యేం రాయమంటవే చిన్ని-ఓ నా చిన్నారి
ఎప్పుడు అమ్మ నాన్న అంటు లేదంటే అక్కచేల్లి ,తమ్ముళ్ళు గతంతోనే గచ్చకాయలు ఆడుతున్నా నంటావా
నా స్నేహితులు ,స్నేహితులంటో ఇంట్లోవున్న నెచ్చెలి మానసపుత్రిక చిన్నారి ని నిర్లక్ష్యం చేస్తున్ననంటావా
నీ గురించి రాయమంటావా ?ఏమని రాయమంటవే చిన్నారి .......
ఆరుగురి తరువాత మాతో ఆడుకోవడానికి మా ఇంటికొచ్చిన అందాల బొమ్మవని చెప్పాలా?
ఆరిందాలా అమ్మమ్మ వెంట నట్టింట తిరుగుతూ నడయాడిన బుట్టబోమ్మవని చెప్పాలా?
అమ్మ ఎప్పుడు చదువుకోవాలంటూ పుస్తకాలు తెచ్చి నా ఒడిలో పడేసిన చిన్నారి చిన్నివని చెప్పాలా ?
నిత్యం నన్నావరించిన మలయమారుతం నీవేనని చెప్పాలా ?
చిన్ని చిన్ని అడుగులతో కూచిపూడి ని ఔపోసన పట్టిన
చిన్నారి నాట్యమయూరి సుధవని చెప్పమంటావా?
కమ్మని గాత్రంతో పరిసరలను సైతం ముగ్ధుల్ని చేసే
ఈ ఇంటి కొమ్మ వనమాలినివని చెప్పమంటావా ?
అమ్మ చదివి చదివి అలసిపోతే ,పదేళ్ళకే పెద్దపెద్ద పుస్తకాలు నాన్న కు పోటీగా చదివి విన్పించిన వైనం చెప్పమంటావా
అమ్మ నాన్నకే అమ్మల కోసరికోసారితినిపించే అన్నపూర్ణవని చెప్పమంటావా ...
అమ్మ దుఖపడుతుంటే కొండంత అండ నేనున్నానని తనువెల్ల పెనవేసుకునే ఆశవాహినివని చెప్పమంటావా ..
నీ స్నేహంతో నన్ను నీ వయస్సుకు దించిన నీ గడుసుదనం గురించి చెప్పాలా
నీవు అమ్మకి చెల్లి వి అని తెలీని జనం అంటుంటే చిందులేసిన వైనం చెప్పాలా
నీ ఆటపాటలకు సైతం నాకు చోటిచ్చిన నేచ్చేలివని చెప్పాలా
నీవేమి దాచవమ్మ మనిద్దరి మద్య ,నేనేం దాచకుడద కలనయిన !
అమ్మకిచ్చిన మాట చెప్పమంటావా
అమ్మ సాధించనిది సాధించి చూపుతనంటావా
అమ్మ కల ల హరివిల్లు అమృత దర్శిని
యేం చెప్పాలే చిన్నారి ..ఈ ప్రియదర్శిని గురించి ఇంకేం చెప్పాలే .....
(మా అమ్మాయి అలిగితే మురిపించడానికి రాసాను ....) అప్పుడెప్పుడో ..
కలనయినా ఊహించలేదమ్మ భూగోళానికి నువ్వావల నేనివల ఉంటామని .... నువ్వెక్కడ వున్నా నేనెక్కడ వున్నా అమ్మ ప్రేమ దీవేనలు పున్నమి వెన్నెల లా నిరంతరము వర్షిస్తూనే ఉంటాయమ్మా చిన్ని నా చిన్నారి
కార్తిక పౌర్ణమి రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న చిన్నితల్లికి కిజన్మదిన శుభాకాంక్షలు ... ప్రేమతో అమ్మ
కలనయినా ఊహించలేదమ్మ భూగోళానికి నువ్వావల నేనివల ఉంటామని .... నువ్వెక్కడ వున్నా నేనెక్కడ వున్నా అమ్మ ప్రేమ దీవేనలు పున్నమి వెన్నెల లా నిరంతరము వర్షిస్తూనే ఉంటాయమ్మా చిన్ని నా చిన్నారి
కార్తిక పౌర్ణమి రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న చిన్నితల్లికి కిజన్మదిన శుభాకాంక్షలు ... ప్రేమతో అమ్మ
31 కామెంట్‌లు:
nice
ఎంత ప్రేముంటే ఇంత ప్రియంగా రాస్తారు ప్రియదర్శిని గురించి
@కొత్తపాళీ
@చిలుమురి విజయమోహన్
ధన్యవాదములండీ .
