వారం కి ఒక్కసారైనా బ్లాగు లో నా ముత్యాల ముగ్గులు (కాకి పిల్ల కాకి కి ముద్దు నా రాతలు ఎంత చెత్త అయినా ) గీయాలని అనుకున్న కుదరడం లేదు . అంటే నేనేదో పెద్ద కష్టపడిపోతున్నాను అనుకుంటే తప్పులో కాలేసినట్టే ... పని లేదు పాడు లేదు పరమ లేజీ అయ్యిపోయాను . ఎప్పుడెప్పుడు సుఖంగా అంటే ప్రశాంతంగా పని చేసుకుంటాను బోల్డన్ని బుక్కులు చదివేయొచ్చు అలాగే బోల్డన్ని రాసేయొచ్చు అని కలలు కన్నాను కానీ నా ఆశలన్నీ అడియాశలు అయ్యిపోయే ...అదేదో కోతి కధలా ముళ్ళు పోయి కత్తి వచ్చే కత్తి పోయి పిల్ల వచ్చేలా వెదవ ముఖపుస్తకం మాయలో పడి కొట్టుకుపోతూ మునుగుతూ ..తేలుతూ హమ్మయ్య ఆ మాయలో నుండి తప్పించుకునే లోపు వెధవది వాట్సాప్ పట్టేసుకుంది వద్దు మొర్రో అనుకున్న వందల గ్రూపులు అక్కాచెల్లెళ్ల గ్రూప్ అనురాగాలు ... అనుబంధాలు ... కజిన్స్ ... ఫ్రెండ్స్ చిన్నారి బంధాలు ... ఉజ్జోగం బంధం .... కలెక్టర్ బంధం ,జిల్లా బంధం టెలిగ్రామ్ ఒకటి కజిన్ లా ... రోటరీ సేవ బంధం యోగా బంధం ...వాకర్స్ బంధం .. కులగౌరవాలు .... నాటక బంధం ...పాటల బంధం వాట్ నాట్ ...మనకి ఇష్టం వున్నా లేకపోయినా అందులోకి లాగేయ బడతాం .... మొహమాటం గా నచ్చితే ఉండటం నాలుగు రోజులాగి జంప్ ... కొన్ని నోరుమూసుకుని ఉండాల్సి రావడం ...మరి అప్పుడప్పుడు బిగ్ బాస్ లకి ఎస్ సార్ ...నోటెడ్ సార్ అనాలిగా ..ఎప్పటికప్పుడు మెస్సేజి చెక్ చేసుకోవాలి లేపోతే ఏమైనా మిస్ అవ్వుతాము మిస్ అయ్యి తిట్లు తినేసిన రోజులున్నాయి ....అట్లా అలవాటయిన టెలిగ్రామ్ వాట్సాప్ నేడు వ్యసనం అయ్యి కూర్చుని నా సమయం మొత్తం మింగేస్తుంది .... అక్కడికి చాలా వాటినుండి తప్పుకున్న నాకు నచ్చిన వాటినుండి తప్పుకోలేక పోతున్న ....అందుకే బ్లాగు లేకపోతున్న ....చదవలేకపోతున్న ...ఎక్కడికి పోయిన వైఫై ఉందొ లేదో చెకింగ్... అన్నట్లు బ్లాగు బంధాలు లేదనుకుంటాను :-)... అది కూడా గ్రూపు చేసేస్తేపోలా --;) ;)
9, అక్టోబర్ 2016, ఆదివారం
29, జులై 2016, శుక్రవారం
1, జూన్ 2016, బుధవారం
ప్రేమా లేక మోహమా!
రెండు రోజులయ్యింది ఈ పుస్తకం ముగించి
నవలలోని పాత్రలు వెంటాడుతున్నాయి
కథలో లీనం అయ్యిపోయి వదలకుండా అక్షరం అక్షరం కూడబలుక్కుని మరీ చదివాను (పాత్రల పేర్లు మరీ నోరు తిరగవాయే )
అప్పుడెప్పుడో ఇంటర్లో చదివాను అంత ఆలోచించే వయస్సు కూడా కాదు అన్నా కరినీనా పట్ల విపరీతమైన సానుభూతి చూపించేసాను
నాటి అరిస్ట్రోక్రటిక్ సమాజం కి చెందిన అన్నా ప్రేమ, దాని వైఫల్యం ,నాటి రష్యన్ సుప్రసిద్ద రచయిత టాల్ స్టాయ్ అద్భుతంగా చూపించారు.
దాదాపు నూట నలభ్యయి సంవత్సరాల క్రిందటి స్త్రీ వ్యవస్థలో అప్పుడు ఇప్పుడు ఒకేవిధంగా గోచరిస్తుంది
ఇవన్ని ప్రక్కనబెడితే అన్నా దీ ప్రేమ లేక మోహమా అని రెండు రోజులనుండి
ఆలోచిస్తున్నా !
