ఈ రోజు హైదరాబాద్ సెంట్రల్ యునివర్సిటీ లో కేరళ వాళ్ళ ఫెస్టివల్ "ఓనం " జరుగుతుందట.అది విన్న దగ్గరనుంచి మనస్సు అటు పరుగులు తీస్తుంది .మినీ సైజే ప్రపంచం లా వుండే ఆ యునివర్సిటీ అంటే నాకు చాల ఇష్టం.భాగ్యనగరం వాతావరణ కాలుష్యానికి దూరంగా ప్రశాంతంగా ఒకింత చిట్టడవి ని తలపించేట్లు వుండేది ,బహుశా ఇప్పుడేమైనా మారి వుండొచ్చు .రుతువులకు అనుగుణంగా రంగులు మార్చుకుంటూ యే కాలానికి ఆ కాలం సొగసులద్దుకుంటూ స్వాగతం పలుకుతుంటది.
శీతాకాలం మంచుతెరల్లో చలికి వణుకుతూ చెట్లమద్య ఒంటరిగా నడిచే ఆనందం ...వర్ణించ తరమ!...అప్రయత్నంగా మనసులో "ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై "పాడేసుకుంటూతెలీని ప్రపంచం లోకి వెళ్ళిపోవాలని అన్పిస్తుంది .
వర్షాకాలం లో చిన్న చిన్న తుంపర్లలో తడుచుకుంటూ కనబడిన అడవి జాజిపూలను అందినకొద్దీ గుప్పెల్ల దొరకబుచ్చుకుని సన్నటి ఇరుకు దారిలో నెమళ్లసరస్సు చేరి కనబడిన రాతి గుట్టపై చేరబడి కనబడని నెమళ్ల కోసం వేచిచుడడంలో ఆనందం మళ్లీరాదేమో ...
వేసవి ఉషోదయాలు ,సాయంత్రం సంధ్యా సమయాలు ఎర్రటి అగ్నిపూలతో,పసుపుపూలతో గమ్మతైన పూల పరిమళంతో మనస్సును ఆహ్లాద పరుస్తుంది .
అన్నిటికి మించి ఎల్లలు ఎరగని ఆ స్నేహం లో,ఒక్కసారి అందులో అడుగు పెట్టాక అక్కడున్న ప్రతి చెట్టుతో పుట్ట తో మన అనుభందాన్ని తెంచుకోలేక ,గుర్తొస్తే మనస్సు చిలుకై అక్కడ చెట్టు మీద వాలుతుంది.
నేను ఈ పోస్ట్ రాసే సమయానికి మనవాళ్ళు పదిహేను రకాల కేరళ వంటలతో విందారగిస్తున్నారు....-:)
15 కామెంట్‌లు:
ఇప్పుడిప్పుడే నేటిలో జీవించటం నేర్చుకుంటున్నాను. ఇప్పటి జీవితంలోనూ ఆనందాలకి కరువు లేకపోయినా, ఏమిటో గతం ఇంకా తీపిగావుంటుంది. గతాన్ని తరిచి చూసేలోగా నేడు గతంలోకి జారిపోతుంది. "కొమ్మని అడిగానే ప్రతి రెమ్మన వెదికానే, కనిపించవు కాస్తైనా, సీతాకోకచిలుకా..." పాట విన్నారా [ఉర్మిళ నటించింది] "రంగు రంగు రెక్కల...సీతాకోకచిలుకా..." [జగపతిబాబుది] ఇలా ఎన్నో మనని మనం మరిచి ప్రకృతిలోకి మమేకమైపోవాలనిపించే అనుభూతులు. కనీసం అలా కేవలం విందులకి అంకితమైపోకుండా స్పందించగలుగుతున్న మనని మనం అభినందించుకుందాం.
Hmm I just loved the food they serve there! Are they still doing it at the Gurubaksh Singh hall?
"శీతాకాలం మంచుతెరల్లో చలికి వణుకుతూ చెట్లమద్య ఒంటరిగా నడిచే ఆనందం ..."
