2, నవంబర్ 2012, శుక్రవారం

బ్లాగ్ vs ఫేస్ బుక్

బ్లాగు ల అబ్సేస్స్షన్ దాదాపు పోయినట్లే !ఒకప్పుడు బ్లాగుల్లో పడి బోల్డంత సమయం వృధా చేస్తున్ననని తెగ ఫీల్ అయ్యిన  నేను మొత్తానికి బయటికి రాగలిగాను కుదిరినప్పుడు ఏదైనా తప్పనిసరిగా జ్ఞాపకంగా రాసుకోవాల్సి వచ్చినపుడు మాత్రమే బ్లాగు రాయటం జరుగుతుంది ఆసక్తిగా వున్నాబ్లాగ్స్ చదువుతున్న కాని ఇదివరకటంత ఉధృతి మాత్రం తగ్గిందిఅలా అని చెప్పి నెట్ కి ఏమైనా దూరం వున్నన అనుకుంటే వుహు అదేమీ లేదు ఈ వెలితి కాస్త ముఖ పుస్తకం పై పడింది .వీలైనపుడు కాస్త రిలాక్స్ అవ్వలనిపిస్తే పేస్ బుక్ ఓపెన్ చేస్తున్నాను దీనికి మాత్రం అడిక్ట్ కాలేదు మనస్సు మీద నియంత్రణ బానే వుంది ,నా సమయం మాత్రం వృధా కాలేదు.బ్లాగు లవలన మంచి స్నేహితులు కలిసారు ముఖ్యంగా సాహిత్యం పట్ల అభిమానం అవగాహన వున్నా వారు బ్లాగు లోకంలో తారసపడతారు మంచి రచయిత రచయిత్రుల కధనాలను చదవవచ్చుమనం నచ్చినట్లు రాసుకోవచ్చు:) అలానే తోటి బ్లాగర్లని అవకాశం వచ్చినపుడు కించ పరిచే వారు అధికంగానే వుంటారు ఆ చిన్న ప్రపంచం లో వారికీ వారే గొప్పగా ఫీల్ అవ్వుతుంటారు అజ్నతంగానో పరోక్షంగానో ప్రక్క వారిని భాధించాలని చూస్తారు ఇవన్ని చూసి చూడనట్లు పొతే తప్పించి పట్టించు కుంటే అక్కడ మనుగడ ఉండదు .కాని పేస్ బుక్ లో ఇటువంటి సందర్భాలు ఎదురవ్వవు బహుశ ఇక్కడ ఎవరెవరో తెలుసుకుని ఆడ్ చేసుకోవడమో కొంత సభ్యత కలిగే వుంటారు .ఈ రెండిటిలో ఏది బెటర్ అని ఆలోచిస్తే పేస్ బుక్ కే నా వోట్ అనుకుంటాను ..నాకు ఇప్పటికి  అర్ధం కానిది బ్లాగులు అలా పిచ్చిగా ఎందుకు చదివానా అదొక బంగారు లోకం అని ఎందుకు ఫీల్ అయ్యానో !    
       

22 కామెంట్‌లు:

Padmarpita చెప్పారు...

మీరన్నదాంట్లో నిజం ఉన్నది.....అయినప్పటికీ అన్నింటిలో మంచి చెడు ఉన్నట్లే బ్లాగ్గ్ లోను....
ఏది ఏమైనా ఇలా మీ ఓటు ఫేస్ బుక్ కి వేయడం వలన నేను మీలాంటి మంచి బ్లాగ్మిత్రుల్ని కోల్పోయిన మాట మాత్రం వాస్తవం :-(
అప్పటి ఆ ఉత్సాహం...ఆ ఉరవడి ఇప్పుడంత లేదండి. Miss U all.

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

క్రొత్తొక వింత పాతొక రోత :)
నేనూ మీ మాదిరే!

♛ ప్రిన్స్ ♛ చెప్పారు...

