16, మే 2013, గురువారం

పూలు గుసగుస లాడేనని ..సైగ చేసెనని........

మల్లెపూలను నా జీవితాన్ని విడిగా చూడను అంటే మల్లెపూలతో అంత గాడమైన అనుబంధం అన్నమాట !ఒక్క మల్లెపూలేంటి కనబడిన పిచ్చిపూవ్వు గడ్డి పువ్వు నాకిష్టమే అలా కోసి ఇలా తలలో తురుముకుంటాను ,అన్ని పూలలోకి మల్లె విరజాజులంటే ఇష్టం . ఎండాకాలం పిల్లలు సెలవలకోసం చూస్తె నేను మాత్రం మల్లెపూలు రోజు పెట్టుకోవచ్చుగా అని ఎదురు చూసేదాన్ని యే ఊరు వెళ్ళిన అక్కడ పూల వాళ్ళతో నాకు స్నేహం వుండేది మధ్యాహ్నం నుండే వేడి వేడి మల్లెపూలు అనే కేక కోసం ఎడురుచుసేదాన్ని :)బుట్టలు బుట్టలు కొని ఓపికగా కుర్చుని మాలలు కట్టేదానిని జడనిండా పెట్టుకుని మిగిలినవి అందరికి ఇచ్చేదానిని... అటువంటి నేను పూలు పెట్టుకువడం ఇంటివరకే పరిమితం చేసుకున్నాను ఆఫీసు కి పూలు పెట్టుకుని వెళ్ళడం ఎందుకో ఇబ్బందిగా వుంటుంది అలానే బయట ఫంక్షన్  కి కూడా అచీ తూచి చిన్నదండ పెట్టుకుంటాను ఇంట్లో మాములుగానే పెట్టుకుంటాను
అసలు సంగతి ఏంటంటే ... మొన్న ఒకరోజు నేను మా చిన్న మామయ్యా వైఫ్ (నా ఫ్రెండ్)కలసి  గుండె జారి గల్లంతయ్యిందే సినిమాకి వచ్చిన రోజే వెళదామనుకుని సాయంత్రానికి టికెట్స్ తెప్పించుకున్నాము మమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి ఇద్దరి వద్ద డ్రైవర్స్ లేరు తనని వాళ్ళ అబ్బాయి మా ఇంట్లో దించేసి ఫ్రెండ్స్ దగ్గరకి వెళ్ళిపోయాడు ఇంటి నుండి కుంచెం దూరం నడిస్తే ఆటో లో వెళ్ళ వచ్చులే అని తీరికగా పనులు తెముల్చుకుని వీది  చివర అటో ఎక్కాము థియేటర్ సాయిబాబా గుడి ప్రక్కనే వుంటది అక్కడివరకి వచ్చాము కదా కాస్త దేవుడ్ని కూడా దూరం నుండి లుక్ వేసుకుని వెళదామని గుడి దగ్గర ఆగి అటో అబ్బాయికి డబ్బులు ఇవ్వబోతే అంతకి చిల్లర నా దగ్గర లేదమ్మా అనేసర్కి చిల్లర కోసం  ప్రక్కనే వున్నా పూల దుకాణం లో పది మూరల మల్లెలమాలలు కొనేసి అబ్బాయికి డబ్బులిచ్చేసి గుడిలోకి వెళ్తే సినిమా మొదటినుండి మిస్ అవుతాం అనుకుని బయటినుండే దండం పెట్టేసి ధియేటర్ లోకి వెళ్ళాము