Wonderful!!!
@jeedipappu
@murali
thanq
మీ కొంగట్టుకు తిరిగే బంగారు తల్లి అలగకపోతే ఆ కొంగు చాటునే దాచేసేవారన్నమాట ! బావున్నాయ్ మీ చిన్నారి ముచ్చట్లు .
మీ చిన్నారి చిట్టి కబుర్లు భలే.. భలే!!
చాలా బావుందండీ..
అయినా ఇంతకీ తను ఎందుకలిగిందో?? బహుశా తన చేతిలోని ఐస్ క్రీమునో లేదా చాక్లెట్లనో మీరు లాక్కొని తినేసి ఉంటారు అని నా ఊహ..
nice chala chla bagundi andi
please watch my blog at http://mirchyvarma.blogspot.com
@పరిమళం
మా ఇద్దరికీ ఒకళ్ళమీద ఒకళ్ళం అలగడం అలవాటే .....ఈసారికి ఇలా రాసి కూల్ చేసానన్నమాట:) ధన్యవాదాలు
@సృజన
ధన్యవాదాలు
@ఉమాశంకర్
భలే కనిపెట్టేసారే ....మా ఇంట్లో మేమిద్దరం పిల్లలమే ....ఈ విషయంలో :)
@మిర్చి
ధన్యవాదాలు ,మీ బ్లాగ్ చూసాను ,బాగుంది .
chinni gaaru chaala danyavadaluu andi meeru na blog ki vahchi mee coment ichhinaduku e roju mari okati post chesanu vachhi chudandi
untanu andi
me mirchy harish varma
చిన్నీ, నాకు ద్విముఖ పోటి వచ్చారుగా, పిల్లలే లోకంగా బ్రతకటం, వాళ్ళ లీలల్ని కవితలుగ, పాటలుగా అల్లటం నాకు అలవాటు. బ్లాగులో పెట్టటానికి సమయం చాలదు, పైగా కొన్ని ఆయా సందర్భాలకి సరిపడతాయి అని వదిలేస్తాను. ల్బాగుంది మీ వ్యక్తీకరణ. ఈ రోజు ఉదయం - మాతృత్వానికి సంభందించి ఇది మూడో టపా నేను చదవటం. ప్రచారానికి అనుకోకపోతే "దశావతారాలు నీవేనైనావే? ఇదేం లీల? " http://maruvam.blogspot.com/2009/01/blog-post_31.html చూడండి నా పిల్లల లోకం నాకు అందించిన అనుభూతి అది.
చిన్నీ, ఉదయాన్నే మంచు ముత్యాలు అద్దుకున్న మరువపు లేచివుర్ల్ని ఎపుడైనా తాకారా? బహుసుందరం ఆ మొలక, మహదానందం ఆ భావన. మీ వ్యాఖ్యలు మరువానికి అటువంటివే. నేను చతురమాడానంతే, మీ శైలి చక్కగావుంటుంది. అంతమాత్రానికే నా మీద అలిగేస్తే ఎలా చిన్నీ? ;)
అన్నట్లు ప్రేమని సృజించిన నా మొదటి రచనని ఆలస్యంగా చూసానన్నారు కనుక, ఓ మాట చెబుదామని, "[ప్రేమ కావ్యం-2 శ్రీకారం ] ప్రేమని శ్వాసించే ప్రతి మనసులోదీను... " http://maruvam.blogspot.com/2009/07/2.html మీరు ఇష్టపడే ధారణొ కాదో నాకు తెలియదు కానీ తెలియపరుద్దామని ఈ వ్యాఖ్యలో ప్రస్తావించాను.
