7, ఏప్రిల్ 2012, శనివారం
లక్ష్యం
అడుగులు ఎటు వెయ్యాలి? ఇంకా నాకేం కావాలి ?చేసే ఈ పనిలో నిజమైన తృప్తీ ఉందా?కొనసాగాలా లేక కొంత కాలం బ్రేక్ తీసుకోవాలా ఉహు మనస్సు మాట వినదే !నాలుగు రోజులు ఇంట్లో విశ్రాంతిగా కూర్చుందామని అనుకున్న కూర్చోలేని నా మనస్తత్వం పై బోల్డంత కోపం వస్తుంది .ఒక్కసారే వచ్చిపడిన విరామం లా వుంది .నా పరిస్థితినాలుగు రోడ్ల కూడలిలో ఉన్నట్లుంది.ఒక్కోసారి అమ్మ అమ్మమ్మ వాళ్ళలా ఇంట్లో చక్కగా వండుకుంటూ వార్చుకుంటూ ఇరుగమ్మ పోరుగమ్మ తో ముచ్చట్లేసుకుంట జీవితం గడిపేస్తే పోలా అని మరొక వైపు సమ సమాజం కోసం జీవితం అంకితం చేసేద్దాం :)అని ఆశ. మరింకోవైపు రాజకీయాల్లో కి పోయి దేశాన్ని మనం కూడా ఉద్దరించేయోచుగా అని కోరిక ఇవేవి కాదనుకుంటే నోర్ముసుకుని వున్నా ఉద్యోగాన్ని సక్రమంగా ఓపిక వున్నంతవరకి చేస్కోవాల హ్మం ప్రస్తుతం ఏంచేయాలో అర్ధం కావడం లేదు .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
5 కామెంట్‌లు:
It's just midlife crisis. It will pass. Come to blog and start writing a lot more :)
చిన్ని గారు..మీ ఉద్యోగం మీరు చెయ్యండి. వీలైనంత వరకు give back to the community , మీరు ఎంత చెయ్యగలిగితే అంత.money, service, or sometimes just give your time to someone who deperately needs it..ఏదో ఒకరకంగా సహాయం అవసరమైన వారికి సాయపడండి. అప్పుడు చూడండి మీకు ఎంత తృప్తి గా ఉంటుందో!
@నారాయణ స్వామి
అంతేనంటారా! నిజమే ఎడాపెడా బ్లాగులు చదువుతూ రాస్తూ ఈ శూన్యాన్ని అధిగామించేస్తాను :-) చక్కని సలహా ఇచ్చినందుకు ధన్యవాదాలు .
@జలతారు వెన్నెల
మీ బ్లాగ్ పేరు చాల బాగుంది .తప్పకుండా మీ సూచనలు అనుసరిస్తానండీ .థాంక్యూ .
ఇరుగమ్మ పొరుగమ్మ కబుర్లు మీకెందుకు గాని, రొటీన్ లైఫ్ నుంచి కొన్నాళ్ళు పారిపొండి చాలు:) హాయిగా కొన్నిరోజులు మీరు చూడని ప్రాంతాలకి మీకు నచ్చిన కంపెనీతో వెళ్ళి ఇతర ఆలోచనలు లేకుండా గడిపేయండి. ఆ తరువాత మీ బాధ్యతలే మిమ్మల్ని వెనక్కి గుంజేస్తాయి. ప్రస్తుతం అమ్మాయి దగ్గరలేదు కదా! ఆ దిగులు కూడా కొంచెం తోడయ్యింది. అప్పుడప్పుడూ మాలాంటి స్నేహితుల్ని కూడా పలకరించండి. ఇటువంటి స్టేజ్ ప్రతిఒక్కరికీ ఎప్పుడో అప్పుడు తప్పదు. ఇతరులకు సేవ చేసే ఉద్యోగం లోనే ఉండి, ఇంకా సంఘసేవ గురించి ఆలోచన ఎందుకు. ప్రస్తుత రాజకీయాలు మీరు మార్చగలరా? ఉద్ధరించగలరా! నిజంగా తృప్తి పొందగలరా! అవునూ...బుజ్జులు ఎలా ఉంది. చాలా రోజులయింది చూసి. అడిగానని చెప్పండేం. All the best.
@జయ
బుజ్జులు బాగుందండీ మాటలు రావు కాని అన్ని తెలుసు ఆటలు ఎక్కువ అయ్యాయి .అలకలు ఎక్కువ .
ఏదో తెలీని వెలితి చేసే పనిలో ధ్యాస వుండట్లా :)మీరంతా అన్నట్లు కొన్నాళ్ళు వుంది పోతదేమో.,ఈ లోపు మన
ఆలోచనలో మార్పు వస్తుందనుకుంటాను .మార్పు సహజం కదా ! మీ సూచనలు తీసుకుంటాను థాంక్యూ .
కామెంట్‌ను పోస్ట్ చేయండి