కొత్త ఒక వింత పాత ఒక రోత అంటే ఇదే కాబోలు... బ్లాగ్స్ లో చాల మంచి వ్యక్తులు పరిచయం అయినారు... కాని పేస్ బుక్ లో తెలిసినవారినే ఆడ్ చేసుకంటారు సో న్యూ గా మంచి వారు కలవటం చాలా తక్కువ అని నా అభిప్రాయం..

భాస్కర్ కె చెప్పారు...

ఎంత మాట అనేసారండి, కొన్ని నిజాలే అయినప్పటికీ,....ఫేస్ బుక్ కంటే బ్లాగే చాలా మేలని నా ఫీలింగ్,..ఏమో కొన్ని రోజుల తరువాత మీరు అలానే అంటారేమో,..రెండూ అనవసరమేమో....హ,.హ.హశ్రీ చెప్పారు...

బ్లాగ్ మిత్రులలోని ఆత్మీయతలు అక్కడ లేవనేది వాస్తవం...
ముఖ పుస్తకంలో ఎన్నో ముఖాలు తెలియనివే ...
ఇక్కడ తెలియని ముఖాలు కూడా తెలిసినట్లే అనిపిస్తాయి...
నేను అందులో కూడా వ్రాస్తున్నాను.
మనం వ్రాసుకొనే బ్లాగ్...మనదైన పుస్తకం.
నా భావాలు అందరి ముందు ఉంచేందుకు
వేదికనిచ్చిన బ్లాగ్ ఎప్పటికీ నేను దూరం చేసుకోను...@శ్రీ

శ్రీ చెప్పారు...

బ్లాగ్ మిత్రులలోని ఆత్మీయతలు అక్కడ లేవనేది వాస్తవం...
ముఖ పుస్తకంలో ఎన్నో ముఖాలు తెలియనివే ...
ఇక్కడ తెలియని ముఖాలు కూడా తెలిసినట్లే అనిపిస్తాయి...
నేను అందులో కూడా వ్రాస్తున్నాను.
మనం వ్రాసుకొనే బ్లాగ్...మనదైన పుస్తకం.
నా భావాలు అందరి ముందు ఉంచేందుకు
వేదికనిచ్చిన బ్లాగ్ ఎప్పటికీ నేను దూరం చేసుకోను...@శ్రీ

అజ్ఞాత చెప్పారు...

మీరే కరక్ట్ అని నేనంటా..
బాగా మంట పుట్టినప్పుడు బ్లాగ్ లో గీకి పారేసి...తిట్లు తింటుంటే...వాహ్..ఆ మజాయే వేరు...
కానీ ఫేస్ బుక్ ఇన్ స్పైరింగ్ గా ఉంటుంది...ప్రపంచాన్ని చుట్టి వచ్చి నట్టు ఉంటుంది...బ్లాగ్స్ లో ఉన్న ఉద్రిక్తత అక్కడ ఉండదు...చాలా ప్రశాంతంగా ఉంటుంది...ఇక్కడ చిరాకు రాంగానే అక్కడికి పోతా నేను...

అజ్ఞాత చెప్పారు...

మీరే కరక్ట్ అని నేనంటా..
బాగా మంట పుట్టినప్పుడు బ్లాగ్ లో గీకి పారేసి...తిట్లు తింటుంటే...వాహ్..ఆ మజాయే వేరు...
కానీ ఫేస్ బుక్ ఇన్ స్పైరింగ్ గా ఉంటుంది...ప్రపంచాన్ని చుట్టి వచ్చి నట్టు ఉంటుంది...బ్లాగ్స్ లో ఉన్న ఉద్రిక్తత అక్కడ ఉండదు...చాలా ప్రశాంతంగా ఉంటుంది...ఇక్కడ చిరాకు రాంగానే అక్కడికి పోతా నేను...

ఎందుకో ? ఏమో ! చెప్పారు...