@ఉష
మీకు నేను పోటీనా ?...మీ అక్షరాలు అందమైనవి వాటిని మీ మరువపు చిగుర్లతో చక్కటి కదంబం అల్లగలరు ....
మీవి రెండు చదివాను ..ధన్యవాదాలు .
చిన్నిగారు, ఇంతకీ మీ పాప మీతో కటీఫ్ తీసి గట్టు మీద పెట్టిందా ఈ కవిత విని?
:):) బాగుంది
@భా,రా
నాది కవితా ! ఎవరైనా వింటే నవ్వుతారు ...ఏదో రాసేసాం ....మా ఇద్దరికీ మామూలే గంట కూడా వుండలేము .
@బాస్కరరామరాజు
ధన్యవాదాలండీ
మీ పాప ఎంత అదృష్టవంతురాలు కాకపోతే అమ్మ రాసిన అక్షర ముత్యాలతో తన మురిపెం తీర్చుకుంటుంది. చాలా ప్లెజెంట్ గా అనిపించింది మీ టపా చదువుతుంటే.
@శేఖర్ పెద్దగోపు
ధన్యవాదాలండీ
ఏం చెప్పాలి అంటూనే చాలా చెప్పారు చిన్నారి గురించి.
బాగుంది.
@ chaitanya .s
thanq
మీరేంటండి.. కథలు చెప్పడం మానేసి, వ్యాఖ్యలు వ్రాసుకుంటూ బ్రతుకుతున్నారు?
:) రాయాలనే మూడ్ వుండటం లేదండీ..మనస్సు ప్రశాంతంగా వున్నపుడే రాయగలుగుతాను . రాయడం కన్నా చదవటాన్ని బాగా ఎంజాయ్ చేస్తాను .
chinniii....neelo chala talent undoiii :)
బాగా రాసారు . నాకైతే మా అమ్మాయి అత్తవారింటికి వెళ్ళిన చాలా ఏళ్ళ వరకూ , ఇప్పుడూ " అమ్మ దొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగా " నే గుర్తొస్తూవుంటుంది .
@మాలాకుమార్
ధన్యవాదాలండీ
చిన్ని గారు..
చాలా బాగా రాసారండీ.........!!!!!
@సీత
సీత గారు ధన్యవాదాలండీ
అరె! నేను ఇన్నాళ్ళు చూడ కుండా మిస్ అయ్యాను.
యెంత బావుంది ..చిన్ని తల్లి ముచ్చట్లు.
అద్భుతం. అమ్మకి నెచ్చెలి.. అవడం యెంత బావుందో!
అమ్మ చేత మనసు మాటలు వెల్లడింప జేసిన "ప్రియ దర్శిని" చల్లగా వర్ధిల్లు.తల్లీ!
అమ్మ కోసం కనీసం అరగంట అయినా కేటాయించి అమ్మ బెంగ దీర్చు తల్లీ!
"చిన్ని" గారు మీ మనసు మాటని యెంత బాగా చెప్పారో! వండర్ఫుల్.
ఇక్కడ మీ పేరు చిన్ని..అది ప్రియదర్శిని ముద్దు పేరు కదా!
మిమ్మల్ని ఏమని పిలవాలి?
:)
అవునండీ ప్రియదర్శిని ని ప్రేమగా చిన్నితల్లి చిన్ని పిల్చుకుంటాం అండీ.నా పేరంటారా నా బ్లాగ్ పేరే నా అసలు పేరండీ ఎలా అయిన పిలవొచ్చు :)
నచ్చినందుకు ధన్యవాదాలండీ .
చిన్ని తల్లి ముచ్చట్లు ఎంత బాగున్నాయో , చిన్నిగారూ మీ మనస్సుని చుపెడుతున్నాయి ,
కామెంట్‌ను పోస్ట్ చేయండి