14, అక్టోబర్ 2012, ఆదివారం

బుజ్జులు తప్పిపోయింది .

బుజ్జులు తప్పిపోయింది .ఇంట్లో నుండి బయటికి అడుగు పెట్టదు కానీ ఎలా వెళ్లిందో మిస్టరీగా వుంది .బుజ్జులుకి పాలు పోసి కాసిని పెడిగ్రిలు వాటిలో పోసి "బుజ్జులమ్మ  బువ్వ తిందువు గాని రామ్మా "అంటూ ఎంత పిలిచినా ఉలుకు పలుకు లేదు మంచాల క్రింద  వంగి చూసి పిలిచినా జాడ కనబడలేదు ఇక శోకాలు పెట్టుకుంటూ గది గది లోను బాత్ రూం లో ఇంటి వెనుక మెట్ల క్రింద వెదికిన బుజ్జులు కనబడలేదు  మేడ పైకి పరుగులు తీసి రెండంతస్తుల ఇళ్లన్నీ గాలించాను .కాళ్ళ కి చెప్పులు కూడా లేకుండా పిచ్చిదానిలా వీధి లోని ప్రతి గడప తలుపు తట్టాను నా ఏడుపుకి కోరస్ నా చెల్లి కూతురు తోడయింది మరిది చెల్లి ఇంట్లో అద్దెకి వున్నా వాళ్ళు ఎదురు పిల్లడు ప్రక్క వీధిలో కాపురం వుండే పనమ్మాయి వాళ్ళ పిల్లలు మూడు కిలో మీటర్లు దూరం లో వున్నా మా భావగారి అబ్బాయి ,మావారు సిక్కుల కాలనీ ఫన్ టైమ్స్ భారతినగర్ బ్యాంకు కొలని బాబా గుడి రోడ్ ఆటో నగర్ స్టెల్ల వెనుక రోడ్స్ ఎనిమిదింటి నుండి పదకొండు వరకు చీకట్లో 'బుజ్జులు ' బుజ్జులు 'బంగారు తల్లి ఎక్కడ ఎక్కడమ్మా అంటూ తిరిగాము చైతన్య హాస్టల్ వాచ్ మన్లకి ,కాలనీల వాచ్ మన్లకి జాడ తెలిస్తే చెప్పమన్నాము బహుమతులు ఇస్తామని చెప్పాము ...అలిసి వరండ మెట్ల మీద కూర్చుని పొగిలి పొగిలి ఏడ్చాము ..నా కూతుర్కి నేనేమని సమాధానం చెప్పాలి పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని మాట ఇచ్చాను నుదురు కొట్టుకుంటూ ఏడుస్తున్న మావార్ని చూస్తె ఎలా సముదాయించాలో తెలియక నేను చైతు భోరుమన్నాము .....తిరిగి ఆశ చావక వెదికిన వీదులే తలొక ప్రక్క పోయాము బాబా గుడి ముందు ఆగిన నేను బుజ్జులు ఇంటికి వస్తే నిన్ను చూస్తాను లేకుంటే జన్మలో నిన్ను చూడ అనుకుంటూ వెనక్కి తిరిగిన నాకు ఫోన్ రింగ్ వచ్చింది ...ఇంటికి వచ్చేయ్  బుజ్జు వచ్చింది  అని .......కాలనీ మూడో రోడ్ లో బుజ్జు మెడ బెల్ట్ పుచ్చుకుని ఎవరో ఇద్దరు పైకి లేపుతుంటే అదేమో కుయ్ కుయ్ అని అరిసిందట అది మా వారి కంటబడి  పరుగున అక్కడ చుస్తే బుజ్జమ్మ డాడి మీదికి దూకిందట .......అల కథ సుఖాంతం ..ఇంటికి వచ్చి పండగల స్వీట్స్  పంచుకున్నాము ...బుజ్జమ్మ పాలు త్రాగి అలసి పడుకుంది ....చెప్పకుండా ఎక్కడికి వెళ్ళవే  అంటుంటే మమ్మల్ని చుసిన ఆనందం తో గంతులు వేస్తుంది ....బుజ్జులు తిరిగి రాకపోతే మా చిన్ని కి ఇద్దరం ఏం సమాధానం చెప్పేవాలమో అసలు అది తట్టుకోగలిగేద ...అసలు ఊహే భయంకరంగా వుంది ...బాబా మాపై దయ చూపాడు . http://himabinduvulu.blogspot.in/2010/11/blog-post_13.html
http://himabinduvulu.blogspot.in/2012/04/blog-post_30.html

12 కామెంట్‌లు:

ప్రేరణ... చెప్పారు...

అయ్యో అయ్యో అనుకున్నా..
ఆనందమానందమాయెగా...

Unknown చెప్పారు...

medalo oka geotag kattandi. bujjulu ekkadiki vellina meeku address telusthuntundi.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

అమ్మయ్య ! ఎలా గైతేనేం..బుజ్జులు దొరికింది..హ్యాపీ..అండీ!

జయ చెప్పారు...

