ఆవేదన లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆవేదన లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, మార్చి 2012, శుక్రవారం

గూడు చిన్నబోయింది

రెక్కలొచ్చిన చిట్టితల్లి గూటిని తను చుట్టూ అల్లుకున్న మమకారాలను కష్టం మీద చేదించి జంట గువ్వ తో ఎగిరిపోయింది .....గూడు వెలవెలబోయింది .

18, అక్టోబర్ 2010, సోమవారం

అమ్మ కి జేజేలు

ఒక్కో యాడాది గడిచే కొద్ది దిగులుగా వుంటుంది ..మరల వచ్చే యేడు ఇలానే "అమ్మ " మా అందరి సమక్షం లో తన పుట్టినరోజు జరుపుకోవాలని చాలా ఆశ .నాకు ఊహ వచ్చినప్పటినుండి చూస్తూనే వున్నాను అమ్మ పిల్లలందరికీ ఘనంగా పుట్టినరోజు పండుగ చేయడమే కాకుండా తనది కూడా శ్రద్దగా జరిపేది (నాన్న జరిపించేవారు )ప్రతినెల మా ఇంట్లో ఎవరిదోకరిది పుట్టినరోజు వుంటుంది ,మామూలు పండగకంటే వీటికే మాఇంట్లో ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది .ఈ భూమి మీద సంతోషముగా ఇన్ని సంవత్సరాలు ఆత్మీయులందరి తో కలసి జీవించడం అదృష్టంగానే భావిస్తుంటాం ..ఇలాటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో రావాలని కోరుకుంటాం .

అమ్మ అరవయ్యిలో వుంది ,ఇంతమందిని పెంచిన ,తనకి ఎంత అనారోగ్యం వున్నా ముఖంలో లేశమాత్రం విసుగు చూపక నవ్వుతు కళకళ లాడుతుంది "అమ్మ" .అమ్మ ముఖం లో వార్ధాఖ్యం చాయలు తొంగి చూస్తున్నాయి ఇప్పుడిప్పుడే ముంగురులు వెండి తీగల్ల మార్పు చెందుతున్నాయి .తన ఆరోగ్యంలో చాల తేడా వచ్చింది .అమ్మ లో ఈ మార్పులు చూస్తున్నప్పుడల్లా మనస్సంతా భాద తో నిండిపోతుంది .

ఈ రోజు పూర్తిగా అమ్మ తో చెల్లి వాళ్ళందరితో పాటు గడపాలనుకున్న కాని నాకున్న భాద్యతలతో అవకాశం లేకపోయింది..చిరు జల్లుల్లో మసక చీకట్లో అందరికంటే ముందే నేనే అభినందనలు చెప్పివచ్చాను ....అమ్మకి ఎప్పుడు ఇచ్చే గులాభి గుత్తులు మాత్రం ఇవ్వలేకపోయాను ....

.సాయంత్రం .....

మనుమరాళ్ళ సమక్షంలో పిల్లలంతా హ్యాపీ బర్త్ డే పాడుతుండగా అమ్మ మా అందరి నోళ్ళు తీపి చేసింది .

కనిపించని ఆ దేవుడ్ని వేడుకుంటున్న "అమ్మ ఆరోగ్యం తో తన మనవల పెళ్ళిళ్ళు కూడా తన చేతుల మీద జరిపించాలని ,ఆ నివాసం (నా పుట్టిల్లు )ఎప్పటికి కళ కళ లాడాలని ...................

