారించాను.గురువు యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్నాను .నా ఆలోచన పరిధి విస్తారమయ్యింది(బహుశ వయస్సు కారణం కావచ్చు )
మనకి తెలియని ఒక అధ్బుతమైన శక్తి ఒకటి మనల్ని నడిపిస్తుంది అని నమ్మకం ఏర్పడింది ,ఆ శక్తి కి ఎవరికి తోచిన విధం గా ఆ పేరుతో పిలుస్తారు కాబోలు అనుకుంటాను .ఎన్నో ప్రశ్నలు వస్తుంటాయి సమాధానాలు దొరికిన పుస్తకాల్లో వెదుక్కుంటాను తరుచు మా అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళ సంభాషణలో దొరుకుతుంటాయి
నాకు కావలసిన శక్తి ,ధైర్యము కోసం ఆ భగవంతుని అడుగుతుంటాను గురువు సహాయం తో ....
నాకు నిరంతరం తోడుగా అన్ని వేళలునన్ను హెచ్చరించి మానవత్వం నాలో నశించకుండా కాపాడే దైవ సమానుడు "శ్రీ సాయి"
ఎంతటి జటిల సమస్య వచ్చిన వివేకం తో మెలిగి ఆ సమస్యను తొలగిపోయేలా చేసుకొనడానికి నాకు ఎంతగానో సహాయపడుతుంటారు .
రెండేళ్ళ క్రితం నన్ను చుట్టుముట్టిన సమస్య విడిపోయి మనస్సుకి ప్రశాంతత చేకూరింది .నన్ను నడిపిన గురువుకి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఈ రోజు సాయంత్రం ఇంట్లో అయిదు నుండి ఎనిమిదిన్నర వరకి సాయి సంకీర్తన ఏర్పాటు చేసాను .సాయి ని అనుసరించేవారంతా ఆహ్వానితులే ....అనంతరం ఫలహారం కూడా .....................

21, ఏప్రిల్ 2010, బుధవారం

ఒక్క నిమిషం

దాదాపు అన్ని స్కూళ్ళ లోను కాలేజిలలోను ఫైనల్ పరీక్షలు అయ్యిపోయి వేసవి సెలవలు మొదలయ్యాయి .పదవతరగతి రాసిన పిల్లల విషయంలో ఇప్పటికే తల్లిదండ్రులు అప్పోసప్పో చేసేసి ఏదొక కార్పోరేట్ కాలేజి లో సీట్ రిజర్వ్ చేసేసుకుని వుంటారు .ఆ పిల్ల భవిష్యత్తు దాదాపు స్కెచ్ వేసినట్లే రెండేళ్ళు రెసిడెన్స్ కాలేజి ఆనక "ఎంసెట్"లాంగో షార్ట్ టేర్మో..తరువాత ఇంజినీర్ ,డాక్టర్ ..ఆ తరువాత "డాలర్ ".......గ్రామాల్లోను ,పట్టణాల్లోను ఇదే బాట .ముఖ్యంగా మా కోస్తా వారి ప్లాన్ ఈ విధం గానే వుంటుంది .
పిల్లల కి చదువు చెప్పించడం సామాన్యులకి తలకి మించిన బరువుగానే తోస్తుంది ,అయిన వున్నా కుంటా ,సెంటు తెగనమ్మి పిల్లలికి చదువు చెప్పిస్తు కార్పోరేట్ కాలేజీలను కుభేరుల్ని చేస్తున్నారు
స్థోమత వున్నవారు ఏవిదం గా చేసిన పెద్ద నష్టపోయేది ఏముండదు ,ఎటొచ్చి లేని వారి పరిస్థితే ఆలోచించాలి .దాదాపు గ్రామాల్లోనే 70 % నివసిస్తున్నారు చాలావరకు వ్యవసాయం ,కూలిపనులు చేసేవారే ఎక్కువ ,వారంతా గ్రామం లో వున్నా ప్రభుత్వ బడిలో తమ పిల్లల్ని చదివిస్తూ ఆ పైన చదివించలేక ఎటువంటి అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తుందో తగిన సమాచారం లేక ఆ ఊరి పెద్దో ,మోతుభారి రైతో ,లేక అక్కడి ఉపాధ్యాయుని సలహా చేత తమని మించిన బరువైన ఇంజినీరో ,డాక్టరీ నో చదివించాలని తము తిని తినక పిల్లల్ని పట్టణాల్లో రెసిడెన్సీ కాలేజీల్లో చేర్పిస్తున్నారు .పిల్లలు చదివి ఉద్యోగాలు తెచ్చుకుని వాళ్ళు సెటిల్ అయ్యి పెద్దవారిని మంచి చెడు చూసుకునే సమయానికి వారు తలకి మించిన అప్పులతో ఆరోగ్యం క్షీణించి వృద్దాప్యం తో ఒంటరిగాకాలం వెళ్ళబుచ్చడం జరుగుతుంది .
పైన పేర్కొన్న చదువులే కాక ఎన్నో రకాల వృత్తివిద్యలు వున్నట్లు బహు కొద్దిమందికి మాత్రమె తెలుసు .పదవతరగతి పూర్తి కాగానే ఒకటి లేక రెండు సంవత్సరాల సర్టిఫికట్ కోర్సు చేయగానేవెంటనే ఉపాధి లభిస్తుంది దానిని ఆధారం చేసుకుని ఆ పై డిప్లోమ ,ఇంజినీరింగు డిగ్రీ చేయడానికి ఎంతో అవకాశం వుంది .దాదాపు ఇటువంటి వృత్తి విద్యలు 65trades మన రాష్ట్రం లోనే పారిశ్రామిక శిక్షణ సంస్థల్లో లభిస్తున్నాయి .అదేవిధంగా టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్వహించే డిప్లోమ కోర్సుల తో త్వరితగతిన ఉపాధి పొందవచ్చును తన కుటుంబం కి ఆసరాగా నిలబడుతూనే పై చదువులు చదవను వచ్చు.ఇవే కాక పారామెడికల్ కోర్సులు చేసి వెంటనే ఉపాధి పొందవచ్చును .
పదవతరగతి ,ఇంటర్ చదివిన తరువాత పై చదువులు గాని ,ఏదైనా ఉపాధి సంభందిత సమాచారం పొందాలంటే మీ జిల్లా లోని ఉపాధి కార్యాలయం లో ఉన్నటువంటి ఒకేషనల్ గైడెన్స్అధికారిని సంప్రదించినట్లయితే తగిన సమాచారము ,సలహాను పొందవచ్చును .అభ్యర్ధి అభిరుచి సాంఘిక స్థోమత బట్టి అభ్యర్దికి లభించే అవకాశాలు ,స్కాలర్షిప్పులు,మార్గదర్శకాలు పొందవచ్చును .
తగిన సమాచారం కోసం ఈ క్రింద పేర్కొన్న వెబ్ సైట్ చూడవచ్చును .

పైన రాసిన సమాచారం చదివిన ఏ ఒక్కరైన (ముఖ్యం గా ఉపాద్యాయులు ) తమకి తెలిసిన పిల్లలకి తెలిపినచో వారి జీవితానికి ఎంతోకొంత సహాయపడినవారు అవ్వుతారు .మనం వెచ్చించే అర నిమిషం చాలు చిన్ని సలహా జీవితాన్నే ఉన్నత స్థితికి మార్చొచ్చు .

17, ఏప్రిల్ 2010, శనివారం

GREETINGS

ఈ రోజు ఆంగ్ల సంవత్సరాది ప్రకారం పుట్టినరోజు జరుపుకునే బ్లాగ్ మిత్రునికి "జన్మదిన శుభాకాంక్షలు ". ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని .........
HAPPYBIRTHDAY.

