9, అక్టోబర్ 2009, శుక్రవారం

క్రిటికల్ కేర్ లో 'బాపుబొమ్మ'

సాయంత్రం ఆఫీసు నుండి తిన్నగా ఇంటికి వెళ్ళకుండా సిటీలో వున్నా మల్టీ స్పెషాలిటి హాస్పిటల్ కి వెళ్లాను ..ఐ.సి .యు విసిటింగ్ హౌర్స్ సాయంత్రం రెండు గంటలు మాత్రమె కావడం వలన ఒకింత ఉద్విగ్నత తో రూం దగ్గరకి చేరి నా చేతిలోని హ్యాండ్ బాగ్ అక్కడే కూర్చ్చున్న మా కజిన్ ఒడిలో విసిరినంత పనిచేసి తలుపు తోసుకుంటూ రూం లోకి వెళ్లాను.నా కళ్ళు మూలనున్న బెడ్ వైపు వెళ్ళాయి...ఒక్కసారే దిగులు కళ్ళు మసకబారిపోయాయి .....క్రిటికల్ కేర్ బెడ్ మీద ''బాపు బొమ్మ ''...అటు ఇటు నర్సేస్ బ్రతిమాలుతూ పాలు తాగిస్తూమద్య మద్యలో ఆమె తల అడ్డంగా తిప్పుతూ ....నేను తనని సమీపించగానే నన్ను చూసి కనుబొమలు ఎగరవెస్తు నవ్వింది ఆ హాస్పిటల్ రూల్స్ ప్రకారం రెండుజడలు వాళ్ళ యునిఫారం షర్ట్ వేసుకున్న తనని చూస్తుంటే పోలిక లేకపోయినా 'వసంతకోకిల''సినిమాలో శ్రీదేవి గుర్తొచ్చింది .నన్ను గుర్తుపట్టలేదు ..అర్ధం అయ్యింది ...ఎప్పుడో వుండుండి మన లోకం లోకి వస్తుంది..అప్పుడు నన్ను అడుగుతుంది అలానే మాట్లాడిస్తూ వుండగా హటాత్తుగా మన లోకం లోకి వచ్చి నన్ను గుర్తుపట్టి కన్నీరు .....తనకి జ్వరం రావడం తల నొప్పి రావడం చెబుతుండగానే మరల వేరే ధ్యాసలో చిన్న పిల్ల లా గోల ....మూడు రోజుల్లో ఎలా వుండే మనిషి ఎలా అయ్యిందో తలుచుకుంటే గుండె చెరువు అయ్యింది .రంగు మారి,పాలిపోయిన పెదవులు నిర్లిప్తంగా ఎటో చూస్తున్న కళ్ళు చిక్కిపోయిన చెంపలు ....యంత మార్పూ ....ఈమేనా ''బాపుబొమ్మ''....
కళ్ళు తుడుచుకుంటూ బయటకి వచ్చి కొంచెం ఎడంగా వున్నా బాల్కనీ లో కూర్చున్న వచ్చేపోయే వారిని చూస్తూ ...ఒక్కసారే నా మనసు గతం లోకి పరిగెట్టింది... ఆమెను మొట్ట మొదటిసారి నేను ఆరవ తరగతి చదువుతుండగా చూసాను .స్కూల్ నుండి వచ్చేసరికి మా ఇంటి బయటి చక్కబల్ల ఊయ్యాలలో ఒడిలో నెలల బాబుతో అపరిచితురాలు ,కళ్ళు చెదిరే అందం ...మెరిసిపోతూ బాపుబొమ్మ (ఈ పేరు అక్క పెట్టింది ) ఊయల నుండి నేలను తాకుతున్న పెద్ద జడ ....పోటి పడుతూ ఆమె పమిట చెంగు ....అలా కళ్ళార్పకుండా చూస్తున్న మమ్మల్ని ఆవిడకు పరిచయం చేసింది మా అమ్మ .ఆవిడ నవ్వుతుంటే మరింత అందంగా వుంది ...కాసేపట్లో ఆవిడతో కలసిపోయము .ఆమె అమ్మమ్మ చెల్లి కోడలాట.. మా అమ్మకి తమ్ముడు వరుస అవ్వుతాడు ..అతను కొవ్వూరు క్యాంపు కి వస్తు ఆమెను కూడా తీసుకు వచ్చాడట .మాకు చుట్టాలు అప్పటివరకు సరిగ్గా తెలియదు..వున్నా రెండురోజులు సరదాగా గడిచిపోయింది..ముఖ్యంగా అక్కా నేను ఆమె అందాన్ని తెగ అడ్మిరే చేసేవాళ్ళం .
తరువాత మేము కాలేజికి వచ్చాక నాన్నగారు పనిచేసే ఊర్లోనే అమ్మ వాళ్ళ కజిన్ వాళ్ళుకూడా ట్రన్స్ఫెర్మీద రావడం ఆమె తన పిల్లల్ని తీసుకు రావడం మేము వెళ్ళడం జరిగిందీ ..ఆమెలో అందం ఏ మాత్రం తగ్గలేదు సరికదా అప్పటికంటే ఇంకా అందంగా వుండినది .ఏ చీర కట్టిన బొమ్మలా వుండేది .
నా నిశ్చితార్ధం రోజు ఆమెదే మా అత్తగారి తరుపు హడావిడి ....ఎందుకంటే ఆమె ఆ ఇంటి పెద్దకోడలు కాబట్టి ...నేను ఆ ఇంటి చిన్న కోడలిని ...ఆ బాపు బొమ్మ నా తోటికోడలు.ఇప్పటికి ఏభయ్యేళ్ళ వయస్సంటే ఎవ్వరు నమ్మరు నలభయ్యిలో అడుగు పెట్టినట్లున్టది....అమృతం తాగుతున్నావా అని అడుగుతుంటాను...అన్నిటికి నవ్వే తన సమాధానం ......
మూడు రోజులక్రితం హటాత్తుగా తలనొప్పి తీవ్ర జ్వరం తో పడిపోయి ఒక రోజంతా కోమాలో వుండి...మృత్యు ముఖం నుంచి బయటపడింది బ్రెయిన్ ఫివేర్ ..ఒక కిడ్నీ ఫెయిల్ అయ్యి బ్రెయిన్ కి ఇన్ఫెక్షన్ వచ్చి ఇలా ..మనలోకం లోకి వచ్చి తన లోకం లోకి వెళ్ళిపోతుంది ..మెలుకువ వస్తే అందరికోసం చూస్తుంది అదీ నిమిషాలే ....కోలుకుని మాలోకి రావాలని అందరం ఎదురుచూస్తున్నాం ...ఆ పిల్లలు మరీ తల్లడిల్లుతున్నారు .....ఆ పైవాడు ఏం చేస్తాడో చూడాలి ....

