24, అక్టోబర్ 2009, శనివారం

నేను

కళ్ళు విప్పిచుసే సరికి చుట్టూ అంత పచ్చగా నాలానే ....ఎండవానలో ఊహవచ్చేవరకు ఎదిగాను ....అసలు ఎందుకు పెరుగుతున్ననో ,ఎక్కడినుంచి వచ్చానో నాకే తెలిదు ..చినుకు రాలినపుడు పరవశించుతూ ,ఉరుములు ఒరుమినపుడు ఉలిక్కిపడుతూ .. మెరుపులు చూసి ఆశ్చర్యపోతూ ....మంచుకి వణుకుతూ ఇదంతా ఏవిటని .అడగాలంటే చెప్పేవాళ్ళు లేరు అన్నిటిని చూస్తూ ...రాత్రివేళ నిద్ర రానపుడు నక్షత్రాలను లెక్కపెడుతూ ...
ఎప్పుడు పూయడం మొదలు పెట్టానో ...నాలో వయసేప్పుడు వికసించిందో నాకే తెలీదు ..వసంతం లో కోయల కూసినపుడు తొలి వలపు గుండెల్లో వికసించడం మాత్రం గుర్తుంది .ప్రకృతి నాలో నింపిన సొగసునంత నీలాకాశం కింద పచ్చగా పరిచాను .నా పూల సొగసుకి మురిసిన తుమ్మెదల ఝుంకారాలు,తీనటీగల హోరు ,సీతాకోక చిలుకల సందడి.......నాలో ఏదో చిన్న గర్వం ...నాకోసమేకదాఅని హొయలు ...అసలు ఇంతకి నేనెవర్నో ..?

17 కామెంట్‌లు:

jeevani చెప్పారు...

ఇలా కామెంట్లలో అసందర్భంగా దూరినందుకు ముందుగా క్షమించండి. దయచేసి ఒక్కసారి http://jeevani2009.blogspot.com/2009/10/blog-post_25.html ను సందర్శించండి పేరును సూచించండి ధన్యవాదాలతో, మీ జీవని.

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

చిన్నిగారు చాలా కష్టమైన ప్రశ్న వేసారహో... అయినా మాకేమి తెలుస్తుందండి. మీ పెరటి పున్నాగ చెట్ల వేదనలు?
మీరు ముగ్గులు బాగా వేస్తారా? ఓ చుక్కలు తెగ పెడుతున్నారు :)

మరువం ఉష చెప్పారు...

నీవెనరో నాకు అనవసరం, మా "చిన్ని" కలానికి కవితనిచ్చావు. ఆ వచనంలో పచ్చగా మెరిసావు. విచ్చిన నీ పూలతో నాకు రాయబారమంపావు. మరిన్ని వూసులు చెబ్తామంటే చిరునామా చెప్పకనే చక్కా పోయావుగా ఓ మొక్క?

మురళి చెప్పారు...

మీరు 'చిన్ని' కదండీ?? :):)

cartheek చెప్పారు...

మీరు మీరు మీరు బ్లాగు వనంలో పూసిన ఓ అందమైన పువ్వు

Hima bindu చెప్పారు...

@జీవని
తప్పకుండ చూస్తానండి,మీరు చేసే సేవలు బ్లాగ్ ద్వారా చూస్తూనే వున్నాను మీకు అభినందనలు .
@భా.ర.రే
మా ఇంటి పెరటిలో పున్నాగ వుందని ఎవరు చెప్పరేంటి ?అంత అదృష్టమే ...మా కాలనీ లో వుంది .
చిన్ని బిందువునిగా ......అలా అల అలవాటు .ధనుర్మాసం లో రాత్రుళ్ళు మా వాకిళ్ళు నా కళాఖండలతో సోకు చేసుకోవలసిందే .
@ఉష
ముంజేతి కంకణం నకుఅద్దమేల యన్నట్లు ..పూల తల్లి మనసు మరువం నకు తెలియనిదా :):)

Hima bindu చెప్పారు...

@మురళి
నీ నెమలికన్ను నా నీడలో మైమరచి ఆడిన వైనం అప్పుడే మరిచావా ....హు నన్ను చిన్ని అంటావా ?
@కార్తిక్
పువ్వు కాదు అది "చెట్టు "..అడవిలోని అందమయిన చెట్టుని :)

తృష్ణ చెప్పారు...

నా బ్లాగ్ పేరు క్రింద tag చదివారా ఎప్పుడన్నా...
A woman's search for identity...
"నేనెవరు" అన్న అన్వేషణ.....అదే తెలుసుకోవాలని తృష్ణ ...
అదే ఇవాళ్టి మీ టపా...

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

మీరిలా పజిల్ ప్రశ్నలు అడిగితే ఎలాగండీ...?
బాగా రాసారు.

జయ చెప్పారు...

బాగుంది చిన్ని గారు. అసలు ప్రకృతికి కి మూలాధారమే నీవు కదా! అందుకేనేమో అంత గర్వం.

శివ చెరువు చెప్పారు...

prakruthi kaantha ayi vundavacchu.. mee re cheppandi.. :)

Hima bindu చెప్పారు...

@తృష్ణ
అవునా -:)
@శేఖర్
నేను పజిల్ ఇచ్చానా?అదేంటో వేచి చూడండి ఓపిక వుంటే :)ధన్యవాదాలు .
@జయ
హుమ్మ్...ఎంత మాట !
@శివచేరువు
కవుల కళ్ళకి అందరూ కాంతలే ...ఇదే కవి హృదయం .ధన్యవాదాలు

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

చిన్నిలో చిన్నగా కవయిత్రి నిద్రలేస్తున్నట్లుంది. మీ అక్షరాల అల్లిక బాగు, అల్లికతో అలరారిన ప్రకృతి వర్ణన బహుబాగు.వెరసి చిన్ని చిత్తము ప్రకృతి ఒడిలో ఊయల.

ఈ సారి ఇన్ని చుక్కలు రాకుండా కొద్ది చుక్కలు పెట్టండి.jk

Padmarpita చెప్పారు...

వేచి వుంటాను ఓపికతో జవాబు ఎప్పటికైనా తెలియపోతుందాని:)

భావన చెప్పారు...

నేనెవరంటే.... నీలాకాశం కింద పచ్చ గా పరిచిన ప్రకృతి అందాల తోడు గా
ఎదిగిన చిన్ని... హిమ బిందువు .. అవునా? :-)

నరసింహ మూర్తి చెప్పారు...

ప్రకృతి తన పనిని ఆపి సేద తీరి ఒక ప్రశ్న వేసుకుంటే ... అచ్చం ఇలాగే ఉంటుంది మీరు రాసినట్టు .... " నేనెవరు ? " అని

Hima bindu చెప్పారు...

@పద్మర్పిత
మీకు ఓపిక ఎక్కువ .ధన్యవాదాలు .
@భావన
అధ్బుతం ...
@నరసింహ మూర్తి
నిజమేనండీ .ధన్యవాదములు .