11, ఏప్రిల్ 2010, ఆదివారం

DON'T MAKE THEM SHED TEARS


WE ALWAYS CRITISIZE ,TERRORISTS,NAXALS AND MANY OTHERS FOR THEIR VIOLENT WAYS OF INJURING AND KILLING OTHERS.
BUT HOW ARE WE DIFFERENT !
INFACT WE ARE MUCH WORSE.
UNLIKE THEM WE DON'T MIND INFLICTING FATAL,
EMOTIONAL WOUNDS TO OUR OWN LOVED ONE
JUST TO SATISFY OUR " EGO "
LIFE IS SHORT ................MAKE THE MOST OUT OF IT.
NO ONE IS PERFECT...... LEARN TO ACCEPT IMPERFECTION
IN OTHERS . EVERYONE LIKES TO BE LOVED....
SO , LEARN TO LOVE.
EVERYONE LIKES TO BE RESPECTED SO,
LEARN TO RESPECT.
BOTH PERFECTION AND IMPERFECTION ORIGINATE FROM YOU
AND RADIATE INTO THE WORLD...........
PRACTISE LOVE
PRACTISE TOLERANCE
PRACTICE PATIENCE
PRACTISE RESPECT
PRACTISE TRUST , PEACE AND HARMONY.
THERE IS NO POINT IN SHEDDING TEARS
WHEN SOMEONE PASSES AWAY . RATHER IT IS IMPORTANT TO
ENSURE THAT WE DONT MAKE THEM SHED TEARS WHEN THEY ARE WITH US NOW........
WITH LOVE AND RESPECT
CHINNI

"శిశిరం అయిన శిధిలం అయిన


ఆకులు రాలే వేసవిగాలి నా ప్రేమ నిట్టూర్పులే................
తోలకరికోసం తొడిమను నేనై అల్లాడుతున్నానులే
హిమముల రాలి సుమములై పూచి
రుతువులై నవ్వి ..మధువులై పొంగు ...............................
"శిశిరం అయిన శిధిలం అయిన
విడిచిపోబోకుమావిరహం అయిపోకుమా................ "

7, ఏప్రిల్ 2010, బుధవారం

బుల్లి ఫ్రెండు


మమ్మీకి ఉన్నాడు ఒక ''బుల్లి ఫ్రెండ్ "
వస్తాడు మా ఇంటికి అప్పుడపుడు
తెస్తుంటాడు తీయని చాక్లేట్సూ
హిమ క్రీములు బోలెడు బోలెడు
చెబుతుంటాడు ఎన్నో ఫన్ని
ఫన్నికబుర్లు మాకు
ఒక మాట మాట్లాడి ఒక
నిమిషం పాటు నవ్వుతుంటాడు
ఒక గంట కబుర్లు చెబితే వాటిలో
45 నిమిషాలు నవ్వులే వుంటాయి
ఇది మా నవ్వుల ఫ్రెండు కథ
(హి..హి ..హి ..నాకు స్వంత బ్లాగ్ లేదు కదా అందుకే మా మమ్మీ బ్లాగ్ అరగంట అద్దికి తీసుకున్న )
బై
చిన్ని డాటర్

2, ఏప్రిల్ 2010, శుక్రవారం

ఈ వేళలో

తొలి పొద్దువై వచ్చావు
జాబిల్లివై వెలిగావు
కాలమంతా కౌగిలింతై
కలల అలల పై కదిలించావు
నీ కన్నుల్లో కనుపాపని చేసి
కమ్మని కలలే చూపావు
ఎడబాటుతో తడబడిపోయా
ఏకాంతం లో నిన్నే తలిచా
తొలి వలపు పిలుపు విన్నా
నీలి మేఘాలలో నీకై వెదికా
కలలలుగా కదిలే నీలి మేఘాలు
సంధ్య కాంతులకి తల్లడిల్లి
నిశబ్ద నిశీధిలో నలుపెక్కాయి
మసక మసక చీకటికి
సువాసనలద్దె మల్లెలమ్మ
మనసు విప్పితమకంగానవ్వింది
(డైరీలో ఒక పేజి )
.

24, మార్చి 2010, బుధవారం

కలల అలజడికి నిద్దురకరువాయి

తెలవారదేమోస్వామి
నీ తలపుల మునకలో
అలసిన దేవేరి అలిమేలు మంగకూ
తెలవారదేమో స్వామి
.
చెలువము నేలగ చెంగట లేవని
కలతకు నెలవయి నిలచిన నెలతకు
చెలువము నేలగ చెంగట లేవని
కలతకు నెలవయి నిలచిన నెలతకు
కలల అలజడికి నిద్దురకరువాయి
అలసిన దేవేరి అలమేలు మంగకూ
తెలవారదేమో స్వామి ........

మక్కువ మీరగ అక్కున జేరిచి
అంగజు కేళి ని పొంగుచు తేల్చగా .......
మక్కువ మీరగ అక్కున జేరిఛి
అంగజు కేళిని పొంగుచు తేల్చగ
ఆ మత్తునే మది మరి మరి తలచగ
అలసిన దేవేరి అలమేలు మంగకూ
తెలవారదేమో స్వామి ........

14, మార్చి 2010, ఆదివారం

పూబాల

నిశిరాత్రి నన్ను వెదుక్కుంటూ నా తలుపు తట్టిందో భాల
తలుపు తీసిన నన్ను చూసి గమ్మత్తుగా నవ్విందా విరిభోణీ
ఎవరికోసం అని అడిగిన నన్ను చూసి అల్లరిగా తాకింది.............

10, మార్చి 2010, బుధవారం

యెదలో గానం ..యెదలో గానం ..
..పెదవే మౌనం ...
సెలవన్నాయి కలలు.
..సెలయేరైన కనులలో
మెరిసేనిలా శ్రీరంగ కావేరి
సారంగా వర్ణాలలో...అలజడిలో
యెదలో గానం పెదవే మౌనం
సెలవన్నాయి కలలు సెలయేరైన
కనులలో మెరిసేనిలా శ్రీరంగ కావేరి
సారంగా వర్ణాలలో అలజడిలో .....

కట్టుకధ లాయే మమత కలవరింత
కాలమొకటే కలలకయినా పులకరింత
శిలకూడా చిగురించే విధి రామాయణం
విధికయినా విధి మార్చే కధప్రేమాయణం

మరువకుమా ..వేసంగి ఎండల్లో పూసేటి మల్లెల్లో మనస్సు కధ....
మరువకుమా ...వేసంగి ఎండల్లో పూసేటి మల్లెల్లో మనస్సు కధ .................

