23, సెప్టెంబర్ 2009, బుధవారం

''నా ముద్దు పేరు ''

నాకు చిన్నప్పటినుండి నాకున్న పేర్లతో పెద్ద తలనొప్పి వుండేది.నాకు అందరిలానే స్కూల్ రికార్డ్కి ఒక పేరు ఇంట్లో పిలవడానికి ఒక పేరు వుండేది.అప్పట్లో నా వయస్సు పిల్లలు నా పేర్లను ఎగతాళి చేస్తుంటే కొంత వయస్సు వచ్చేవరకు భాధపడే దాన్ని తరువాత తరువాత నా అస్సలు పేరు అర్ధం తెలిశాక భాధపడ్డం మానేసాను కాని ఇప్పటికి నేను ఇబ్బంది పడేది నా ముద్దు పేరుతోనే .చిన్నప్పుడు పల్లెటూరు వెళ్ళినప్పుడల్లా నా తోటి పిల్లలు నాకు కోపం తెప్పించాలంటే నా ముద్దుపేరును పదేపదే పిలిచేవారు,అదేమంటే మీ అక్కవాళ్ళు పిలవడం లేదా అనేవాళ్ళు .మా అమ్మ దగ్గర ఏడ్చేదాన్ని పైగా'' నీవేమో చక్కగా బేబీ అని పెట్టుకుని నన్నేమో ఇంత పిచ్చి పేరుతో పిలుస్తారా'' అని .
దానికి మా అమ్మ ఒక కథ చెప్పుకొచ్చేది ..
అమ్మకి ముగ్గురు తమ్ముళ్ళు వుండేవారట ,కాని మాకు ఊహ తెలిసాక ఇద్దరు మాత్రమె తెలుసు,అందరిలో పెద్ద తమ్ముడు తన పద్దెనిమిదవ ఏట అకాల మరణం చెందాడట..అప్పుడు నేను నెలల పిల్లనట ,తన పాకెట్ మనీతో నాకు మబ్బురంగు క్రేప్ గౌన్ కొనుక్కోచ్చాడట ,అమ్మ నాకు ఆ గౌన్ తొడిగితే పచ్చగా మెరిసిపోతున్న (అప్పుడు) నన్ను మామయ్యా ఎత్తుకుని''అక్క దీనిని ఈ రోజు నుండి ......అని పిలుద్దామే అన్నాడట ,అలా నా ముద్దు పేరు నాకు స్థిరమయ్యి ఇంట్లో అందరి నోళ్ళలో కొందరు దగ్గరి భందువులలో ప్రాచుర్యమయ్యింది.ఎంచక్కగా బుజ్జి ,చంటి చిన్ని చిన్నారి వుండగా ఇదే మీకు దొరికిందా అని ఇప్పటికి నా నుండి మా అమ్మ రెండు మూడు నెలలకోసారి యుద్ధం చూస్తుంది ,ముఖ్యంగా ఎవరైనా స్నేహితులో చుట్టాలో వచ్చి వెళ్ళాక .....వాళ్ళ ముందు నన్ను పిలిచినప్పుడు నాకేమో ఇబ్బందిగా వుంటాది .
మా అక్క మరీను ,తనతో బయటికి వెళ్తే అక్కడ ఎవరున్నా పట్టించుకోదు గట్టిగ పిలుస్తుంది ,ఒకటి రెండుసార్లు మా ఆఫీసు కి వచ్చినప్పుడు మా స్టాఫ్ ముందు నా ముద్దుపేరుతో పిలిచింది ,అదేమంటే ఇంకా కొత్తగా ఏం పేరు పెట్టి పిలవాలే నిన్ను అంటుంది.తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్క అనటానికి ముందు నా పెట్ నేమ్ తగిలించి మరీ అంటారు
మా అమ్మాయి, వాళ్ళ నాన్న కూడా నన్ను ఏడ్పించాలంటే అదే పిలుపు .
ఈ సోదంతా ఇప్పుడు ఎందుకు అంటే సాయంత్రం మా నాన్నగారు ఎవరో స్నేహితులు వస్తే పరిచయం చేయడానికి నా పేరును గట్టిగ పిలిచి మా రెండో అమ్మాయండీ పలానాపలానా అని నా గురించి పరిచయం చేస్తుంటే అక్కడ ఏడవలేని వెర్రి నవ్వు ఒకటి నవ్వి మళ్లీమా అమ్మతో ఫైటింగ్ చేసోచ్చాను ...మన బ్లాగ్ లోకంలో ఎవరో నా పెట్ నేమ్ తో తెగ రాసేస్తున్నారు :)

35 వ్యాఖ్యలు:

సుభద్ర చెప్పారు...

ఇప్పుడు మా అ౦దరికి ఫజిలా????? సరే ప్రయత్నిస్తాను.నాకు పోస్ట్ పేరు నచ్చితేనే చదువుతా!!!!అసలు బ్లాగ్ పేర్లూ పట్టి౦చుకోను.సరే మీ ఈ ఫజిల్ ముల౦గా నాకు బ్లాగ్స్ పేర్లు చుడట౦ వస్తు ౦ది.థ్యా౦క్స్.......ఒకటి మాత్ర౦ ఘ౦టాపద౦ గా చెప్పగలను.నా బ్లాగ్ పేరు మీ ముద్దు పేరు కాదని.
నాకు తెలిసిన పేర్లు..జ్యోతి కాదు,శ్రీలలితా కాదు,పర్ణశాల కాదు,నవ్వులాట కాదు,చాకిరేవు కాదు,తౄష్ట కాదు,లీలామెహన౦ కాదు,భావిక కాదు,నీ స్నేహమా కాదు ,జురాన్ కాదు,యాత్రకాదు,మరువ౦కాదు,పరిమళ౦ కాకపొవచ్చు.నాన్న ఉ ఉహు,జీవని ముద్దుపేరుక౦టే పేరు కే సుటవుతు౦ది.గడ్డిపూలు,నెమలికన్ను కాదెమె.......హరిసేవ కానే కాదు. అబ్బ ఇ౦కా బ్లాగ్ పేర్లు ఏమి ఉన్నాయి.......సరె ఆగదు ఆగదు ఈ వెదుకులాట...
మీరు చిప్పితే సరె లేక పోతే ........మళ్ళి నా గెస్స్ లు మొదలు.ప్లీజ్ నాకు చెప్పలని అన్పిస్తే మెహమాటపదక౦డి సరేనా!!!!!

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

అదేదో చెప్పేస్తే మేమూ పిలుస్తాం కదా ! :)

అజ్ఞాత చెప్పారు...

maaku cheppochugaa...aa peru

భాస్కర రామి రెడ్డి చెప్పారు...

ohh ,, intakI mI muddu pEru .....(dash) andI

ఉష చెప్పారు...

మా అక్క ముద్దు పేరు "బన్" సంవత్సరం పిల్లపుడు దాని బూరి బుగ్గలు చూసి ముచ్చటేసి బేకరీ తిళ్ళు ఎక్కువగా తినే ఓ తాతగారు అలా అనేవారట. అలా అలా బన్నక్క, బన్నొదిన, బన్నత్త, బన్నమ్మ గారు అయిపోయింది. మా వదిన పేరు "బుడిగి". బావ గాడి పేరు "టున్ టున్". వదిన కొడుకు "డుంబు". మా పనమ్మాయి ముద్దు పేరు "కాంచనమల" అసలు పేరు సత్యవతి. ok then tell me now, don't you feel better? ;)

సిరిసిరిమువ్వ చెప్పారు...

:)) నిన్నేపెళ్ళాడతా సినిమాలో పండు గుర్తొచ్చింది.

మురళి చెప్పారు...

పజిల్ బాగుందండీ.. సరైన సమాధానం చెప్పిన వాళ్లకి ఏదైనా బహుమతి ప్రకటిస్తే ఎంట్రీలు బాగా వస్తాయి :-) :-)
@ఉష: 'బన్' పేరు రూపాంతరం చెందినా విధానం భలేగా ఉంది.. అలాగే కాంచన మాల కూడా...

అజ్ఞాత చెప్పారు...

is it mabbu?

చిన్ని చెప్పారు...

@సుభద్ర
నిజంగా మీకు పజిలేకొంచెం ఓపిగ్గా చుస్తే నేను చెప్పకుండానే మేకు తెలిసిపోతుంది ఒక్క చిన్న క్లూ ఇచ్చిన ఈజీగా చెప్పేస్తారు .
చివరి వాక్యాలు మీరు సరిగ్గా చూడలేదు ....బ్లాగ్ లోకం అన్నాను కాని బ్లాగ్ పేరు అనలేదు ...హ హ్హ ...మీరు చెప్పింది ఒక్కటికూడా కాదు .
@విజయమోహన్
అదేకదా నా భాధ....ఏదో నాకు నేనుగా పెట్టుకున్న పేరు 'చిన్ని 'బాగానే వుందిగా -:)
@అజ్ఞాత
ముందు మీ పేరు చెప్పండి అపుడు రహస్యంగా నా పేరు చెప్పేస్తాను .

చిన్ని చెప్పారు...

@భా.రా.రే
మీరు మరీ చేబుతారండీ,ఎవరైనా డాష్అంటారా!
@ఉష
కొంచెం బెటర్ అనుకుంటాను ...పాపం వాళ్ళు నాలానే ఎంత ఫీల్ అయ్యేవాల్లో కదా -:)
@సిరిసిరిమువ్వ
హమ్మ్.....-:) ధన్యవాదాలు
@మురళి
సరే ప్రకటించేసాం సరైన సమాధానం ఠకీమని చెప్పినవారికి వారు కోరుకున్న బహుమానం ఇవ్వబడుతుంది .అంటే సమాధానం సూటిగా వుండాలి అది అయ్యుండొచ్చు ,అనుకుంటాను లాటివి వుండకూడదు .-:):)

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

- CLUE NO 1 : తన పాకెట్ మనీతో నాకు మబ్బురంగు క్రేప్ గౌన్ కొనుక్కోచ్చాడట ,అమ్మ నాకు ఆ గౌన్ తొడిగితే పచ్చగా మెరిసిపోతున్న (అప్పుడు) నన్ను మామయ్యా ఎత్తుకుని''అక్క దీనిని ఈ రోజు నుండి ......అని పిలుద్దామే అన్నాడట......

- CLUE NO 2 : నాకేమో ఇబ్బందిగా వుంటాది ....

$$$$$..టేవ్..టేడేం..టేడేం....టేడేం...టేడేట్టేడేం..టేరేడేడేం...$$$$$(బ్యాక్ గ్రౌండ్ లో బాండ్ మ్యుజిక్ ప్లే చేసుకోండి)

- CLUE NO 3 : తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్క అనటానికి ముందు నా పెట్ నేమ్ తగిలించి మరీ అంటారు......

- CLUE NO 4 (Imp) : మన బ్లాగ్ లోకంలో ఎవరో నా పెట్ నేమ్ తో తెగ రాసేస్తున్నారు

$$$$$..టేవ్..టేడేం..టేడేం....టేడేం...టేడేట్టేడేం..టేరేడేడేం...$$$$$

Investigation has gone to second stage...

- ఇట్లు

'Finding PetName' Detective Agency

:)

sunita చెప్పారు...

మీ ముద్దుపేరు చిలుక గాని రామ చిలుక గాని ఐఉండోచ్చు. Am i correct?

Indian Minerva చెప్పారు...

"ఆ గౌన్ తొడిగితే పచ్చగా మెరిసిపోతున్న (అప్పుడు) నన్ను మామయ్యా ఎత్తుకుని''అక్క దీనిని ఈ రోజు నుండి ......అని పిలుద్దామే అన్నాడట."

చందమామ కదూ... మీ పేరు. పోన్లేండి ఏదోఒకటి మరీ "The Invincible Rebel Road", "క్రీడారంగం","daily cartoon", "తెలుగు రధం" ఇలాంటివైతే కాదుగా...

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

పట్టేసా...మీ పేరు కనిపెట్టేసా...చెప్పనా...చెప్పనా..
"నీ ధ్యాసలో..నా హృదయం" బ్లాగర్ పండు...ఈయన ఇంచు మించు ఈ నెలలో నలభై ఒక్క టపాలు రసారు.

సో మా "Finding PetName" Detective Agency ఇచ్చిన రిపోర్ట్ ల ప్రకారం మీ ముద్దు పేరు "పండూ",

Am I right?

( If you dont want to reveal this to others..you can ignore my answer without publishing it...I dont mind..)

గిఫ్ట్ షాప్ కి ఎప్పుడు వెళుతున్నారు?
:)

చిన్ని చెప్పారు...

@అభిమతం
మబ్బులు కాదండీ -:) ధన్యవాదాలు .
@సునీత
అస్సలు కాదండీ ;)
@ఇండియన్ మినర్వా
చందమామ అంటే కొంచెం వినడానికి బానే వుంది కాని మరీ రోడ్లు ,రధాలు ,రంగాలు ఏమిటండీ .....మరీను .
@శేఖర్
హమ్మో మీరు సామాన్యులు కాదుఏకంగా అడహోక్ డిటెక్టివ్ ఏజెన్సీ తెరిచేశారు ......గిఫ్ట్ హైదరాబాద్ లో కొనాలా లేక చీకాకులం (శ్రీకాకుళం )లో కొనాలా....-;).....నా పేరు ఏమో కాని మీ అన్వేషణలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిందండి .

భాస్కర రామి రెడ్డి చెప్పారు...

Avuna pandu :-)

కొత్త పాళీ చెప్పారు...

సిసిము, శెఖర్ .. అదుర్స్.
చిన్నిగారూ భలే తంటా తెచ్చి పెట్టారే? నేనూ ముందు మబ్బు అనుకున్నా, కానీ ఎంత ముద్దుగా పిల్చినా అది ముద్దుపేరు కాదు. ముద్దుగా ఉన్న మేనకోడ్లని చూసి ఏ మావయ్యా అలా పిలవడు. నా వోటుకూడా పండుకే.

సోదరి చెప్పారు...

శేకర్ నీ కామెంట్స్ అదుర్స్.. చిన్ని గారు .. ముద్దు పేర్ల లిస్ట్ లోకి బుజ్జిని చేర్చకండి.. బుజ్జి నీ వళ్ళంతా గజ్జి అని పదే పది సార్లు అంటే ఎంత కష్టం గా ఉంటుందో ఆ బాధ అనుభవించిన వాళ్ళ్కే తెలుస్తుంది :)
అయినా మబ్బు రంగు గౌనుకి ,పచ్చగా ఉన్న(బంగారు రంగు) పిల్లకు, పండుకి అసలు ఏమన్నా పోలిక ఉందా ...నాకు కూసంత మకతిక గా ఉంది . :)
శేకర్ మళ్ళి మొదలు పెట్టండి పరిశోధన ...ఫస్ట్ నుండి

sunita చెప్పారు...

ఇవ్వాళ మరలా ఇటొచ్చాను ఎవరైనా కనిపెట్టారేమో అనుకుని, ఊహూ! నేనైతే "బంగారం" అన్న ముద్దుపేరుకు
ఓటేస్తున్నా!చూద్దాము!

భాస్కర రామి రెడ్డి చెప్పారు...

ayite bangaaru

చిన్ని చెప్పారు...

@కొత్తపాళీ
అబ్బే నేను ఇంత తంటాతెస్తాను అని అనుకోలేదు ....నిజానికి ఫైటింగ్ మూడ్ లో రాసిన కథ అది .....కొంచెం మెదడుకు మేత అయ్యింది .
@సోదరి
మా అక్క పేరు బుజ్జి కాని ఆమెను ఎవరు వెక్కిరించలేదు ,కాని మేము ఎవరం బుజ్జక్క అనలేదు 'అక్క 'అని మాత్రమె అనేవాళ్ళం ....తమ్ముడ్ని 'బుజ్జిగా 'అంటాము వాడు ముచ్చటగానే ''ఆ ''అంటూ పలుకుతాడు .స్కై బ్లూ కలర్ రంగు వున్నవారికి ఇంకొంచెం రంగు ''అరువు '' తెచ్చిపెడుతుంది కదండీ ....-:) ధన్యవాదాలు .
@సునీత
బంగారు అంటే మురిసిపోఏదాన్నేమో .....
@భా.రా.రే
ఇంకా ఆలోచన ?......

anagha చెప్పారు...

ippude me post chusenu ,me muddu peru mummatiki'PANDU'anukuntunnanu,ade ayeite meru ninepelladata cinemalolaga chala ibbandulu padiunttaru.

sreenika చెప్పారు...

ఇదిగో చిన్ని గారూ
మీకిదే last post. It is unbearable to read any more.మీరు PANDU పేరుతో సరిపెట్టుకుంటారా..లేదంటే PANDU పేరు నుంచి 'మిమ్మల్ని' తప్పించేసి 'నేను'వచ్చేస్తాను.
అర్ధం కాలేదా? అయితే ఇదో పజిల్ కి పిల్ల పజిల్.

పవన్ చెప్పారు...

చిన్ని గారు మీ ముద్దు పేరు అప్పు కదా

చిన్ని చెప్పారు...