"అమ్మ రియల్లీ యూ ఆర్ గ్రేట్ "

9, అక్టోబర్ 2009, శుక్రవారం

క్రిటికల్ కేర్ లో 'బాపుబొమ్మ'

సాయంత్రం ఆఫీసు నుండి తిన్నగా ఇంటికి వెళ్ళకుండా సిటీలో వున్నా మల్టీ స్పెషాలిటి హాస్పిటల్ కి వెళ్లాను ..ఐ.సి .యు విసిటింగ్ హౌర్స్ సాయంత్రం రెండు గంటలు మాత్రమె కావడం వలన ఒకింత ఉద్విగ్నత తో రూం దగ్గరకి చేరి నా చేతిలోని హ్యాండ్ బాగ్ అక్కడే కూర్చ్చున్న మా కజిన్ ఒడిలో విసిరినంత పనిచేసి తలుపు తోసుకుంటూ రూం లోకి వెళ్లాను.నా కళ్ళు మూలనున్న బెడ్ వైపు వెళ్ళాయి...ఒక్కసారే దిగులు కళ్ళు మసకబారిపోయాయి .....క్రిటికల్ కేర్ బెడ్ మీద ''బాపు బొమ్మ ''...అటు ఇటు నర్సేస్ బ్రతిమాలుతూ పాలు తాగిస్తూమద్య మద్యలో ఆమె తల అడ్డంగా తిప్పుతూ ....నేను తనని సమీపించగానే నన్ను చూసి కనుబొమలు ఎగరవెస్తు నవ్వింది ఆ హాస్పిటల్ రూల్స్ ప్రకారం రెండుజడలు వాళ్ళ యునిఫారం షర్ట్ వేసుకున్న తనని చూస్తుంటే పోలిక లేకపోయినా 'వసంతకోకిల''సినిమాలో శ్రీదేవి గుర్తొచ్చింది .నన్ను గుర్తుపట్టలేదు ..అర్ధం అయ్యింది ...ఎప్పుడో వుండుండి మన లోకం లోకి వస్తుంది..అప్పుడు నన్ను అడుగుతుంది అలానే మాట్లాడిస్తూ వుండగా హటాత్తుగా మన లోకం లోకి వచ్చి నన్ను గుర్తుపట్టి కన్నీరు .....తనకి జ్వరం రావడం తల నొప్పి రావడం చెబుతుండగానే మరల వేరే ధ్యాసలో చిన్న పిల్ల లా గోల ....మూడు రోజుల్లో ఎలా వుండే మనిషి ఎలా అయ్యిందో తలుచుకుంటే గుండె చెరువు అయ్యింది .రంగు మారి,పాలిపోయిన పెదవులు నిర్లిప్తంగా ఎటో చూస్తున్న కళ్ళు చిక్కిపోయిన చెంపలు ....యంత మార్పూ ....ఈమేనా ''బాపుబొమ్మ''....
కళ్ళు తుడుచుకుంటూ బయటకి వచ్చి కొంచెం ఎడంగా వున్నా బాల్కనీ లో కూర్చున్న వచ్చేపోయే వారిని చూస్తూ ...ఒక్కసారే నా మనసు గతం లోకి పరిగెట్టింది... ఆమెను మొట్ట మొదటిసారి నేను ఆరవ తరగతి చదువుతుండగా చూసాను .స్కూల్ నుండి వచ్చేసరికి మా ఇంటి బయటి చక్కబల్ల ఊయ్యాలలో ఒడిలో నెలల బాబుతో అపరిచితురాలు ,కళ్ళు చెదిరే అందం ...మెరిసిపోతూ బాపుబొమ్మ (ఈ పేరు అక్క పెట్టింది ) ఊయల నుండి నేలను తాకుతున్న పెద్ద జడ ....పోటి పడుతూ ఆమె పమిట చెంగు ....అలా కళ్ళార్పకుండా చూస్తున్న మమ్మల్ని ఆవిడకు పరిచయం చేసింది మా అమ్మ .ఆవిడ నవ్వుతుంటే మరింత అందంగా వుంది ...కాసేపట్లో ఆవిడతో కలసిపోయము .ఆమె అమ్మమ్మ చెల్లి కోడలాట.. మా అమ్మకి తమ్ముడు వరుస అవ్వుతాడు ..అతను కొవ్వూరు క్యాంపు కి వస్తు ఆమెను కూడా తీసుకు వచ్చాడట .మాకు చుట్టాలు అప్పటివరకు సరిగ్గా తెలియదు..వున్నా రెండురోజులు సరదాగా గడిచిపోయింది..ముఖ్యంగా అక్కా నేను ఆమె అందాన్ని తెగ అడ్మిరే చేసేవాళ్ళం .
తరువాత మేము కాలేజికి వచ్చాక నాన్నగారు పనిచేసే ఊర్లోనే అమ్మ వాళ్ళ కజిన్ వాళ్ళుకూడా ట్రన్స్ఫెర్మీద రావడం ఆమె తన పిల్లల్ని తీసుకు రావడం మేము వెళ్ళడం జరిగిందీ ..ఆమెలో అందం ఏ మాత్రం తగ్గలేదు సరికదా అప్పటికంటే ఇంకా అందంగా వుండినది .ఏ చీర కట్టిన బొమ్మలా వుండేది .
నా నిశ్చితార్ధం రోజు ఆమెదే మా అత్తగారి తరుపు హడావిడి ....ఎందుకంటే ఆమె ఆ ఇంటి పెద్దకోడలు కాబట్టి ...నేను ఆ ఇంటి చిన్న కోడలిని ...ఆ బాపు బొమ్మ నా తోటికోడలు.ఇప్పటికి ఏభయ్యేళ్ళ వయస్సంటే ఎవ్వరు నమ్మరు నలభయ్యిలో అడుగు పెట్టినట్లున్టది....అమృతం తాగుతున్నావా అని అడుగుతుంటాను...అన్నిటికి నవ్వే తన సమాధానం ......
మూడు రోజులక్రితం హటాత్తుగా తలనొప్పి తీవ్ర జ్వరం తో పడిపోయి ఒక రోజంతా కోమాలో వుండి...మృత్యు ముఖం నుంచి బయటపడింది బ్రెయిన్ ఫివేర్ ..ఒక కిడ్నీ ఫెయిల్ అయ్యి బ్రెయిన్ కి ఇన్ఫెక్షన్ వచ్చి ఇలా ..మనలోకం లోకి వచ్చి తన లోకం లోకి వెళ్ళిపోతుంది ..మెలుకువ వస్తే అందరికోసం చూస్తుంది అదీ నిమిషాలే ....కోలుకుని మాలోకి రావాలని అందరం ఎదురుచూస్తున్నాం ...ఆ పిల్లలు మరీ తల్లడిల్లుతున్నారు .....ఆ పైవాడు ఏం చేస్తాడో చూడాలి ....