మోహమో వ్యామోహమొ కాని దానికి " ప్రేమ " అని ఆత్మవంచన గా కనిపిస్తుంది
అన్నా పట్ల తెలియకుండానే గౌరవం ఆకర్షణ ఇష్టం చదువురలకు కలుగుతుంది అనడం లో యెటువంటి సందేహం లేదు
సామాన్యమైన సైనికాధికారి పట్ల వ్యామోహం తో తను అత్యంతగా ప్రేమించే నాలుగేళ్ల కుమారుడు సేర్యోజా ని భర్త ని వదిలివేసి పీటర్స్బర్గ్ నుండి ఇటలీ ప్రియుని తో కలిసి వెళ్లి పోయి తిరిగి వస్తుంది
సమాజం అన్నాని కలుపుకొదు కాని ఆమె ప్రియుడు వ్రాన్స్కి పట్ల ఎటువంటి వివక్షత చూపించదు . విడాకులకి అంగీకరిస్తే కొడుకు సేర్యోజ పూర్తిగా దూరం అవ్వుతాడని అంగీకరించదు .
నిజంగా అన్నా కి కొడుకు పట్ల ప్రేమ వుంటే పసిగుడ్డు ను వదిలి తుచ్చమైన ఆకర్షణ కి లొంగి ఇల్లు వదిలి వెళ్ళేది కాదు
తన అందం తో ఎదుట వ్యక్తిని తన దారిలోకి తీసుకుని రాగలదని ప్రగాఢమైన నమ్మకం .
అన్నా ఇక్కడ తన "అహం"ని ప్రేమించింది తన బిడ్డలను భర్తని ఆఖరికి ప్రియుడ్ని కూడా ప్రేమించలేదు కేవలం తన "అహం"కోసమే తన జీవితాన్ని బలి చేసుకుంది .
ఆమె ప్రియుడు వ్రాన్స్కి కూడా ఆమెని ప్రేమించలేదు సామాన్యమైన సైనికాధికారి అత్యంత గొప్ప సమాజం నుండి వచ్చిన అందమైన స్త్రీని ఆకర్షించడం గర్వంగా భావిస్తాడు అంతే తప్ప ప్రేమించడు.
నో నిజమైన "ప్రేమ" అటువంటి వ్యక్తి కోసం అన్నా వ్యామోహం తో కుటుంభానికి సమాజానికి దూరం అయ్యింది.
ప్రేమా

14, మే 2016, శనివారం
నిన్ను చూడక నేనుండగలనా
ఫేస్బుక్ చూడక నెలరోజులు అయ్యింది .కొన్నాళ్ళు దూరంగా ఉందామనే నెల క్రితం ఆలోచన చేసి మూసేశాను పెద్ద నష్ట పోయింది యేమిలేదు
ఖాళీగా సమయం దొరికినప్పుడు మంచి పుస్తకాలు చదువుతున్నాను చాలా చదివేశాను కూడా
ప్రస్తుతం మరోసారి వెయ్యిపడగల తో మునిగిపోయాను .
ఇంతకీ ఆలోచిస్తే ఫేస్బుక్ మన కాలాన్ని యిట్టె హరించేస్తుందని చెప్పుకోదగ్గ ఉపయోగాలు అంతగా లేవని :)

9, మే 2016, సోమవారం
చరిత్ర వినేసాను
నేను రెండో తరగతిలో చూసాను ఈ ఖిల్లా ని అప్పుడు ఇప్పుడు యే మార్పు లేదు సాయంకాలం చూపించే రంగుల మెరుపుల కథ తప్పించి ,నాన్న మా అందర్నీ తెలిసి తెలియని వయస్సులో తీసికెళ్ళి ప్రతిది వివరించి చెబుతూ సాయంత్రం వరకు త్రిప్పి చూపించారు బహుశా అదే మాకు అందరికి పునాది అనుకుంటా చరిత్ర అంటే చచ్చేంత ఇష్టం అదే నన్ను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టింది నాడు చూసిన గోల్కొండ నేడు అలాగే హుందాగా వుంది ఇన్నేళ్ళలో ఎన్నోసార్లు అనుకునే దాన్ని గోల్కొండ చూడాలని కాని అస్సలు కుదరలేదు ఇక్కడ ఉద్యోగం పుణ్యమాని బొత్తిగా భాద్యత లేమి లేకపోవడాన నా భాల్యంలోకి ఒక్కొక్కటిగా తొంగి చూస్తున్నా మొన్న సంధ్యా సమయంలో చిరు జల్లుల్లొ తడుస్తూ (ఇక్కడ రోజు వర్షం కరెంటు కష్టాలే మా విజివాడే బాగుంది ) రంగుల్లో చరిత్ర వినేసాను చూసేసాను .