ఎంట్రెన్సు లో ఒక చెక్అయ్యాక  లోపల మరల ఫిమేల్ సెక్యూరిటీ మా ఇద్దర్ని చెక్ చేసి  హ్యాండ్ బాగ్ ఓపెన్ చేయమన్నది గుప్పుమని మల్లెల పరిమళం ఆవిడ ముఖానికి కొట్టింది 'నో మేడం ఫ్లవర్స్ నాట్ అలోడ్ ,ప్రక్కన పడేయండి లేకపోతె టోకెన్ తీసుకుని సినిమా తరువాత అటువైపు రండి' అని చెప్పింది .నష్టం ఏంటి ఇవేమీ బాంబులు కాదుగా అని కన్విన్సు చేయబోయము కాని ఒప్పుకోలేదు ఇద్దరము  ఒకరి ముఖాలు ఒకరం చూసుకుని   వీళ్ళని బ్రతిమాలె బదులు చెరో కాసిని  తలలో పెట్టేసుకున్దాము అనుకుని బాగ్ లో నుండి బయటికి తీసాము చెరిసగం తుంచేసి లలితా చేతిలో మిగిలిన మాల పెట్టి కష్టపడి ఇంత చిన్న జడలో అన్ని పూలుపెట్టేసాను లలితకి పెట్టుకోవడం రావడం లేదు అది ఎంచక్కగా సెక్యూరిటీ చేతిలో పూలు పెట్టి' నా తలలో పెట్టు' అని వెనక్కి తిరిగి నుంచుంది అనుకోని సంఘటనకి సెక్యూరిటీ అమ్మాయి ఉలిక్కిపడి మేము ఇలా నిలబడి పూలు పెట్టకూడదు మేడం మనజ్మేంట్ ఊరుకోరు అని కంగారుపడింది అయినా  లలిత వదిలితేనా ...ఫర్లెదు ఈ ఒక్కసారికి పెట్టు నాకు పెట్టుకోవడం కుదరడం లేదు అని ఎట్టికేలకి ఆయమ్మని మొహమాట పెట్టి తల నిండుగా అయిదుమూరలమల్లెలు పెట్టుకుంది ఈ లోపు మా వెనుక క్యూలో అసహనంగా చూస్తూ పిన్న పెద్ద ఆడవాళ్ళు ...వాళ్ళలో  చిన్న పిల్ల' అమ్మ మనకి కూడా పూలు పెడతార నేను పెట్టిన్చుకోను ఇంటికి తీసుకు వెళ్దాము'అంటుంటే నవ్వు ఆపుకోలేక కష్టపడ్డాము రుసరుసలడ్తున్న ఆ అమ్మాయి ముఖం చూడకుండా చెక్ నుండి బయటపడ్డాము స్క్రీన్ లోకి అలో చేయడానికి అయిదు నిముషాలు టైం వుండగా ఎంట్రన్స్ లో జనాలతో పాటు  నిలబడ్డాము అప్పుడు మొదలైంది అసలు సినిమా జనాలు మా ఇద్దరి వంక విచిత్రంగా చూస్తూఇద్దరికీ అప్పుడు వెలిగింది మరీ అస్సయంగా జడని మించి పెళ్ళికి పెట్టినట్లు మల్లెపూలు అక్కడ తీయలేము అలా  అని వుంచుకోలేము ఒకరిద్దరు ఆడాళ్ళు మమ్మల్ని చూసి గుసగుసలడ్తున్నట్లు అనిపించింది లలితా మరీ బిడియ  పడుతుంటే చెప్పాను మనల్ని తమిళ్ వాళ్ళు అనుకున్టారులేవే లోపలి వెళ్ళాక తీసి బాగ్ లో పడేద్దాము అని లైట్ గా కొట్టిపడేసాను చుట్టూ ఆడవాళ్ళని  చూడగా అతి కొద్ది అంటే పది మందికి ఇద్దరు మాత్రమే చిన్ని చిన్ని మాలలు తురుముకున్నారు
పూలు పాతరోజుల్లోలా  ఎవరు జడనిండా పెట్టుకోవడం లేదు బహుశ ఇంట్లోనే పెట్టుకుంటూ ఉన్నట్లున్నారు...యెమైన ఆడపిల్లలకి అలంకారలైన పూలు బొట్టు కాటుక ఈ రోజుల్లో నిర్లక్ష్యం చేయబడుతున్నాయి .. హాల్లోకి వెళ్ళగానే ఇద్దరం హడావిడిగాపెద్ద తప్పు చేసినట్లు  తలలో బరువు తీసి బాగ్ లో పడేసి గుండె జారి గల్లంతయ్యిందే లో మునిగిపోయాము .        

