ప్రతిదినం నీ దర్శనంమరి దొరకునా..దొరకునా..... .
నిను చూడని రోజు నాకు రోజు కాదు......
తప్పదని తెలుసు అయిన నా మనస్సునా మాట వినదే ....అయ్యో దీనికి జత నా కళ్ళు కూడా తోడయ్యాయే ..
...హమ్మయ్య నక్షత్రాలను కమ్మేసి కారుమబ్బులు ఆత్మభందువుల్లా చల్లగా కమ్ముకున్నాయి ......
నా కోసం కరుణించి చిందించిన జల్లులు నన్ను ,నా మనస్సులోతడిని కడిగేసినా మసకబారిన కళ్ళతో నవ్వుతు నే చెప్పిన వీడ్కోలు .... కొండంత ధైర్యం తో అమ్మ కలలకోసం లక్ష్యం వైపు నీ గమనం .................
ఆ రోజు కోసం నేను ..............వేచివుండలేనా ?
12 కామెంట్‌లు:
మసక బారిన కళ్ళవెనుక మమత ఎప్పటికి వృధా పోదు..
అమ్మ కలలు కోరే లక్ష్యం సాధించే తీరం గమనం లో తప్పక వుంటుంది..
వేచిచూడటం భారమైనా ఫలమెప్పుడు తియ్యనే..
all the best chinni garu.
ఉండగలరు.. ఉండాలి...
@భావన
అదే ''ఆశ ''మనసుని పాషాణంచేసుకుని భవిష్యత్తు వైపు నా చూపు -:( థన్క్యు.
@మురళి
వున్నాను .
జీవితంలో చాలా భాగం ఎదురుచూపులే! కన్నీరు నిండిన కనులను తప్పని సరిగ కమ్మని కలలు తుడుస్తాయి.
వుండగలము, వుండగలమాని ఎప్పటికీ ప్రశించుకుంటూనే వుండగలము. వేచీవుండగలము. వేచివున్నానని తెలిసినా చూపుని మసకబార్చే తడినీ ఆపకుండా వుండలేము. అమ్మతనంలోని మమత, మమకారం అంతే. got to go to find my tissue box
you will be :))
No comments.
@జయ
@ఉష
ధన్యవాదాలు నా ఆవేదన పంచుకున్నందుకు .
@పవన్
మీ నవ్వు నాకు అర్ధం కాలేదు ..మేక్ఇట్ క్లియర్
@భా.రా.రే
నేనొప్పుకోను నో కామెంట్ అంటే ..హమ్మ యెంత'ధైర్యం 'నా బ్లాగ్ లోకి వచ్చి చదివి వురకనే వెళ్ళిపోతారా..-:)
చిన్నీ మళ్ళీ నోకామెంట్స్ :)
ఇంతకు ముందొకసారి, ఇలాంటి సందర్భానికే వ్యాఖ్య వ్రాసిన గుర్తు :)
చివరి నాలుగు లైన్లు అద్భుతంగా ఉన్నాయండీ...బయట ఎక్కడో చదువుకుంటున్న పిల్లలందరి ఇళ్ళల్లో అమ్మ మనసు ఇలానే పరితపిస్తుందేమో!!
ఒక చిన్న సూచన...మీరు మీ కామెంట్ బాక్స్ ని వేరే పేజీలో ఒపెన్ అయ్యేటట్టు సెట్టింగ్స్ మార్చుకోరూ!!! చాలా సార్లు ఇబ్బంది వస్తుంది కామెంట్ ని పంపించడానికి....మఖ్యంగా 'మంటనక్క' బ్రౌజర్లో...:)
@sekhar
ok..try chestanu taruvata
@sekhar
mee abyrdhana memu manninchitimi chudandi-:)
కామెంట్‌ను పోస్ట్ చేయండి