7, ఆగస్టు 2010, శనివారం

మా బెజవాడ అందమైన నగరం
మా బెజవాడ అందమైన నగరం.సహజసిద్దంగా కొండ కొనలమద్య ఏర్పడింది.ఎంతో ప్రశాంతంగా ,ఆహ్లాదంగా సహజ సౌందర్యం తో మా నగరాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలవు.ఈ జిల్లాలో పుట్టినందుకు ఈ ఊర్లో నా చదువు సంధ్యలు జరిగినందుకు నా ఊరు ఇదే అని చెప్పుకోవడానికి గర్వపడతాను.ఉదయం సాయంత్రం రాత్రుళ్ళు అలా మేడ పయికి ఎక్కి చుట్టూ ప్రకృతిని చుస్తే ................ఈ జన్మకి ఇది చాలు అన్పిస్తుంది .


11 కామెంట్‌లు:

జయ చెప్పారు...

అవునండి. నేను చూసిన రెండు సార్లు నాకు బెజవాడ అందంగానే కనిపించింది. ముఖ్యంగా అక్కడి దీవికి పడవ ప్రయాణం, బరాజ్ నుంచి కృష్ణమ్మ ఉరకలు, , కనకదుర్గమ్మ నుంచి నగర సౌందర్యం నాకు చాలా నచ్చాయి.

అనుదీప్ చెప్పారు...

నేను విజయవాడ లో ఐదు సంవత్సరాలు చదువు కోసం ఉన్నాను. నాకు ఎంతో నచ్చే ప్లేస్. ప్రశాంతం గా ఉంటుంది. బస్సు లు కుడా ఎకువ రష్ గా ఉండవు. నేను అక్కడే ఉద్యోగం చేస్తాను అంటే అంతా నవ్వారు. ఇప్పుడంతా అంతే కదా మరి ఉద్యోగం ఆంటే పెద్ద పెద్ద సిటీ లలో మాత్రమే చెయ్యాలి. అక్కడ ఉరుకులు పరుగులు పెడుతూ చేస్తేనే చేసినట్టు కదా మరి.

వీరుభొట్ల వెంకట గణేష్ చెప్పారు...

_________________________
ఈ జిల్లాలో పుట్టినందుకు ఈ ఊర్లో నా చదువు సంధ్యలు జరిగినందుకు నా ఊరు ఇదే అని చెప్పుకోవడానికి గర్వపడతాను.
_________________________

Me too.

అజ్ఞాత చెప్పారు...

అవునండి లాంగ్ షాట్ లో బాగా అందంగా వుంటుంది. మొన్న చార్మినార్, పరిసరాలు కూడా ఎవరి బ్లాగ్ లోనో చాలా అందంగా తీశారు.

Hima bindu చెప్పారు...

@జయ
నేను పూర్తిగా ప్రతి ప్రదేశము గురించి చెప్పలేదు కాని విజయవాడ అందమైన నగరం ,ప్రతి నగరాల్లో ఉన్నట్లే మైగ్రేషన్ వలన మురికివాడలు (స్లమ్స్ )వున్నాయి కాని వాటి అభివృద్ధి కూడా జరుగుతుంది .పాత సిటీలో వసతులు కొరత కనబడిన మిగిలిన ప్రదేశాల్లో హరితవనం లా నగరం వుంటుంది .
@అనుదీప్
అవునండీ చాలా ప్రశాంతంగా వుంటుంది ,ముఖ్యంగా ఇతర ప్రదేశాలకి వెళ్లి ఇల్లు చేరినపుడు హమయ్య అనిపిస్తుంది ,ఇక్కడ ఉద్యోగావకాశాలు గొప్పగా వుండవు కాని ఇక్కడ పని చేస్తే రాష్ట్రంలో ఎక్కడైనా చేయొచ్చు ,కష్టపడతారు.ధన్యవాదాలు .
@వీరుబోట్ల వెంకట గణేష్
ధన్యవాదాలండీ
@snkr
నిజమే చార్మినార్ అందమైనది కాదు అన్నది ఎవరండీ .చూసే కళ్ళు స్పందించే హృదయం వుంటే అన్నీ అందంగానే వుంటాయి .

శరత్ కాలమ్ చెప్పారు...

విజయవాడలో కొన్ని ఏళ్ళు వున్నాను. విజయవాడ బెంజి సర్కిల్ దగ్గరలోని నాస్తిక కేంద్రానికి చాలా చిన్నప్పటి నుండీ మా నాన్న గారితో వస్తూవుండేవాడిని. ఈ నగరం అంటే నాకు ప్రత్యేకాభిమానం.

చక్రవర్తి చెప్పారు...

ఓ.. మీది కూడా విజయవాడేనా.. జజ్జినక జజ్జినక.. మనదీ విజయవాడే. నాకు బాగా నచ్చే ఊరు ఇదే.. నేను ఇక్కడే పుట్టాను అన్న ఒక్క విషయం ప్రక్కన పెడితే, చక్కగా మూడు పాయల గుండా నీరు పారుతూ అన్ని వేళలా నీరు సంవృధ్ధిగా దొరికే చోటుగా నాకు చాలా ఇష్టం. నేను ప్రస్తుతం భాగ్యనగరంలో ఉంటున్నా, మా అమ్మతో ఎప్పటికీ చెబుతుంటాను, రిటైర్ అయ్యే నాటికి విజయవాడే శరణమని. చూద్దాం అప్పటికి ఎలా ఉంటుందో, అప్పటిదాకా ఇలా విజయవాడ గురించి వ్రాసేవాళ్ళ బ్లాగు పోస్టులో విజయవాడని తలచుకుని సంతోషిస్తూ ఉంటాను. ఏమైనా విజయవాడని మరోసారి గుర్తుకు తెచ్చినందులకు నెనరులు. అమెరికాలో ఉన్న నాకు ఈ విజయవాడ తలపు ఓ ఔషదం.

Hima bindu చెప్పారు...

@శరత్ కాలం
ధన్యవాదాలండీ..ఇప్పుడు చాలా మారి ఉండొచ్చు ,పాతికేళ్ళ క్రితం మేం చుసిన బెంజి సర్కిల్ ఇప్పుడు ఎంతో మారిపోయింది.
@chakravarthy
చాలా సంతోషం అండీ ,వెల్కం టు విజయవాడ అండీ ..తప్పక మీ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాం

విశ్వ ప్రేమికుడు చెప్పారు...

నాకూ చాలా ఇష్టం విజయవాడ అంటే..
@జయ గారు : దీవా.. ఎక్కడ? మాకూ వివరాలు చెప్పండి ఎవరైనా.. మేమూ ఈ సారి వెళ్తాం..

Hima bindu చెప్పారు...

@viswapremikudu
bavani island gollapudiki velle daarilo(hyd daari )vuntundhi.andamaina pradesam .

భావన చెప్పారు...

నాకు కూడా విజయవాడ అంటే చాలా ఇష్టం. ఆ ప్లేస్ తో నాకు ఎంతో ప్రత్యేక అనుభందం వుంది. నేను చదువుకుంటానికి వున్నప్పుడూ ప్రియదర్శిని హాస్టల్ లో వుండే దానిని బెంజ్ సెంటర్ లో. ఇప్పటీకి నా మనసు ఎప్పుడూ లాగుతూనే వుంటుంది ఆ వూరి మీద. ఫొటో లు బాగున్నాయి. విజయవాడ చూపిస్తాడని కృష్ణ సినిమా కు వెళ్ళేము మేము.