1, జూన్ 2016, బుధవారం

ప్రేమా లేక మోహమా!

రెండు రోజులయ్యింది ఈ పుస్తకం ముగించి
నవలలోని పాత్రలు వెంటాడుతున్నాయి
కథలో లీనం అయ్యిపోయి వదలకుండా అక్షరం అక్షరం కూడబలుక్కుని మరీ చదివాను (పాత్రల పేర్లు మరీ నోరు తిరగవాయే )
అప్పుడెప్పుడో ఇంటర్లో చదివాను అంత ఆలోచించే వయస్సు కూడా కాదు  అన్నా కరినీనా పట్ల విపరీతమైన సానుభూతి చూపించేసాను
నాటి అరిస్ట్రోక్రటిక్  సమాజం కి చెందిన అన్నా ప్రేమ, దాని వైఫల్యం ,నాటి రష్యన్ సుప్రసిద్ద రచయిత టాల్ స్టాయ్ అద్భుతంగా చూపించారు.
 దాదాపు నూట నలభ్యయి సంవత్సరాల క్రిందటి స్త్రీ వ్యవస్థలో అప్పుడు ఇప్పుడు ఒకేవిధంగా గోచరిస్తుంది
 ఇవన్ని ప్రక్కనబెడితే  అన్నా దీ  ప్రేమ లేక మోహమా  అని రెండు రోజులనుండి
ఆలోచిస్తున్నా !
మోహమో వ్యామోహమొ  కాని దానికి " ప్రేమ " అని  ఆత్మవంచన గా కనిపిస్తుంది
 అన్నా పట్ల తెలియకుండానే గౌరవం ఆకర్షణ ఇష్టం చదువురలకు కలుగుతుంది అనడం లో  యెటువంటి సందేహం లేదు
సామాన్యమైన సైనికాధికారి పట్ల వ్యామోహం తో  తను అత్యంతగా ప్రేమించే నాలుగేళ్ల  కుమారుడు సేర్యోజా ని  భర్త ని వదిలివేసి పీటర్స్బర్గ్  నుండి ఇటలీ ప్రియుని తో కలిసి వెళ్లి పోయి తిరిగి వస్తుంది
సమాజం అన్నాని కలుపుకొదు కాని ఆమె ప్రియుడు వ్రాన్స్కి పట్ల ఎటువంటి వివక్షత చూపించదు . విడాకులకి అంగీకరిస్తే కొడుకు సేర్యోజ పూర్తిగా దూరం అవ్వుతాడని  అంగీకరించదు .
నిజంగా అన్నా కి కొడుకు పట్ల ప్రేమ వుంటే పసిగుడ్డు ను వదిలి తుచ్చమైన ఆకర్షణ కి లొంగి ఇల్లు వదిలి వెళ్ళేది కాదు
తన అందం తో ఎదుట వ్యక్తిని తన దారిలోకి తీసుకుని రాగలదని ప్రగాఢమైన నమ్మకం .
 అన్నా ఇక్కడ తన "అహం"ని ప్రేమించింది తన బిడ్డలను భర్తని ఆఖరికి ప్రియుడ్ని కూడా ప్రేమించలేదు కేవలం తన "అహం"కోసమే తన జీవితాన్ని బలి చేసుకుంది .
 ఆమె ప్రియుడు వ్రాన్స్కి కూడా ఆమెని ప్రేమించలేదు సామాన్యమైన సైనికాధికారి అత్యంత గొప్ప సమాజం నుండి వచ్చిన అందమైన  స్త్రీని ఆకర్షించడం గర్వంగా భావిస్తాడు అంతే తప్ప ప్రేమించడు.
 నో నిజమైన "ప్రేమ"   అటువంటి వ్యక్తి కోసం  అన్నా వ్యామోహం తో కుటుంభానికి  సమాజానికి దూరం అయ్యింది.
ప్రేమా 

2 కామెంట్‌లు:

మురళి చెప్పారు...

నాకెందుకో చలం రచనల మీద ఈ నవల ప్రభావం ఉందనిపిస్తుందండీ.. చదవాలి మళ్ళీ ఓసారి..

Hima bindu చెప్పారు...

అన్నాకరీని న మరల చదివి సమీక్షించండి అస్సలైన "ప్రేమ" వుందా అనే కోణం లో .నిజమే చలం గారు తొంగి చూస్తారు