1, మార్చి 2010, సోమవారం

ఒక లైలా కోసం

ఒక లైలా కోసం తిరిగాను దేశం
ప్రతిరోజు ప్రతిరాత్రి ప్రతిపాట ఆమె కోసం

ఆకాశానికి నిచ్చెన వేసి
చుక్కల పట్టుకు అడిగాను
లైలా యేదని...నా లైలా యేదని

తెల్లచోక్కలు నల్ల పాంట్లు ఇన్షర్ట్చేసుకుని నల్ల గ్లాసులు కళ్ళ కి తగిలించుకుని మన పాత తరం హీరోలని అనుకరిస్తూమా జునియర్ అబ్బాయిలు చేసిన డాన్స్ ....మా అందరి మనస్సులు దోచేసాయి అంటే అతిశయోక్తి కాదు .
1980 సంవత్సరం మొదలుకొని 2008-09 రియూనియన్ జరిగింది. .నిజానికి మా కాలేజి 1954 సంవత్సరంలో ప్రారంభించారు వారంతా చాల ఆక్టివ్ గా పాల్గొంటూ వుంటారు. ఎటొచ్చి 1980 తరువాత వాళ్ళే సరయిన కమ్యునికషన్ లేకుండా పోయిందని ప్రత్యెక రియూనియన్ నిర్వహించారు .
ప్రతి అయిదు సంవత్సరాల ను ఒక విభాగంగా చేసి దానికి ఒక గ్రూప్ లీడర్ ని నియమించారు . మాదే గ్రూప్ అని అడుగుతున్నారా:) మాది1988- 1990batch.
మా గ్రూప్ లో 1984-86 చెందిన రాష్ట్ర సాంకేతిక ఐ.టి.ఐ అమాత్యులు మోపిదేవి వెంకటరమణ వున్నారు .మా ముందు బాచ్ లో శాసనసభ సభ్యులు ధూళిపాళ నరేంద్ర మాజీ శాసన సభ్యులు రావి వెంకటేశ్వర రావు వున్నారు. వీరంతాచాల ఉత్సాహంగా కార్యక్రమం పూర్తయ్యేవరకు వున్నారు ..
మా క్లాసు వాళ్ళం చాల వరకు హాజరయ్యం ,సమాచారం సమయానికి అంధక రానివాళ్ళు ఎందరో .....ప్రోగ్రమం నిర్వహణ చక్కగా జరిగింది .రాబోయే రోజుల్లో చేయబోయే కార్యక్రమాలు చర్చించడం జరిగింది ,పూర్తి స్తాయిలో అల్కాని బలోపేతం చేయాలని నిర్ణయించడం జరిగింది .మా కళాశాల కురువృద్దులు (ఫాదర్స్ )సుపిరియర్ ,ప్రిన్సిపాల్ ,అల్కా ప్రెసిడెంట్ అతిధులు చక్కని సందేశాలు అందించారు .పూర్వ విద్యార్ధి మోపిదేవి రమణ , నరేంద్ర వారి అనుభవాలు పూర్వ విద్యార్ధులతో పంచుకున్నారు ,వివిధ రంగాల కి చెందిన ప్రముఖ విద్యార్ధులు ,అప్పటి మా అద్యాపకులు జ్ఞాపకాలు పంచుకున్నారు...నేను కూడా -:):).అప్పట్లో మా జునియర్ డిగ్రీ విద్యార్ధులు ,అధ్యాపకులు మమ్మల్ని గుర్తుపట్టి ఆత్మీయంగా పలకరించారు అయిదు బ్యాచ్ లు ఒకటిగా కలిపి ఫోటో సెషన్ నిర్వహించారు చక్కటి విందు కూడా ఏర్పాటు చేసారు .మనసులు విప్పి ఎన్నో ఊసులాడుకున్నాం. మేం అంటే బొత్తిగా భయం లేకుండా సినియర్ స్టూడెంట్స్ అని అయిన చూడక మాకు సైట్ కొట్టిన ఇంటర్ డిగ్రీ విద్యార్ధులను తలుచుకుని నవ్వుకున్నాం ..అక్కడ గడిపిన అయిదుగంటలు అయిదునిమిషాల్ల గడచిపోయింది...really really we enjoyed a lot .

THIS LITTLE GUIDING LIGHT OF MINE
I AM GONNA.LET IT SHINE
LET IT SHINE ALL THE TIME LET IT SHINE

TAKE MY LITTLE LIGHT ROUND THE WORLD
I AM GONNA LET IT SHINE
LET IT SHINE ALL THE TIME LET IT SHINE .............

13 వ్యాఖ్యలు:

Giridhar Pottepalem చెప్పారు...

చాలా బాగుందండి. నేనూ లయోలా కాలేజి స్తూడెంట్ నే. 1983-85 ఇంటర్ మీడియట్ చేశాను. గోగినేని హాస్టల్ లో వుండేవాడిని. తర్వాత ఎప్పుడూ కాలేజికి వెళ్ళనేలేదు.