1, మార్చి 2010, సోమవారం

ఒక లైలా కోసం

ఒక లైలా కోసం తిరిగాను దేశం
ప్రతిరోజు ప్రతిరాత్రి ప్రతిపాట ఆమె కోసం

ఆకాశానికి నిచ్చెన వేసి
చుక్కల పట్టుకు అడిగాను
లైలా యేదని...నా లైలా యేదని

తెల్లచోక్కలు నల్ల పాంట్లు ఇన్షర్ట్చేసుకుని నల్ల గ్లాసులు కళ్ళ కి తగిలించుకుని మన పాత తరం హీరోలని అనుకరిస్తూమా జునియర్ అబ్బాయిలు చేసిన డాన్స్ ....మా అందరి మనస్సులు దోచేసాయి అంటే అతిశయోక్తి కాదు .
1980 సంవత్సరం మొదలుకొని 2008-09 రియూనియన్ జరిగింది. .నిజానికి మా కాలేజి 1954 సంవత్సరంలో ప్రారంభించారు వారంతా చాల ఆక్టివ్ గా పాల్గొంటూ వుంటారు. ఎటొచ్చి 1980 తరువాత వాళ్ళే సరయిన కమ్యునికషన్ లేకుండా పోయిందని ప్రత్యెక రియూనియన్ నిర్వహించారు .
ప్రతి అయిదు సంవత్సరాల ను ఒక విభాగంగా చేసి దానికి ఒక గ్రూప్ లీడర్ ని నియమించారు . మాదే గ్రూప్ అని అడుగుతున్నారా:) మాది1988- 1990batch.
మా గ్రూప్ లో 1984-86 చెందిన రాష్ట్ర సాంకేతిక ఐ.టి.ఐ అమాత్యులు మోపిదేవి వెంకటరమణ వున్నారు .మా ముందు బాచ్ లో శాసనసభ సభ్యులు ధూళిపాళ నరేంద్ర మాజీ శాసన సభ్యులు రావి వెంకటేశ్వర రావు వున్నారు. వీరంతాచాల ఉత్సాహంగా కార్యక్రమం పూర్తయ్యేవరకు వున్నారు ..
మా క్లాసు వాళ్ళం చాల వరకు హాజరయ్యం ,సమాచారం సమయానికి అంధక రానివాళ్ళు ఎందరో .....ప్రోగ్రమం నిర్వహణ చక్కగా జరిగింది .రాబోయే రోజుల్లో చేయబోయే కార్యక్రమాలు చర్చించడం జరిగింది ,పూర్తి స్తాయిలో అల్కాని బలోపేతం చేయాలని నిర్ణయించడం జరిగింది .మా కళాశాల కురువృద్దులు (ఫాదర్స్ )సుపిరియర్ ,ప్రిన్సిపాల్ ,అల్కా ప్రెసిడెంట్ అతిధులు చక్కని సందేశాలు అందించారు .పూర్వ విద్యార్ధి మోపిదేవి రమణ , నరేంద్ర వారి అనుభవాలు పూర్వ విద్యార్ధులతో పంచుకున్నారు ,వివిధ రంగాల కి చెందిన ప్రముఖ విద్యార్ధులు ,అప్పటి మా అద్యాపకులు జ్ఞాపకాలు పంచుకున్నారు...నేను కూడా -:):).అప్పట్లో మా జునియర్ డిగ్రీ విద్యార్ధులు ,అధ్యాపకులు మమ్మల్ని గుర్తుపట్టి ఆత్మీయంగా పలకరించారు అయిదు బ్యాచ్ లు ఒకటిగా కలిపి ఫోటో సెషన్ నిర్వహించారు చక్కటి విందు కూడా ఏర్పాటు చేసారు .మనసులు విప్పి ఎన్నో ఊసులాడుకున్నాం. మేం అంటే బొత్తిగా భయం లేకుండా సినియర్ స్టూడెంట్స్ అని అయిన చూడక మాకు సైట్ కొట్టిన ఇంటర్ డిగ్రీ విద్యార్ధులను తలుచుకుని నవ్వుకున్నాం ..అక్కడ గడిపిన అయిదుగంటలు అయిదునిమిషాల్ల గడచిపోయింది...really really we enjoyed a lot .

THIS LITTLE GUIDING LIGHT OF MINE
I AM GONNA.LET IT SHINE
LET IT SHINE ALL THE TIME LET IT SHINE

TAKE MY LITTLE LIGHT ROUND THE WORLD
I AM GONNA LET IT SHINE
LET IT SHINE ALL THE TIME LET IT SHINE .............

28, ఫిబ్రవరి 2010, ఆదివారం

జ్ఞాపకాలపూలు


మాఆంద్ర లయోలా కాలేజి పూర్వ విద్యార్ధుల సమావేశం రేపు ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకి ఫాదర్ దేవయ్య ఆడిటోరియం లో జరగబోతుంది.ఆహ్వానం అందిన వెంటనే అవకాశం వున్నవారందరం కలుద్దాం అని నిర్ణయించుకున్నాం .ఆ కాలేజిలో చదవడం వలన క్రమశిక్షణ ,విలువలు మానవత్వం నేర్చుకున్నాం .
మా కాలేజి డిసిప్లినే కి మారు పేరు ఉదయం మొదటి గంట కొట్టే సరికే క్లాసు రూం లో వుండాలి పొరపాటున లేట్ అయ్యామా మా ఇన్నయ్య ఫాదర్ పులిలా కర్ర పట్టుకుని ఆఫీసు రూం దగ్గరలో వుండేవారు అందరు ఒకటే ఉరుకులు పరుగులు .ఆ ఎదురుగానే వున్నా 'మారిస్ స్టెల్లా' లోఇంత క్రమశిక్షణ వుండేది కాదు ఎలా తెలుసంటే మనం డిగ్రీ అక్కడే చదివాం గ్యాంగ్ మైంటైన్ చేస్తూ బోల్డన్ని యవ్వరాలు నడిపెవాళ్ళం.

మొట్టమొదటి పోస్ట్ గ్రాడ్యేట్ డిపార్టుమెంటు మా బాచ్ తోనే మొదలయ్యింది .డిపార్టుమెంటు అఫ్ సోషల్ వర్క్ లో మేము ముప్పయ్యి మందిమిఅలానే ఇంగ్లీష్ డిపార్టుమెంటు లో ముప్పయ్యి .అసలు ఆడపిల్లలు ఆ కాలేజిలో అడుగుపెట్టడం కూడా మాతోనే .ప్రారంబోత్సవం ఒక వేడుకలా చేసారు .ఆనాటి అతిధులుగా దివంగత మంత్రి ఇంద్రారెడ్డి ,శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వర రావు పాల్గొన్నారు.

చదివిన రెండున్నర సంవత్సరాలుఆ కళాశాల మా మీద ఎంతో ప్రభావం చూపింది .ముఖ్యంగా మేం ఎంచుకున్న ఫీల్డ్ మా ఆలోచన దృక్పధాన్నేమార్చేసింది.మూడురోజులు క్లాస్ వర్క్ మూడు రోజులు ఫీల్డ్ వర్క్ వుండేది
మా చదువులో భాగంగా మురికి వాడలు,అనాధ శరణలయిన నిర్మల్ హృదయ భవన్ ,జువనైల్ హోములు మెంటల్లీ రెటార్దేడ్ హోంసు స్త్రీ సంరక్షణ సంస్థలువిజిట్ చేసి.వారితో కలసి కేసు వర్క్ ,గ్రూప్వర్క్ చేయడం ....ఇవన్ని మాకు వాస్తవ జీవితం ఎలా ఉంటోందో అనేధీ ప్రత్యక్షంగా తెలుసుకున్నాం. .క్రిమినల్ రిఫార్మేషన్ లో నాస్తిక కేంద్రంలో గోరా గారి కుమారుడు 'లవణం 'గారిపర్యవేక్షణలో ఫీల్డ్ ట్రైనింగ్ మరపురాని జ్ఞాపకం .

మా చదువులో భాగంగా మచిలీపట్టణం దగ్గర సముద్రంలో ఒక దీవి వంటి కుగ్రామం లో సైక్లోనే సెంటర్లో పదిహేను రోజులు ఆ గ్రామస్థులతో పాటు నివసించాము.అక్కడి యువత తో కూడి రెండు కిలోమీటర్ల పొడవు గ్రావెల్ రోడ్ వేసాము .చీకటిలో షెల్టర్ హొం పైకి వెళితే సముద్రపు హోరుచుట్టూ మినుకు మినుకు మనే చుక్కలు,దూరంగా లైట్ హుసే నుండి వుండుండి వెలుగు ...హ్మం అద్భుతమైన అనుభవం ..గ్రామస్తుల తో కలిపి ఆటలు పాటలు తిరిగి విడిచి రావడానికి ఎంతో బెంగ పడ్డాము.
రెండో సంవత్సరం లో మేం ఎంచుకున్న గ్రూప్ బట్టి కే.సి.పి సుగర్స్ లో ,సిరిస్ లో ,హెచ్ .ఎ.ఎల్ లో మా ఎక్జిక్యూటివ్ ట్రైనింగ్ జీవితానికి అపారమైన అనుభవాన్ని ఇచ్చింది .అక్కడ చదివిన రెండేళ్ళు చాల చూసాం మాకు తెలియని ప్రపంచాన్ని చూసాం చుట్టూ వున్నా సమాజాన్ని చూసి వేదన చెందాము ఎటువంటి పరిస్తితుల్లోనయిన బ్రతకొచ్చు అనే సూక్ష్మ సత్యాన్ని తెలుసుకోగలిగాం.మా సైకాలజీ మేడం సంధ్య భల్ల తో నా స్నేహం కళాశాల వార్షికోత్సవం లో మేం ప్రదర్శించిన నాట్యం .,నేను వెలగబెట్టిన సోషల్ వర్క్ అసోసియేషన్ అద్యక్ష పదవి ,ఆధిపత్యాన్ని సహించలేక రెండు గ్రూపులైన మేము ;):)
మార్కులకోసం ,యునివెర్సిటీ ర్యాంక్ కోసం మా తాపత్రయం ఎన్నో ఎన్నెన్నోతీపి జ్ఞాపకాలు . మాడిపార్ట్మెంట్ హెడ్ ఫాదర్ .దాస్ నిరంతరం స్పూర్తిదాయకంగా అడుగడుగునా అభినందిస్తూ సమాజం పట్ల మా భాద్యత గుర్తు చేసిన తీరు మరచిపోలేనిది మా రెక్టార్ ఫాదర్ అమలరాజ్ ప్రిన్సిపాల్ ఫాదర్ ఇన్నయ్య మమ్మల్ని చాల చాలా గారభం గా చూసేవాళ్ళు వేరే స్టేట్ నుండి వచ్చిన విసిటర్స్ కి మమ్మల్ని గర్వంగా పరిచయం చేసేవాళ్ళు (ఇంగ్లీష్ వాళ్ళని అంతగా పట్టించుకునే వాళ్ళు కాదు :):)
ఈ రోజు అందరం దాదాపు చక్కగానే స్థిరపడ్డాం. కొన్నాళ్ళ క్రితం మాలోని ఒక మిత్రుని మరణం తీరని వేదన కలిగింది.ఫాదర్ తిక్మూరే ప్రత్యేకంగా ప్రేమగా పంపిన ఆహ్వానాన్ని చూసి అందుబాటులో వున్నవాళ్ళం అయిన కలవాలని నిశ్చయించుకున్నాం ..


.

26, ఫిబ్రవరి 2010, శుక్రవారం

హై వే ఎప్పుడొస్తుందో ?


మొన్నీ మధ్య అత్యవసరంగా హెడ్ ఆఫీసు కి వెళ్ళాల్సి వచ్చింది .మీటింగ్ అటెండ్ అయ్యి వెంటనే తిరిగి వచ్చేయొచ్చు ఏ టైం అయిన అని రోడ్ మార్గం ఎంచుకున్న .నాతో పాటు క్యాంపు క్లార్క్ ,ఆఫీసు సబ్ స్టాఫ్ వున్నారు .ఆ సబ్ స్టాఫ్ ఏడాది క్రితం తండ్రి చనిపోతే కంపషినాట్ గ్రౌండ్స్ లో చేరాడు ,చదువు పెద్దగ లేదు పది చదివినట్లున్నాడు వయసు పందొమ్మిది ఉండొచ్చు . నా ఆఫీసు కి వచ్చే ఫ్రెండ్స్ అతన్ని ముద్దుగా అతి వినయం అని పిలుచుకుంటారు .నేను ఊరు బయలుదేరుతుంటే "అమ్మ నేను వస్తాను ఇంతవరకి హైదరాబాద్ చూడలేదు " అన్నాడు . అతనికి వైజాగ్ నుండి నెల్లూరు వరకే తెలుసు తరచూ నా కూడా ఉంటాడు .ప్రయాణం మొదలవ్వగానే అలవాటు ప్రకారం పుస్తకం తీశాను ,ఎప్పుడో మొదలెట్టి వదిలేసినా 'ది అల్కెమిస్ట్ ' తీశాను . ఈ పుస్తకం కంటే ఈ ముగ్గురి పిల్లల కబుర్లే ఆసక్తిగా వున్నాయి .డ్రైవర్ కూడా ఇంచుమించు మా అతివినయం వయసే .పుస్తకం పక్కన పడేసి నేను కూడా వాళ్ళ సంభాషణలో పడిపోయాను .అప్పటికి మేం బయలుదేరి మూడు గంటలు అయ్యింది .ముందు సీట్లో వున్నా డ్రైవెర్ని వినయం విసిగిస్తున్నాడు నాకు వినబడకుండా .డ్రైవెర్ తెగ నవ్వేసుకుంటూ వస్తుంది ..వస్తుంది అంటున్నాడు .మా క్లార్క్ కూడా నవ్వుతున్నాడు .,ఇద్దరు కలసి ఆ అబ్బాయిని ఎడ్పిస్తున్నారు.ఏవిటని అడిగితె ఎమిలేదంటారు .మరో అరగంట తరువాత ఆ పిల్లాడు అడగడం మరల అదే సమాధానం చెప్పి నవ్వడం చేస్తున్నారు . ఇక వాళ్ళు నవ్వలేక నాకు చెప్పారు ,.."హై వే ఎప్పుడొస్తుంది" అని మూడు గంటల నుండి అతివినయం వాళ్ళ ప్రాణం తీస్తున్నాడని ,డొంక రోడ్లో ఎందుకన్నా బండి తీస్కేల్తావు హై వే లో పోనీయమని .వీళ్లేమో ముందు వస్తుంది అని మభ్యపెడుతూ అతన్ని ఆడుకుంటున్నారు .అతని అమాయకత్వానికి నేను కూడా నవ్వులు కలిపి ఇంకో గంటలో రావొచ్చు అన్నాను .మేం ఇంకో గంట ప్రయాణం చేస్తే ఫోర్ వే వస్తుంది అని ,మనం ఇప్పటివరకి ప్రయాణం చేసింది హై వే నే 'డొంక రోడ్డు "కాదు ,ఇంకా ఈ రూట్ చెన్నై కలకత్తా రూట్ లా ముస్తాబు అవ్వడానికి మరికొంత కాలం పట్టొచ్చు అని వివరించాను .ఎంతో గొప్పగా ఊహించి హైదరాబాద్ ప్రయాణం అయ్యిన మా వాడికి ఊహించని షాక్ ఈ హై వే . అయిదవ నంబరు జాతీయ రహదారి మీద ప్రయాణం చేసిన వారికి తొమ్మిదో నంబరు రహదారి అదీ నందిగామ నుండి హైదరాబాద్ వరకి నరకమే . నల్గొండ జిల్లా మొదలైన దగ్గరనుండి అడుగడుగునా మోహరించిన ' రక్షక దళం' రహదారి కి రెండు చోట్ల చిన్చిఛిన్న గోడలు, కూల్చి వేసిన దృశ్యాలు .ఈ రక్షకదళం లేకపోతె సురక్షిత ప్రయాణం కల.
నిత్యం వేల వాహనాలు తో అతి రద్దీ గా వుండే ఆ రహదారి ఇప్పటికి అభివృద్ధి చెందలేదు. ఇరుకైన దారులు ,మలుపులు దారుణమైన ఆక్సిడెంట్లు ఆ దారిలో ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాలి. మనం ఎంత జాగ్రత్తగా వున్నా అవతల వచ్చే క్వారీ లారీ వాళ్ళు జాగ్రత్తగా వుండరు .పదిహేను ఏళ్ళ క్రితం నాన్న కజిన్ ఫ్యామిలీ తో మా భందువుల పెళ్ళికి వస్తు చిట్యాల దగ్గర దారుణమైన ఆక్సిడెంట్ కి గురయ్యారు. స్టేట్స్ లో చదువుతున్న పెద్ద అమ్మాయి తప్పించి నలుగురు పిల్లలు ,ఆ పిన్ని బాబాయి తీవ్రంగా గాయపడ్డారు ఆయన స్పాట్ డెడ్ చిన్న వయసులోనే . .ఆ దారి నా చిన్నప్పటి నుండి ఇప్పటికి అలానే వుంది.ఆ దారి మృత్యు రహదారి .
ఆ రోడ్ మార్గాన్ని ఆధునికరించాల్సిన అవసరం యంతైన వుంది ప్రమాదాలు నివారించే దృష్ట్యా తగిన చర్యలు చేపట్టాలి ......
చూడాలి ఈ హై వే ఎప్పుడొస్తుందో -:):). .
.

