30, ఏప్రిల్ 2012, సోమవారం

సమాజసేవకు మేము సైతం .....


సమాజానికి మంచి చేయాలనీ ఆలోచన ఉన్నవారే సివిల్ సర్వీసెస్ కి రావాలని ఇతర ఉద్యోగాల్లో కేవలంవ్యక్తిగత  ప్రతిభకు అవకాశం వుంటే సివిల్స్ కి మాత్రం సామాజిక భాద్యత అధనంనైతిక విలువలు తప్పనిసరి అని సివిల్ సర్వీసెస్ పై నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ ఉద్భోధించారు.ఇది సత్యం. ఒకప్పుడు కోస్తా జిల్లాలలో ఇంజనీరింగ్ మెడిసిన్ తప్పించి వేరే ఆలోచన తల్లిదండ్రులకు వుండేది కాదు ఇప్పుడు ట్రెండ్ మారుతుంది .తమ పిల్లల్ని ఇంటర్ స్థాయి నుండే సివిల్ సర్వీసెస్ వైపు ప్రిపరషన్ సాగిస్తున్నారు పిల్లలకంటే తల్లిదండ్రులే తపన పడుతూ ఈ సదస్సుకి హాజరయ్యి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు .గత అయిదు సంవత్సరాల తో పోల్చితే ఇంత పెద్ద ఎత్తున అభ్యర్ధులు తల్లిదండ్రులు  అవగాహనా సదస్సుకు హాజరు కావడం  భవిష్యత్తు లో మార్పు కి నాంది అని చెప్పవచ్చు .స్వాగతం పలుకుదాము . 
            

బుజ్జులు కి ఇష్టం అయిన పండు


బుజ్జులు ఆడుకునే పోజ్ ....మామిడి కనబడితే ఆటలు వదిలి ఇలా........
మామిడి పళ్ళు తినాలి అంటే  రహస్యంగా తినాల్సి వస్తుంది రహస్యం ఎందుకు డయాబిటిక్ గాని ఉందేమోనని డౌట్ పడగలరు  .. ఈ పరిస్థితి నా ఒక్కదానికే కాదు మా ఇంట్లో వున్నా వారందరిది.చిన్నరసాలు సీజన్ ఉన్నంత కాలం మన ఇంట్లో ఉండాల్సిందే వచ్చిన బంధువులకి తినిపించడమే కాకుండా పాక్ చేసి వాళ్ళ కూడా పంపిస్తాము
 .అసలు విషయానికి వస్తే మాతో తినడానికి పోటీగా బుజ్జులు కూడా తయారయ్యింది దానికి పళ్ళంటే చాలా ఇష్టం మరి మామిడి పళ్ళంటే మహా ప్రాణం తియ్యగా వుంటాయి కాబట్టి వాటికి పెట్టొద్దు అని తెలిసిన ఇరుగమ్మ పోరుగమ్మ  చెబితే బుజ్జులుకి మామిడి పళ్ళు ఇవ్వడం మానేశాము .అసలే అంతంత మాత్రం జుట్టు తీపి తింటే వున్నది ఊడిపోతుంది అనేసర్కి బుజ్జులు అందం తగ్గుతుందేమోననే భయం తో పూర్తిగా పెట్టడం మానేశాము .దాని ముందు పండు తినాలి అంటే దాని చూపుల్ని తట్టుకోలేము అదేదో సినిమాలో బ్రహ్మానందం చూసినట్లు చూడటమే కాకుండా పిచ్చి తిట్లు దాని చేతులు పెట్టి అందినంతవరకు మమ్మల్ని కొట్టడం చేస్తుంది ,అందుకే బుజ్జులు ముందు సాధ్యం అయినంత వరకి తినడం తగ్గించాము తినాలి అంటే బుజ్జులు మేడ పైకి షికారుకి వెళ్ళే సమయం చూసుకోవాల్సిందే .మా అమ్మాయి జాలి పడి రసం మొత్తం తీసేసిన టెంకె ఇచ్చి దానిని బుజ్జగిస్తుంటది .బుజ్జులు నిద్రపోయేప్పుడు తింటున్న వాసనలు పసిగట్టి వచ్చి గోలగోల చేసేస్తుంది .ఈ మామిడి పళ్ళ పిచ్చిలో పడి పాలు అన్నం తినడం మానేసి స్లిమ్ గా తయారయ్యింది .అమ్మ వాళ్ళింటికి తీసుకెళ్ళిన పైన చెల్లి వాళ్ళింటికి వెళ్ళిన ఫ్రిజ్  డైనింగ్ టేబుల్ చుట్టూనే తిరుగుతుంది అక్కడ  మామిడి పళ్ళ వాసన లు పసిగట్టి ..పండు పట్టుకుంటే తెల్లగా పీల్చి పిప్పి చేసి మరి తింటుంది .ఏమైనా ఇలా రహస్యంగా తినే బదులు అసలు తినకపోవడమే బెటర్ అనిపించేలా చేస్తుంది ఈ బుజ్జులు.ఇంతక్రితమే మా అమ్మాయి రసం తీసేసి ఇచ్చిన పండు ఎంత పరవశం తో తింటుందో చూడండీ ..

