16, నవంబర్ 2019, శనివారం

ప్రక్కింటోళ్ల స్థలములో నా చెట్లు

ఈ రోజు సాయంత్రం ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కుంటూ ఉత్తర దిక్కు మొక్కల్ని పరకాయిస్తు ప్రహరీ ఆవల కి ఒక లుక్ ఇచ్చాను నా బొప్పాయిలు కాస్త రంగు మారాయి అరటి చెట్టు భారంగా ఒంగి నేలను చూస్తుంది ... ఇక వాటి భాధ చూడలేక డ్రైవర్ కుర్రాడిని పిలిచి  అర్జంటుగా గోడ దూకి అరటి గెల బొప్పాయిలు కోసేసెయ్యి అని వంటగదిలోకి వెళ్లి చాకు తెచ్చి ఇచ్చాను ...రెండు క్షణాల్లో అవి మన ఇంటికి వచేసాయి .... అవి గెల వేసినప్పటినుండి కాపలా కాయలేక చస్తున్నాను అస్సలుకే మనది క్యాంపుల ఉజ్జోగము అన్నట్టు మనది ఇప్పుడు విజ్జివాడలో ఉజ్జోగాము  కాదు రత్నాల సీమ కి వెళ్లి సంవత్సరము అయ్యింది కానీ వారము వారము విజివాడ చూడకుండా ఉండను గోడకి అవతల మనది కానీ స్థలములో నేను పెంచుతున్న వనముని చూడకుండా ఉండలేను ..ఆ స్థలము వాళ్ళు ఇటు దిక్కు కూడా చూడరు ... నేను అప్పుడెప్పుడో జంగారెడ్డిగూడెంకు నుండి తెచ్చిన అరటి చెట్లు ప్రహరీ పొడవునా సైనికుల్లా పెరిగి బోల్డన్ని గెలలు వేసి బరువు తో ప్రహరీ మొత్తము కూలగొట్టాయి ...ఇక దొరికిందే వంక మా వారు నిర్ధాక్షిణ్యంగా మొక్కలన్నీ నరికించి సిమెంటు చేపించి ప్రహరీ కట్టించారు ...నేను కిమ్మనకుండా వాటి పిలకల్ని ప్రక్క స్థలములో ..కొన్ని అమ్మ వాళ్ళింట్లో నాటెను .... వాటి ఫలాలు అన్నమాట ! చుట్టూ ప్రక్కల వారికి నాలుగు డజన్లు పంపిణి చేసి మిగిలినవి ఇవి ....ఇవి కూడా మా ఇంటికి ఎవరు వచ్చిన మా వారు అరటికాయలు వున్నాయి తీసుకు వెళ్ళండి అంటూ బలవంతంగా అంటగడతారు ..అరటి కూర తన గొంతుకలో దిగదు మరీ ఒకసారి తింటే గోప్పే ! బొప్పాయిది ఇంచుమించు ఇదే కథ ... మరోమారు గుర్తు చేసుకుందాము
  

కామెంట్‌లు లేవు: