21, సెప్టెంబర్ 2009, సోమవారం

"నా కవిత్వం"


వారం నుంచి బోల్డంత తీరికగా వున్నాను ...ఏదో మద్యలో ఒకటి రెండురోజులు తప్పించి .....ఇష్టం వచ్చినప్పుడు లేవడం ...నిద్రపోవడం పుస్తకాలు చదువుకుంటూ ...బ్లాగ్లు చదువుకుంటూ ...పాటలు వింటూ...కబుర్లు చెప్పుకుంటూ ....గంటలు గంటలు ఫోన్లో కబుర్లు చెప్పుకుంటూ హాయిగా గడిపేస్తున్నాను...
ఇంత చేస్తున్న ఇంకా చేయాల్సిన పనులు మిగిలున్నాయని చక్కగా పేపర్ ,పెన్ను పట్టుకుని ఒక కథ రాద్దాం అని కూర్చున్న ....ఏదో రాసాగాని రెండోసారి చదువుకుంటే నీరసంగా అనిపించింది ...సర్లేమ్మని దాన్ని ప్రక్కన పడేసా ...నా పాత డైరీ ఒకటి తీసుకున్న ...అప్పుడెప్పుడో నేను రాసుకున్న కవితలు ......హమ్మ్...అబ్బో "మరువం " ఉషగారు రాసిన కవితలతో పోటీ పడుతున్నాయి ...అన్ని తిరగేసి చదివి మురుసుకున్న....మచ్చుకి మీకొకటి ఇందులో పెడతాను ....ఓపిక వుంటే చూడండీ ....ముఖ్యంగా బ్లాగ్లలో వున్నా కవిత మహులందరికోసం............ఎంత ఓపిగ్గా రాసానో ....
...
రేగినకోరికలతో ...... గాలులు వీచగా
జీవన వేణువులలో ..... మోహన పాడగా
దూరము లేనిదై .....లోకము తోచగా
కాలము లేనిదై ...గగనము అందగా
సూరీడేఒదిగి ఒదిగి ...జాబిల్లి ఒడిని అడిగే వేళ
ముద్దుల సద్దుకే ...నిదుర లేచే ప్రణయ గీతికి
ఒంటరి బాటసారి... జంటకు చేరగా
కంటికి పాపవైతే ...రెప్పగా మారనా
తూరుపు నీవుగా.... వేకువ నేనుగా
అల్లిక పాటగా ........పల్లవి ప్రేమగా
ప్రేమించే పెదవులోకటై ...పొంగించే సుధలు మనవైతే
జగతికే అతిధులై జననమందిన ప్రేమ జంటకు
ఓం నమః నయనశ్రుతులకు ఓం నమః హృదయలయలకు ఓం
ఓం నమః అధర జతులకుఓం నమః మధుర స్మృతులకుఓం
నీ హృదయం తపన తెలిసి,నా హృదయం కనులు తడిసే వేళలో
ఈ మంచు బొమ్మలోకటై కౌగిలిలో కలిసి కరిగే వేళలో.......................


ఇదండీ నాకు చాల ఇష్టమైన లిరిక్ ....గీతాంజలిలో మా నాగ్ అధ్బుతంగా లీనమయ్యి నటించేసాడు ....
ఎంత బాగా రాసుకున్నానో కదా .....ఎన్ని సార్లు విన్న విసుగు అనిపించదు ..... విని విని కాపీ చేసుకున్న ......నా కవిత .......-:)


10 కామెంట్‌లు:

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

చిన్నీ మరీ యింత చతురతా? టపా చివరి దాకా ఆహా చిన్నీ గారూ, ఓహో చిన్నీ గారూ అనుకుంటు చదివాను "ఓం నమః నయనశ్రుతులకు" కనిపించేంత వరకు. :)

మురళి చెప్పారు...

నాకు "జీవన వేణువులలో మోహన పాడగా.." అనే లైన్ అంటే చాలా చాలా ఇష్టం.. ముఖ్యంగా జానకి పలికే తీరు... బాగుంది మీ కవిత.. అచ్చం వేటూరి లా రాశారు :-) :-)

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

కవితలో మొదటి కొన్ని లైన్లు చదవగానే చిన్ని గారు రాసిన కవితకు ట్యూన్ ఈజీగా కట్టేయొచ్చు అని అనుకుంటుండగా...
"ప్రేమించే పెదవులోకటై ...పొంగించే సుధలు మనవైతే.." అన్న లైను చదివేసరికి ఇది ఎక్కడో ఏదో పాటలో ఉంటుందో అని ఆలోచించగా అప్పుడర్ధమైంది...వేటూరి గారు మీ అనుమతిలేకుండా గీతాంజలిలో వాడుకున్నారని..:-))
Just kidding....

నేస్తం చెప్పారు...

చిన్ని గారు ఒకసారి ఆలి నాలుక బయట పెట్టి తల ఊపే సీన్ గుర్తు తెచ్చుకోండి :)

Jagadeesh Reddy చెప్పారు...

ఎన్నడో మర్చిపోయిన మంచి పాటని గుర్తు చేసారు.. థ్యాంక్స్ చిన్ని గారు..

Hima bindu చెప్పారు...

@భా.రా.రే
హ్హు! మీరన్నందుకైన త్వరలో మీచేత ...చిన్ని ఆహా !ఓహో!..అనిపిస్తాను:(

@మురళి
పాట విన్న కొత్తలో నేను అలానే ఆశ్చర్యపోయాను ....వేటూరి నన్ను ఇమిటేట్ చేసారా లేక కాపీ కొట్టేసారా అని :)

@శేఖర్
వావ్ ! ట్యూన్ కూడా కట్టేద్దామనుకున్నర ...గుడ్ గుడ్ ..నిజమేనండి నా అనుమతిలేకుండా వాడేసారు,పాపం ఏదోలే పెద్దమనిషి అనేసి ఊరుకున్నాను .

Hima bindu చెప్పారు...

@నేస్తం
పట్టేసార నేస్తంగారు ......భలే గుర్తుచేసరండీ ఆలి ని . నాకు ఆలి అంటే సీతాకోక చిలుక సినిమా అప్పటినుండి చాల ఇష్టం ....శరత్ దగ్గరకి పెళ్లి పెద్దగా వెళ్లి మనం మనం ఫ్రెండ్స్ అంటాడు చూడండీ ఆ సీన్ సూపర్ ..

@ఎస్పి జగదీశ్
ధన్యవాదాలండీ .

మరువం ఉష చెప్పారు...

>> "మరువం " ఉషగారు రాసిన కవితలతో పోటీ పడుతున్నాయి <<

*** ఓయ్ చిన్నీ, ఓహోయ్ అన్నారంటా!!!! :) నా పేరిలా మారుమ్రోగిపోతుందేంటబ్బా? మీ అభిమానానికి చాలా సంతోషం. నిజానికి గీతాంగలిలోని ఆ పాటతో సమస్థాయిలో నా కవితలనుంచటం, నా మరువం భాగ్యం. ఆహా ఏమి ఈ విజయదశమి శుభ శకునం. "అన్నీ మంచి తరణములే చిన్నీ టపాలాపనలే... ;)"

cartheek చెప్పారు...

చిన్నిగారు నేను మీ బ్లాగుకి కొత్త అండి
ఇలా కూడా నవించవచ్చని నాకు ఇంతకు ముందెన్నడు తెలియదండి....

Hima bindu చెప్పారు...

@కార్తీక్
ధన్యవాదాలు ...ఆలస్యంగా -:)