17, అక్టోబర్ 2014, శుక్రవారం

ఆనాటి వాన చినుకులేవి

ఈ రోజు చాలా కాలం తరువాత బ్లాగిళ్ళ కు తిరిగి వచ్చాను పాత ఇళ్లన్నీ వెల వెల బోతున్నాయి కొత్తవన్ని కళ కళ లాడుతున్నాయి ... దాదాపు అన్ని ఇళ్ళు మూసేసి వున్నాయి నెమలికన్ను మరువం పద్మర్పిత తేటగీతి బ్లాగిళ్ళు మాత్రం ముత్యాల ముగ్గులతో కళ గా వున్నాయి కాసేప్పక్కడ తచ్చాడి మూసేసిన వాకిళ్లలో నాటి స్మృతి సుగంధాలను ఆఘ్రాణించి వెనుదిరిగాను 

13, ఆగస్టు 2014, బుధవారం

ప్రశాంతంగా పనిచేసుకోవచ్చు

చాల సంతోషంగా వుంది ....ఇక మీదట రివ్యూలు మీటింగులకు భాగ్యనగరం  వెళ్ళనవసరం లేదని ప్రశాంతమైన వాతావరణంలో అందరం పనిచేసుకోవచ్చని .

20, జులై 2014, ఆదివారం

ముసుగెందుకు

ముసుగెందుకు ? చాలారోజుల నుండి నన్ను వేధిస్తున్న ప్రశ్న ...ఎందుకని ఈ అమ్మాయిలూ ముఖానికి ముసుగు వేస్తున్నారు కళ్ళు మాత్రమె కనబడేలా ఉంచుకుని రకరకాల స్కార్ఫ్స్ తో ముసుగులతో వెళ్తున్నారు బండి నడిపే వాళ్ళు నడపని వాళ్ళు ఇదే పద్దతుల్లో కనబడుతున్నారు సిటీ లోనే కాకుండా మండల కేంద్రాల్లో ఇలాటి అమ్మాయిలను  తరుచు చూస్తున్నాము .... ఎండబారినుండి పిగ్మేంటేషన్  నుండి తప్పుకోవడానికా అనుకుంటే నిజం కాదనిపిస్తుంది బహుశా  క్రూర మృగాళ్ళ నుండి రక్షణ కోసం  అనుకుంటా !

8, ఫిబ్రవరి 2014, శనివారం

బడికి వెళ్తున్నా

నా బ్లాగుకి అయిదేళ్ళు నిండాయి మొన్ననే
  కొత్త గౌను వేసుకుని కొత్త పుస్తకం పట్టుకుని
 నా నేస్తాల తో కలిసి  బడిలోకి వెళ్తున్నాను
 బాగా చదువుకోడానికి:-)