అభిమాన రచయితలూ అభిమాన కథానాయకుల లానే మనకి నచ్చే బ్లాగర్ కూడా సహజంగానే వుంటారు వాళ్ళు ఏది రాసిన సమయం వున్నా లేకపోయినా వెసులుబాటు చేసుకుని చదవవలసిందే,.బ్లాగ్లోకం లోకి అడుగు పెట్టిన కొత్తలో దాదాపు అన్ని బ్లాగులు చదివేదాన్నికొంతమంది రచనలు మరపురాని విధంగా హార్ట్ టచింగ్ గా వుంటాయి అటువంటి కొందరు బ్లాగర్స్ ని క్రమం తప్పక అనుసరించేదాన్ని వారిలో ఇద్దరు ముగ్గురు మిత్రులు కూడా అయ్యారు ...అసలింతకి చెప్పొచ్చేది ఏమంటే మూడు సంవత్సరాల పరిచయం తరువాతభూగోళం కి ఆవల ఉంటున్న నేను అభిమానించే బ్లాగు మిత్రుడిని కలిసాను తనకున్న టైట్ షెడ్యుల్లోవెసులుబాటు చేసుకుని మా ఊరు వచ్చి మా ఇంటికి వచ్చి కొంత సమయం మాతో స్పెండ్ చేసి వెళ్ళారు మాకుబోల్డన్ని గిఫ్ట్స్ ఇచ్చి వెళ్ళారు థాంక్స్ టూ బ్లాగు లోకం బంగారులోకం :-)..ఇంతకి నా అభిమాన బ్లాగర్ ఎవరంటారా !అది సస్పెన్స్:-)
24, నవంబర్ 2012, శనివారం
2, నవంబర్ 2012, శుక్రవారం
బ్లాగ్ vs ఫేస్ బుక్
బ్లాగు ల అబ్సేస్స్షన్ దాదాపు పోయినట్లే !ఒకప్పుడు బ్లాగుల్లో పడి బోల్డంత సమయం వృధా చేస్తున్ననని తెగ ఫీల్ అయ్యిన నేను మొత్తానికి బయటికి రాగలిగాను కుదిరినప్పుడు ఏదైనా తప్పనిసరిగా జ్ఞాపకంగా రాసుకోవాల్సి వచ్చినపుడు మాత్రమే బ్లాగు రాయటం జరుగుతుంది ఆసక్తిగా వున్నాబ్లాగ్స్ చదువుతున్న కాని ఇదివరకటంత ఉధృతి మాత్రం తగ్గిందిఅలా అని చెప్పి నెట్ కి ఏమైనా దూరం వున్నన అనుకుంటే వుహు అదేమీ లేదు ఈ వెలితి కాస్త ముఖ పుస్తకం పై పడింది .వీలైనపుడు కాస్త రిలాక్స్ అవ్వలనిపిస్తే పేస్ బుక్ ఓపెన్ చేస్తున్నాను దీనికి మాత్రం అడిక్ట్ కాలేదు మనస్సు మీద నియంత్రణ బానే వుంది ,నా సమయం మాత్రం వృధా కాలేదు.బ్లాగు లవలన మంచి స్నేహితులు కలిసారు ముఖ్యంగా సాహిత్యం పట్ల అభిమానం అవగాహన వున్నా వారు బ్లాగు లోకంలో తారసపడతారు మంచి రచయిత రచయిత్రుల కధనాలను చదవవచ్చుమనం నచ్చినట్లు రాసుకోవచ్చు:) అలానే తోటి బ్లాగర్లని అవకాశం వచ్చినపుడు కించ పరిచే వారు అధికంగానే వుంటారు ఆ చిన్న ప్రపంచం లో వారికీ వారే గొప్పగా ఫీల్ అవ్వుతుంటారు అజ్నతంగానో పరోక్షంగానో ప్రక్క వారిని భాధించాలని చూస్తారు ఇవన్ని చూసి చూడనట్లు పొతే తప్పించి పట్టించు కుంటే అక్కడ మనుగడ ఉండదు .కాని పేస్ బుక్ లో ఇటువంటి సందర్భాలు ఎదురవ్వవు బహుశ ఇక్కడ ఎవరెవరో తెలుసుకుని ఆడ్ చేసుకోవడమో కొంత సభ్యత కలిగే వుంటారు .ఈ రెండిటిలో ఏది బెటర్ అని ఆలోచిస్తే పేస్ బుక్ కే నా వోట్ అనుకుంటాను ..నాకు ఇప్పటికి అర్ధం కానిది బ్లాగులు అలా పిచ్చిగా ఎందుకు చదివానా అదొక బంగారు లోకం అని ఎందుకు ఫీల్ అయ్యానో !
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)