9, అక్టోబర్ 2016, ఆదివారం

రాయాలని ఉంది కానీ రాయలేక పోతున్నా

వారం కి ఒక్కసారైనా  బ్లాగు లో నా ముత్యాల ముగ్గులు (కాకి పిల్ల కాకి కి ముద్దు  నా రాతలు ఎంత చెత్త అయినా ) గీయాలని అనుకున్న కుదరడం లేదు . అంటే నేనేదో పెద్ద కష్టపడిపోతున్నాను అనుకుంటే తప్పులో కాలేసినట్టే ... పని లేదు పాడు లేదు పరమ లేజీ అయ్యిపోయాను . ఎప్పుడెప్పుడు సుఖంగా అంటే ప్రశాంతంగా పని చేసుకుంటాను బోల్డన్ని బుక్కులు చదివేయొచ్చు అలాగే బోల్డన్ని రాసేయొచ్చు అని కలలు కన్నాను కానీ నా ఆశలన్నీ అడియాశలు అయ్యిపోయే ...అదేదో కోతి కధలా ముళ్ళు పోయి కత్తి వచ్చే కత్తి పోయి పిల్ల వచ్చేలా వెదవ ముఖపుస్తకం మాయలో పడి కొట్టుకుపోతూ మునుగుతూ ..తేలుతూ హమ్మయ్య ఆ మాయలో నుండి తప్పించుకునే లోపు వెధవది వాట్సాప్ పట్టేసుకుంది వద్దు మొర్రో అనుకున్న వందల గ్రూపులు అక్కాచెల్లెళ్ల గ్రూప్ అనురాగాలు ...  అనుబంధాలు ... కజిన్స్  ...  ఫ్రెండ్స్ చిన్నారి బంధాలు ...  ఉజ్జోగం బంధం .... కలెక్టర్ బంధం ,జిల్లా బంధం  టెలిగ్రామ్  ఒకటి కజిన్ లా ...  రోటరీ సేవ బంధం యోగా బంధం ...వాకర్స్ బంధం ..   కులగౌరవాలు .... నాటక బంధం  ...పాటల బంధం  వాట్ నాట్ ...మనకి ఇష్టం వున్నా లేకపోయినా  అందులోకి లాగేయ బడతాం .... మొహమాటం గా నచ్చితే ఉండటం నాలుగు రోజులాగి జంప్ ... కొన్ని నోరుమూసుకుని ఉండాల్సి రావడం ...మరి అప్పుడప్పుడు  బిగ్ బాస్ లకి ఎస్ సార్ ...నోటెడ్  సార్  అనాలిగా ..ఎప్పటికప్పుడు మెస్సేజి చెక్ చేసుకోవాలి లేపోతే ఏమైనా మిస్ అవ్వుతాము మిస్ అయ్యి తిట్లు తినేసిన  రోజులున్నాయి ....అట్లా అలవాటయిన  టెలిగ్రామ్  వాట్సాప్  నేడు వ్యసనం అయ్యి కూర్చుని నా సమయం మొత్తం మింగేస్తుంది .... అక్కడికి చాలా వాటినుండి తప్పుకున్న నాకు నచ్చిన వాటినుండి తప్పుకోలేక పోతున్న ....అందుకే బ్లాగు లేకపోతున్న ....చదవలేకపోతున్న ...ఎక్కడికి పోయిన వైఫై ఉందొ లేదో చెకింగ్...    అన్నట్లు బ్లాగు బంధాలు లేదనుకుంటాను :-)... అది కూడా గ్రూపు చేసేస్తేపోలా --;) ;) 

8 కామెంట్‌లు:

Lalitha చెప్పారు...

వాట్సాప్ మాయలో పడితే ఇంక అంతా స్విచ్-ఆఫే :) తరచుగా బ్లాగ్ రాయగలిగే సమయం మీకు దొరకాలని కోరుకుంటూ...

~లలిత

Hima bindu చెప్పారు...