21, ఫిబ్రవరి 2010, ఆదివారం

ఏకాంత సౌధం లో

ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధం లో
నిదురించు ఓ జహాపనా
నిదురించు ఓ జహాపనా

పండు వెన్నోల్లో ....వెండి కొండల్లే !పం !
తాజ్ మహల్ .....ధవళ కాంతుల్లో
నిదురించు.......... జహాపనా
నిదురించు........... జహాపనా

నీ జీవితా...జ్యోతీ.......నిను చూడ మూర్తీ
ముంతాజ సతి ....సమాధీ
సమీపానా నిదురించు జహాపనా
నిదురించు ......జహాపనా .!.ఈ !

నా డైరీ లో ఒక పేజీ .
ఈ పాటఎన్ని సార్లు విన్న మరీ మరీ వినాలనిపిస్తుంది పౌర్ణమి వెన్నెల్లో తాజ్ మహల్ అందాలు , చివరిరోజుల్లో కొడుకు చేత బందీ అయ్యి ప్రియమైన తన భార్య కోసం వేదన చెందే దృశ్యం మనోఫలకం పై గోచరిస్తుంది . పాట ఎవరు పాడేరో తెలియదుకాని సినిమా "నీరాజనం "ఇందులో పాటలన్నీ చాల చాల బాగుంటాయి .సంగీతం ఓ.పి.నయ్యర్.
.మనస్సు బరువెక్కుతుంది.. మనసులోని మమత ఏరులై కన్నీరై నన్ను తడిపేస్తుంది .ఒలికిన పాలను ఎత్తలేని నా నిస్సహాయత నన్ను కుదిపేస్తుంది .19, ఫిబ్రవరి 2010, శుక్రవారం

నేలటికేట్

హమ్మ్...ఇన్నాళ్ళకి నేలటికెట్ తీసుకొని సినిమా చూసాను.చిన్నప్పుడు చాలాసార్లు అనుకునేదాన్ని ఎంచక్కగా స్క్రీన్ కి దగ్గరగా కూర్చుంటే అందర్నీ దగ్గరనుండి చూడొచ్చు కదా అని ,ఆ కోరిక ఇన్నాళ్ళకి మా అమ్మాయి ద్వారా తీరింది .
మద్యాహ్నం ఇంటికి లంచ్ కి వెళ్ళగానే నా కూతురు ,చెల్లి కూతురు పెద్ద ప్లాన్ తో ఎదురొచ్చారు ,యెట్టి పరిస్థితిలో ఈ రోజు శేఖర్ సినిమా "లీడర్ "చూడాల్సిందేనని పైగా అదీను ఈ రోజే రిలీజ్ అయ్యిందని వాళ్లకి జతగా చెల్లి వంతపాడింది,టికెట్స్ రిజర్వు చేయించమని. అరగంటలో సినిమా మొదలవబోయే సినిమాకోసం అడగక అడగక అడిగారు పిల్లలని కాస్త పెద్ద మనస్సు చేసుకుని నాలుగు టికెట్లు సంపాదించాను ,వాళ్ళు టికెట్స్ ఇచ్చేప్పుడు స్క్రీన్ ఒన్ అనగానే ఎదోకట్లే వీళ్ళు (నేను )సినిమా చూడటం కావాలిగాని అంటూ లోపలి వెళ్లాం .వెళ్ళాక గాని తెలియలేదు అది నేల టికెట్ అని స్క్రీన్ కి దగ్గరలో రెండో వరుసలో కూర్చున్నాం.సినిమా మొత్తం తల కొంచెం పైకి యెత్తి చూడాల్సి వచ్చింది (సీట్స్ దరిద్రంగా వున్నాయి ) వందరూపాయలు టికెట్ ,పేరుకి inox .జీవితంలో మొదటి ఆట మొదటిసారి స్క్రీన్ కి అత్యంత దగ్గరలో చూసాం ,ఏదో శేఖర్ కమ్ముల కాబట్టి కాస్తంత సర్దుకున్నాను లేకపోతె వాళ్ళని అక్కడ వదిలేసి చక్క వచ్చేసేదాన్ని.ఆనంద్ గోదావరి తో శేఖర్ అభిమానిని కనీసం హ్యాపీ డేస్ లా అయినా సినిమా ఉండకపోతుందా అనే ఆశ తో ఓపికగా సినిమా అంతా చూసాను .
ఏదో చెప్పాలనుకుని చెప్పలేకపోయాడు.....అనిపించింది .ఏవిటి కథా అని ఆలోచిస్తే "నల్లధనం" వెతికి తీసి ప్రజలకి పంచాలి అన్నా సందేశం కనిపిస్తుంది .మరీ లీడర్ టైటిల్ కొంచెం కన్ఫుజింగా వుంది తల్లి పాత్ర ద్వారా లీడర్ వేరు పోలిటిసియన్ వేరు అని చెప్పించడం , తండ్రి సాధించలేక అవినీతి వ్యవస్థలో కొట్టుకుపోవడం ,దానికి విరుగుడుగా తానూ సాధిస్తాను అనడం ఆ లక్ష్యం చేరుకోవడానికి తండ్రి సంపాదించిన నల్లధనాన్నే వాడుకుని ముఖ్యమంత్రి కావడం చిరాకు కలిగించింది .అసలుకే తక్కువ సినిమాలు చూస్తాను చూడక చూడక చాలారోజులకి చుస్తే సినిమా నిరాశాపరచినదే అనిపించింది .పాటలు 'జయ జయ ప్రియబారత ,మా తెలుగు తల్లి బ్యాక్గ్రౌండ్లో వినులకింపుగానే వున్నాయి చివరిలో వచ్చిన కాథానాయకి కళ్ళకింపుగా ముద్దుగా వుంది,అన్నట్లు ఆమె కట్టిన చీరలు బాగున్నాయి,పాటలు పర్లేదు .

6, ఫిబ్రవరి 2010, శనివారం

సంవత్సరం అయ్యింది !

శుక్రవారం 6 ఫిబ్రవరి 2009

కొత్తగా బ్లాగు లోకం లోకి..

ఇదో కొత్త ప్రపంచం నాకు..ఇల్లు, ఉద్యోగం..కొంచం ఖాళీ దొరికితే మనసుకు నచ్చే పుస్తకాలు, సంగీతం.. కొద్ది రోజుల క్రితం వరకు ఇదే నా ప్రపంచం. ఇప్పుడు కొత్తగా బ్లాగులతో పరిచయం అయ్యింది.. మీ అందరితో పంచుకోడానికి నా దగ్గర ఎన్నో ఊసులు ఉన్నాయనిపించింది..అందుకే ఈ చిరు ప్రయత్నం.. నా బ్లాగులోకి మీ అందరికి స్వాగతం..మళ్లీ ఇదేమి పిచ్చి అనుకుని నవ్వకండే... గత ఏడాది ఇదేరోజు బ్లాగ్ లోకంలోకి ప్రవేశించాను . పైన టైపు చేసింది నేను కాదు ,నేను ఏమనుకుంటున్న నో చెబితే నా ఫ్రెండ్ రాసారు ఓపికగా నా అల్లరి భరిస్తూ (అర్ధం కాక విసిగిచ్చేసాను ).......
నాలోని ఊహలుకు నాలోని ఊసులకు నడకలు నేర్పావు -:) మా బ్లాగ్ గురువుగారికి నమస్కారములతో .
-చిన్ని

30, జనవరి 2010, శనివారం

అదే నీవు.... అదే నేను

అదే నీవు.... అదే నేను
అదే గీతం.... పాడనా
కథయినా...... కలయినా
కనులలో...... చూడనా
కొండ కోన గుండెల్లో
ఎండవానానయినావు
గువ్వా గువ్వా కౌగిల్లో
గూడు చేసుకున్నాము
అదే స్నేహమూ... అదే మొహమూ
ఆది అంతం ....ఏది లేని.... గానము
నిన్న రేపు సందెల్లో నేడైవుందామన్నావు
కన్నీరయిన ప్రేమల్లో పన్నీరవుదామన్నావు
అదే బాసగా ....అదే ఆశగా
యెన్నినాళ్ళు నిన్న పాటే పాడను .