బ్లాగు అనేది నా దృష్టి లో ఒక open dairy వంటిది, మనకి మనం తెలుసనే అనుకుంటాం, కాని మనల్ని మనం మరొకరికి పరిచయం చేసుకోవలనుకున్నప్పుడో, మన భావాలు వ్యక్త పరచాలనుకున్నప్పుడో ఒక out standing thinking pattern మనలోని మనకి తెలియని మనలను బయటకు తెస్తుంది. ఇప్పుడే ఒక బ్లాగులో శ్రీ శ్రీ గారి చేదుపాట కవితని టైటానిక్ bgm వింటూ చదివగానే awesome అనిపించింది. వెంటనే మరో బ్లాగు చూడాలని ఇచ్చ కలిగి ఇటు వచ్చాను. మీ పోస్ట్ కామెంట్ చేసేన్తలా కదిలించిందని కామెంట్ చేస్తున్నాను.

నేను బ్లాగు లోకి అడుగిడి సంవత్సరం దాటింది. గత సంవత్సరపు పోస్ట్ లను తీసి చూస్తుంటే.... మనసు మౌన పడటం గుర్తించి అచ్చేరువొందాను.

కన్నతల్లికి సొంతఊరికి మాతృభాషకి దూరమైన వారికి ఈ అంతర్జాలం మానసికంగా ఆ లోటుని కొంత భర్తీ చేస్తుందనే చెప్పాలి.

వేగమనస్కులకు ముఖ పుస్తకము,
సావధాన చిత్తులకు బ్లాగు

nice & థాంక్స్

?!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ఏమిటండీ..ఇలాంటి నిర్ణయం తీసేసుకున్నారు?

ఎంతైనా.. బ్లాగ్ కి వేరొకటి సాటి రాగలదా ?

ప్రపంచంలో ఎన్ని వికృతాలు ఉన్నాయో.. వాటిని అన్నిటిని తప్పించుకుని పోగలమా!?

నా కైతే.. బ్లాగ్ అంటే..మన మనోభావాల, అభిప్రాయాల,స్పందన ల వేదిక అనుకుంటాను.

ఎవరి గొప్ప వారిదే కదండీ! పరస్పర గౌరవం,సహృదయత ఉంటె చాలు. అనుకుంటాను నేను.

మళ్ళీ పోస్ట్ లు వ్రాస్తారని ఆశిస్తూ..

Hima bindu చెప్పారు...

@Padmarpita
బ్లాగులు ఇదివరకటి అంత గా రాయకపోయినా బ్లాగ్మిత్రుల్ని కోల్పోమేమో కదండీ !మీ బ్లాగు లుక్ వేయకుండా వెళ్ళం.మీ బొమ్మలు కవితలు ముఖ్యంగా ఎన్నెన్నో వర్ణాలు పాట వినడనికైనవచ్చి వెళ్తుంటాను :)

Hima bindu చెప్పారు...

@చిలమకూరి విజయ మోహన్
కొత్త వింత పాత రోత అనేది ఇక్కడ అస్సలు లేదు ఎందుకంటే బ్లాగులో కొట్టుకు పోయినంతగా ఫేస్బుక్ లో మునగలేదు:)

Hima bindu చెప్పారు...

@ప్రిన్స్
నాకు తెలిసినంత వరకి సాహిత్యాభిమానులు భాషాభిమానులు ఏదొకటి రాయాలనే తపన కల్గిన వారు మనస్సులో మాటలని అక్షర రూపంలో పెట్టడానికి వేదికగా బ్లాగులు ఉపయోగపడుతున్నాయి .ఫేస్బుక్ స్నేహితులని కలిపే వారధులు .నావరకి అరవయ్యి శాతం నా భంధువులే వుంటారు మా అందర్నీ కలిపి ఉంచడానికి ఫేస్బుక్ ఉపయోగకరంగా వుంది :-)

Hima bindu చెప్పారు...

@the tree
అంతేనా !బ్లాగులోకం లో మొదట్లో నా సమయం అంత వృధా చేసానండీ పని మీద ఇంటి మీద పుస్తకాల మీద ధ్యాస కూడా పోయింది ,కాని పేస్ బుక్ కి అడిక్ట్ కాలేదు :)

Hima bindu చెప్పారు...

