నాకు ఇష్టం అయిన పనుల్లో వంట చేయడము కూడా చేర్చవచ్చు అస్సలు కష్టం అనిపించదు . మా వంటింటి మహా రాణిని నేనే ... ఈ వంట ప్రస్థానం పెళ్లి అయ్యాకే మొదలు అయ్యింది అంతక్రితం అవసరం రాలేదు ..అమ్మ అన్నీ అలవోకగా చేసిపెడుతుంటే చెయ్యాల్సిన అవసరం రాదుగా ...కానీ చిన్నప్పటి నుండి అమ్మ వంట చేసేప్పుడు ఎప్పుడైనా స్కూల్ కానీ కాలేజీ నుండి కానీ వచ్చి అమ్మ పక్కన చేరి కబుర్లు చెప్పేప్పుడు అమ్మ వంట చేసే విధానము గమనిస్తూ ఉండేదాన్ని...అలా అబ్సర్వేషన్ ద్వారా నేర్చుకుని మక్కికి మక్కి అచ్చు అమ్మ చేసినట్లే వండుతాను .పాత వంటలు కొత్త వంటలు చిటికెలో చేసేస్తాను ... మా ఇళ్లల్లో చాలా రుచిగా చేస్తాను అని పేరు ... తింటూ అమ్మని గుర్తు చేసుకోక మానరు ..నా వరకు నేను ఏదైనా పని మొదలు పెడితే ఇష్టంగా చేస్తాను .... నా కూతురు కూడా మంచి కుక్ అని చెప్పవచ్చు ఒక్కసారే పాతిక యాభయ్యి మందికి వండేయగలదు .. మా అమ్మ లానే చేస్తుంది ఇంతకీ నేను చెప్పేది ఏమిటంటే ఈ రోజు మా చిన్న తమ్ముడు హైద్రాబాదు నుండి వచ్చాడు వాడికోసం వాళ్ళ అబ్బాయి కోవిద్ కొరకు కేక్ చేసాను చాలా టేస్టీ గా వున్నది ....ఇవిగో ఇక్కడ ...రుచి చూడండీ
25, నవంబర్ 2019, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి