2, ఏప్రిల్ 2010, శుక్రవారం

ఈ వేళలో

తొలి పొద్దువై వచ్చావు
జాబిల్లివై వెలిగావు
కాలమంతా కౌగిలింతై
కలల అలల పై కదిలించావు
నీ కన్నుల్లో కనుపాపని చేసి
కమ్మని కలలే చూపావు
ఎడబాటుతో తడబడిపోయా
ఏకాంతం లో నిన్నే తలిచా
తొలి వలపు పిలుపు విన్నా
నీలి మేఘాలలో నీకై వెదికా
కలలలుగా కదిలే నీలి మేఘాలు
సంధ్య కాంతులకి తల్లడిల్లి
నిశబ్ద నిశీధిలో నలుపెక్కాయి
మసక మసక చీకటికి
సువాసనలద్దె మల్లెలమ్మ
మనసు విప్పితమకంగానవ్వింది
(డైరీలో ఒక పేజి )
.

12 కామెంట్‌లు:

తెలుగు వెబ్ మీడియా చెప్పారు...

కవిత బాగుంది కానీ ప్రొఫైల్ ఫొటో బాలేదు. రాత్రి నిద్రపోయే ముందు తీసిన ఫొటోలా ఉంది.

కెక్యూబ్ వర్మ చెప్పారు...

లేలేత తొలిప్రేమ సుగంధాన్ని పంచారు. థాంక్స్.

Hima bindu చెప్పారు...

@చెరసాల శర్మ
థాంక్సండీ ....అక్కడ చిన్నిపాప పడిపడి చదువుతుంది,అది రాత్రిపూట తీసిన ఫోటోనే
@కేక్యూబ్
ఏదోనండి పిచ్చిరాతలు:-) వాటికి కవితలని పేరు పెట్టుకుని మురిసిపోతాను .ధన్యవాదాలు

భావన చెప్పారు...

బాగుంది, పొద్దుటనుంచి రాత్రి దాకా తోడైన ఒక తోడు గురించిన కవితా.. :-)

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

బాగుందండి కవిత..మీ చిన్ని పాప ఫోటోలో తన హెయిర్ స్టైల్ 'హేపీడేస్' లో శ్రావ్స్ లాగా భలే ఉందండి..:-)

మురళి చెప్పారు...

బాగుందండీ.. తొలిపొద్దు-చందమామ అంటే ఉదయం వేళలో మసకగా కనిపించే చందమామ అనా??

హను చెప్పారు...

good one anDi chala bagumdi

Hima bindu చెప్పారు...

@భావన
హిహి ..అది చదివేవాళ్ళ ఊహకే :-):)
@శేఖర్
మీ కాంప్లిమెంట్ తనకి చెబితే ఇప్పటికైనా నమ్ముతుందేమో ,తన కర్లీ హెయిర్ తనకి నచ్చదు..థాంక్స్ -:)
@మురళి
ఇట్ట అర్ధాలు అడిగితె యెట్లా ఏదో పాచ్ వర్క్ చేసాను :-)
@హను
థాంక్సండీ

Padmarpita చెప్పారు...

బాగుందండి కవిత..

Hima bindu చెప్పారు...

padmarpita
thanq.........

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

ఊ చిన్ని గారు చిన్నంగా కవితా గానం అందుకున్నారన్నమాట. బాగుంది. ఇంతకీ ఎప్పుడు వ్రాసారండి ఈ కవిత?

Hima bindu చెప్పారు...

ఏప్రెల్ 2 సాయంత్రం 8.28 నిమిషాలకి రాసి బ్లాగ్ లో పోస్ట్ చేసాను ..కనబడటం లేదా ?