"వర్షాకాలం లో చిన్న చిన్న తుంపర్లలో తడుచుకుంటూ కనబడిన అడవి జాజిపూలను అందినకొద్దీ గుప్పెల్ల దొరకబుచ్చుకుని..."
మమ్మల్ని కూడా అక్కడికి తీసుకెళ్ళిపోయారు...
అక్కడి వాతావరణం బాగా చెప్పారు.
ఓనం అంటున్నారు...విందుతో పాటు అక్కడ 'కనుల'విందు బాగానే ఉంటుందనుకుంటా!! :)
@ఉష
మీరు చెప్పింది నిజమేనండి
@మలక్పేటరౌడి
ఇప్పుడు డి .ఎస్ .టి లో జరుగుతున్నాయి. నిన్న ఆవియాల్ బాగుందట.
@మురళి
నిజంగా తీసుకు వెళ్లి నట్లుందా!వహ్ థాంక్స్
@శేఖర్
హమ్మ ! బొత్తిగా భయం లేదు ,కేరళ కలర్స్ గురించి మాట్లాడతారా...నో డౌట్ కళ్ళు చెదిరే అందాలు -:) .
చిన్నీ కథలో ఈ ట్విస్ట్ ఎలాగొచ్చింది? వేంకటేశ్వరా విస్వవిద్యాలయానికి , సెంట్రల్ యూనివర్శిటి...లింక్ ఎక్కడో తెగిందే.. ాయితే మాకు చెప్పడానికి మీదగ్గర ఇంకా బోలెడు కబుర్లు వున్నాయన్న మాట
-:) నేను వెంకటేశ్వర యునివర్సిటీ లో అసలు చదవలేదే ...ఎలా అనుకున్నరండి ! ఓహ్!...వై .ఎస్ .ర్ విజయవాడ ఆంధ్ర లయోలా కాలేజే లో ఇంటర్ చదివారు ,మాకు బోల్డంత సీనియర్ ...:):) లింక్ దొరికిందా?..
దదాపు 3 సంవత్సరాలు ఆ ప్రాంతంలోనే ఉన్నాను కానీ లోపలికి వెళ్లి చూడ లేక పోయాను. మీ పోష్టు చదివితే ఓ సారి వెళ్లి చూడాలని ఉంది. ఎప్పటికి కుదురుతుందో... ? వర్ణన బాగుంది. :)
మీ టపాతో "ఉషోదయాలు ,సాయంత్రం సంధ్యా సమయాలు, శీతాకాలం మంచుతెరలు, నెమళ్లసరస్సు, ఎర్రటి అగ్నిపూలు ,పసుపుపూలు, అడవి జాజిపూల"ను మాకు కూడా చక్కటి అనుభూతుల్ని పంచారండి.
@viswapremikudu
-:)thanq..chuse kallani batti kooda aa feel vuntaademo.
@pranitha,swati
thanq
చాలా బాగా కాపీ చేసారు పొరపాటు బాగా రాసారు ......ఇలా రాస్తుపొండి నాకు నచ్చిన 'బ్లాగ్ ' అంటూ రివ్యూ రాస్తాను ,నాలానే పనిలేనోళ్ళు మీ బ్లాగ్ కి జేజేలు పలుకుతారు......మీ బ్లాగ్ చదవమని నన్ను పిలిచిమరి చెప్పినందుకు 'ధన్యవాదాలు '
మీరు హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ లో చదివారా?
నేనూ అక్కడే చదివాను. నేను యూనివర్సిటీ వదిలేసి 6 నెలలయింది. యూనివర్సిటీ సిక్ నెస్స్ తో ఉన్నాను. ఇప్పుడే మీ పోస్ట్ చదివాను. మీ నా సిక్ నెస్ ని పెంచేసారు :(
@సౌమ్య
మీరు యే బ్రాంచ్ ?...రెండేళ్ళ అనుబంధం ఉంది :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి