25, మే 2019, శనివారం

శీత వేళ రానీయకు --శిశిరానికి చోటీయకు

అప్పుడే కొత్త సంవత్సరము సగములోకి  వచ్చేసాము ,,,ఇంకేముంది నాలుగు రోజులు  కళ్ళు మూసుకుంటే ఆరు నెలలలోకి .....నాకోటి అర్థం కావడం లేదు భూమి ఏమైనా తన వేగాన్ని పెంచిందా అని సందేహం వస్తుంది ..... మనకేమో సంవత్సరాలు నెత్తి మీదకి వస్తున్నాయి కానీ ఒక్క వెండివేణి  కనబడటం లేదు ,,,కళ్ళు మాత్రం కొంచెం మసకబారి అద్దాలు లేనిదే చిన్న అక్షరాలూ కాన రావడం లేదు  ఇది వయస్సు తో వచ్చిన చత్వారం అని డాక్టర్ గారు సెలవిచ్చారు కొన్నాళ్ళకి తగ్గిపోతుంది అని ఊరట నిచ్చారు ,,, రోజు వీడియో కాల్  పిల్లలతో మాట్లాడుతుంటే
అప్పుడు గుర్తొస్తుంది  నిజంగానే భూమి వేగంగా తిరిగి పోతుందని .... నిన్న కాక మొన్న పుట్టిన అమోఘ ప్రీస్కూల్
కి వెళ్ళడము ఏమిటి ... వింత కాపోతే అనిపిస్తుంది ,,,,, ఇంకా నా మనస్సు లో  శశిరానికి  తావు రాలేదు