@అనఘ
టబు పడ్డ పాట్లన్ని మనకి అనుభవమే ...:)
@శ్రీనిక
సరిపెట్టుకోక చస్తానా :)....మీ పేరు కూడా నాకు తెలిసింది.:)
@పవన్
ఏ అప్పు ...?ఆసియన్ గేమ్స్ అప్పునా..హ్యాపీ డేస్ అప్పు నా -:)

చిన్ని చెప్పారు...

@శేఖర్
గిఫ్ట్ ఎప్పుడు కలెక్ట్ చేసుకుంటారు ?-:)

పవన్ చెప్పారు...

chinni garu
???

చిన్ని చెప్పారు...

@PAVAN
-:)

పవన్ చెప్పారు...

చిన్ని గారు.
తెలిసిపోయింది..మీరు చేప్పినప్పుడే నేను చేప్తా సరేనా :))

మధురవాణి చెప్పారు...

చిన్ని గారూ,
సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలాగా ఉందండీ ఈ టపా, ఇక్కడి వ్యాఖ్యలూ..
ఇక మావల్ల కాదు భరించడం :(
అయితే చివరాఖరికి 'పండూ' అనేసుకోమన్నట్టేనా మరి.? ;)
అన్నట్టు...అప్పుడెప్పుడో ముద్దుపేరు గురించి నేనొక పోస్టు రాసాను. వీలుంటే ఓ లుక్కెయ్యండి :)
http://madhuravaani.blogspot.com/2008/12/blog-post_7743.html

చిన్ని చెప్పారు...

@మధురవాణి
మీరు మొత్తం కామెంట్స్ తో సహా చదివారు కదా ......మీరే చెప్పేయండి.
మీరు రాసిన కథ చూసొచ్చాను చాల బాగుంది

సిరిసిరిమువ్వ చెప్పారు...

అన్యాయం అన్యాయం...ముందు చెప్పింది నేను..మీరేమో శేఖర్ గారికి గిఫ్టు అంటున్నారు..మరి నాకో!!

చిన్ని చెప్పారు...

@సిరిసిరిమువ్వ
-:):)మీరు గుర్తొచ్చిందని ఆపేశారు ...ముందుకువెళ్ళి నీ పేరు కచ్చితంగా ఇదే అనలేదు ....నాకు అనుమానం శేఖర్ మీరు ఇచ్చిన క్లూ తోనే ''ఫైండింగ్ పెట్ నేమ్ ''డిటెక్టివ్ ఏజెన్సీ తెరచినట్లున్నారు .గిఫ్ట్ ఎక్కడ కొనిపించుకోవలో శేఖర్ ఇంకా నిర్ణయించుకున్నట్లు లేరు ...శేఖర్ తో కన్సుల్ట్ చేద్దాం గిఫ్ట్ ఎవరికి చెందుతుందో...-:)

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

చిన్ని గారు,
అబ్బ...మీ టపా ఎంతమందిని ఎంటర్టైన్ చేసిందో చూడండి.....ఇక గిఫ్ట్ అంటారా.....మీరెక్కడ కొన్నా సరే నాకు ఓ.కె. ఏమంటారు? ఇక నేను సిరిసిరిమువ్వగారు ఇచ్చిన క్లూ బట్టి లాగానంటారా??? లేదండీ...మీరు ఈ టపా పోస్ట్ చేసిన కొద్ది రోజుల ముందే ఏదో చానల్ లో ఆ సినిమా ఇచ్చాడు. సో మీటపా చదవగానే అదే నాకు స్పురించింది. దానికి సిరిసిరిమువ్వగారు కూడా తోడవ్వటంతో నా రీసెర్చీకి పదును పెట్టాను. ఎనీవే తనతో గిఫ్ట్ పంచుకోడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. :)) మరి అడ్రస్ చెప్పమంటారా? :))
( సంవత్సరానికి సరిపడా ఆక్సిజన్ ని పీల్చుకోడానికి(మరి హైదరాబాదులో దొరకదు కదండీ..) దసరా పేరుతో ఓ పదిరోజులు లీవు తీసుకుని మా ఊరు వెళ్ళటంతో స్పందించడానికి కొంచెం టైం పట్టిందండీ... )

చిన్ని చెప్పారు...

@sekhar
adrs ivvandi pampistam...nijamga nijam:) konchem busyga vunnanu ..tensn taggagane pampistanu.