''అక్కా మీకోసం అమ్మ జున్నుపాలు పంపింది '' తలుపు తీయగానే నాకన్నా డబల్ సైజు వున్నా పిల్లోడు పాల కాన్ నా చేతికంధించాడు వాడు బుచ్చిబాబు మా పెద్ద నాన్న కొడుకు పక్క ఊర్లో వుంటారు సంక్రాంతికి తప్పక నాయనమ్మ వూరు వెళ్ళే వాళ్ళం మా నానమ్మ కి ఎనిమిదిమంది అక్కయ్యలు ముగ్గురు అన్నయ్యలు అంతా చుట్టూ ప్రక్కల గ్రామాల్లో వుండేవారు బోల్డంత మంది కజిన్స్ ఎవరు పెద్దో ఎవరు చిన్నో తెలిసేది కాదు అసలు విషయానికి వస్తే ఆ బుచ్చి నాకంటే రెండేళ్ళు పెద్దోడు అయినా నన్ను అక్కా అని పిలిచేవోడు నాకు ఒళ్ళు మండేది అలా పిలుస్తుంటే వద్దు అని చెప్పలేని బలహీనత వాడి అమాయక మొహం చూస్తుంటే ....
అప్పుడే కాలేజి లోకి అడుగిడిన రోజులు .... ఏలూరులో సెయింట్ తెరిసాలో ఎల్ కేజీ టూ పిజి వరకు వుంటుంది కాంపస్ ఒక్కటే గేట్స్ వేరే వుంటాయి . లంచ్ టైం లో మా జూనియర్స్ ని పలకరించడానికి మా ఫ్రెండ్స్ అంతా కలసి వెళ్ళాము చెట్టు క్రిందా గుంపులుగా బోజనాలు చేస్తూ పిల్లలు కుర్చుని వున్నారు మనం తోచక అక్కడున్న చిన్న పిల్లను చూసి ఏమి తింటున్నావు ,మీ క్లాస్స్ ఎక్కడ అని అడుగుతుంటే ఆ పిల్లకి అన్నం పెడుతున్న తల్లి "చెప్పు ఆంటీ అడుగుతుంది కదా "అని పిల్ల తో ఒకటికి పది సార్లు అంటుంటే మేము తెల్లమొహాలు వేసుకుని నవ్వు ఆపుకుని అక్కడినుండి పారిపోయాము "ఆంటీ" అన్న పిలుపు కొత్తగా వింతగా అనిపించింది .రాను రాను ఆంటీ అలవాటయ్యింది మా అమ్మాయి పుట్టాక ఆక్సేప్ట్ చేసేసాను .కొన్ని సార్లు వింతగా మనకన్నా చాన పెద్దోళ్ళు మనల్ని ఆంటీ అంకుల్ అంటుంటే పలకాలో వద్దో అర్ధం అయ్యేది కాదు , మా పాప ఫస్ట్ క్లాస్స్ లో వుండగా మా ఇంటి పయన వుండే ఒక జంట మమ్మల్ని ఆంటి అంకుల్ అనేవారు అయన నాకంటే పెద్ద ఆమె కూడా ఇంచుమించు నా వయస్సే వాళ్ళు పిలుస్తుంటే పలికి మాట్లాడి వాళ్ళు వెళ్లాక చిందులు వేసేదాన్ని.
మా అమ్మాయి ఫిఫ్త్ క్లాస్స్ లో వుండగా మా బావ గారి అమ్మాయి పెళ్ళయింది ఆ అమ్మాయి ఇంటర్ పోయేసరికి మంచి సంభంధం అని చేసారు ఆ తరువాత రెండేళ్ళకి చిన్నమ్మమ్మ అనే పిలుపు విని ఉలిక్కిపడ్డాను వరుసబెట్టి నా ఆడపడుచుల పిల్లలికి పెళ్ళిళ్ళు ఆనక నానమ్మ అని పిలిపించడం ఒకసారి మావారి మేనకోడలి కూతురు నన్ను ఆంటీ ఆంటీ అంటూ కూడా తిరుగుతుంటే నా రెండో ఆడపడుచు వాళ్ళ అమ్మాయి కలసి ఆ పిల్ల దాన్నినోటి తో నాయనమ్మ అనిపించేదాక వదల్లేదు మా అమ్మాయి నేను నవ్వుకునే వాళ్ళం ....
ఇప్పుడేమో బుడి బుడిగా రాగాలు తీస్తూ అమ్మమ్మా మామ్ మామ్ అని వింటుంటే వీనుల విందుగా వుంటుంది నా మనవడు "అమోఘ శౌర్య " ని అడిగి మరీ అమ్మమ్మ అను అను అడిగి మరీ పిలిపించుకుంటే ఆ ఆనందమే అధ్బుతం . ఇప్పుడు నేను నిజ్జంగా అమ్మమ్మని కదా మరీ !
6 కామెంట్‌లు:
అలా పిలిచేవారా మిమ్మల్ని? కానీయండి, కొన్నేళ్ళ తరువాత వాళ్ళను కూడా ఇంకొకరు అలా పిలవకా తప్పదు, వాళ్ళు వినకా తప్పదు :)
అమ్మమ్మ పిలుపు .. ఆనందమానందమాయే ! :)
@ ఉమాశంకర్
వినవలసినప్పుడు ఆ పిలుపు బానే వుంటాది
కానీ ఇంకా నయం అలాగా అమ్మమ్మ గారు అనలేదు ;-)
@ వనజా తాతినేని
నిజమే చాలా ఆనందంగా వుంటుంది ముందు ముందు మీకు తెలుస్తుంది :)
"గాంధి" సినిమా చూసే ఉంటారుగా మీరు?
అరెస్ట్ అయి జైల్లో ఉన్న గాంధీగారిని చూడటానికి ఆయన తెల్లస్నేహితుడు, ఆప్తుడు అయిన Rev.Charles Freer Andrews వస్తారు. మాటల్లో ఆయన గాంధీగారితో అంటారు గదా - ప్రజలందరూ నిన్ను "బాపు" అంటున్నారు. దానికర్ధం "తండ్రి" కదా? - అని అడుగుతారు. అప్పుడు గాంధీ గారు - అవును, మనం ముసలివాళ్ళమయిపోతున్నామన్నమాట ఛార్లీ - అంటారు :)
వయస్సు పైబడుతున్నప్పుడు ఇటువంటి పిలుపులు, "తాత / బామ్మ / అమ్మమ్మ" అనే unexpected ప్రొమోషన్లు తప్పవు ఓ చిరునవ్వుతో సరిపెట్టుకోవడమే:)
@ విన్నకోట నరసింహరావు
నిజమేనండీ అలవాటు పడుతున్నాము :-) ధన్యవాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి