13, ఏప్రిల్ 2012, శుక్రవారం

ఆ ఇద్దరు లేరు

కష్టాలు వస్తే ఒకదాని తరువాత ఒకటి చెట్టపట్టాలు వేసుకువస్తాయని నాయనమ్మ చెబుతుండేది సంతోషం అయిన అంతేనంటా.నాయనమ్మ ఎన్ని సామెతలు చెప్పేదో ఆలోచిస్తే జీవితానుభవం లోంచి వచ్చినవె .గత సంవత్సరం మధ్య నుండి కష్టాలే ఊహించనివి .,సరదాగా హెల్త్ చెకప్ అని వెళ్ళిన శ్రీవార్కి మేజర్ హార్ట్ సర్జరీ అయ్యి దేవుని దయవలన రిస్క్ నుండి కొంత సేవ్ చేయబడ్డారు కాని చిన్ని రాసే మెయిన్ ఎక్జమ్స్ మీదపడి తను సర్వీసు కోల్పోయిందిఇవన్ని నాన్న కంటే ఎక్కువ కాదులే అని సరిపెట్టుకుంది .సర్జరీ అయ్యి పూర్తిస్థాయిలో రెస్ట్ తీసుకుంటున్న శ్రీవార్ని చూసుకోవడానికి కూడా సెలవలు లేని వైనం చేసే ఉద్యోగం పై విరక్తి కలిగి నా మాతృ శాఖకి వచ్చేసేలా పురిగొల్పింది ఇంటాబయట మనస్సుకి శరీరాన్కి విశ్రాంతి లేక పూర్తి అయోమయం లో పడిపోయాను ....దగ్గరలో అమ్మాయి పెళ్లి వుంది ఇలాంటి స్థితిలో ఎలా చేస్తామా అని సందిగ్ధం ..
తమ్ముడి స్థితి చూసి ఖంగారు పడ్డ అన్న (శ్రీవారి అన్న )హార్ట్ చెకప్ చేసుకుని తనకంత మంచిగా వుందని ఊపిరి పీల్చుకున్న ఆనందం నెలరోజుల్లో ఆవిరి అయిపోయింది అర్ధరాత్రి హార్ట్ అటాక్ రూపంలో కబళించింది ఊహించని ఈ అవాంతరం చూసి మతి చెదిరి కుప్పకూలి పోయింది మా "బాపుబొమ్మ "(..క్రిటికల్ కేర్ లో 'బాపుబొమ్మ').స్మశాన వైరాగ్యం నుండి బయటపడి తెచ్చిపెట్టుకున్న ఆనందం తో పెళ్లి పనులు ఒక్కటొక్కటిగా మొదలు పెడదాము అనుకునే తరుణం లో తన భర్త ని విడిచి ఉండలేని మా తోడికోడలు ఒక ఉదయాన తన ముగ్గురు పిల్లల్ని మాకప్పగించి ఈ లోకం నుండి శాశ్వతంగా సెలవు తీసుకుంది .చివరివరకి చిన్ని పెళ్ళికోసం ఎదురు చూసిన ఆ ఇద్దరు లేకుండానే పెళ్ళయిపోయింది బహుశా మేము కూడా అంతలా ఎదురు చూడలేదు అమ్మాయి పెళ్లి కోసం హ్మం ...దేవుడు అడుగడుగునా నాకు కష్టాలు పెడుతూనే వున్నాడు కొలువులో తీవ్రమైన ఒత్తిడి అన్ని విషయాలు యెరిగి కూడా మానవత్వం చూపని అధికారులు ఉద్యోగం అంటే యేహ్యత ఏర్పడింది .ఇన్ని ఇబ్బందుల్లోను నా పయి పెట్టిన భాద్యతను ఆత్మియులైన స్నేహితులు తోబుట్టువుల సహకారం తో నేరవేర్చాను ఒక్కటి మాత్రం మనస్సులో తోలుస్తునేవుంది ఆ ఇద్దరు లేనిలోటు ..

7 వ్యాఖ్యలు:

వనజవనమాలి చెప్పారు...

చాలా బాధాకరం . అండీ ..అయినా తేరుకుని లేవక తప్పదు. జాబ్ లో జాయిన్ అయ్యారా? పుస్తకాలు మంచి నేస్తాలు. అలాగే ఫ్రెండ్స్ తో కూడా టచ్ లో ఉండండి. ఇలా బ్లాగ్ లోకి వస్తూ ఉండండి. అనీ సర్దుకుంటాయి. అందుకే ఒక కవి అన్నారు..

చేతి చిటికేనే వేళ్ళు కలిస్తే కల్యాణం

కాలి బొటనవేళ్ళు కలిస్తే నిర్యాణం.. మధ్యలో నటన జీవితం

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

ఆత్మీయులు లేని లోటు ఎవరూ తీర్చలేనిది. విపత్కర పరిస్థితులను ఎదుర్కొని ధైర్యం గా నిలిచిన మీకు అభినందనలు.

చిన్ని చెప్పారు...

@వనజ వనమాలీ
ఉద్యోగం లో చేరానండీ.మీ సూచనలకి ధన్యవాదాలు .
@బులుసు సుబ్రహ్మణ్యం
మీ స్పందనకి ధన్యవాదాలండీ .

మాలా కుమార్ చెప్పారు...

అయ్యో . అంతే నండి క్ష్టాలు వస్తే అలా ఒకదానివెనుక వచ్చేస్తూనేవుంటాయి . మీ ధైర్యమే మీకు రక్ష .

చిన్ని చెప్పారు...

@మాలాకుమార్
ధన్యవాదాలండీ

Narayanaswamy S. చెప్పారు...

wow.
Our prayers are with your family

చిన్ని చెప్పారు...

@Narayanaswamy.s
thankyou.