24 కామెంట్‌లు:

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

ఏమని వ్యాఖ్యానించను?బాపు బొమ్మ బోసిబొమ్మ అయినతీరా?పగులుతున్న గాజుబొమ్మ గతజ్ఞాపకాలను వ్యాఖ్యానించాలా?

అతికించ ప్రయత్నించడం మన ధర్మం
అతికించడం పైవాడి దయ.

కోలుకోవాలని కోరుకుంటూ...

Padmarpita చెప్పారు...

ఆవిడ త్వరలో కోలుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను.

తృష్ణ చెప్పారు...

ఆ పిల్లలు ఎంత బాధ పడుతున్నారో...
ఆమె భర్త ఎంత వేదన లో ఉన్నారో...
మీ బాపూ బొమ్మకు త్వరలొనే నయం కావాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తాను...

సుభద్ర చెప్పారు...

ఎమి రాయలో తెలియట౦ లేదు..కాని అ౦తా మ౦చే జరుగాలని కోరుకు౦టున్నాను.

మరువం ఉష చెప్పారు...

Just pray to god. Remember gita and what Lord Krishna said.

sreenika చెప్పారు...

భగవంతుడు కరుణించు గాక.

నేస్తం చెప్పారు...

ఆవిడ కోలుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను

sunita చెప్పారు...

>> అతికించ ప్రయత్నించడం మన ధర్మం
అతికించడం పైవాడి దయ.

కోలుకోవాలని కోరుకుంటూ...>>

ఉమాశంకర్ చెప్పారు...

తను కోలుకోవాలనీ, ఆ విషయం మీరు త్వరలొ మాతో పంచుకోవాలని ఆ పైవాణ్ణి ప్రార్ధిస్తూ ..

Giridhar Pottepalem చెప్పారు...

త్వరలో కోలుకుని బాపు బొమ్మలా కల కాలం కళ కళలాదాలని ఆశిస్తున్నాను.
- గిరిధర్ పొట్టేపాళెం

మురళి చెప్పారు...

మరేమీ పర్వాలేదండీ.. అంతా మంచే జరుగుతుంది..

Hima bindu చెప్పారు...

స్పందించిన ''మిత్రులందరికీ ''ధన్యవాదాలు ...ప్రస్తుతం అదేపరిస్థితి కొనసాగుతుంది అందరి కోరిక భగవంతుడు ఆలకిస్తాడని నమ్ముతున్నాను .

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

బాపుబొమ్మని ఇదివరకులా చెంగు చెంగున చలాకీగా తిరిగేటట్టు చెయ్యాలని దేవున్ని కోరుకుంటున్నాను.

కొత్త పాళీ చెప్పారు...

too sad

భావన చెప్పారు...

Oh so sorry to hear that chinni. Hope she recover soon. our heart and prayers are with her. All the best.

తృష్ణ చెప్పారు...

ఇప్పుడు ఆవిడకు ఎలా ఉందండి..?

పరిమళం చెప్పారు...

మీ పోస్ట్ చదివితే మీ మధ్య బంధం ఎంత గాఢ మైనదో తెలుస్తోంది .భగవంతుడి దయవలన ఆవిడ తప్పక కోలుకుంటారు .

Hima bindu చెప్పారు...

స్పందించిన మిత్రులకు ధన్యవాదాలు .కొంచెం ఆశలు చిగురిస్తున్నాయి తృష్ణ .

మరువం ఉష చెప్పారు...

I am glad that she is doing better, Wish her a speedy recovery. I hope you are coming back to terms too! This is life and all about uncertainties and unexpected moments. Stay calm and believe in good times to come back every and now and again! Stay positive.

Hima bindu చెప్పారు...

తనకి లైఫ్ రిస్క్ తప్పింది ...

Hima bindu చెప్పారు...

@USHA
THANQ..:)

జయ చెప్పారు...

కంటికి రెప్పలాగా కాపాడుతున్నారుగా. తప్పకుండా మన లోకంలోకి వొస్తుంది. దేవుడు దయామయుడు.

గీతాచార్య చెప్పారు...

Happy to know abt recovery. Hwz she now?

Hima bindu చెప్పారు...

@GEETACHARYA
Thanq...she is fine.