10, జూన్ 2012, ఆదివారం

ఇన్నాళ్ళకి వచ్చావా

ఇన్ని అందాలను ఆనందాలను ఇన్నాళ్ళు ఎక్కడ దాచావమ్మ !ఇప్పుడిప్పుడే మా ఊరు రావనుకున్నాము చెప్పాపెట్టకుండా మొన్న రాత్రి నీవు చూపిన దయతో మా ఊరంతా మురిసిపోయి తడిసి ముద్దయి పోయింది తెల్లారేసర్కి నీ జాడలు మాత్రం వదిలి వెళ్లి పోయావే !అప్పటినుంచి ఒళ్లంతా కళ్ళు చేసుకుని నీ కోసం ఎదురు చూస్తున్నాను ఏమాత్రం అలికిడి అయిన  నువ్వోచ్చేసావు అనుకుంటు కిటికీ పరదాలు తీసి మన ఇంట వాకిట
ఆడుకుంటున్న  చిట్టి రెమ్మలని కొమ్మల్ని అడుగుతున్నాను . .
నీకు తెలుసా నీ కోసం మన ఇంట్లో ఎంతమంది ఎదురు చూస్తున్నారో !అదిగదిగో మనస్సున్న మరుమల్లి యెలా
వాడి పోయిందో నీవులేక ,వన్నెచిన్నెల విరజాజి పందిరిని చూసావా తన నేస్తం చంపకం చెప్పే కబుర్లు మీద దృష్టి నిలపక మొర ఎత్తి కరిమబ్బుల  లో నీ జాడలు వెదుకుతుంది చిట్టి చేమంతులు ముద్దు గులాబీలు మరువపు పొదలు
సైతం ఆత్రుతగా నీ చిరు సవ్వడి కోసం ఆలకిస్తున్నాయి .........
హమ్మయ్య ఇన్నాళ్ళకి మా పయి దయ కలిగిందా !చిరుగాలి తో మా ఊరు చూసి రమ్మని కబురు  పంపావా !నీకు స్వాగతం  పలకటానికి విరులన్నీ కొలువు తీరి ఉన్నాయమ్మావడిగా వచ్చి ఆనందపు జల్లుల్లో మమ్మల్ని ముంచెయ్యి !  

6, జూన్ 2012, బుధవారం

నాకెవ్వరు పోటీ

మామ్ ఒక్కసారి ప్లీజ్ పది నిమిషాల్లో ఇచ్చేస్తానుగా!
హ్మం !ఇప్పటి వరకు నీ దగ్గరే కదా ఎంత సేపు పేస్ బుక్ కాసేపు దానికి రెస్ట్ ఇవ్వు "నేను .
అబ్బ !నీవా బ్లాగ్స్ చూడటం మొదలెడితే ఇప్పట్లో ఇవ్వవు జల్లెడ అంటావు కాసేపు హారం కూడలి 
ఇవన్ని నీవు తిరిగి వచ్చేసర్కి నాకు నిద్ర ముంచుకు వస్తది ప్లీజ్ అమ్మా యిచ్చేస్తా "చిన్ని.
అయిన అంతసేపు లాప్టాప్లో వుంటే కళ్ళు స్ట్రెయిన్ అవ్వుతాయి "నేను. 
అబ్బా ఏమి కాదులే నీకు ఇష్టం అయిన పాట పెడతాను వింటూ వుండు ఈ లోపు ఇచ్చేస్తాను 
మొదలయ్యిందా గోల చిన్న పిల్లతో నీ పోటీ ఏంటి తోచకపోతే ఏదొకటి చదువుకోరాదు "శ్రీవారు .
మేము ఏదొకటి పడతాము నీకెందుకు "కసురుకుంటూ నేను ..
...మమ్మీ ఈ ఫోటో  చూడు ఈ పిచ్చుకలు ఎంత 
ముద్దుగా వున్నాయో "చిన్ని
అబ్బ ఎంత బాగున్నాయో ఎవరు పెట్టారు ఈ ఫొటోస్ "సంబరంగా నేను 
ఇప్పుడు ...................................................
నాకెవ్వరు జోడీ హ్మం !
ఇల్లంతా వెలితి !దుఖం గుండెల్లో నింపుకుని కన్నీరు దాచుకుంటున్న నాన్న 
అర్ధరాత్రిలో మెలకువ వచ్చి పక్కన తడిమితే నీవు లేవన్న పచ్చి నిజం గుండె 
పగిలిపోతుంది  గది గదిలో నీవున్నవనే ఆశ తో నీకోసం వెదుకుతున్న బుజ్జుల్ని 
చూస్తుంటే నా కళ్ళు నా మాట వినడం లేదు తల్లీ ....మా మూడు ప్రాణాలు నీకోసం తల్లడిల్లుతున్నాయి చిన్నీ !
ఇప్పుడు ఎవరు కన్నా నాతో పోటీ ?