1, సెప్టెంబర్ 2010, బుధవారం

ఈ రోజు నాదే

''రేపటి సెలవు రోజు నాది కదా ''అంటూ రాబోయే ఆఫ్ ని తలచుకుంటూ ,ఆ రోజు చేయవలసిన పనులు లిస్టు చెబుతుంటే నాకు అసలు అర్ధం అయ్యేది కాదు ఇంతల సెలవురోజు కొరకు ఎదురు చూస్తారా అని .
పది ఏళ్ళు నా సమయం నా చేతి లో వుండేది నా పై కమిషనర్ భాగ్యనగరం లో వుండటం మా పై జిల్లా కలెక్టర్ కి ఎటువంటి నియంత్రణ లేకపోవడం ఒక విధంగా స్వేచ్చగా వుద్యోగం వెలిగింది.ఇప్పుడు కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు నా సమయం నా చేతిలో లేకుండా పోయింది,కదలాలి అంటే పెర్మిషన్ ,జ్వరం వచ్చిన ఇష్టం వచ్చినట్లు ఇంట్లో వుండే పనిలేదు అందరికి సెలవయిన మాకు ఉంటుందో ఉండదో అని ఆలోచన ....హమ్మో సెలవు అంటే ఎంత ప్రియమో ప్రాక్టికల్గా అర్ధం అవుతుంది ...ఈ రోజు కృష్ణాష్టమి ఈ రోజు వేరే పనేమీ ,ప్రోగ్రాం కాని లేదు ..ఈ రోజు నాదే .

10 వ్యాఖ్యలు:

భాస్కర రామి రెడ్డి చెప్పారు...

చ్చ్ చ్చ్ ..అయ్యో హెంత పని జరిగిందండి.;) ఏమైనా మీ సెలవు దినాన్ని తనివితీరా అపురూపంగా చూసుకోండి. మళ్ళీ ఎప్పుడో కానీ మీరోజు మీకు దక్కదు మరి.

రాధిక(నాని ) చెప్పారు...

మీ రోజుని మీరు పూర్తిగా ఎంజాయ్ చేయండి.

చిన్ని చెప్పారు...

@BA.ra.re
navvinanduku ilaati kshobha meru anbhavinchalani saapam istunnanu po.24gantalu dabba vadalaka panichese rojulu vastayile
@RADHIKA
THANQ.

జయ చెప్పారు...

మరింకేం, మీ బంగారం బాగా అలిగి ఉండాలే ఈ పాటికి. ఈరోజంతా హాయిగా ఆడుకోండి. మీ బంగారాన్ని చూసి చాలా రోజులయ్యింది. కొంచెం టైం చేసుకొని చూపించండి మరి. All the best. Have a nice time.

సావిరహే చెప్పారు...

ha ha ha...jagratha mari .
all the best

geetika చెప్పారు...

అయ్యో... మీ సెలవురోజు అయిపోవస్తోందండీ...! చిన్నిగారూ పని ఎప్పుడూ ఉండేదే. రేపటి గురించి ఆలోచించకుండా మనసులో బెంగేం పెట్టుకోకుండా హాయిగా నిద్రపొండి.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

ఎంజాయ్ అండి...కొద్ది రోజులు పోతే, టైంని మేనేజ్ చేసుకోవటం అలవాటై ప్రతిరోజు నాదే అని మీరే అంటారు చూడండి...అన్నట్టు బంగారం గాడిని గిచ్చి మరీ అడిగానని చెప్పండి..వాడికి నా భౌ భౌ లు..:-)

చిన్ని చెప్పారు...

@జయ
బంగారం కాస్తా "బుజ్జులు" అయ్యింది .నా చెల్లి కొడుకు మిక్కి ని నేను ముద్దుగా బంగారం అనేదాన్ని "నన్ను నీ ముద్దుల కుక్కని ఒక్కలానే పిలిస్తే నేను మాట్లాడను పో " అన్నాడు ,అందువలన బంగారం పేరును అతి కష్టం మీద బుజ్జులుగా ఫిక్స్ చేసాం .వాడి అల్లరి చెప్పలేము ,ఫోటో లు పెడతాను ముచ్చట్లు కూడా రాస్తాను ,జయ ఆంటీ అడిగింది అని చెబితే తెలిసినట్లు తల ఆడిచ్చింది.:-)
@సావిరహే
ఎందుకండి జాగ్రత్త ?బుద్ధిగా పని చుసుకోమనా!
@గీతిక
అయిపోయిందండి ,దివంగత ముఖ్యమంత్రి గారి వర్ధంతి కూడా ఘనంగా జరిపించెం ,ధన్యవాదాలు .
@శేఖర్ పెద్దగోపు
నిజమేనండీ ట్రై చేయాలి ,కొత్త కదా నెమ్మదిగా ప్లాన్ చేసుకోవాలి
అన్నట్లు బుజ్జులుగాడ్నీఘాట్టిగా గిల్లే చెబుతాను ,నన్ను కరిస్తే:-(
అధసలె వాళ్ళ నాన్న పార్టీ..దానికి అన్ని తెలుసు భలే అలిగేస్తుంది.

భావన చెప్పారు...

ఎలా ఎంజాయ్ చేసేరు మీదైన రోజును?

పరిమళం చెప్పారు...

ఈ రోజు మీదైనా ...ఏం చేశారో ఓ టపా పెట్టండి మేమూ సంతోషపడతాం కదా :)