5, సెప్టెంబర్ 2009, శనివారం

అహం

మీరు నిరంతరం ఇతరులను తక్కువ చేయడం ద్వారా
మిమ్మల్ని మీరు అధికులుగా అనుకుంటూ ఉంటారు .
ఇదే అహంకారానికి మూల కారణం .
ఆత్మా గౌరవంలో పోలిక ఉండదు
ఆత్మా గౌరవంతో నీవు ఇతరుల గురించి ప్రస్తావించవు
అది కేవలం నాకు నేను గౌరవనీయున్ని ,నన్ను నేను
ప్రేమిస్తాను ,నేను ఇలా వున్నందుకే గర్వంగా ఉంటాను .
ఈ అందమైన సృష్టిలో వుండటమే నాకు గర్వకారణం,
అని చెప్తావు ...నీవు పోల్చడం ఎప్పుడైతే మొదలు పెడతావో ,
అపుడే అది అసహ్యకరమైన ఆటగా మొదలవుతుంది .

పైన రాసిన వాక్యాలు చాల ఇష్టమైనవి ...ప్రాక్టీసు చేయడానికి ప్రయత్నిస్తున్న .....(..ఓషో రచనలనుంచి తీసుకున్నవి ).

18 వ్యాఖ్యలు:

srujana చెప్పారు...

మంచి మాటలు....ఆచరించడానికి కాస్త కష్టం!

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

>>>...నీవు పోల్చడం ఎప్పుడైతే మొదలు పెడతావో ,
అపుడే అది అసహ్యకరమైన ఆటగా మొదలవుతుంది.
మంచి వాక్యం.

మురళి చెప్పారు...

మా ఫ్రెండ్ ఆఫీస్ కి వెళ్ళగానే పెద్ద అక్షరాలతో కనిపిస్తాయి ఈ వాక్యాలు.. వెళ్ళిన ప్రతిసారీ చదువుతాను.. మీరు మళ్ళీ గుర్తు చేశారు...

'Padmarpita' చెప్పారు...

మంచి వాక్యాలు..ఆచరించడానికి కష్టమే అయినా....ప్రయత్నిస్తే ఫలితముంటుంది!

చిన్ని చెప్పారు...

@సృజన
@పద్మర్పిత
కొంచెం ప్రయత్నిస్తే అదేమంత కష్టం కాదేమోనండి...చాల కాలం నుండి ట్రై చేస్తున్నాను ...కొంచెం పర్వాలేదు అనుకుంటున్నాను .
@శేఖర్
ధన్యవాదాలు
@మురళి .
-:)-:)

పరిమళం చెప్పారు...

మంచి మాటలు!రోజూ ఒక్కసారైనా చదువుతుంటే బావుంటుంది

చిన్ని చెప్పారు...

@పరిమళం
కొందరైనా పట్టించుకుని ఆలోచిస్తారనే ఆశ .:)

కొత్త పాళీ చెప్పారు...

నిజమే. నిజంగా ఆత్మగౌరవం కలవ్యక్తి ఇతరుల్లో కూడా ఆ ఆత్మని చూస్తాడు, గౌరవిస్తాడు.

పునర్వసు చెప్పారు...

అందరూ ఆచరించవలసిన గొప్ప విషయాన్నీ తెలియజేసినందుకు కృతజ్ఞతలు.
కొత్తపాళీ గారి వ్యాఖ్యానం మరింత బాగా ఉంది.
ఆచరించడం విషయానికొస్తే, మనం మాట్లాడడం తగ్గించి ఎదుటి వారు చెప్పేది వింటుంటే, మెల్లగా మన అహం తగ్గుతుంది. ఎదుటివారిని గౌరవించడం పెరుగుతుంది.

చిన్ని చెప్పారు...

@కొత్తపాళి
మీరు చెప్పినది నిజమే .
@పునర్వసు
కొత్త విషయం వింటున్నాను ..వినడం వలన మనకి విషయం పట్ల అవగాహన పెరుగుతుందని తెలుసు,కాని 'అహం' తగ్గడం తెలిదు .ధన్యవాదాలు .

భాస్కర రామి రెడ్డి చెప్పారు...

నీవు పోల్చడం ఎప్పుడైతే మొదలు పెడతావో ,
అపుడే అది అసహ్యకరమైన ఆటగా మొదలవుతుంది .

అక్షర సత్యాలు.

కానీ మనిషి పోలిక కు తను సాధించ దలచుకున్న దానికి తేడా తెలుసుకున్న రోజు ఇలాంటి ఇబ్బందులు ఉండవేమో !

చిన్ని చెప్పారు...

@భాస్కర రామిరెడ్డి
హుమ్మ్...........మీరన్నది నాకు అర్ధం కాలేదు,వీలయితే కొంచెం విషదీకరించండి.

ఉష చెప్పారు...

ఎన్ని చదివినా ఎంత విన్నా ఆత్మవికాసం అన్నది స్వతహాగా విచ్చుకోవాల్సిన కుసుమం కదా చిన్ని. ఎవరినీ ఎవరమూ మార్చలేం, కాస్త కదలిక కలిగించగలం, ఆ పరిణితి అంకురం నుండి ఆవిర్భావమే వ్యక్తి వికాసం

భాస్కర రామి రెడ్డి చెప్పారు...

"విష" దీకరించడానికి ఏముందండీ.. :)
పోలిక కు, అనుకున్నది సాధించడానికీ వున్న తేడా అది. పోలిక తో సాధించాలనుకుంటే అసంతృప్తి, సాధనతో సాధించాలనుకుంటే ఆత్మసంతృప్తి.

చిన్ని చెప్పారు...

నిజమేనండి ...అర్ధం కాకే అడిగాను ...ధన్యవాదాలు

చిన్ని చెప్పారు...

@BA.RA.REDDY
ayyo....apaardam:)

చిన్ని చెప్పారు...

@ushaji
thanq..

భాస్కర రామి రెడ్డి చెప్పారు...

చిన్ని అవునా , ఇప్పుడే చూశా మీ సమాధానాన్ని :)