13, ఏప్రిల్ 2012, శుక్రవారం

ఆ ఇద్దరు లేరు

కష్టాలు వస్తే ఒకదాని తరువాత ఒకటి చెట్టపట్టాలు వేసుకువస్తాయని నాయనమ్మ చెబుతుండేది సంతోషం అయిన అంతేనంటా.నాయనమ్మ ఎన్ని సామెతలు చెప్పేదో ఆలోచిస్తే జీవితానుభవం లోంచి వచ్చినవె .గత సంవత్సరం మధ్య నుండి కష్టాలే ఊహించనివి .,సరదాగా హెల్త్ చెకప్ అని వెళ్ళిన శ్రీవార్కి మేజర్ హార్ట్ సర్జరీ అయ్యి దేవుని దయవలన రిస్క్ నుండి కొంత సేవ్ చేయబడ్డారు కాని చిన్ని రాసే మెయిన్ ఎక్జమ్స్ మీదపడి తను సర్వీసు కోల్పోయిందిఇవన్ని నాన్న కంటే ఎక్కువ కాదులే అని సరిపెట్టుకుంది .సర్జరీ అయ్యి పూర్తిస్థాయిలో రెస్ట్ తీసుకుంటున్న శ్రీవార్ని చూసుకోవడానికి కూడా సెలవలు లేని వైనం చేసే ఉద్యోగం పై విరక్తి కలిగి నా మాతృ శాఖకి వచ్చేసేలా పురిగొల్పింది ఇంటాబయట మనస్సుకి శరీరాన్కి విశ్రాంతి లేక పూర్తి అయోమయం లో పడిపోయాను ....దగ్గరలో అమ్మాయి పెళ్లి వుంది ఇలాంటి స్థితిలో ఎలా చేస్తామా అని సందిగ్ధం ..
తమ్ముడి స్థితి చూసి ఖంగారు పడ్డ అన్న (శ్రీవారి అన్న )హార్ట్ చెకప్ చేసుకుని తనకంత మంచిగా వుందని ఊపిరి పీల్చుకున్న ఆనందం నెలరోజుల్లో ఆవిరి అయిపోయింది అర్ధరాత్రి హార్ట్ అటాక్ రూపంలో కబళించింది ఊహించని ఈ అవాంతరం చూసి మతి చెదిరి కుప్పకూలి పోయింది మా "బాపుబొమ్మ "(..క్రిటికల్ కేర్ లో 'బాపుబొమ్మ').స్మశాన వైరాగ్యం నుండి బయటపడి తెచ్చిపెట్టుకున్న ఆనందం తో పెళ్లి పనులు ఒక్కటొక్కటిగా మొదలు పెడదాము అనుకునే తరుణం లో తన భర్త ని విడిచి ఉండలేని మా తోడికోడలు ఒక ఉదయాన తన ముగ్గురు పిల్లల్ని మాకప్పగించి ఈ లోకం నుండి శాశ్వతంగా సెలవు తీసుకుంది .చివరివరకి చిన్ని పెళ్ళికోసం ఎదురు చూసిన ఆ ఇద్దరు లేకుండానే పెళ్ళయిపోయింది బహుశా మేము కూడా అంతలా ఎదురు చూడలేదు అమ్మాయి పెళ్లి కోసం హ్మం ...దేవుడు అడుగడుగునా నాకు కష్టాలు పెడుతూనే వున్నాడు కొలువులో తీవ్రమైన ఒత్తిడి అన్ని విషయాలు యెరిగి కూడా మానవత్వం చూపని అధికారులు ఉద్యోగం అంటే యేహ్యత ఏర్పడింది .ఇన్ని ఇబ్బందుల్లోను నా పయి పెట్టిన భాద్యతను ఆత్మియులైన స్నేహితులు తోబుట్టువుల సహకారం తో నేరవేర్చాను ఒక్కటి మాత్రం మనస్సులో తోలుస్తునేవుంది ఆ ఇద్దరు లేనిలోటు ..

11, ఏప్రిల్ 2012, బుధవారం

మా ఇంట్లో భూకంపం

మా విజయవాడకి భూకంపం వచ్చింది .ఇప్పుడే పైన వుండే వాళ్ళు పరుగులు తీసుకుంటూ వచ్చారు మమ్మల్ని చూసి తీరికగా కూర్చున్నరేంటి ఇల్లంతా కదిలిపోతుంటే అని ...బయటికి వచ్చాం కొంత సేపు చూడాలి యెం జరుగుతుందో ...

7, ఏప్రిల్ 2012, శనివారం

లక్ష్యం

అడుగులు ఎటు వెయ్యాలి? ఇంకా నాకేం కావాలి ?చేసే ఈ పనిలో నిజమైన తృప్తీ ఉందా?కొనసాగాలా లేక కొంత కాలం బ్రేక్ తీసుకోవాలా ఉహు మనస్సు మాట వినదే !నాలుగు రోజులు ఇంట్లో విశ్రాంతిగా కూర్చుందామని అనుకున్న కూర్చోలేని నా మనస్తత్వం పై బోల్డంత కోపం వస్తుంది .ఒక్కసారే వచ్చిపడిన విరామం లా వుంది .నా పరిస్థితినాలుగు రోడ్ల కూడలిలో ఉన్నట్లుంది.ఒక్కోసారి అమ్మ అమ్మమ్మ వాళ్ళలా ఇంట్లో చక్కగా వండుకుంటూ వార్చుకుంటూ ఇరుగమ్మ పోరుగమ్మ తో ముచ్చట్లేసుకుంట జీవితం గడిపేస్తే పోలా అని మరొక వైపు సమ సమాజం కోసం జీవితం అంకితం చేసేద్దాం :)అని ఆశ. మరింకోవైపు రాజకీయాల్లో కి పోయి దేశాన్ని మనం కూడా ఉద్దరించేయోచుగా అని కోరిక ఇవేవి కాదనుకుంటే నోర్ముసుకుని వున్నా ఉద్యోగాన్ని సక్రమంగా ఓపిక వున్నంతవరకి చేస్కోవాల హ్మం ప్రస్తుతం ఏంచేయాలో అర్ధం కావడం లేదు .

1, ఏప్రిల్ 2012, ఆదివారం

love @ golconda - Song

moch