30, సెప్టెంబర్ 2009, బుధవారం

ప్రతి దినం నీ దర్శనం దొరకునా ........

ప్రతిదినం నీ దర్శనంమరి దొరకునా..దొరకునా..... .
నిను చూడని రోజు నాకు రోజు కాదు......
తప్పదని తెలుసు అయిన నా మనస్సునా మాట వినదే ....అయ్యో దీనికి జత నా కళ్ళు కూడా తోడయ్యాయే ..
...హమ్మయ్య నక్షత్రాలను కమ్మేసి కారుమబ్బులు ఆత్మభందువుల్లా చల్లగా కమ్ముకున్నాయి ......
నా కోసం కరుణించి చిందించిన జల్లులు నన్ను ,నా మనస్సులోతడిని కడిగేసినా మసకబారిన కళ్ళతో నవ్వుతు నే చెప్పిన వీడ్కోలు .... కొండంత ధైర్యం తో అమ్మ కలలకోసం లక్ష్యం వైపు నీ గమనం .................
ఆ రోజు కోసం నేను ..............వేచివుండలేనా ?

3, సెప్టెంబర్ 2009, గురువారం

"రాలిన మణి పూస"

మా కాలేజి పూర్వ విద్యార్ధి సంఘమనే ముత్యాల హారం నుండి ఒక 'మణిపూస'జారిపోయింది......ఎక్కడ పడిందోననిఇరవయ్యి నాలుగు గంటలు గాలించగా .....దొరికింది .......ఎక్కడో తెలుసా గగనం లో చమక్కున మెరిసేటి ఓ 'తార 'గా...........మీరు చూస్తారా .......ఎంత వెలుగులు చిమ్ముతూ ప్రకాశిస్తుందో ......రాజసం తో దర్పంగా ......
నిన్ను మరువగలమా......! .