22, ఫిబ్రవరి 2016, సోమవారం
ఆ పిలుపు లోయేముందంటే
''అక్కా మీకోసం అమ్మ జున్నుపాలు పంపింది '' తలుపు తీయగానే నాకన్నా డబల్ సైజు వున్నా పిల్లోడు పాల కాన్ నా చేతికంధించాడు వాడు బుచ్చిబాబు మా పెద్ద నాన్న కొడుకు పక్క ఊర్లో వుంటారు సంక్రాంతికి తప్పక నాయనమ్మ వూరు వెళ్ళే వాళ్ళం మా నానమ్మ కి ఎనిమిదిమంది అక్కయ్యలు ముగ్గురు అన్నయ్యలు అంతా చుట్టూ ప్రక్కల గ్రామాల్లో వుండేవారు బోల్డంత మంది కజిన్స్ ఎవరు పెద్దో ఎవరు చిన్నో తెలిసేది కాదు అసలు విషయానికి వస్తే ఆ బుచ్చి నాకంటే రెండేళ్ళు పెద్దోడు అయినా నన్ను అక్కా అని పిలిచేవోడు నాకు ఒళ్ళు మండేది అలా పిలుస్తుంటే వద్దు అని చెప్పలేని బలహీనత వాడి అమాయక మొహం చూస్తుంటే ....
అప్పుడే కాలేజి లోకి అడుగిడిన రోజులు .... ఏలూరులో సెయింట్ తెరిసాలో ఎల్ కేజీ టూ పిజి వరకు వుంటుంది కాంపస్ ఒక్కటే గేట్స్ వేరే వుంటాయి . లంచ్ టైం లో మా జూనియర్స్ ని పలకరించడానికి మా ఫ్రెండ్స్ అంతా కలసి వెళ్ళాము చెట్టు క్రిందా గుంపులుగా బోజనాలు చేస్తూ పిల్లలు కుర్చుని వున్నారు మనం తోచక అక్కడున్న చిన్న పిల్లను చూసి ఏమి తింటున్నావు ,మీ క్లాస్స్ ఎక్కడ అని అడుగుతుంటే ఆ పిల్లకి అన్నం పెడుతున్న తల్లి "చెప్పు ఆంటీ అడుగుతుంది కదా "అని పిల్ల తో ఒకటికి పది సార్లు అంటుంటే మేము తెల్లమొహాలు వేసుకుని నవ్వు ఆపుకుని అక్కడినుండి పారిపోయాము "ఆంటీ" అన్న పిలుపు కొత్తగా వింతగా అనిపించింది .రాను రాను ఆంటీ అలవాటయ్యింది మా అమ్మాయి పుట్టాక ఆక్సేప్ట్ చేసేసాను .కొన్ని సార్లు వింతగా మనకన్నా చాన పెద్దోళ్ళు మనల్ని ఆంటీ అంకుల్ అంటుంటే పలకాలో వద్దో అర్ధం అయ్యేది కాదు , మా పాప ఫస్ట్ క్లాస్స్ లో వుండగా మా ఇంటి పయన వుండే ఒక జంట మమ్మల్ని ఆంటి అంకుల్ అనేవారు అయన నాకంటే పెద్ద ఆమె కూడా ఇంచుమించు నా వయస్సే వాళ్ళు పిలుస్తుంటే పలికి మాట్లాడి వాళ్ళు వెళ్లాక చిందులు వేసేదాన్ని.
మా అమ్మాయి ఫిఫ్త్ క్లాస్స్ లో వుండగా మా బావ గారి అమ్మాయి పెళ్ళయింది ఆ అమ్మాయి ఇంటర్ పోయేసరికి మంచి సంభంధం అని చేసారు ఆ తరువాత రెండేళ్ళకి చిన్నమ్మమ్మ అనే పిలుపు విని ఉలిక్కిపడ్డాను వరుసబెట్టి నా ఆడపడుచుల పిల్లలికి పెళ్ళిళ్ళు ఆనక నానమ్మ అని పిలిపించడం ఒకసారి మావారి మేనకోడలి కూతురు నన్ను ఆంటీ ఆంటీ అంటూ కూడా తిరుగుతుంటే నా రెండో ఆడపడుచు వాళ్ళ అమ్మాయి కలసి ఆ పిల్ల దాన్నినోటి తో నాయనమ్మ అనిపించేదాక వదల్లేదు మా అమ్మాయి నేను నవ్వుకునే వాళ్ళం ....
