రోజు రోజుకి ఈ ఉరుకులు పరుగులు ఎక్కువ అవ్వుతున్నాయే కాని యెక్కడా క్షణం ఆగి సేదతీరుదామన్న అవకాశమే రావడం లేదు ,అంతా మన చేతుల్లోనే వుంది అంటారు పక్కన కూర్చుని చోద్యం చూసేవాళ్ళు !ఈ మధ్యకాలం లో చాలా మిస్ అవ్వుతున్నాను పట్టుమని పది నిమిషాలు నాకెంతో ఇష్టం అయిన వారపత్రికలు చూడలేక పోతున్నాను హ్మ్మ్ ! నా గదిలో పుస్తకాలన్నీ నిశబ్ధం గా నిద్దరోతున్నాయి అంతెందుకు ఆఫీసు ప్రక్కనే అన్ని రోజులు పుస్తక ప్రపంచం పుస్తక ప్రియులతో కళకళ లాడిపోతున్న అందులో అడుగుపెడటానికి ఒక్క క్షణం తీరితే ఒట్టు ... యేమి కట్టుకుంటున్నానో యేమి తింటున్నానో నాకే తెలియడం లేదు పిల్లలతో కనీసం పదినిమిషాలు ఫోను మాట్లాడదమన్నా పది మిస్సేడ్ కాల్ల్స్ ..నిద్రమొహాన పరిగెట్టి నిద్రకళ్ళతో ఇల్లు చేరడం ... నన్ను నేనే మరిచిపోయేట్లున్నా !అన్నీమిస్స్ అవ్వుతున్నాను .
22, ఫిబ్రవరి 2015, ఆదివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)