@ శ్రీ
బ్లాగు లోకం బంగారు లోకం అని http://himabinduvulu.blogspot.in/2010/01/blog-post_18.htm ఒకప్పుడు రాసుకున్నాను చూడండీ మొత్తానికి ఆ ఉధృతి నుండి తేరుకున్నాను అని

Hima bindu చెప్పారు...

@kvsv
హమ్మయ్య మీరు ఏకీభవిస్తున్నారు :)

Hima bindu చెప్పారు...

@ఎందుకో ?ఏమో!
నిజమే ,బ్లాగ్ ఓపెన్ డైరీ .నిజానికి నేను ఈ పోస్ట్ ఎందుకు రాసానంటే బ్లాగు మొదలు పెట్టిన నాటి సంఖ్యా ఇప్పటిది తరచి చూసుకుని హమ్మయ్య అనుకున్నాను .మొదట్లో ఎప్పుడు రాయాలి అనిపించేది అన్ని చదవాలని అనిపించేది చాలావరకి తగ్గిపోయింది ".కన్నతల్లికి సొంతఊరికి మాతృభాషకి దూరమైన వారికి ఈ అంతర్జాలం మానసికంగా ఆ లోటుని కొంత భర్తీ చేస్తుందనే చెప్పాలి."

వేగమనస్కులకు ముఖ పుస్తకము,
సావధాన చిత్తులకు బ్లాగు

థాంక్యూ

Hima bindu చెప్పారు...

@వనజ వనమాలి
నిర్ణయం కాదండి ,అడిక్షన్ నుండి బయటికి వచ్చాను అని చెబుతున్నాను ,నా పరిశీలనలో మంచి చెడు రెండు ఉన్నాయనే చెబుతున్నాను .మొదట్లో తోటి బ్లాగరుల వలన కొంత ఇబ్బంది పడ్డా తరువాత పట్టించుకోవడం మానివేశాను పేస్ బుక్ లో ఇలా అజ్ఞాతంగా కించపరచడం పారడీలు రాసి వికృతానందం పొందడం ఉండదు కదా !

సుజాత వేల్పూరి చెప్పారు...

అయితే నాకు తోడున్నారు అన్న మాట బ్లాగ్మిత్రులు కొందరు! నేను కూడా ఈ మధ్య కాలక్షేపం కోసం ఫేస్బుక్ లో కాసేపు గడుపుతున్నాను. ఎక్కువ స్టేటస్ లు నేను పెట్టకపోయినా ఫ్రెండ్స్ వి చూస్తూ ఉంటాను. నియంత్రణలోనే ఉన్నాను అడిక్ట్ కాకుండా! మంచి చెడూ ఎక్కడైనా ఉంటాయి. కానీ..ఏదైనా రాయాలన్నా, అది ఒక డైరీలా షిరంగా ఒక చోట ఉండాలన్నా...బ్లాగే ఉత్తమం! మిగతా సమయమంటారా...మనిష్టం! ;-))

జలతారు వెన్నెల చెప్పారు...

బ్లాగ్ అయినా , ఫేస్ బుక్ అయినా addiction అన్నది మంచిది కాదు అని నేను తెలుసుకున్న నిజం.
సరదాకి ఎప్పుడన్నా చదువుకోవడం, అప్పుడప్పుడు నచ్చితే రాసుకోవడం తప్ప, అంతకు మించి సమయం వెచ్చించడం అనవసరం అని నా అభిప్రాయం.

Hima bindu చెప్పారు...

@సుజాత
నిజమేనండీ బ్లాగు డైరీ లానే వుంటుంది పాత పుటలు తిరగేస్తున్న అనుభూతి పాత బ్లాగ్ పోస్ట్లు చదువుతుంటే బ్లాగుల పట్ల నియంత్రణ కోసం కొంత కష్టపడాల్సి వచ్చింది :)ధన్యవాధాలు

Hima bindu చెప్పారు...

@జలతారు వెన్నెల
మీతో పూర్తిగా ఏకీభవిస్తాను ,నాకు ఇన్నాళ్ళకి జ్ఞానోదయం అయ్యింది :-)థాంక్యూ .