30, నవంబర్ 2019, శనివారం

ముసుగు కావాలి

అయిదు సంవత్సరాల క్రిందట జులై 2014 లో నేనొక సందేహం వ్యక్తపరిచాను ...అమ్మాయిలూ ఎక్కడ చూసినా ముఖానికి స్కార్ఫ్ కట్టుకుని కనబడుతున్నారు ఎందుకనో  అని ...హ్మ్మ్ సమాధానం కూడా నేనే చెప్పేసుకున్నా !     అమాయకంగా కనబడుతూ మేక వన్నె పులుల్లా సమయం వస్తే చటుక్కున్న నోటా కరుచుకుని కబళించాలని చూసే మానవ మృగాలనుండి రక్షించుకోవడానికి అని అర్ధం అయ్యింది .....పసిపిల్లనుండి పండు ముదుసలి వరకు  యెంత ఎదిగినా యెంత ఒదిగినా.ఆడదానికి రక్షణ కరువయ్యింది .ముసుగు కావాలి మృగాళ్ళనుండి రక్షించుకోవడం కొరకు . https://himabinduvulu.blogspot.com/2014/07/blog-post_20.html నా ఓల్డ్ పోస్ట్ "ముసుగెందుకు "

28, నవంబర్ 2019, గురువారం

THIS MOMENT IS MY LIFE

ఇది నాకెంతో ఇష్టం అయినా కొటేషన్ .... నిస్పృహ ఆవహించినపుడు  స్ఫూర్తిదాయకంగా వుంటుంది మనస్సునకు 

25, నవంబర్ 2019, సోమవారం

మా వంటింటి మహారాణిని

నాకు ఇష్టం అయిన పనుల్లో వంట చేయడము కూడా చేర్చవచ్చు  అస్సలు కష్టం అనిపించదు . మా వంటింటి మహా రాణిని నేనే ... ఈ వంట ప్రస్థానం పెళ్లి అయ్యాకే మొదలు అయ్యింది అంతక్రితం అవసరం రాలేదు ..అమ్మ అన్నీ అలవోకగా  చేసిపెడుతుంటే చెయ్యాల్సిన అవసరం రాదుగా ...కానీ చిన్నప్పటి నుండి అమ్మ వంట చేసేప్పుడు ఎప్పుడైనా స్కూల్  కానీ కాలేజీ నుండి కానీ వచ్చి అమ్మ పక్కన చేరి కబుర్లు చెప్పేప్పుడు  అమ్మ వంట చేసే విధానము  గమనిస్తూ ఉండేదాన్ని...అలా అబ్సర్వేషన్ ద్వారా నేర్చుకుని మక్కికి మక్కి అచ్చు అమ్మ చేసినట్లే వండుతాను .పాత వంటలు కొత్త వంటలు చిటికెలో చేసేస్తాను ... మా ఇళ్లల్లో చాలా రుచిగా చేస్తాను అని పేరు ... తింటూ అమ్మని గుర్తు చేసుకోక మానరు ..నా వరకు నేను  ఏదైనా పని  మొదలు పెడితే ఇష్టంగా చేస్తాను  .... నా కూతురు కూడా మంచి కుక్ అని చెప్పవచ్చు ఒక్కసారే పాతిక  యాభయ్యి మందికి వండేయగలదు .. మా అమ్మ లానే చేస్తుంది  ఇంతకీ నేను చెప్పేది ఏమిటంటే ఈ రోజు మా చిన్న తమ్ముడు హైద్రాబాదు నుండి వచ్చాడు వాడికోసం వాళ్ళ అబ్బాయి కోవిద్  కొరకు  కేక్ చేసాను చాలా టేస్టీ గా వున్నది ....ఇవిగో ఇక్కడ ...రుచి చూడండీ

23, నవంబర్ 2019, శనివారం

మనము చాలా బిజీ





మనము చాలా బిజీ గా వున్నాము  అందుకే ఇంట్లో మొక్కలు పూలు ఏమి చేస్తున్నాయో అస్సలు తెలీదు ...బహుశా నా కోసము ఎదురు చూస్తూ వుండి వుంటాయి ....కనబడే  మేఘాల్లో మీకు ఏమి కనఁబడుతున్నాయో నాకయితే తెలీదు కానీ  నాకు మాత్రము మా అమ్మా నాన్న బుజ్జులు అక్కడి నుండి నన్ను చూస్తూ వున్నారనిపిస్తుంది ...ఈ రహదారి యెంత బాగుందో కొండలు చెట్లు నీరెండలో వెండిలా మెరిసే మేఘాలు ...చిత్తూరు నుండి తిరుపతి వెళ్లే దారి ..కొంత సేపు అలా దిగి బాదాము మిల్క్ తాగి రహదారి లో కనబడే అందాలు చూస్తూవు గమ్యము చేరాను . 

