22, ఫిబ్రవరి 2016, సోమవారం

ఆ పిలుపు లోయేముందంటే

''అక్కా మీకోసం అమ్మ జున్నుపాలు పంపింది '' తలుపు తీయగానే నాకన్నా డబల్ సైజు వున్నా పిల్లోడు పాల కాన్  నా చేతికంధించాడు  వాడు బుచ్చిబాబు మా పెద్ద నాన్న కొడుకు   పక్క ఊర్లో  వుంటారు  సంక్రాంతికి తప్పక నాయనమ్మ వూరు వెళ్ళే వాళ్ళం మా నానమ్మ కి ఎనిమిదిమంది అక్కయ్యలు ముగ్గురు అన్నయ్యలు అంతా చుట్టూ ప్రక్కల గ్రామాల్లో వుండేవారు బోల్డంత మంది కజిన్స్ ఎవరు పెద్దో ఎవరు చిన్నో తెలిసేది కాదు అసలు విషయానికి వస్తే ఆ బుచ్చి నాకంటే రెండేళ్ళు పెద్దోడు అయినా నన్ను అక్కా అని పిలిచేవోడు నాకు ఒళ్ళు మండేది అలా పిలుస్తుంటే వద్దు అని చెప్పలేని బలహీనత వాడి అమాయక మొహం చూస్తుంటే .... 
అప్పుడే కాలేజి లోకి అడుగిడిన రోజులు .... ఏలూరులో  సెయింట్ తెరిసాలో ఎల్ కేజీ టూ  పిజి  వరకు వుంటుంది కాంపస్  ఒక్కటే  గేట్స్ వేరే వుంటాయి . లంచ్ టైం లో మా జూనియర్స్ ని పలకరించడానికి  మా ఫ్రెండ్స్  అంతా కలసి వెళ్ళాము  చెట్టు క్రిందా గుంపులుగా బోజనాలు చేస్తూ పిల్లలు కుర్చుని వున్నారు  మనం తోచక అక్కడున్న చిన్న పిల్లను చూసి  ఏమి తింటున్నావు  ,మీ క్లాస్స్ ఎక్కడ అని అడుగుతుంటే ఆ పిల్లకి అన్నం పెడుతున్న తల్లి "చెప్పు ఆంటీ అడుగుతుంది కదా "అని పిల్ల తో ఒకటికి పది సార్లు అంటుంటే మేము తెల్లమొహాలు వేసుకుని నవ్వు ఆపుకుని అక్కడినుండి పారిపోయాము   "ఆంటీ" అన్న పిలుపు కొత్తగా వింతగా అనిపించింది .రాను రాను  ఆంటీ అలవాటయ్యింది  మా అమ్మాయి పుట్టాక ఆక్సేప్ట్ చేసేసాను .కొన్ని సార్లు వింతగా మనకన్నా చాన పెద్దోళ్ళు మనల్ని ఆంటీ అంకుల్ అంటుంటే పలకాలో వద్దో అర్ధం అయ్యేది కాదు , మా పాప ఫస్ట్ క్లాస్స్ లో వుండగా మా  ఇంటి పయన వుండే ఒక జంట మమ్మల్ని ఆంటి అంకుల్ అనేవారు అయన నాకంటే పెద్ద ఆమె కూడా ఇంచుమించు నా వయస్సే వాళ్ళు పిలుస్తుంటే పలికి మాట్లాడి వాళ్ళు వెళ్లాక చిందులు వేసేదాన్ని. 
మా అమ్మాయి ఫిఫ్త్ క్లాస్స్ లో వుండగా మా బావ గారి అమ్మాయి పెళ్ళయింది ఆ అమ్మాయి ఇంటర్ పోయేసరికి మంచి సంభంధం అని చేసారు ఆ తరువాత రెండేళ్ళకి చిన్నమ్మమ్మ అనే పిలుపు విని ఉలిక్కిపడ్డాను వరుసబెట్టి నా ఆడపడుచుల పిల్లలికి పెళ్ళిళ్ళు ఆనక నానమ్మ అని పిలిపించడం ఒకసారి మావారి మేనకోడలి కూతురు నన్ను ఆంటీ  ఆంటీ అంటూ కూడా తిరుగుతుంటే నా రెండో ఆడపడుచు వాళ్ళ అమ్మాయి   కలసి ఆ పిల్ల దాన్నినోటి తో నాయనమ్మ అనిపించేదాక వదల్లేదు మా అమ్మాయి నేను నవ్వుకునే వాళ్ళం .... 
ఇప్పుడేమో బుడి బుడిగా రాగాలు తీస్తూ అమ్మమ్మా మామ్  మామ్ అని వింటుంటే వీనుల విందుగా వుంటుంది నా మనవడు "అమోఘ శౌర్య " ని అడిగి మరీ అమ్మమ్మ అను అను అడిగి మరీ పిలిపించుకుంటే  ఆ ఆనందమే అధ్బుతం . ఇప్పుడు నేను నిజ్జంగా అమ్మమ్మని కదా మరీ !

7, ఫిబ్రవరి 2016, ఆదివారం

ఏడేళ్ళ ప్రాయం

ఈ రోజు ఎంత టైం అయినా సరే నా బ్లాగులో నాలుగు లైన్ లు ఆయినా రాయాలనే గాట్టి సంకల్పం చేసుకుని తీరుబాటుగా ఇలా మొదలెట్టాను .యేమంత విశేషాలు రాయబోతున్నాను అనుకుంటే గొప్ప శేషమే ఈ బ్లాగు ప్రపంచంలోకి వచ్చి ఈ రోజుకి ఏడు సంవత్సరాలు  నిండాయి ... గడచిన సంవత్సరాలు తరచి చూస్తే మనం పేద్దగా సాధించిందేమి లేదు (బ్లాగు ల వరకే సుమా ) ఆంధ్రులు ఆరంభ శూరులు  అన్నట్లు  నా బ్లాగు చూసినోళ్లకి  చదివినాళ్ళకి  ఇట్టే  అర్ధం అవ్వుద్ది .బ్లాగు మొదలెట్టిన కొత్తలో ఎంత పనులున్న ప్రక్కన పడేసి కళ్ళు మొహం వాచేట్టు నిద్దరాపుకుని కంప్యూటర్ లో ముఖం  పెట్టుకుని కూర్చునే దాన్ని  కొన్నిసార్లయితే నా ఎడిక్షన్ ఎలా ఒదుల్చుకోవాల  అని భాదపడిన రోజులున్నాయి   http://himabinduvulu.blogspot.in/2010/01/blog-post_18.html    ప్రతి సంవత్సరం గడిచేసరికి పోస్ట్లు పలుచన అయ్యాయి వీటికి వివిధ కారణాలు ...బ్లాగుల పట్ల కొంత వ్యామోహం బలవంతాన తగ్గించుకోవడం కాస్త దారి తప్పి ముఖపుస్తక వ్యామోహం లో పడటం  ఇప్పుడు అదీ తగ్గిందిలేండి  కొత్త ఒక వింత పాత ఒక రోత  అన్న చందాన వాట్సప్  మాయ  లో పడిపోయాం ఇప్పుడేమో టెలిగ్రాం ... సమాచారం సెకన్స్ లో పైగా చూడకపోతే మనం ఎన్నో మిస్ అవ్వుతాము  సో ఇలా కొట్టుకుంటూ ప్రవాహం లో పడితే  మన బ్లాగిల్లు మసక బారడం సహజమే కదా ! పూర్వం యెంతో  బాగా రాసే బ్లాగులన్నీ కళ తప్పి వున్నాయి కొత్త బ్లాగులు మాత్రం కళ గా వున్నాయి  నేను . ఇప్పుడే  ఇల్లు కడిగి  ముగ్గులేసి   తోరణాలు కట్టి  రంగులేసాను  నా జ్ఞాపకాల పూలను నా అనుభవాల అల్లికలని పరికించి చూసి ఒచ్చాను  యెటు తిరిగొచ్చినా  నా ఇల్లు వదల కూడదని నేను సేద తీరేదిదని  పుట్టిన రోజున జ్ఞానోదయం అయ్యింది :-).