26, జనవరి 2010, మంగళవారం

చేదు జ్ఞాపకం

రిపబ్లిక్ డే అనగానే నా మనస్సు తొమ్మిది యేళ్ళు వెనక్కి పరిగెట్టి కొద్ది క్షణాలు మనస్సు చేదేక్కుతుంది. నాడు భారత దేశాన్ని భుజ్ తదితర ప్రాంతాల్ని తీవ్రంగా కుదిపేసి తీవ్రమయిన భూకంపం కొన్ని క్షణాల్లోనే వేలాది ప్రాణాలు బలి తీసుకుంది. ఆనందం గా గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్న చిన్నారులు స్కూలు శిధిలాల క్రింద నలిగిపోయారు ,భయంకర మయిన వ్యధలు ..గాధలు ఇప్పటికి తేరుకొని కోలుకొని అనాధలు ..ప్చ్ .చాలాకాలం వెంటాడిన ఆ సంఘటనలు ...మనవంతు ఎంత చేసిన అది అత్యల్పమే ...ప్రక్రుతి ముందు అల్పులమే ...ఆనాడు అసువులుబాసిన చిన్నారులకి ,పెద్దలకి నా ప్రగాడ "నివాళి ".

21, జనవరి 2010, గురువారం

బ్లాగ్ లోకం -బంగారులోకం ముగింపు

బ్లాగ్ మిత్రులు భా.రా.రె బంగారులోకం మూడవ భాగం కూడా రాసి నూరు టపాలు పూర్తి చేయమని సలహా ఇచ్చారు .నిజానికి నేను చాల రాసినదాన్నే ఎందుకులే గొడవలు క్లుప్తంగా నాలుగు ముక్కలు రాస్తేపోలా అని ముగించేసాను .నావి వంద అని వారు చెప్పగానే వెళ్లి కౌంట్ చేసాను ....ఒక్కసారే నవ్వు వచ్చింది ..అప్పుడెప్పుడో చిన్నప్పుడు చదివిన పద్యం లీలగా గుర్తొచ్చింది .,"గంగి గోవుపాలు గరిట డయిన చాలు ....కడివిడయిన నేమి ఖరము పాలు "అన్నట్లు..మనం తోచనప్పుడల్లా నాలుగయిదు లైన్లు గెల్కి దానికి వంద లోకి ప్రవేశామా ! దానికి తగ్గట్లు మిత్రులు ముందస్తు శుభాకంక్షలా !

బ్లాగ్ లోకం -బంగారులోకం కొనసాగింపు తానోవ్వి నొవ్వక యెం రాయాలా అని ఆలోచిస్తే ''నిగ్రహం లేక నియంత్రణ" గుర్తొచ్చింది. ఇంకోమాటలో ఆత్మనిగ్రహం అనుకొందాం .నాకు నిగ్రహం అనగానే "ప్రవరుడు"గుర్తొస్తాడు .ప్రవరుడికి ఉన్నంత నిగ్రహం వుండాలని ..ప్రవరుడు ఎవరా అంటారా ?మా చుట్టం కాదండోయ్ ..(నేను రాసేది పండితులకు కాదని మనవి ) ప్రవరుడెవరో అతని ఆత్మా నియంత్రణ యేపాటిదో నాకు తెలిసిన కథ కొంచెం చెప్తాను .

పెద్దన రాసిన మహా ప్రభంధం "స్వారోచిష మను సంభవం" మన వాడుకలో 'మను చరిత్ర ' హీరో ప్రవరుడు -:) ఈ విప్రకుమారుడి ఊరి పేరు అరుణాస్పదం.చాలా బుద్దిమంతుడు ,ఇక చెప్పాలంటే సద్గుణ సంపన్నుడు .రోజు పూజ పునస్కారం ,ఇల్లు చక్కదిద్దుకుంటూ వుండగా ,ఒక రోజు వయసులో చిన్న అయిన "సిద్దుడు "లోక సంచారం చేసి మన హీరోగారి ఇంటికి వస్తాడు .వచ్చిన అతిధికి మర్యాదలు చేసి "స్వామి తవరికి ఇంత జ్ఞానం యల వచ్చింది ,ఏయే ప్రదేశాలు ,గిరి వన సముద్రాలు చూసారు చెప్పండీ ,అదీ ఇంత చిన్న వయస్సులో ,ఇంత స్వల్ప వ్యవధిలో ప్రపంచాన్ని ఎట్లా చుట్టారు (బ్లాగ్లంటే ఏంటి అని యల చూడాలో అని నేను అన్నట్లుగా అన్నమాట )అని ప్రవరుడు ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించాడు .అపుడు ఆ సిద్దుడు ,తనకి ఈశ్వరుని కృపచే పాద లేపనం అనే దివ్యవుషధం లభ్యం అయ్యిందని,ఆ ప్రభావంతో మనో వాయువేగంతో అన్ని ప్రదేశాలు సంచరించవచ్చని(అంతర్జాలం లా) తను చుసిన ప్రదేశాలు వర్ణించి చెబుతుంటే మన ప్రవరుడు కూడాచూడాలనిపించి తనకి కూడా ఆ దివ్యవుషధంఇమ్మనితను చూసి పుణ్యం తెచ్చుకుంటానని సిద్దుడిని కోరతాడు . సిద్దుడు దంతపు భరిణ తీసి పాదలేపనం ప్రవరుడి పాదాలకి పూసి వెళ్తాడు . ప్రవరునికి ఎప్పటినుండో "హిమవత్పర్వతం" చూడాలని కోరిక అనుకున్నదే తడవు అక్కడ వాయువేగం తో వాలిపోయాడు .

ఆ హిమవన్నగా సౌందర్యం చూసి ప్రవరుడు మైమరచికొండకొలను చెట్టుపుట్టల్లోతిరుగుతూ సూర్యకాంతి నడినెత్తికి వచ్చేసరికి ఉలిక్కిపడిఇల్లు గుర్తుకి వచ్చి తన నిత్య కృత్యాలు గతి తప్పుతాయేమోనని బెంగపడిఇంటికి వెళ్ళడానికి వెనక్కి మళ్లుతాడు.హిమపర్వతం మంచు వలనఎండ వేడికి సిద్దుడు రాసిన లేపనం కరిగిపోయి ఇల్లు చేరు దారి మరచిపోతాడు .యేల ఇల్లు చేరాలో తెలియక చింతా సాగరం లో మునిగి తన ఇంటికి దారి ఎవరైనా చెబుతారేమోనని వెదుకు చుండగా ,గరుడ పచ్చలతో పొదగబడిన భవనం లో వీణమీటుతున్న ఒక దేవకాంతని చూస్తాడు .ఆమె సౌందర్యానికి చిత్తుడై ఇలా అంటాడు
ఎవ్వతే నీవు భీత హరిణేక్షణ ! భయం లేకుండా ఇక్కడున్నావు ,మా ఊరి దారి మరిచిపోయాను దారి చెప్పి పుణ్యం కట్టుకో అని ..అప్పటికే ఆ దేవకన్య ప్రవరుడిని చూసి ప్రేమలో పడిపోయి కావలేనే పలకరిస్తున్నాడనుకొని,..ఇంతలు కన్నులుండ దేరు వెవ్వరి వేడెదు? ఏకాంతం లో వున్నా జవరండ్రని నెపం మీద పలుకరిస్తున్నావు అని ప్రవరుని పయి తనకి కలిగిన ప్రేమ ,మోహాం నిసిగ్గుగా
ఈ విధంగా వెల్లడిస్తుంది ..."నిక్కము దాపనేల ?ధరణి సురనందన !యింకా నీ పయిం
జిక్కె మనంబు నాకు ,నను జిత్తజుభారికి నప్పగించేదో?
చొక్కి మరంద మద్యముల చూరల భాటలు వాడుతేంట్ల సొం
పెక్కిన ,యట్టిపూవు బోదరిండ్లను గౌగిట గారవించేదో?