15, మే 2013, బుధవారం

ఇళ్లు వెలిసిపోతున్నాయి( ఖాళీ అవ్వుతున్నాయి )

ఈ మద్య ఎందుకో నా ఆలోచనలు విపరీతంగా అనిపిస్తున్నాయి సాధారణమైన సంఘటనను కూడా మనస్సుకి  ఎక్కువ తీసుకుంటున్నాను బహుశ వయస్సు పెరిగే కొద్ది ఇలా అవుతారేమో అర్ధం కావడం లేదు  చిన్ని ఇంటి నుండి వెళ్ళిపోయిన వెల్తి స్పష్టంగా కనబడుతుంది బుజ్జులు ఉండబట్టి గాని లేకపోతె మేము ఇద్దరం వున్నా ఇంట్లో మనుషులు వున్నట్లు అలికిడి వుండదు ఇద్దరం బిజి ఎవరి ప్రపంచం వారిది
నన్ను కలవరపెడుతున్న విషయం అమ్మ నాన్నలు పెద్దవాళ్ళు అయ్యిపోతున్నారు అని  ఎంతో ఆరోగ్యంగా వుండే నాన్న కొన్ని నెలల నుండి తేడాగా వుంటున్నారు అమ్మ కూడా చిక్కిపోతుంది చిన్నప్పటి నుండి నా కోరిక అమ్మా నాన్నకి  ముసలితనం రాకుడదని అయిన కాలం తనపని తానూ చేసుకుపోతుంది మా ఆశకి విలువ ఇవ్వక ..
ముప్పయ్యి మూడు సంవత్సరాల నుండి విజయవాడలో వుంటున్నారు అప్పుడు అమ్మ నాన్న ల వయస్సు చిన్నదే ఇక్కడున్న కాలనీలో దాదాపు వారి తోటి వయస్సు వారే వారంతా కూడా అమ్మా నాన్న లానే చిక్కిపోతున్నారు .రెక్కలొచ్చిన పక్షి పిల్లలు గూడు ఖాళీ చేసి వెళ్ళినట్లు యే ఇల్లు చూసిన  బోసిపోయినట్లు భార్య భర్తలు మాత్రమె మిగిలి ఎప్పుడెప్పుడో వచ్చే పిల్లలి రాక కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూడటం కనిపిస్తుంది (నేను కూడా చాల త్వరగానే వీళ్ళ లిస్టు లో చేరిపోయాను )కాలనీలో జరిగే చిన్న చితక పార్టీల్లో కలిసినపుడు వాళ్ళని చూస్తుంటే మనస్సు భారమవ్వుతుంది .
. అమ్మ వాళ్ళ ప్రక్క బజారులో వుండే సరోజినీ ఆంటీ  ఎంత బాగుండేదో పచ్చటి నిమ్మపండు చాయతో మెరిసిపోయేది అన్నీ మాచింగు లే వేసుకునేది అమ్మ వాళ్ళ స్నేహితుల గ్రూప్ లో మెరిసిపోయేది సందడి సందడి చేసిది ఇప్పుడు రుమాటిక్ పెయిన్ తో అడుగు తీసి అడుగు వెయ్యలేదు పిల్లలు ముగ్గురు యెగిరి పోయారు అంత పెద్ద ఇంజనీరు ఎప్పుడు నౌకర్లు చాకర్ల తో వుండే ఇల్లు వెలసిపోయింది ఎప్పుడు ఏదొక పార్టీలు కల్పించుకుని నెలకి ఒక చోట కలిసి సందడి చేసుకునే వీళ్ళంతా పెద్దవాళ్ళు అయిపోయారు
.ఉదయనె వరండాలో కూర్చుంటే కాలనీ లో వాకింగు చేసే అంకుల్స్ కనబడుతుండేవారు వాకింగ్ చేసే ఆ గ్రూపు పలుచబడిపోతుంది  నాలుగు రోజుల క్రితం ప్రక్క వీధిలో వుండే రామారావు అంకుల్ చడిచప్పుడు లేకుండా వెళ్ళిపోయారు వార్త వినగానే షాక్ ... ఎప్పుడు మా ఎదురుగా వుండే ఎలక్ట్రీషియన్ ని  పలకరిస్తూ వెంటబెట్టుకుని వెళ్తూ కనబడేవారు ఎంతో పెద్ద పదవిలు చేసి రిటైర్డ్ అయ్యాక అతి సామాన్యంగా అందరితో కలిసిపోయి తిరుగుతున్న వీళ్ళను చూస్తె ఇరవయ్యి ఏళ్ళ క్రితం నేను చుసిన వారెన వీళ్ళు అనిపిస్తుంది ..
 మూడు నెలల క్రితం కల్పన వాళ్ళ నాన్న బసవేశ్వర రావు అంకుల్  వెళ్ళిపోయారు ఎప్పుడు కనబడిన వాళ్ళ అమ్మాయి రాజకీయంగా ఎలా ఎదుగుతుంది మిగిలిన వారు ఎలా వున్నారు అని ఆపి చెబుతుండేవారు .. ఆయన లేరు .అంత క్రితం   నెల లోనే ఎప్పుడు నవ్వుతు త్రుళ్ళుతూ అందర్నీ నవ్విస్తుండే డిఎస్పి ఆంటీ (అంకుల్ ఎసిపి )సడెన్గా గుండేనొప్పి తో సెలవు చెప్పేశారు న్యూ ఇయర్ వచ్చిందంటే మా కాలనీ పార్క్ లో ప్రోగ్రం అంత ఆంటీ లాంటి వాళ్ళు ఏర్పాటు చేసేదే .
. ఇకపోతే మా ఇంటి వెనుక గోడ ఆవల నైరుతి మూల  కోనేరు రంగారావుగారు ఆయన సతీమణి తక్కువ వ్యవధిలోనే వెళ్ళిపోయరు  వాయువ్యం గోడకి ఆవల ఇంజినీరు ప్రసాదుగారు దక్షిణం వైపు వున్నా నాగయ్య గారు ఎదురింటి కోటేశ్వర రావు మామగారు  సెలవు తీసుకున్నారు వృద్దాప్యం మీదకి వచ్చి ఏదొక రూపాన మృత్యువు తీసుకుపోతుంది ఇది అత్యంత సహజమైనదే కాని మనస్సు తల్లడిల్లుతుంది ..యెన్నొ కలలతో ఆశలతో కష్టపడి కట్టుకున్న సౌధాలు వాటి అధిపతులు లేక శిధిలం అవ్వుతున్నాయి వెలిసిపోతున్నాయి ఖాళీ అవ్వుతున్నాయి  అపురూపంగా పెంచుకున్న మొక్కలన్నీ ఈ రోజు వృక్షలయ్యి కాలని  అంతటిని కమ్మేసి ఎవరున్న లేకున్నా మీకు తోడుగా మేము వున్నాము కదా అని ఒదార్చుతున్నట్లు తోస్తుంది ...ఎప్పటికైనా ఖాళి చేయాల్సిందే కదా హ్మ్మ్!. కాల చక్రం ఒక్కసారి వెనక్కి తిరిగేస్తే ఎంత బాగుండునో !