4, సెప్టెంబర్ 2009, శుక్రవారం

''ఒక్క క్షణం ఆలోచించండి ''

సాటి స్త్రీగా ఒక్క క్షణం ఆలోచించలేమా ?...ప్రకృతి పరంగాచూస్తె "స్త్రీ " ఎంత ఆకాశంలో సగమైన భేలయే...తన శారీరక నిర్మాణంలో కాని,మానసికంగా కాని పురుషుని తో పోల్చితే చాల "సున్నితమైనది ".పురుషునితో సమానంగా అన్నిరంగాల్లోను పనిచేయవచ్చుకాని సహజంగా సంక్రమించిన తనదైన లక్షణాలను దాచుకోలేదు. యెధైనవిపత్కర సమయంలోపురుషుని మాదిరి గంబీరత తో ఎదుర్కొనలేదు తన హావభావాలను అదుపు చేసుకోవటానికి చాల కష్టపడవలసి వస్తుంది .కదిపితే కన్నీటి పర్యంతమవుతుంది.ఎక్కడో తప్పించి అదీ అబ్నొర్మల్ స్త్రీ లోనే ఇందుకు విరుద్దంగా జరుగుతుంది..అంతవరకు ఎందుకు జీవితంలో ఎన్నో ఆటు -పోటులను ఎదుర్కున్న,కరడుకట్టినట్లు కనబడే 'సోనియా ' కంట నీరు చూడలేదా?
రాఖిల లకే పరిమితమైన చేవెళ్ళచెల్లెమ్మ నోరు విప్పకపోవడం లో ఆశ్చర్యం లేదు .భర్తమరణం వరకు గడప దాటని ఆ ఇల్లాలు అనుకోకుండా తనను వరించిన ఆ పదవుల్లో ఇమడడానికి ఇంకా సమయం కావాలేమో ?తనని నమ్మి ఎంపిక చేసుకున్న ప్రజల సమస్యలు తీర్చడానికి పూర్తి నిభద్దతాతో,ఎక్కడ బేషజం లేకుండా జీవితంలో తను పోగొట్టుకున్న "ఆనందం ''తాలుక విషాదం ని అంతా కళ్ళ లో నింపుకుని అలుపెరుగక పనిచేసే ఈ అమ్మ ని విమర్శించే ముందు ఒక్క క్షణం ఆలోచించాలేమో ......
మొన్న సాయంత్రం మొట్టమొదట ఏర్పాటు చేసిన సమావేశంలో కాస్తంత నిశితంగా పరిశీలించి చూస్తె తెలిసేది ...అప్పటికే జరిగిన పరిస్థితికి ఒక నిర్ణయానికి వచ్చిన ఆంద్రప్రభుత్వం ,కేంద్రప్రభుత్వం ప్రజాపాలన దృష్ట్యా విషయాన్ని ప్రజలు మానసికంగా అంగీకరించేంత స్తాయికి తీసుకురావడానికి తమలోని దుఖాన్ని దిగమింగుకునిమాట్లాడిన తీరు ....చీఫ్ సెక్రటరీ రమాకాంతరెడ్డి మాట్లాడిన తీరు .....
రాజకీయాల్లో కాని ,వయస్సు రీత్యకాని పెద్దవాడు ఆర్ధికశాఖ మంత్రి రోశయ్య మాట్లాడటం "అభ్యంతరకరమైన "విషయం కాదనుకుంటాను .అక్కడ పదవులు కాదు ముఖ్యం,పరిస్థితిని ఎదుర్కొనడం.....
మన హోం మినిష్టర్ ఆర్ధికంగా కలిగిన కుటుంబం నుంచి వచ్చారు,దివంగతుడైన ఆమె భర్త రాజకీయ ప్రస్తానం చేసినోడే ...సహజంగా వారి కట్టు బొట్టు వారికి తగ్గట్లుగానే వుంటుంది ...సమయాను సందర్భంగా అప్పటికప్పుడు వెదికి తక్కువ ఖరీదు దుస్తులు ధరించలేరేమో ?..ఆమె అలంకరణ ఎప్పుడు హుందాగా వయస్సుకు తగ్గట్లు పొందికగా వుండటమే చూసాను ....మిగిలిన కొంతమందిలా అసహజ అలంకరణ ,వయసుకు తగని అలంకరణ ఇంతవరకు చూడలేదు ..ఆమెలో చక్కని "స్త్రీ " చూసాను ....చూస్తున్నాను .

పైన ఇలా రాస్తున్నానని నన్నొక స్త్రీ వాదిగా చూడకండి ....నేను యేవాధిని కాదు అని చెప్పగలను కాని "మానవతావాదిని "మాత్రం కాదు అని చెప్పలేను ....ఇది రాసే సమయం కాదు ..అయిన రాయకుండా వుండలేను ...ఎవరికైనా అనుభవం వచ్చే కొద్ది సమర్ధతతో పనిచేస్తారుఇంకా మూడు నెలలెనాయే....అత్యంత భిడియస్తుడు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ,ఇందిరాగాంధీ యావత్ భారత దేశానికే నేతృత్వం వహించలేదా ?......practice makes men perfect ......

10 కామెంట్‌లు:

మురళి చెప్పారు...

హోం మంత్రి చేయాల్సిన ప్రకటనలు ఆర్ధిక మంత్రి చేస్తున్నారేమిటా? అని సందేహించాను మొదట.. కానీ విషయం అర్ధమయ్యాక నాకు అనిపించింది ఏమిటంటే మంత్రులకి ముందురోజే విషయం తెలియడం వల్ల, అంతటి విపత్కర పరిస్థితిలోనూ నిబ్బరంగా ఉండగల వాడు అవడం వల్ల రోశయ్య చేత చెప్పించారని. అదేమీ తప్పు కాదు కదా.. ప్రకటన చేయనందుకు హోం మత్రిని తప్పుపట్టడం సరికాదు.. ఇక ఆవిడ ఆహార్యాన్ని గురించి చర్చించడానికి ఇది సమయమూ, సందర్భమూ కాదు.. బాగుందండీ మీ టపా.. చాలా ఆవేదనతో రాసినట్టున్నారు..

Shiva Bandaru చెప్పారు...

I agree..

Vinay Chakravarthi.Gogineni చెప్పారు...

evaro raasarani......meeru pattincukokandi.vallu anthe edo tamake telusu anukuntaaru........ame dress gurinchi nenu maatladanu gaani

ame 5 years mantri gaa chesindi inka nerchukunedi ento naaku artham kaaledu.......support chesetappudu....anta exmpution evvakoodadu......alantappudu home teesukokoodadu.

rosayya anubhavam ani kaadu rosayya rosayyane.........

ఉమాశంకర్ చెప్పారు...

కీలకమైన హోం శాఖని తనకి కేటాయించినందుకు ఆశ్చర్యపోయిన వాళ్ళలో నేనొకడిని. విషయమేదైనా ఆరకంగా విమర్శించటానికి ఇది సమయం కాదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.

anagha చెప్పారు...

neenu anukunnanu home minister yendukumatladaledu ani..tharavatha anukunna ,ameku ayanakunnanna anubandham sontha chellelulantidi .andulo mahila mirannatu yenthobadalo undivuntundi anukunna.ainna senior leader, ilanti emergency time lo valle matladatharu...appude prajalaku dairyam vasthundi.
aina, ilanti samayamulo sarees gurinchi alochinchadamante mind mature iyee undademo leda
vari heart nu devudu stone tho thayaru chesiuntadu......

Hima bindu చెప్పారు...

@మురళి
నిజమే కొంత చికాకు మరికొంత ఆవేదనతో రాసాను ..ఇది రాసే సమయం కాకపోయినా సమయానికి వెల్లడించాలనే కోరికతో రాసాను .దీని మీద చర్చకూడా కోరుకోవడం లేదు ...ఒక స్త్రీ గా నా స్పందన ఇది .
@శివ భండారు
ధన్యవాదాలు .
@వినయ్ చక్రవర్తి గోగినేని
నేను చాల వరకు పట్టించుకోను కాని కొన్ని సందర్భాల్లో నోరుమూసుకుని వుండటం నా వల్లకాని పని -:)
మీరు అన్నట్లు యే స్త్రీ సంక్షేం శాఖో,సాంఘీక సంక్షేమ శాఖో మొదలైన తెలికపాటివి ఇస్తే నేర్చుకోవడానికి పెద్ద కష్టపడక్కరలేదు కాని ఇక్కడ ఈమె డీల్ చేస్తున్నది హోం శాఖ అదీను నామకేవాస్తే (వాస్తవం మాట్లాడితే ,ఎందుకు ఆవిడకి ఇచ్చారో అందరికి తెలిసిందే )...మీకు తెలుసా నాయకులంతా పుట్టుకతోనే నాయకులు కాదండీ ,కొందరు చేయబడతారు,పుట్టుక అంటే వారసత్వం అని పొరబడకండి ....నాయకత్వలక్షణ లతో కొందరు పుడతారు ,రాచరికపు వ్యవస్తలో .....ఇటీవల కాల 'నాయకత్వం 'లో వారసత్వం సహజం అయిపోయింది ,....అలా వచ్చినవాళ్ళు కొన్నాళ్ళు కష్టపడితే మంచి నాయకులుగాను యెదగగలరు.....హోం తీసుకోవడం తీసుకోకపోవడం వారి చేతిలో లేని పని అనుకుంటాను ...ధన్యవాదాలు .

Hima bindu చెప్పారు...

@ఉమా
అందరితోపాటు ఆశ్చర్యం ఆ తరువాత ఆనందం కలిగింది .కీలకమైన శాఖ అని .....అదీ రాజకీయం కదండీ .
@అనఘ
'దేవుడు హృదయాన్ని స్టోన్ తో తయారు చేసాడు '...నవ్వలేక అలుపు.ధన్యవాదాలు

anagha చెప్పారు...

@vinaygaru,
5years home manthriga chesina jaana garu yemicheserandi?yentha ghoram jarigina nimmaku nirethinatu undevaru.
chattam thanapani thanu chesuku pothundi ane dailagu thappa inkemayina vachhu ?
aayanakanna sabitha garu better kaadu?
mahilaku antha pedda padavi ichhesariki magavallandaru geerninchukolekapothunnru

Mauli చెప్పారు...

janam aameni responsible person ga expect chestaru ...aame ki vasthavam teliya chesenduku vimarsha chese adhikaram vallaki undi ... Home minister anna tarvatha lady ani, sister sentiment ani excuses adagatam haasyaaspadam ...oka sagatu pourudu aame ni vimarshinchatam lo tappu leduhmmm.... aame home minister avvadaniki, YS ki aame meeda unna abhimaname kaaranam antara....YS ki antha kanna dammi dorakaledu ...papam aame matram em chestundi , vaddu antundaaa...YSR unnanppudu aayana choosukonevaru home sakha, ippudu rosayya choosukonnaru ..madhyalo aame ni anadaniki manam yevaramu ....home sakha ni choostunnadi appudu, ippudu CM ye ani ardham chesikovadam tappa...andu ke home sakha manthri hoda lo aameki burial daggaraki cherukone avakaasam kooda dorakaledu ...yendu kante aame YS ki dummy matrame ..aayana leru ..so dummy kooda ledu ...

Hima bindu చెప్పారు...

@mauli
చూడండి ...నేను రాసింది మరొక్కసారి చదవండి ...విమర్శించవద్దు అనలేదు ....వాస్తవాన్ని ఆలోచించమన్నాను,ఒడ్డున వున్నోళ్ళం ఎన్నయినా మాట్లాడతం.. అక్కడ సాధారణ సమావేశం కాదు ,ఘోర విపత్తు దానిని ప్రశాంతం గా ఎదుర్కోవడం ....ఫలాని పని ఫలనివాల్లెచేయాలనీ కూర్చుంటే కొన్ని సందర్భాల్లో కొంపలు కొల్లేరు అవ్వుతాయి ....క్రయసిస్ వచ్చినప్పుడు రాజు బంట్రోతు అని కూర్చోరనుకుంట !....అర్ధం అయ్యిందిగా ఆమె డమ్మీ అని ఇంకా చెప్పాల్సింది ఏముంది ...?"రాజకీయం ".....చరిత్రలోకి వెళ్లి అప్పుడు రండి తీరికగా మాట్లడదాం ..