అప్పుడు మన కథానాయకుడు ,తప్పు ఏదో బుద్ధి గడ్డి తిని ఇక్కడ ఏమేమి వింతలున్నాయో చూడటానికి వచ్చాను ,నాకోసం ఎదురు చూసే బంధు జనాలు వున్నారు ,నాకు చాలా భాద్యతలు వున్నాయి వెళ్లి నా పనులు నేను చూసుకోవాలి ...చూడటానికి వచ్చానే కాని ఉండటానికి కాదు అని .....మత్తు వదుల్చుకొని "అగ్ని దేవుడిని "ప్రార్ధించి తన నిజమందిరం కి చేరిపోతాడు .
అది ప్రవరాఖ్యుని నిగ్రహం .....తాత్కాలిక ఆనందాలకి లోనయితే నిత్యకర్మ కలాపాలు భంగం అవుతాయని అది ధర్మం కాదని మన ప్రవరుడు చెబుతున్నాడు ...-:):)
ఇది చదివినవారు ఎవరికి తోచినరీతిలో వారు తీసుకోవచ్చు ........చివరికి చెప్పొచ్చేది ఏవిటంటే "సెల్ఫ్ కంట్రోల్ ".......దేనికిని ఎడిక్ట్ కాకుండా .కళ్ళ ముందు "లాప్ టాప్ " కనబడిన ,మనం ఎంత విశ్రాంతిగా వున్నా నియంత్రించుకున్న సమయంలోనే అటు చూడాలని-:):) ..చివరిగా ఒక మాట ,రాసినదంతా నాలాంటి వారికోసమే సుమా !పెద్దోళ్ళ కోసం కాదు .

20, జనవరి 2010, బుధవారం

బ్లాగ్ లోకం -బంగారులోకం ......

బ్లాగ్ ల వలన ప్రపంచంలోని సమాచారం మెరుపుకన్న వేగంగాతెలుసుకోగలుగుతాం ,అనేక మంది భావసారుప్యం వున్నా వ్యక్తుల్ని అంతర్జాలం ద్వారా కలవడం చర్చించడం విషయసేకరణ కి అవకాశం కలుగుతుంది .వార్తపత్రికల కన్నా మిన్నగా ఒక అంశం గురించి రాసినపుడు భిన్న కోణాల్లో అభిప్రాయ వ్యక్తీకరణ వెరసి అన్నిటికి మంచి వేదిక .రాజకీయ ,ఆర్ధిక సామాజిక ,సాహిత్య చర్చలు నిరంతరం ఒక చోటే నిత్యనూతనంగా అందుబాటులోవుంటాయి . పరోక్షంగా విజ్ఞానం పంచి పెంచడంలో బ్లాగ్స్ దోహదపడుతున్నాయి .
ఇక చెప్పాలంటే బ్లాగ్స్ రాసే వ్యక్తులు చాలా వరకి అజ్ఞాతంగా వుంటారు .కాని ఈ అజ్ఞాతంలో ఎన్నో వర్గ ,వర్ణ వైషమ్యాలో.ఇవి ఎంతవరకంటే వ్యక్తిగత దూషణల వరకి వెళ్ళడం వరకి వుంటుంది .తెలియని ప్రపంచంలో తెలియని వ్యక్తుల మీద కూడా విషం వెదజల్లే వర్గాలు వుంటారు అవకాశం దొరికినపుడు అవహేళన చేస్తారు ,పోనీ వారేమైనా మేధావులా అంటే అదీను కాదు ..నేను గమనించినంత వరకి విషయ పరిజ్ఞానం తో రాసేవాళ్ళు చాల తక్కువ .చాలవరకి పై పైన రాసేవాళ్ళే ఎక్కువ (నాలాగ-:) ) బ్లాగ్ ని డైరీ లా రాసేవాళ్ళ గురించి కాదు ఈ వ్యాఖ్యలు ..
బ్లాగ్ లో నా ప్రవేశం అనుకోకుండా జరిగింది . బ్లాగ్ డిజైన్ చేసి దానికి ఒక పేరు పెట్టడం అంత నా ఫ్రెండ్ తో కలిసే చేసాను .సాద్యమైనంతవరకి మన వివరాలు గోప్యంగా ఉంటేనే మంచిది అనిన తన మాటకి "ఏమవుతుంది తెలిస్తే "అని మొండిగా వాదించిన సందర్భం లేకపోలేదు ....కాలక్రమేణ నాకే తెలిసి వచ్చింది ,తెలియకపోయినా అవకాశం తీసుకుని బురదలు జల్లే వ్యక్తులు ఇక తెలిస్తే బ్రతకనివ్వరని.స్వేచ్చగానచ్చినట్లు రాసిన ,జ్ఞాపకాలు ,అనుభవాలు ఆయా అజ్ఞాత వ్యక్తుల చేతుల్లో పారడిలుగా ప్రాణం పోసుకుంటాయి .వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి కూడా ఇదే వేదిక అనుకోవచ్చు
బ్లాగ్ లు రాయండి ,తెలుగును ప్రోత్శాహించండీ అంతర్జాలం లో సాహిత్యాభివ్రుద్ది చేయండీ అంటే బాగానే వుంది కాని విపరీత పోకడలతో రాసే బ్లాగ్స్ ని అదేవిధంగా డిస్కరేజ్ చేయకపోవడం ప్రధానలోపం
బ్లాగ్ మొదలెట్టడం అంటే నెట్ కి అడిక్ట్ కావడం లానే గమనించాను ,.కచ్చితంగా అందులో మంచి చెడు రెండు వుంటాయి వాటి వలన గొప్పగా ఒరిగేది ఎమిలేకపోయిన నిజ జీవితంపై ప్రభావం చూపుతున్నాయి .వీటిపై వెచ్చించే సమయం పరిమితంగా ఉంటేనే బాగుంటుందని నిర్ణయించుకున్నాను .చూడాలి ఎంతవరకి నియంత్రణ చేయగలనో ...ఈ నెట్ అడిక్షన్ సిగరెట్లు,కాఫీ ,మత్తు పానీయాలు లాటిదే అనికూడా నా అనుమానం ...ఇది "బంగారు లోకమా "?....అనుమానమే........ ..

18, జనవరి 2010, సోమవారం

"బ్లాగ్ లోకం -బంగారు లోకం "???????


"బ్లాగ్ లోకం -బంగారులోకం " అని సరిగ్గా తొమ్మిది నెలల క్రితం(ఏప్రిల్ ) పోస్ట్ రాసాను ,అప్పటికి నేను బ్లాగ్ రాయటం మొదలెట్టి రెండునెలలు అయ్యింది .అప్పట్లో టైం చాల వేస్ట్ చేస్తున్నాను అనే బెంగ ఒక ప్రక్కన చూడకుండా ఉండలేని పరిస్థితి మరోప్రక్కన .అప్పట్లో చాల మంది చాల రకాలుగా సలహాలు ఇచ్చారు .ఏదో క్రొత్త కాబట్టి ఇలా అంటున్నారు మరో మూడు నెలలు ఆగి అభిప్రాయం చెప్పమన్నారు .బ్లాగ్ చదవడం ,రాయడం అంటే విముఖత కలగలేదు కాని నా దైనందిన జీవితంలో మాత్రం మార్పులు కలిగాయి .ముఖ్యంగా నేను అమిత ఇష్టంగా చదివే పుస్తకాల నుండి కొంత దూరం అయ్యి వాటి స్థానే బ్లాగ్ ఆక్రమించింది రెండు నా పూల మొక్కల ఆలనాపాలనా నిర్లక్ష్యం చేయడం జరిగింది అలాగే అద్దంలా మెరిసే నా ఇల్లు కొంచెం మసకబారింది వస్తువులు స్థానబ్రంశం చెందితే కలవరపడే నేను నిర్లిప్తంగా తయారయ్యానుఆఫీసు వర్క్ మీద కొంత ప్రభావం చూపింది నాలో కొంత నిర్లక్ష్యం ఏర్పడింది .నా కళ్ళచుట్టూ డార్క్సర్కిల్స్ ఏర్పడుతున్నాయి అలసట వలన.
ఇవండీ నా ఆత్మాపరిశీలనలో తేలిన నెగిటివ్ అంశాలు . నన్ను నేను నియంత్రించుకోవడంలో కొంత వరకి సఫలం అయ్యాను .నా ఆఫీసు పని కి అంతరాయం కలగకుండా పూర్తిగా ఆఫీసు సమయంలో కూడలి ,జల్లెడ హారం చూడటం మానేసాను అసలు బ్లాగ్ అనేదాన్ని తెలియనట్లే ఉంటున్నాను .ఎటొచ్చి ఇంటికి వచ్చాక మాత్రం వీలున్నప్పుడల్లా ఓపెన్ చేస్తున్నాను .ఇది కూడా నియంత్రిన్చాలనే ఆలోచనలో వున్నాను .
.బ్లాగ్ ల వలన మనసుకి నచ్చిన మిత్రులు కూడా కలిసారు...బహుశ ఈ బ్లాగ్ లోకం లోకి అడుగుపెట్టకపోతే నాకు పరిచయం అయ్యేవారు కాదుగా .....

