8, ఫిబ్రవరి 2013, శుక్రవారం

కొన్ని స్నేహాలు

జీవన ప్రయాణంలో బాల్యం నుంచి వృద్దాప్యం వరకు యెంతో మంది
 మలుపు మలుపుకి మిత్రులు తారసపడుతుంటారు (మిత్రులు అనుకోవచ్చో లేదో ?)ఎంతో ఆప్తులుగా దగ్గరకి వస్తారు (మనం భ్రమ పడతాం )అంతలోనే మాయం అవుతారు కొన్నిస్నేహాలు  అంతే అనుకుంటాను అవి ఎప్పటికి అర్ధం కావు  ఈ స్నేహాల్ని మనస్సుకు తీసుకోకూడదు అంతే అంతే అంతే .....!

6, ఫిబ్రవరి 2013, బుధవారం

జ్ఞాపకాల నిధులు      • కొత్తగా బ్లాగు లోకం లోకి..అంటూ నేను అడుగులు వేసి ఇప్పటికి నాలుగు సంవత్సరాలు నిండాయి .అప్పట్లో నా బ్లాగు ఓపెన్ చేసి దానికి నామకరణం చేసి మొదటి పోస్ట్ రెండవ పోస్ట్ రొటీన్ కి భిన్నంగా...రాసింది నాకు బ్లాగు ని పరిచయం చేసిన మిత్రుడే కాకపొతే నేను చెబుతుంటే తన ఆలోచనలు రెండు కలిపి అక్షర రూపం ఇచ్చారు .బ్లాగులు తెరచి ఉంచిన జ్ఞాపకాల నిధులు వెనక్కి వెళ్లి చదువుకుంటుంటే భలే గమ్మత్తుగా వున్నాయి.అప్పుడప్పుడు రిలాక్స్ అవ్వడానికి నాకో వేదిక ఈ" హిమబిందువులు ".
      •