5, సెప్టెంబర్ 2010, ఆదివారం

నటించాలని వుంది

నాకు నటించాలని వుంది.కాని నిజ జీవితంలో చేతకావడం లేదు .చిన్నప్పటినుంచి చేతకానిది ఇప్పుడు నేర్చుకుందాం అనుకున్న లెక్కలు నేర్చుకున్నంత కష్టంగా వుంది .అదేంటోగాని వున్నది వున్నట్లు మాట్లడడం నా బలహీనత అలా అని ఇతరుల మనోభావాల్ని గాయపరచాలి అనుకోనుఅస్సలు ప్రయత్నించను అలాగే ఎదుటివారు అలానే వుండాలి అనుకుంటాను.అంత అంటూ వుంటారు నా ముఖం సులువుగా చదివేయోచ్చని నా స్టేట్ఆఫ్ మైండ్ తెలిసిపోతుందట.సంతోషాన్ని,భాద ని,కోపాన్ని,రంగు రంగులాగా చుపించేస్తనట.ప్చ్ ఇవ్వేమి ఎదుటివారు చదవకుండా నటించడం నేర్చుకోవాలి.ఇవ్వాళ్ళ రేపు ఉద్యోగంలో కాని సామాజిక సంభందాల్లో నటించడం చాలా అవసరం అని నెమ్మది నెమ్మదిగా అవగతం అవుతుంది ఇంత లేటు వయస్సులోనయిన కొంతయిన నేర్చుకోక తప్పదేమో .
స్కూల్లోను కాలేజీల్లో ను రంగస్థలం మీద నటించి ప్రత్యెక బహుమానాలే పొందాను నా నటన తో ప్రేక్షకుల కళ్ళలో నీళ్ళు తెప్పించిన సందర్బాలు వున్నాయి . కాని నిజజీవితంలో నటించడం రానందుకు నా మనసు తడి చూడాలి అనుకుంటారు కొందరు.అందుకే అలాటి వారికొరకైననేను 'నటించడం'నేర్చుకోవాలి.

12 వ్యాఖ్యలు:

భాస్కర రామి రెడ్డి చెప్పారు...

what happened?

భావన చెప్పారు...

అనుకునే వాళ్ళను అనుకోనివ్వండి, ఎవరికోసమో నటీంచటం ఎందుకండి హాయి గా అలానే స్వేచ్హగా సంతోషం గా వుండనివ్వండి మనసును.

a2zdreams చెప్పారు...

>>ఎదుటివారు అలానే వుండాలి అనుకుంటాను

ఒకరి దగ్గర నుండి ఏదైనా ఎక్సపెట్ చేస్తే, we will endup as same situation as you

చిన్ని చెప్పారు...

@భా.రా.రె
హ్మం ..అప్పుడప్పుడు మనకి తిక్క :-) మనసులో సంఘర్షణ .
@బావన
ష్యూర్ అండీ ,అలా నేర్చుకుంటే వచ్చేవి కాదని అర్ధం అవుతుందండి.థాంక్స్ అండీ.
@A toZdreams
ధన్యవాదాలండి

పరిమళం చెప్పారు...

ముసుగు వెయ్యొద్దు మనసుమీద అని చెపుతారు కాని అలా లేకపోతె జీవించడం కష్టమైపోతుంది మన నేటి సమాజంలో ...ఐనా ఏంటండి ఇంత నిరాశ !

చిన్ని చెప్పారు...

@పరిమళం
కొన్ని సందర్బాలలో మనకి ఎదురైనా వ్యక్తుల నిజరూపం చూసినపుడు కలిగిన ఆవేదన అండీ.మనసుకి ముసుగు వేసుకున్న ఊపిరాడదండీ:-) ఇప్పుడు బానే వున్నాను :-)

కొత్త పాళీ చెప్పారు...

ఏక్చువల్లీ, కొద్దిగా నటించడం మంచిదే.
ఎప్పటికెయ్యది ప్రస్తుతమన్నాడు సుమతీశతక కారుడు.

భాస్కర రామి రెడ్డి చెప్పారు...

చిన్ని గారూ...,"సంకటహర చతుర్థి" రోజున వినాయకుణ్ని అర్చించుదాం. వినాయక చతుర్థి శుభాకాంక్షలు

హారం

చిన్ని చెప్పారు...

@kottapaali
:-)
@ba.ra.re
thanq

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

నాది కూడా కొత్తపాళీగారి మాటే..ముఖ్యంగా ఆఫీస్ వ్యవహారాలు డీల్ చేస్తున్నప్పుడు.. మరీ షబానా ఆజ్మీలా నటించకపోయినా కత్రినా కైఫ్ మాదిరి ఓ మోస్తారు నటనైతే చేయటం అవసరమేనండీ...:-)

చిన్ని చెప్పారు...

@sekhar
haha...kathrina range:-)

Mauli చెప్పారు...

@మనసుకి ముసుగు వేసుకున్న ఊపిరాడదండీ

True :)