అమ్మో!!!! ఒక్క క్షణం, గుండె ఆగిపోయిందండి....ఏమీ అర్ధం కాలేదు. మీ దగ్గర నేను లేక పోయినా బుజ్జులు తోటి అంత అనుబంధం నాలో పెంచారు. ఏమైనా చివరికి సంతోష వార్త చెప్పారు. ఎవరైనా ఎత్తుకెళ్ళారేమో అనుకున్నాను. నా పేరు కూడా చెప్పి దిష్టి తీసేయండి. కొన్నాళ్ళు బయటికి పోనీయకండి. బాగా భయపడిపోయి ఉంటుంది. ఒక సారి బుజ్జులు ని చూపించరూ. బుజ్జులు చెల్లి ఉందిగా. కొన్నాళ్ళు పిలిపించండి, పాపం. కాస్త ఊరట గలుగుతుంది.

శిశిర చెప్పారు...

హమ్మయ్య.. దొరికింది కదా.

అజ్ఞాత చెప్పారు...

//.నా కూతుర్కి నేనేమని సమాధానం చెప్పాలి పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని మాట ఇచ్చాను నుదురు కొట్టుకుంటూ ఏడుస్తున్న మావార్ని చూస్తె ఎలా సముదాయించాలో తెలియక నేను చైతు భోరుమన్నాము//

నమ్మలేకపోతున్నాను, అతిశయం ఏమి లేదు కదా ?
నాకు జంతువులతో అంత అనుబంధం లేదు, అందువల్ల ఇది ఆశ్చర్యంగా ఉంది. ఇంత అట్టాచ్మెంట్ ఉంటుందా ?

Hima bindu చెప్పారు...

@ప్రేరణ
ఆనందమా ఇంకేమన్నానా "ప్రాణం "లేచి వచ్చింది :).ధన్యవాదాలు .
@మధు మోహన్
థాంక్స్ ఫర్ యువర్ సజెషన్ .
@వనజ వనమాలీ
అవునండీ అంత హపీనే :)

Hima bindu చెప్పారు...


@జయ
నేను పోస్ట్ రాసేప్పుడు మిమ్మల్ని తలన్చుకున్నాను :)
మా అనుమానము ఎవరో తీసుకువెళ్ళి వుంటారనే ,నేను కిచెన్ లో తనేమో క్రికెట్ లో వున్నప్పుడు బుజ్జితల్లి వరండాలో కి వెళ్లి వుంటది చీకటి కదా తీసుకుని పోయి వుంటారు మూడు గంటలు అంతమందిమి వెదికేసరికి వదిలి వుంటారు ఇక ఎవరు రారని తరలిస్తున్నారో దేవునికే తెలియాలి !దృష్టి తీసానండి.ఫోటో పెడతాను ,ఎఫ్ .బి ఎకౌంటు వుంటే నాకు చెప్పండి ,అందులో బుజ్జు వి వున్నాయి .
@శిశిర
థాంక్యూ :)
@సన్నాయి
ఇక్కడ అతిశయోక్తి కి ఏమాత్రం ఆస్కారం లేదండీ బుజ్జు మాకు అపురూపం దాని 'ఆత్మ'తో అంత బంధం వుంది .మీరు నా బ్లాగు ఇపుడే చూస్తున్నారేమో ఇది నాఓపెన్ డైరీ.సంఘటన జరిగిన అరగంట తరువాత రాసాను ..బుజ్జు మిస్ అయ్యి తిరిగి మా కుటుంబం లోకి రావడం గొప్ప సంతోషం అది యధాతధంగా పెట్టాను .జంతువుల తోనే కాదు మాకు వస్తువుల తో కూడా చాల అనుబంధం పాత ఇల్లు అమ్మిన ,పాత కార్లు ,బళ్ళు అమ్మిన అన్నం మానేసి దిగులు పడ్డ సందర్భాలు అనేకం .....ఎందుకంటే మేము "ప్రేమ జీవులం ".వస్తువుల్ని ,మనుష్యుల్ని ,జంతువులని ,మొక్కలని ,పక్షులను అమితంగా ప్రేమిస్తాము....కాబట్టి నమ్మవచ్చు ....నమ్మకపోయినా ఫర్వాలేదు .ధన్యవాదాలు

మధురవాణి చెప్పారు...

హమ్మయ్యా.. పోన్లెండి.. ఎంత టెన్షన్ పడినా చివరికి మీ బుజ్జులు మీ ఇంటికొచ్చేసింది.. ఇప్పుడు మరింత జాగ్రత్తగా చూస్కోండి మరి.. :)

Hima bindu చెప్పారు...

@మధురవాణి
తప్పకుండా!థాంక్యూ .

రాధిక(నాని ) చెప్పారు...

సంతోషమండి దొరికింది.పెంపుడు జంతువులతో అనుబంధం అలానే ఉంటుందండి.మా టామీ అలానే రాత్రి వెళ్ళిపోయి చాలాసేపు రాలేదు.వీధి కుక్కలు ఏమన్న చెస్తాయేమో అనుకున్నాము కానీ క్షేమంగానే వచ్చేసింది. మా ఊరు చిన్నది కావడంతో ఎవరింటికన్న వెళ్ళినా వాళ్ళు ఫోన్ చేస్తారు.వెళ్ళితీసుకొస్తాము. అలా చాలా సార్లు జరుగుతుంది.

Hima bindu చెప్పారు...

@రాధిక (నాని)
మేము బయపడ్డాది కూడా అదే వీదిసింహాలు బుజ్జి దాన్ని ఏమైనా చేసేస్తాయో అని. సిటీ కి ఊరికి వున్నా తేడా అదేనండీ ఇక్కడ పక్కింట్లో ఎవరుంటారో కూడా తెలియని పరిస్థితి .ధన్యవాదాలండీ