ఇప్పుడేమో బుడి బుడిగా రాగాలు తీస్తూ అమ్మమ్మా మామ్ మామ్ అని వింటుంటే వీనుల విందుగా వుంటుంది నా మనవడు "అమోఘ శౌర్య " ని అడిగి మరీ అమ్మమ్మ అను అను అడిగి మరీ పిలిపించుకుంటే ఆ ఆనందమే అధ్బుతం . ఇప్పుడు నేను నిజ్జంగా అమ్మమ్మని కదా మరీ !
7, ఫిబ్రవరి 2016, ఆదివారం
ఏడేళ్ళ ప్రాయం
ఈ రోజు ఎంత టైం అయినా సరే నా బ్లాగులో నాలుగు లైన్ లు ఆయినా రాయాలనే గాట్టి సంకల్పం చేసుకుని తీరుబాటుగా ఇలా మొదలెట్టాను .యేమంత విశేషాలు రాయబోతున్నాను అనుకుంటే గొప్ప శేషమే ఈ బ్లాగు ప్రపంచంలోకి వచ్చి ఈ రోజుకి ఏడు సంవత్సరాలు నిండాయి ... గడచిన సంవత్సరాలు తరచి చూస్తే మనం పేద్దగా సాధించిందేమి లేదు (బ్లాగు ల వరకే సుమా ) ఆంధ్రులు ఆరంభ శూరులు అన్నట్లు నా బ్లాగు చూసినోళ్లకి చదివినాళ్ళకి ఇట్టే అర్ధం అవ్వుద్ది .బ్లాగు మొదలెట్టిన కొత్తలో ఎంత పనులున్న ప్రక్కన పడేసి కళ్ళు మొహం వాచేట్టు నిద్దరాపుకుని కంప్యూటర్ లో ముఖం పెట్టుకుని కూర్చునే దాన్ని కొన్నిసార్లయితే నా ఎడిక్షన్ ఎలా ఒదుల్చుకోవాల అని భాదపడిన రోజులున్నాయి http://himabinduvulu.blogspot.in/2010/01/blog-post_18.html ప్రతి సంవత్సరం గడిచేసరికి పోస్ట్లు పలుచన అయ్యాయి వీటికి వివిధ కారణాలు ...బ్లాగుల పట్ల కొంత వ్యామోహం బలవంతాన తగ్గించుకోవడం కాస్త దారి తప్పి ముఖపుస్తక వ్యామోహం లో పడటం ఇప్పుడు అదీ తగ్గిందిలేండి కొత్త ఒక వింత పాత ఒక రోత అన్న చందాన వాట్సప్ మాయ లో పడిపోయాం ఇప్పుడేమో టెలిగ్రాం ... సమాచారం సెకన్స్ లో పైగా చూడకపోతే మనం ఎన్నో మిస్ అవ్వుతాము సో ఇలా కొట్టుకుంటూ ప్రవాహం లో పడితే మన బ్లాగిల్లు మసక బారడం సహజమే కదా ! పూర్వం యెంతో బాగా రాసే బ్లాగులన్నీ కళ తప్పి వున్నాయి కొత్త బ్లాగులు మాత్రం కళ గా వున్నాయి నేను . ఇప్పుడే ఇల్లు కడిగి ముగ్గులేసి తోరణాలు కట్టి రంగులేసాను నా జ్ఞాపకాల పూలను నా అనుభవాల అల్లికలని పరికించి చూసి ఒచ్చాను యెటు తిరిగొచ్చినా నా ఇల్లు వదల కూడదని నేను సేద తీరేదిదని పుట్టిన రోజున జ్ఞానోదయం అయ్యింది :-).
21, జనవరి 2016, గురువారం
రొటీన్ కి భిన్నంగా
కొత్త సంవత్సరంలో కనీసం వారానికి ఒక టపా రాయాలని నిర్ణయం తీసుకున్నా మరునాటి నుంచే జన్మభూమి అనక సంక్రాంతి సంబరాలు తరువాత ఇంట్లో నిజమైన సంక్రాంతి పండగలు ఇక ఇప్పుడేమో పెండిగ్ పనులు నా ప్రపంచానికి దూరం అయ్యిపోతున్నాను . గత సంవత్సరం లానే ఈసారి కూడా ఆఫీసు ప్రక్కనే వున్నా పుస్తక లోకాన్ని ఒక్కసారంటే ఒక్కసారి తొంగి చూడలేకపోయాను .ఇల్లు వాకిలి పట్టక ఇంట్లో నాకోసం చూసే పిల్లల్ని పట్టించుకోక ఒక ఇరుగు పొరుగు మాట మంతి లేక ఉగాదులు ఉషస్సులు లేక ;-) నేను పాటుపడి చేసేదేమిటో నాకే అర్ధం కావడం లేదు . నన్ను నేను బంధించుకున్న ఈ చట్రం నుండి బయటికి రావాలి .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)