అశ్రునివాళి

ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ,స్పెషల్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం ,సెక్యూరిటీ ఆఫీసర్ వెస్లీ ఇద్దరి పైలేటేస్ లకు ఆత్మశాంతి కలగాలని ,కుటుంబ సభ్యులంతా త్వరలో కోలుకోవాలని కోరుకుంటూ .....

23, ఆగస్టు 2009, ఆదివారం

ఎదురుచూపులు

ఎదురు చూసినంత సేపు పట్టలేదు నీ నిష్క్రమణం .మరల అవే చూపులు ...అవే తలపులు మన పునస్సమగం కోసం .
నా నుంచి నీవు ఎప్పటికి వేరుకావని ఒకప్పుడు బ్రమపడ్డాను...మన యెడబాటుతాత్కాలికం అనుకున్నా ...కాని అదే మన ఇద్దరి మద్య దూరానికి నాంది అని తెలుసుకున్నా...
మొదటిసారి నన్ను వీడివెళ్ళినప్పుడు నీ బేల చూపులు నా మనో ఫలకం ముద్రితమై అనుక్షణం తడిమి తడిమి చూసుకుంటుంది నా చిన్ని హృదయం ...ఇప్పుడు అవే ...ఆ అందమయిన కళ్ళలో యెన్నిమూగ భావాలో ....బంగారం ...యేమి చెప్పాలనుకున్నావురా ?...నను వదిలి వెళ్ళడం భాధగా వుందనా?....నేను వుండలేక పోతున్నాను అనా!అంత పాషాణంలా తయారయ్యేనాని కినుకా ! నీ చూపుకు అర్ధం యేమని వెదుక్కొనురా కన్నా ...?పెదవి ధాటి పలుకలేని నీ మౌనం నా మదిని ఎప్పుడో తట్టిలేపిందిరా చిన్నా ...నీకు తెలుసు ..........
,నిన్ను తలచినంతనే నేనొక పులుగై నిన్ను వీక్షించగాలనని .
నిన్ను గాంచినంతనే నా మనస్సోక నాట్య మయురమవునని
నిను తాకినంతనే నా తనువెల్ల కడలి తరంగమని
నీ యెడబాటు నా మనస్సుకు తడబాటేనని............అయిన నా మనస్సు తలుపులు మూసివేసి మన కలయిక కోసం ఎదురుచూస్తుంటాను ....ప్రియా
.!

1, మే 2009, శుక్రవారం

విన్నపం

మూడు రోజులనుండి ఒకటే ఎదురుచూపులు .....నిద్రపోయేముందు అదే ఆలోచన మెలుకవ రాగానే అదే ....గబగబా నిద్ర కళ్ళతోనే ఏమైనా దానికి సంబంధించి వార్త వుంటాదేమోననిసాయంత్రం వరకు అదే నిరీక్షణ ....అనుకున్నా ఈరోజు రానే వచ్చింది ..కాని ఇదెలా జరిగిందీ ?ఎవరిని అడగాలి ...నాది బహుశా అతి ధీమానో ....మనకి రాక ఇంకేవరికనో ....ప్రశాంతంగా ప్రవహిస్తున్న "ప్రవాహాన్ని "డిస్టర్బ్ చేశానా .....నేనే కదా కారణం ....ఏంచేయాలి ?ఎలా చేయాలి ......జరిగిందంతా కల అయితే ఎంత బాగుండును ....ఇప్పటికి మద్యాహ్నం నుండి ఎన్నోసార్లు ...లేక్కలేనన్నిసార్లు ....కాని ఇది నిజంగానే "నిజం"....
భగవంతుడా ....కనీసం వారికి నూతనోత్తెజన్నయిన ఇవ్వగలవా ....తిరిగి లేచి పోరాడగల శక్తిని ప్రసాధించగలవా .... "గెలిచేవరకు"...నిజ్జంగా నిజం ...ఇంక నిన్నేమి అడగను ...ప్లీజ్.