19, సెప్టెంబర్ 2010, ఆదివారం

బుజ్జులు మొరుగుతుంది

మా బుజ్జులు (మా బుజ్జి కుక్కపిల్ల)కి దొంగల్ని పట్టుకోవడం వచ్చేసింది .నాలుగు నెలల నుండి చూస్తున్న కొత్తవార్నిచూసి కనీసం తన లక్షణం చూపడానికి అయిన మొరుగుతాదేమో అని ఎదురుచూసేదాన్నిఅబ్బే వుహు అస్సలు మొరగడం అటుంచి చాన్నాళ్ళు నుండి తెలిసినట్లు వెళ్లి వల్ల దగ్గర తన అందమైన కుచ్చు జడని ఆడిస్తూ కొత్త వాళ్ళ దగ్గర సెటిల్ అయ్యేది మనల్ని ఏమాత్రం పట్టించుకోకుండా .అబ్బ ఇది కుక్క పిల్లా లేక పిల్లిపిల్లా అని తెగ విసుక్కునే దాన్ని అలా అంటుంటే మా అమ్మాయికి చాల కోపం వచ్చేది అది పిల్లి కాదు కుక్కే అని తేల్చడానికి తాపత్రయపడేది.
మొన్న రాత్రి నిద్రలో నుండి ఉలిక్కిపడి లేచాను అప్పటికే మా శ్రీవారు,పుత్రిక హాల్ లో కిటికీ నుంచి బయటికి ఎవర్తోనో మాట్లాడుతున్నారు బుజ్జులు ఆపకుండా దాని బుల్లిగొంతు తో వువ్ వువ్ అనిరెట్టించిన ఉత్షాహం తో అరుస్తోంది.పోర్టికో లో కార్ వెనుక ఇద్దరు వ్యక్తులు నిలబడి వున్నారు గేట్స్ వేసే వున్నాయి పొరపాటు న వారి ఇల్లు అనుకుని వచ్చాము అని చెబుతున్నారు,టైం చూస్తె మూడు అవుతుంది మావారి కేకలకి చెట్ల లోకి మాయం అయ్యారు రెండు నిమిషాల్లో మా ఇంటి పైన వున్నా చెల్లి వాలింట్లో కేయూ (బుజ్జులు సిస్టర్)అరవడం వినబడింది.చెల్లికి ఫోన్ చేయడం వాళ్ళు లేవటం దొంగలు గప్చుప్ అయ్యారు .మా ప్రక్క లేన్ లో ఒక ఇంట్లో లాప్ టాప్ మనీ కొన్ని వస్తువులు పట్టుకు పోయారు.మా బుజ్జులు అలికిడికి మొరగడం మా పాపకి ముందుగా మెలకువ వచ్చి బుజ్జుకి ఏమైందో ఆని గాబరాగా వెళ్లి చూడగా అదేమో తలుపు వైపు తిరిగి అరుస్తుందట ఈలోపు ఈయన లేవడం కథ సుఖాంతం అయ్యింది .దాని బుల్లి అరుపులకి మురిసిపోయి అందరం తెగ మురుసుకున్నం.ఇప్పటికయినా అర్ధం అయ్యిందా నేనేను ఎవర్నో అన్నట్లుబుజ్జులు నా వైపు లుక్ ఇచ్చింది వాళ్ళ అక్క భుజల పై తల వాల్చి .

8 కామెంట్‌లు:

శ్రీనివాస్ చెప్పారు...

నాకు తెల్సి ఒంగోల్లో రాయుడు అని ఒక రౌడీ ఉన్నాడు ఆ రౌడీ దగ్గరకి బుజ్జులుని ట్రైనింగ్ కి పంపండి.

Hima bindu చెప్పారు...

@శ్రీనివాస్
:-)

కత పవన్ చెప్పారు...

మా ఇంట్లోను చింటు గాడున్నాడు ..... వాడు రౌడి కాదు వీరో

Hima bindu చెప్పారు...