19, నవంబర్ 2019, మంగళవారం

బుజ్జులు

బుజ్జులు నన్ను శాశ్వతంగా ఈ లోకాన్నే వదిలి సంవత్సరము రెండు నెలలు . 2010 ఏప్రిల్ 22 న .నెలరోజుల పిల్లగా నా ఇంట్లో అడుగు పెట్టి 2018సెప్టెంబర్ 22 లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది ..నేను కనబడక పొతే క్షణం వుండలేకపోయేది మరి ఇప్పుడు ఈ అమ్మ ని వదిలి ఒంటరిగా వెళ్ళిపోయింది .... ఇందులో బుజ్జులు తప్పు అస్సలు లేదు ఈ డాక్టర్లు వున్నారు వాళ్లకి యెంత నిర్లక్ష్యమే ..డాక్టర్ తప్పిదము వలన బుజ్జులు చనిపోయింది .... ఇది రాస్తుంటే నా కళ్ళు కనబడటం లేదు జ్ఞాపకాలన్నీ మనస్సు పొరల్లో కప్పేస్తున్నా అయినా అవి నిలబడటం లేదు ....యెలా మరచిపోగలను?https://himabinduvulu.blogspot.com/2010/05/blog-post.htmlhttps://himabinduvulu.blogspot.com/2010/05/blog-post_12.htmlhttps://himabinduvulu.blogspot.com/2010/09/blog-post_19.html




18, నవంబర్ 2019, సోమవారం

నేను మారానా ?

హ్మ్మ్ !! ఇటీవల  కాలములో  యే  ఫంక్షన్ కి వెళ్లినా  యే పబ్లిక్ గాథేరింగ్ లో వున్నా ఆఖరికి తరచూ నన్ను చూసే మా కాలనీ  వాళ్ళయినా నన్ను చూడగానే కుశాల ప్రశ్నలు అయ్యాక అడిగే ప్రశ్న .."మీరింకా సర్వీస్ లో ఉన్నారా? " లేకపోతె "రిటైర్డ్  అయ్యారా ?"అని ..ఈ ప్రశ్న  గత యాడాదిగా  వింటున్నాను ... వినడము  ఉలిక్కిపడడము  నా వంతు అవ్వుతుంది ..మరీ విడ్డురంగా ఆరు నెలల క్రితము మా అక్క నేను చెల్లి కాలనీ ఫంక్షన్ కి వెళ్ళాము .. మేము భోజనము చేస్తుండగా తెలిసిన వాళ్ళు వచ్చి పలకరిస్తూ మా అక్కని చూస్తూ "మీ అమ్మాయా " అని నన్ను  అడిగారు ..ముసిముసి నవ్వులతో మా అక్క ...పెట్టుకున్న ముద్దా నోట్లో దిగక  నేను తెగ ఇబ్బంది పడ్డాను ... మా అక్కకి నాకు రెండేళ్లు వ్యత్యాసము వుంది .  ఇంటికి వచ్చి అద్దములో చూసుకుంటే నాలో పెద్ద మార్పు లేదు ...అమ్మా నాన్నా బుజ్జులు వెళ్ళిపోయినా బెంగా నా గొంతులో మనస్సులో తాడితడిగానే వుంది ....బహుశ అందుకే వయస్సు మీద పడినట్లు కనబడుతున్నానేమో .... రిటైర్ అయ్యారా అని అడిగినప్పుడల్లా లేదు అని అరిచి చెప్పాలనిపిస్తుంది ... నిన్న కిట్టి పార్టీలో కొత్తగా చేరినావిడ పరిచయాలు చేసుకుంటూ నన్ను చూడగానే "మీరు హిమబిందు గారు కదూ !మీరు నాకు తెలుసు " అంటూ వెంటనే "మీరు ఇంకా  రిటైర్ అవ్వలేదా "అన్నది ...ఒళ్ళు మండినా  వెదవ నవ్వు పెదవుల పైన పులుముకుని తల అడ్డముగా తిప్పాను ..... ఇంటికి వచ్చి మా శ్రీవారిని అడిగాను "నేను ఎట్టా కనబడుతున్నాను "అని ...ఆయన నవ్వుతూ  నువ్వు నువ్వు లానే వున్నావు అన్నారు ...తాను మాత్రము ఏమి చెబుతాడు ...ఈ మధ్య ఇదే ప్రశ్న నేను అడుగుతుంటే !!   

