7, ఫిబ్రవరి 2016, ఆదివారం

ఏడేళ్ళ ప్రాయం

ఈ రోజు ఎంత టైం అయినా సరే నా బ్లాగులో నాలుగు లైన్ లు ఆయినా రాయాలనే గాట్టి సంకల్పం చేసుకుని తీరుబాటుగా ఇలా మొదలెట్టాను .యేమంత విశేషాలు రాయబోతున్నాను అనుకుంటే గొప్ప శేషమే ఈ బ్లాగు ప్రపంచంలోకి వచ్చి ఈ రోజుకి ఏడు సంవత్సరాలు  నిండాయి ... గడచిన సంవత్సరాలు తరచి చూస్తే మనం పేద్దగా సాధించిందేమి లేదు (బ్లాగు ల వరకే సుమా ) ఆంధ్రులు ఆరంభ శూరులు  అన్నట్లు  నా బ్లాగు చూసినోళ్లకి  చదివినాళ్ళకి  ఇట్టే  అర్ధం అవ్వుద్ది .బ్లాగు మొదలెట్టిన కొత్తలో ఎంత పనులున్న ప్రక్కన పడేసి కళ్ళు మొహం వాచేట్టు నిద్దరాపుకుని కంప్యూటర్ లో ముఖం  పెట్టుకుని కూర్చునే దాన్ని  కొన్నిసార్లయితే నా ఎడిక్షన్ ఎలా ఒదుల్చుకోవాల  అని భాదపడిన రోజులున్నాయి   http://himabinduvulu.blogspot.in/2010/01/blog-post_18.html    ప్రతి సంవత్సరం గడిచేసరికి పోస్ట్లు పలుచన అయ్యాయి వీటికి వివిధ కారణాలు ...బ్లాగుల పట్ల కొంత వ్యామోహం బలవంతాన తగ్గించుకోవడం కాస్త దారి తప్పి ముఖపుస్తక వ్యామోహం లో పడటం  ఇప్పుడు అదీ తగ్గిందిలేండి  కొత్త ఒక వింత పాత ఒక రోత  అన్న చందాన వాట్సప్  మాయ  లో పడిపోయాం ఇప్పుడేమో టెలిగ్రాం ... సమాచారం సెకన్స్ లో పైగా చూడకపోతే మనం ఎన్నో మిస్ అవ్వుతాము  సో ఇలా కొట్టుకుంటూ ప్రవాహం లో పడితే  మన బ్లాగిల్లు మసక బారడం సహజమే కదా ! పూర్వం యెంతో  బాగా రాసే బ్లాగులన్నీ కళ తప్పి వున్నాయి కొత్త బ్లాగులు మాత్రం కళ గా వున్నాయి  నేను . ఇప్పుడే  ఇల్లు కడిగి  ముగ్గులేసి   తోరణాలు కట్టి  రంగులేసాను  నా జ్ఞాపకాల పూలను నా అనుభవాల అల్లికలని పరికించి చూసి ఒచ్చాను  యెటు తిరిగొచ్చినా  నా ఇల్లు వదల కూడదని నేను సేద తీరేదిదని  పుట్టిన రోజున జ్ఞానోదయం అయ్యింది :-). 

4 కామెంట్‌లు:

మురళి చెప్పారు...

Happy birthday!!
అప్పుడప్పుడన్నా రాస్తూ ఉండండి :)

ఉమాశంకర్ చెప్పారు...

గత మూడేళ్ళ నుంచి నేనూ అదే అనుకోవటం.. కానీ ప్చ్.. .

ఆల్ ది బెస్ట్. :) . Happy birthday.

ఉమాశంకర్ చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
Hima bindu చెప్పారు...

@ మురళీ
@ ఉమా శంకర్
ఇక ముందు ముందు రాస్తానండీ నెత్తి మీద బరువు తగ్గించుకున్నాను :) థాంక్యూ