@ లలిత
ఏది యెక్కువైన పరిస్థితి వికటించడమే టెక్నలాజి పెరిగిన కొద్దీ మంచి ఫలితాలతో పాటు చెడు ప్రక్కనే పొంచి ఉంటుంది .మాటలు కరువు అయ్యాయి పది మంది కూడిన చోట మాటలకంటే మౌనమే రాజ్యం ఏలుతుంది ఎవరి ప్రపంచం లో వాళ్ళు బిజీగా తలలు వంచుకుని ..... ధన్యవాదాలు .

sarma చెప్పారు...

మీ టపా ఉదయమే చూసాను, కామెంట్ పెట్టలేదు. ఇదివరలో ఎప్పుడూ మీ బ్లాగ్ లో కామెంట్ పెట్టలేదనే అనుకుంటా.

నాకు ఫేస్ బుక్, లింక్డ్ ఇన్, కోరా లలో సభ్యత్వం, ఒకరైతే వాట్సప్ కి రమ్మన్నారు కూడా, ఎందుకో వెళ్ళలేదు. సభ్యత్వం ఉన్నవాటిలోకి కూడా వెళ్ళడానికి మనస్కరించదు. ఇదిగో బ్లాగ్ ను పట్టుకుని వేలాడుతున్నా! ఇది నన్నొదలదు, నేనూ దీన్నివదలలేను, అమ్మ ఎలా చెబితే అలాగే తప్పదు. అభిమానుల సంఖ్య పెరిగిపోతోంది. నిజంగా రాయడానికి మీకున్న బద్ధకంలో కొంచం నాకు పంపించెయ్యకూడదూ :)

Hima bindu చెప్పారు...

@శర్మ గారు
మీరు రాసే వాటిలో ఎంతో విజ్ఞానం ఉంటుంది అందుకనే అంతమంది అభిమానులు నేను తరుచు చూసే బ్లాగుల్లో మీది ఒకటి ..కామెంటడం బద్దకం అయిపోతుంది .అంతా బ్లాగ్స్ వదిలి పూర్తిగా ముఖ పుస్తకం లో స్థిరపడి పోయారు నేను ఈ మధ్యనే తాత్కాలిక విరామం ఇచ్చి పీకేశాను :) ఇక నెక్స్ట్ దాన్ని వదిలే సమస్య లేదు ఉద్యోగం లో ఉన్నంత వరకు ఒక పదేళ్లు తప్పదు ..
మీరు అయిదు రోజుల పెళ్లి అమ్మాయి పెళ్లి లో కామెంట్స్ రాశారు ..రాయమని ప్రోత్సహించారు కూడా -:)

sarma చెప్పారు...

అమ్మో! ములగచెట్టు ఎక్కించేస్తున్నారే :)

హిమబిందువులు అని రింగులు రింగులుగా గతంలో కెళితే పెళ్ళి దగ్గర కనపడ్డారు కదూ, అక్కడ కామెంటేను గుర్తొచ్చి ఆ టపా చూసి, నాలిక కరుచుకున్నా :)

పోన్లెండి ముఖ/మూర్ఖపుస్తకానికి శలవు ప్రకటించారా? :)

యాచనకొచ్చినవాళ్ళని ఉత్తి చేతుల్తో పంపకూడదుటండీ! కొంచం బద్ధకం దానం చేసేద్దురూ! పుణ్యం ఉంటుంది :)

Hima bindu చెప్పారు...

తథాస్తూ !నా బద్ధకం సగం ఇచ్చేస్తున్నా ..ఇకపై వారం కి ఒక టపా రాసుకుంటాను ,ముఖ పుస్తకం టెంపరరీ డి అక్టీవేటెడ్ . .. -:)

Chandrika చెప్పారు...

బావుందండీ మీ బ్లాగు. వ్రాస్తూ ఉండండి. నిజమే ఈ వాట్సాప్ తో విసుగు వస్తోంది. అవసరం మించి టెక్నాలజీ వాడుతున్నామేమో. అందుకే అలా విరక్తి కలుగుతోంది.

GARAM CHAI చెప్పారు...

what a crazy blogs i'm following your blogs please give some suggestions please subscribe and support me
my youtube channel garam chai:www.youtube.com/garamchai