@కతపవన్
మా బుజ్జులు చాల అమాయకురాలు,వీరో లక్షణాలు కాని కనీసం రౌడి లక్షణాలు అస్సలు లేవు ..ప్చ్ :-)

అజ్ఞాత చెప్పారు...

అదేంటి మీ బుజ్జులుని బయట కట్టేస్తారా?

ఓ ఫుటో పెడితే చూసి ఆనందిస్తాం కదా..

అజ్ఞాత చెప్పారు...

అదేంటండి, క్రింద మేటర్ ఒక్క కామెంట్ ఫామ్ పక్కన తప్ప ఎక్కడా కనిపించడం లేదు..
ఇదేదో సరి చేయగలరు

మొన్న రాత్రి నిద్రలో నుండి ఉలిక్కిపడి లేచాను అప్పటికే మా శ్రీవారు,పుత్రిక హాల్ లో కిటికీ నుంచి బయటికి ఎవర్తోనో మాట్లాడుతున్నారు బుజ్జులు ఆపకుండా దాని బుల్లిగొంతు తో వువ్ వువ్ అనిరెట్టించిన ఉత్షాహం తో అరుస్తోంది.పోర్టికో లో కార్ వెనుక ఇద్దరు వ్యక్తులు నిలబడి వున్నారు గేట్స్ వేసే వున్నాయి పొరపాటు న వారి ఇల్లు అనుకుని వచ్చాము అని చెబుతున్నారు,టైం చూస్తె మూడు అవుతుంది మావారి కేకలకి చెట్ల లోకి మాయం అయ్యారు రెండు నిమిషాల్లో మా ఇంటి పైన వున్నా చెల్లి వాలింట్లో కేయూ (బుజ్జులు సిస్టర్)అరవడం వినబడింది.చెల్లికి ఫోన్ చేయడం వాళ్ళు లేవటం దొంగలు గప్చుప్ అయ్యారు .మా ప్రక్క లేన్ లో ఒక ఇంట్లో లాప్ టాప్ మనీ కొన్ని వస్తువులు పట్టుకు పోయారు.మా బుజ్జులు అలికిడికి మొరగడం మా పాపకి ముందుగా మెలకువ వచ్చి బుజ్జుకి ఏమైందో ఆని గాబరాగా వెళ్లి చూడగా అదేమో తలుపు వైపు తిరిగి అరుస్తుందట ఈలోపు ఈయన లేవడం కథ సుఖాంతం అయ్యింది .దాని బుల్లి అరుపులకి మురిసిపోయి అందరం తెగ మురుసుకున్నం.ఇప్పటికయినా అర్ధం అయ్యిందా నేనేను ఎవర్నో అన్నట్లుబుజ్జులు నా వైపు లుక్ ఇచ్చింది వాళ్ళ అక్క భుజల పై తల వాల్చి .

Hima bindu చెప్పారు...

@తార
మనకి ఈ కంప్యుటర్ నాలెడ్జి నిల్ ,నా బ్లాగ్ లోకస్టపడి తీరిక చేసుకుని రాసిన పోస్ట్లు ఎగిరిపోతున్నాయి,గిఫ్ట్ అని రాసింది సగం పోయేసరికి డిలిట్ చేసేసాను ,ఇది అలానే అయ్యింది ,విసుగొచ్చి వదిలేసాను ,బహుశా మీరు రీడర్ లో పట్టుకుని వుంటారు :-)
బుజ్జులుని బయట వదలం ,ఇక్కడ బయట అంటే హాల్ అని నెల క్రితం వరకు మా బెడ్రూం లోనే వుండేది ,దానికి ఎప్పుడు మెలకువ వస్తే అప్పుడు మమ్మల్ని లేపి బయటకి షికార్లు అంటుందని హాల్ లో అలవాటు చేస్తున్నాము .ధన్యవాదాలు :-)

Hima bindu చెప్పారు...

@తార
ఫోటో పెడతానండి