ఈ మద్య ఎందుకో నా ఆలోచనలు విపరీతంగా అనిపిస్తున్నాయి సాధారణమైన సంఘటనను కూడా మనస్సుకి ఎక్కువ తీసుకుంటున్నాను బహుశ వయస్సు పెరిగే కొద్ది ఇలా అవుతారేమో అర్ధం కావడం లేదు చిన్ని ఇంటి నుండి వెళ్ళిపోయిన వెల్తి స్పష్టంగా కనబడుతుంది బుజ్జులు ఉండబట్టి గాని లేకపోతె మేము ఇద్దరం వున్నా ఇంట్లో మనుషులు వున్నట్లు అలికిడి వుండదు ఇద్దరం బిజి ఎవరి ప్రపంచం వారిది
నన్ను కలవరపెడుతున్న విషయం అమ్మ నాన్నలు పెద్దవాళ్ళు అయ్యిపోతున్నారు అని ఎంతో ఆరోగ్యంగా వుండే నాన్న కొన్ని నెలల నుండి తేడాగా వుంటున్నారు అమ్మ కూడా చిక్కిపోతుంది చిన్నప్పటి నుండి నా కోరిక అమ్మా నాన్నకి ముసలితనం రాకుడదని అయిన కాలం తనపని తానూ చేసుకుపోతుంది మా ఆశకి విలువ ఇవ్వక ..
ముప్పయ్యి మూడు సంవత్సరాల నుండి విజయవాడలో వుంటున్నారు అప్పుడు అమ్మ నాన్న ల వయస్సు చిన్నదే ఇక్కడున్న కాలనీలో దాదాపు వారి తోటి వయస్సు వారే వారంతా కూడా అమ్మా నాన్న లానే చిక్కిపోతున్నారు .రెక్కలొచ్చిన పక్షి పిల్లలు గూడు ఖాళీ చేసి వెళ్ళినట్లు యే ఇల్లు చూసిన బోసిపోయినట్లు భార్య భర్తలు మాత్రమె మిగిలి ఎప్పుడెప్పుడో వచ్చే పిల్లలి రాక కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూడటం కనిపిస్తుంది (నేను కూడా చాల త్వరగానే వీళ్ళ లిస్టు లో చేరిపోయాను )కాలనీలో జరిగే చిన్న చితక పార్టీల్లో కలిసినపుడు వాళ్ళని చూస్తుంటే మనస్సు భారమవ్వుతుంది .
. అమ్మ వాళ్ళ ప్రక్క బజారులో వుండే సరోజినీ ఆంటీ ఎంత బాగుండేదో పచ్చటి నిమ్మపండు చాయతో మెరిసిపోయేది అన్నీ మాచింగు లే వేసుకునేది అమ్మ వాళ్ళ స్నేహితుల గ్రూప్ లో మెరిసిపోయేది సందడి సందడి చేసిది ఇప్పుడు రుమాటిక్ పెయిన్ తో అడుగు తీసి అడుగు వెయ్యలేదు పిల్లలు ముగ్గురు యెగిరి పోయారు అంత పెద్ద ఇంజనీరు ఎప్పుడు నౌకర్లు చాకర్ల తో వుండే ఇల్లు వెలసిపోయింది ఎప్పుడు ఏదొక పార్టీలు కల్పించుకుని నెలకి ఒక చోట కలిసి సందడి చేసుకునే వీళ్ళంతా పెద్దవాళ్ళు అయిపోయారు
.ఉదయనె వరండాలో కూర్చుంటే కాలనీ లో వాకింగు చేసే అంకుల్స్ కనబడుతుండేవారు వాకింగ్ చేసే ఆ గ్రూపు పలుచబడిపోతుంది నాలుగు రోజుల క్రితం ప్రక్క వీధిలో వుండే రామారావు అంకుల్ చడిచప్పుడు లేకుండా వెళ్ళిపోయారు వార్త వినగానే షాక్ ... ఎప్పుడు మా ఎదురుగా వుండే ఎలక్ట్రీషియన్ ని పలకరిస్తూ వెంటబెట్టుకుని వెళ్తూ కనబడేవారు ఎంతో పెద్ద పదవిలు చేసి రిటైర్డ్ అయ్యాక అతి సామాన్యంగా అందరితో కలిసిపోయి తిరుగుతున్న వీళ్ళను చూస్తె ఇరవయ్యి ఏళ్ళ క్రితం నేను చుసిన వారెన వీళ్ళు అనిపిస్తుంది ..