అసలు బ్లాగ్ లోకం బంగారులోకమా అని తరచి తరచి నేను రకరకాల బ్లాగ్స్ చదువుతుంటే నేను గమనించినవి కొన్ని ....(రేపు)

9, జనవరి 2010, శనివారం

మంచి మాటలు

"life needs money
but money is not life"

"the correction of mistake"is the first step to success.

if you are honest and frank,people may cheat you;
be honest and frank anyway

give the world the best you have,and it may never be enough;
give the world the best you've got anyway.

8, జనవరి 2010, శుక్రవారం

మా అమ్మాయి "అమ్మమ్మ"అయ్యింది

మా అమ్మాయి అమ్మమ్మ అయ్యిందంట .ఎంతో సంబరపడిపోతుంది.అప్పుడే పుట్టిన ఆ పిల్లలు చక చక చుట్టూ కలయ తిరుగుతున్నాయి ఆ ఇల్లంతా ముందే తెలుసన్నట్టు ఆ నీళ్ళలో పై నుంచి క్రిందికి విన్యాసాలు చేసేస్తున్నాయి .మా పాపమద్యహ్నం నుంచి ఒకటే హడావిడి పడిపోతుంది .పెద్ద టబ్ లోనుంచి సదరు "మీనాకుమారి "ని వేరు చేసి గాజుగోళం(ప్రసూతి రూం )లోకి మార్చి తను చదువుకునే టేబుల్ మీద పెట్టుకుని ఎదురుగా తెరిచి ఉంచిన పుస్తకం కన్నా కళ్ళన్నీవాటి మీదే పెట్టుకుని మొత్తానికి గంపెడు పిల్లల్ని కళ్ళతో చూసింది .బుల్లిగా తోకలాడిస్తూ భలే ముద్దోస్తున్నాయి .అరగంట నుండి అందరికి కాల్ చేసి మరి చెబుతుంది తన "రంగు చేపల"ముచ్చట్లు .నా బ్లాగ్ ప్రపంచానికి చెప్పమంది ,తను అమ్మమ్మ అయ్యిందని .-:)

శ్రీవారు -డైరీలు

కొత్త సంవత్సరం రాబోతుందంటే మా గవర్నమెంటు ఆఫీసులో డిసెంబర్ నెల మద్య నుండే సందడి మొదలవుతుంది గ్రీటింగ్ కార్డ్స్ ,డైరీలు పంపడం తీసుకోవడం లాటివన్నమాట.నేనైతే రెండు మూడేళ్ళ నుండి కార్డ్స్ పంపడం కూడా తగ్గించేసి ఫోన్ల మీద ,షార్ట్ మెస్సేజెస్ మీద నడిపేస్తున్నాను .గతం లో ముఖ్యమైన వారికి ఎక్కడున్నా ఫ్లవర్స్ కొరియర్ ద్వారా పంపేదాన్ని అలానే నాకు ఎవరు ఫ్లవర్స్ ఇచ్చిన ముచ్చటపడి తీసేసుకునేదాన్ని చక్కగా వాటిని వారం రోజులు పోషణ చేసి కాపాడుతుంటాను .గత తొమ్మిది యేళ్ళగా మొట్టమొదటి డైరీ ప్రముఖ దినపత్రిక నుండి అందుకుంటున్నాను ఆ తరువాతే మిగిలినవారి నుండి ....డైరీ లను చూస్తుంటే చాల ముచ్చటగా అనిపిస్తుంది అలా అని అన్నింటిని వాడలేముకదారెండు మూడు వుంచేసుకుని కావలసిన వారందరికీ పంచేస్తుంటాను .
మావారిది క్లైంట్స్ ని ఆకర్షించుకుని వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే వుద్యోగం ,వాళ్ళు తరువాతి ఏడాదికి జారిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ కొత్త సంవత్సరం రోజు వాళ్ళని తగిన రీతిలో సత్కరిస్తుంటారు పూలు ,పళ్ళు డైరీలు ఇచ్చి శుభాకాంక్షలు చెబుతారు .ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే నాదగ్గర ఏతావాతా చాల డైరీ లు మిగిలి ఉంటాయికదా మావారు వాటిని జాతీయం చేసి (పాపం అడుగుతాడు ) చక్కా వాళ్ళ క్లైంట్స్ కి ఇస్తుంటారు .అలానే ఈ ఇయర్ కూడా నా దగ్గర కొన్ని తీసుకున్నారు .

ఈ రోజు ఉదయం నేను హడావిడిగా బయటికి వెళ్ళడానికి తయారవుతుండగా నా దగ్గరకి వచ్చి రెండు పేపర్లు (రెండు పేజీలు )నా చేతికి ఇచ్చి "ఇదిగో నిన్న నరసింహారావుగారు పంపారు ,నీవు ఏదో రాసుకున్నావు "అన్నారు . నేను రాయడం ఏవిటాఅని అర్ధం కాక ఆ పేజీలు చూసేసరికి నా బుర్ర గిర్రున తిరిగింది ,అది నా చేతి రాతే డిసెంబర్ ఇరవయ్యి ఆరు ,ఏడు తారికుల్లో రాసాను కొత్త డైరీలో చివరి పేజీలు . ఒక పేజిలో డిపార్టుమెంటు సభంధించిన డేటా అది హెడ్ ఆఫీసు నుండి కాల్ వస్తే ఎదురుగా ఏమి దొరక్క పై అధికార్ని వెయిట్ చేయించే ధైర్యం లేక గబగాబ ఎవరో ముందే ఇచ్చిన డైరీలో నోట్ చేసుకుని ,ఇంఫర్మషన్ పాస్ చేసాను ఇంకొక పేజిలో ఒక ఫ్రెండ్ పూజ విధానం ఫోనేలోనే చెబితే రాసాను ఎదురుగా వుంది కదా అని ,ఆ తరువాత ఆ పేజీలే మరచిపోయాను ,అన్ని డైరీల తోపాటు అది కలసిపోయింది .మావారు తీసుకున్న డైరీల్లో ఇదికూడా వుండి సదరు నరసింహం గార్ని చేరి ,మావారిచ్చిన డైరీ చూసుకుని ముచ్చటపడి నిన్నో మొన్నో పేజీ లు త్రిప్పి పాపం నా మీద జాలిపడి జాగ్రత్తగా ఆరెండు పేజీలు మావారికి అందచేసారు "మీ మేడం గారు ఏదో నోట్ చేసుకున్నారు " అంటూ.ఒక్క క్షణం తెల్లబోయి తరువాత పడిపడీ నవ్వాను .పాపం అయన ఏం అనుకున్నారో వాడేసిన డైరీ తెచ్చారనుకున్నారో అని మా శ్రీవార్ని ఎదురు ఆటపట్టించాను .ఉడుక్కుంటూ ఇష్టం వచ్చినట్టు రాసేయడమేనా చిన్నపిల్ల లాగ అని ఎదురు దాడి కి దిగారు . ఇక నుండి జాగ్రత్త పడతారేమో చూడాలి -:)