24, మార్చి 2010, బుధవారం

కలల అలజడికి నిద్దురకరువాయి

తెలవారదేమోస్వామి
నీ తలపుల మునకలో
అలసిన దేవేరి అలిమేలు మంగకూ
తెలవారదేమో స్వామి
.
చెలువము నేలగ చెంగట లేవని
కలతకు నెలవయి నిలచిన నెలతకు
చెలువము నేలగ చెంగట లేవని
కలతకు నెలవయి నిలచిన నెలతకు
కలల అలజడికి నిద్దురకరువాయి
అలసిన దేవేరి అలమేలు మంగకూ
తెలవారదేమో స్వామి ........

మక్కువ మీరగ అక్కున జేరిచి
అంగజు కేళి ని పొంగుచు తేల్చగా .......
మక్కువ మీరగ అక్కున జేరిఛి
అంగజు కేళిని పొంగుచు తేల్చగ
ఆ మత్తునే మది మరి మరి తలచగ
అలసిన దేవేరి అలమేలు మంగకూ
తెలవారదేమో స్వామి ........

7 వ్యాఖ్యలు:

మురళి చెప్పారు...

నాకు ఇష్టమైన జేసుదాస్ పాటల్లో ఒకటి.. ముఖ్యంగా 'కలల అలజడికి నిద్దుర కరవై..' అన్న లైన్..

రాధిక(నాని ) చెప్పారు...

ఈకీర్తన నాకు చాలా ఇష్టం.

చిన్ని చెప్పారు...

@మురళి
మా పాప చదువుతుంటే తనకి జతగా కూర్చుని నిద్రని ఆపుకుంటూఇలా వింటూ పాడుకుంటూ ఇలా రాసుకుంటూ....తెలవారదేమో అనుకుంటూ :-)
@రాధిక (నాని)
నాకు ఈ పాట చాలా ఇష్టం అండీ :)

కొత్త పాళీ చెప్పారు...

ఈ పాటంటే మీకందరికీ ఇష్టమైందా?
నాకు అస్సలు ఇష్టం కాలేదు :(
దీనిమీద నేను నూరిన కారాలు మిరియాలు ఈ టపాకింది నా వ్యాఖ్యల్లో చూడచ్చు కావాలంటే
హ్త్త్ప్://ప్రదెepcr.blogspot.com/2007/05/1-2-www.html

చిన్ని చెప్పారు...

@కొత్తపాళీ
మీరు బ్లాగ్ లో ఇచ్చిన "తెలవారదేమో "మీద లింక్ రావడం లేదు .కొంచెం క్లియర్ గా ఇవ్వరూ .

కొత్త పాళీ చెప్పారు...

http://pradeepcr.blogspot.com/2007/05/1-2-www.html

చిన్ని చెప్పారు...

@కొత్తపాళీ
థాంక్స్ అండీ చూసొచ్చాను