17, నవంబర్ 2019, ఆదివారం

ప్రత్యేకమైనరోజు

ఈ రోజు నవంబర్ 17  చాలా ప్రత్యేకమైనరోజు మాకుటుంబానికి.. విచిత్రంగా అనిపిస్తుంది ....ఈ రోజు మా పెళ్ళీ రోజు ..ఇకపోతే  నా ఏకైక పుత్రిక పుట్టిన రోజు కూడా ...సో మాకు ఖర్చు బాగా కలిసి వచ్చేది ...కొన్నాళ్ళు మా పాప పుట్టిన రోజు అమ్మ వాళ్లింట్లోనే జరిపేవారు మా పెళ్లి రోజు తో సహా .... పాప కాలేజి కి వచ్చాక మా ఇంట్లో నే చేసేవాళ్ళము .....క్రితం యేడాది  ఇదే రోజు నాకు మనవరాలు  "ఆధ్యా సరయు "పుట్టింది ... ఈ రోజు అమ్మా కూతుళ్లు కలిసి పుట్టిన రోజు సెలిబ్రేట్ చేసుకుంటున్నారు ..మూడు తరాలకి ముఖ్యమైన రోజు నవంబర్ 17 

16, నవంబర్ 2019, శనివారం

ప్రక్కింటోళ్ల స్థలములో నా చెట్లు

ఈ రోజు సాయంత్రం ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కుంటూ ఉత్తర దిక్కు మొక్కల్ని పరకాయిస్తు ప్రహరీ ఆవల కి ఒక లుక్ ఇచ్చాను నా బొప్పాయిలు కాస్త రంగు మారాయి అరటి చెట్టు భారంగా ఒంగి నేలను చూస్తుంది ... ఇక వాటి భాధ చూడలేక డ్రైవర్ కుర్రాడిని పిలిచి  అర్జంటుగా గోడ దూకి అరటి గెల బొప్పాయిలు కోసేసెయ్యి అని వంటగదిలోకి వెళ్లి చాకు తెచ్చి ఇచ్చాను ...రెండు క్షణాల్లో అవి మన ఇంటికి వచేసాయి .... అవి గెల వేసినప్పటినుండి కాపలా కాయలేక చస్తున్నాను అస్సలుకే మనది క్యాంపుల ఉజ్జోగము అన్నట్టు మనది ఇప్పుడు విజ్జివాడలో ఉజ్జోగాము  కాదు రత్నాల సీమ కి వెళ్లి సంవత్సరము అయ్యింది కానీ వారము వారము విజివాడ చూడకుండా ఉండను గోడకి అవతల మనది కానీ స్థలములో నేను పెంచుతున్న వనముని చూడకుండా ఉండలేను ..ఆ స్థలము వాళ్ళు ఇటు దిక్కు కూడా చూడరు ... నేను అప్పుడెప్పుడో జంగారెడ్డిగూడెంకు నుండి తెచ్చిన అరటి చెట్లు ప్రహరీ పొడవునా సైనికుల్లా పెరిగి బోల్డన్ని గెలలు వేసి బరువు తో ప్రహరీ మొత్తము కూలగొట్టాయి ...ఇక దొరికిందే వంక మా వారు నిర్ధాక్షిణ్యంగా మొక్కలన్నీ నరికించి సిమెంటు చేపించి ప్రహరీ కట్టించారు ...నేను కిమ్మనకుండా వాటి పిలకల్ని ప్రక్క స్థలములో ..కొన్ని అమ్మ వాళ్ళింట్లో నాటెను .... వాటి ఫలాలు అన్నమాట ! చుట్టూ ప్రక్కల వారికి నాలుగు డజన్లు పంపిణి చేసి మిగిలినవి ఇవి ....ఇవి కూడా మా ఇంటికి ఎవరు వచ్చిన మా వారు అరటికాయలు వున్నాయి తీసుకు వెళ్ళండి అంటూ బలవంతంగా అంటగడతారు ..అరటి కూర తన గొంతుకలో దిగదు మరీ ఒకసారి తింటే గోప్పే ! బొప్పాయిది ఇంచుమించు ఇదే కథ ... మరోమారు గుర్తు చేసుకుందాము
  

15, నవంబర్ 2019, శుక్రవారం

పళ్ళ మొక్కలు పూలమొక్కలు కూరలు అన్నీ టెర్రేస్ ఎక్కేయి







ఇవన్నీ కొత్తగా ఇంటికి వచ్చిన పాపాయిలు ,,ఇంకొక విశేషము రెండు నెలలు క్రితము పారవేసిన బొప్పాయి గింజలు గ్రో బాగ్స్ లో  కళ్ళు విప్పేసి అప్పుడే పూలు పిందెలు వేసింది ,,క్రింద నేల తక్కువగా వుంది చుట్టూ చెట్ల తో  నీడలో మొక్కల ఎదుగుదల అస్సలు బాలేదు ..సో  కొత్తవన్నీ  టేర్రెస్  ఎక్కేస్తున్నాయి             


14, నవంబర్ 2019, గురువారం

పూల పిచ్చి

పది సంవత్సరాల క్రింద నా మొక్కల ప్రపంచము ,,,,,,,అమ్మ గారు మరల  వెనుకకు తిరిగారు  :-)