మూడు నెలల క్రితం కల్పన వాళ్ళ నాన్న బసవేశ్వర రావు అంకుల్ వెళ్ళిపోయారు ఎప్పుడు కనబడిన వాళ్ళ అమ్మాయి రాజకీయంగా ఎలా ఎదుగుతుంది మిగిలిన వారు ఎలా వున్నారు అని ఆపి చెబుతుండేవారు .. ఆయన లేరు .అంత క్రితం నెల లోనే ఎప్పుడు నవ్వుతు త్రుళ్ళుతూ అందర్నీ నవ్విస్తుండే డిఎస్పి ఆంటీ (అంకుల్ ఎసిపి )సడెన్గా గుండేనొప్పి తో సెలవు చెప్పేశారు న్యూ ఇయర్ వచ్చిందంటే మా కాలనీ పార్క్ లో ప్రోగ్రం అంత ఆంటీ లాంటి వాళ్ళు ఏర్పాటు చేసేదే .
. ఇకపోతే మా ఇంటి వెనుక గోడ ఆవల నైరుతి మూల కోనేరు రంగారావుగారు ఆయన సతీమణి తక్కువ వ్యవధిలోనే వెళ్ళిపోయరు వాయువ్యం గోడకి ఆవల ఇంజినీరు ప్రసాదుగారు దక్షిణం వైపు వున్నా నాగయ్య గారు ఎదురింటి కోటేశ్వర రావు మామగారు సెలవు తీసుకున్నారు వృద్దాప్యం మీదకి వచ్చి ఏదొక రూపాన మృత్యువు తీసుకుపోతుంది ఇది అత్యంత సహజమైనదే కాని మనస్సు తల్లడిల్లుతుంది ..యెన్నొ కలలతో ఆశలతో కష్టపడి కట్టుకున్న సౌధాలు వాటి అధిపతులు లేక శిధిలం అవ్వుతున్నాయి వెలిసిపోతున్నాయి ఖాళీ అవ్వుతున్నాయి అపురూపంగా పెంచుకున్న మొక్కలన్నీ ఈ రోజు వృక్షలయ్యి కాలని అంతటిని కమ్మేసి ఎవరున్న లేకున్నా మీకు తోడుగా మేము వున్నాము కదా అని ఒదార్చుతున్నట్లు తోస్తుంది ...ఎప్పటికైనా ఖాళి చేయాల్సిందే కదా హ్మ్మ్!. కాల చక్రం ఒక్కసారి వెనక్కి తిరిగేస్తే ఎంత బాగుండునో !

4 కామెంట్‌లు:
Even good things has to end some day.. A bitter truth of life! :(
నిజం చెప్పారు. మన మనసులూ ఖాళీ అవుతున్నాయనిపిస్తోంది. కాలం వేగంగా కదిలి పోతోంది. నాకూ మా అమ్మను చూస్తే ఈ మధ్యన అలాగే అనిపించింది. గడిచిన పదిహేను ఏళ్ళు ఎంతొ తొందరగా పరిగెత్తాయి నా జీవితంలో. మా వూరికెళితే ఇదే పరిస్థితి. అందరి ఇళ్ళూ "ఖాళీ" అవుతున్నాయి. తప్పదు కాలాన్ని ఆపలేము.
యెవరూ ఎప్పటికీ ఉండిపోరు,అందరూ ఇళ్ళు ఖాళీ చేసి చల్లగా వెళ్ళిపోవలసిందే!అది జీవన చక్రం!కాలం ఎవరికోసం ఆగదు వడివడిగా గిర్రుగిర్రున తిరుగుతుంది!అందుకే దీపమున్నప్పుడే ఇళ్ళు చక్కబెట్టుకుంటారు నెరవేర్చవలసిన బాధ్యతలన్నీ తీర్చుకుని తుది పయనంకోసం సంసిద్ధంగా ఉంటారు!
@మధుర వాణి
లోతుగా ఆలోచిస్తే అసలు పుట్టకుండా వున్నబాగుండేది కదా అనిపిస్తుంటది
@ అనూ
మనస్సులు ఖాళి కాదుగాని మనవాళ్ళు లేని వెలితి స్పష్టంగా కనిపిస్తుంది ,ఈ మద్యనే నానమ్మ ఊరు వెళ్ళాను ఆమె వెళ్ళిపోయి ఆరు సంవత్సరాలు నిండిపోయాయి ఇన్ని ఏళ్ళలో ఇది రెండో సారి వెళ్ళడం వున్నా ఒక్కరోజు వెలితిగా అడుగడుగునా ఆమె జ్ఞాపకాలతో దిగులు ఇంకాస్త ఉదృతం అయ్యి మరునాడే వచ్చేసాను
@ A .Surya prakash
అది నిజమేనండీ ,ఈ భంధాలను తెంచుకోలేక మరచిపోలేక వచ్చిన తిప్పలు .అందుకే అత్యాశగా కాలచక్రం వెనక్కి తిరిగిపోతే బాగుండునని అనుకుంటాను బుద్దుని వంటి జ్ఞానులు అరచి మొత్తుకున్నావినకుండా ఈ మాయప్రపంచంలో కొట్టుకుపోతున్నాము :)ధన్యవాదాలు ,స్పందించిన మిత్రులందరికీ
కామెంట్‌ను పోస్ట్ చేయండి