చిన్ని చెప్పారు...

@గిరిధర్
చాల సంతోషం అండీ .మీరు కూడా మా లయోలా(మన )సభ్యులైనందుకు. మీ బాచ్ కి చెందిన పూర్వ విద్యార్ధులు అధిక సంఖ్య లోనే వచ్చారు.ఇంత గొప్పరియునియన్ గతంలో జరగలేదని అంతా అనుకున్నారు ..

జయ చెప్పారు...

చిన్ని గారు మీకు నా హృదయపూర్వక అభినందనలు.

కొత్త పాళీ చెప్పారు...

చాలా సంతోషం.
ఈ మధ్యన విజయవాడ ఒకటికి రెండు సార్లొచ్చి, కాలేజీ గేటుకి ఒక కిలోమీటరు దూరంలోనే బసచేసి కూడ ఎందుకనో కాలేజిలోకి వెళ్ళబుద్ధి కాలేదు. ప్చ్!
అవునూ, ఒక కాలేజిలో ఇంటరు మాత్రమే చదివిన వాళ్ళకి ఇది మా కాలేజి అని చెప్పుకునే అర్హత ఉందంటారా?
నేను చదువుకునే రోజుల్లో పూర్వవిద్యార్ధుల సంఘాన్ని Old Boys' Assoc. అనే వాళ్ళు. అమ్మాయిల్ని చేర్చుకోవడం మొదలెట్టాక పేరు మార్చారేమో మరి.
ఏదేమైనా ఒకందుకు ఆంధ్రలొయొలా యాజమాన్యాన్ని అభినందించాలి. సాధారణంగా కేథలిక్కులు, అందులో జెసూట్లంటే పరమఛాందసులనే భావం ఒకటుంది ప్రజల్లో. ఆ భావాన్ని త్రోసి రాజని, మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా కాలేజి రూపురేఖల్ని, పాలసీలని, విద్యా సౌకర్యాలని అభివృద్ధి చేసుకుంటూ ఎప్పటికప్పుడు నగరంలో ఉత్తమవిద్యకి స్థానంగా తీర్చి దిద్దుతూ వస్తున్నారు.

చిన్ని చెప్పారు...

@కొత్తపాళీ
చాల సంతోషం అండీ ..మీరు కూడా మన కాలేజ్ అయినందుకు .ఒక్క ఏడాది చదివిన ఆ కాలేజి పూర్వ విద్యార్ధి కాకపోతారా!.నేను ఇంటర్ మద్యలోఏలూరు నుంచి విజయవాడ వచ్చినప్పుడు మారిస్ స్టెల్లా లో సీట్ ఇవ్వకపోతే మాంటిస్సొరి లో కోటేశ్వరమ్మ గారు ఇచ్చారు .అక్కడ చదివింది కొద్ది నెలలయినా ఆవిడ నేను ఆమె స్టూడెంట్ ని అని అందరికి చెబుతారు. మీరన్నట్లు పూర్వం ఓల్డ్ బోయ్స్ అసోసియేషన్ అనేవారు. ఇప్పుడు ALC Alumni Association.అంటున్నారు .
@జయ
ధన్యవాదాలు .

మాలా కుమార్ చెప్పారు...

చిన్ని గారు ,
కంగ్రాట్స్ అండి .

పరిమళం చెప్పారు...

ప్చ్ ...నేను మీ కాలేజ్ కాదు :( అసలేకాలేజీ కాదు :) మరి కామెంట్ ఏం రాయను ? మీరు ఆపాట మధురాల్ని బాగా ఎంజాయ్ చేసినందుకు అభినందనలు :)

పవన్ చెప్పారు...

ఇప్పుడు నేను కాలేజి స్టుడేంట్ నే కాని మీ కాలేజ్ కాదు మా కాలేజ్ పేరు పద్మవతి డిగ్రీ కాలేజ్....2007-2010 బ్యాచ్

రాజేంద్ర కుమార్ దేవరపల్లి చెప్పారు...

యేమిటీ లయోలా లో అమ్మాయిలను చేర్చుకుంటున్నారా? ఎప్పటి నుంచి?

భాస్కర రామి రెడ్డి చెప్పారు...

ప్చ్..మీ కాలేజికి నాకు చదువుచెప్పే అదృష్టం దక్కలేదు :)

మురళి చెప్పారు...

బాగున్నాయండీ మీ కాలేజీ కబుర్లు..

చిన్ని చెప్పారు...

@పరిమళం
అదో ప్రపంచం -:) థాంక్సండి
@పవన్
అలానా .
@భా.రా.రె
ఇప్పటికైనా మించిపోలేదు చేరిపోండి...మరి డాలర్లు వుండవు -:(
@మురళి
థాంక్యూ

చిన్ని చెప్పారు...

@మాలా కుమార్
ధన్యవాదాలండీ
@రాజేంద్రకుమార్ దేవరపల్లి
అవును1988నుంచి అండీ