18, నవంబర్ 2019, సోమవారం

నేను మారానా ?

హ్మ్మ్ !! ఇటీవల  కాలములో  యే  ఫంక్షన్ కి వెళ్లినా  యే పబ్లిక్ గాథేరింగ్ లో వున్నా ఆఖరికి తరచూ నన్ను చూసే మా కాలనీ  వాళ్ళయినా నన్ను చూడగానే కుశాల ప్రశ్నలు అయ్యాక అడిగే ప్రశ్న .."మీరింకా సర్వీస్ లో ఉన్నారా? " లేకపోతె "రిటైర్డ్  అయ్యారా ?"అని ..ఈ ప్రశ్న  గత యాడాదిగా  వింటున్నాను ... వినడము  ఉలిక్కిపడడము  నా వంతు అవ్వుతుంది ..మరీ విడ్డురంగా ఆరు నెలల క్రితము మా అక్క నేను చెల్లి కాలనీ ఫంక్షన్ కి వెళ్ళాము .. మేము భోజనము చేస్తుండగా తెలిసిన వాళ్ళు వచ్చి పలకరిస్తూ మా అక్కని చూస్తూ "మీ అమ్మాయా " అని నన్ను  అడిగారు ..ముసిముసి నవ్వులతో మా అక్క ...పెట్టుకున్న ముద్దా నోట్లో దిగక  నేను తెగ ఇబ్బంది పడ్డాను ... మా అక్కకి నాకు రెండేళ్లు వ్యత్యాసము వుంది .  ఇంటికి వచ్చి అద్దములో చూసుకుంటే నాలో పెద్ద మార్పు లేదు ...అమ్మా నాన్నా బుజ్జులు వెళ్ళిపోయినా బెంగా నా గొంతులో మనస్సులో తాడితడిగానే వుంది ....బహుశ అందుకే వయస్సు మీద పడినట్లు కనబడుతున్నానేమో .... రిటైర్ అయ్యారా అని అడిగినప్పుడల్లా లేదు అని అరిచి చెప్పాలనిపిస్తుంది ... నిన్న కిట్టి పార్టీలో కొత్తగా చేరినావిడ పరిచయాలు చేసుకుంటూ నన్ను చూడగానే "మీరు హిమబిందు గారు కదూ !మీరు నాకు తెలుసు " అంటూ వెంటనే "మీరు ఇంకా  రిటైర్ అవ్వలేదా "అన్నది ...ఒళ్ళు మండినా  వెదవ నవ్వు పెదవుల పైన పులుముకుని తల అడ్డముగా తిప్పాను ..... ఇంటికి వచ్చి మా శ్రీవారిని అడిగాను "నేను ఎట్టా కనబడుతున్నాను "అని ...ఆయన నవ్వుతూ  నువ్వు నువ్వు లానే వున్నావు అన్నారు ...తాను మాత్రము ఏమి చెబుతాడు ...ఈ మధ్య ఇదే ప్రశ్న నేను అడుగుతుంటే !!   

కామెంట్‌లు లేవు: