19, అక్టోబర్ 2009, సోమవారం

కార్తీకసోమవారం

నిన్న రాత్రి నిద్రపోయేముందు రోజు లేచేదానికంటే అరగంట ముందు లేవాలని నిర్ణయించుకోవడం తోపాటు ఎందుకైనా మంచిదని టైం సెట్ట్ చేసి నిద్రలో వున్నా మావార్ని లేపి "అలారం మోతకి నేను లేవకపోయిన నువ్వు లేస్తావు కాబట్టి నన్ను లేపు" అని చెప్పాను .ఎక్కడికి వెళ్తున్నావు అన్న మావారిని విసుక్కుని ,ఎటు వెళ్ళడం కాదు కార్తిక సోమవారం శివాలయం కి వెళ్ళాలి....అన్న నా మాటలు విన్నారో లేదో తెలీదు నిద్రలో వున్నారు కాబట్టి సరిపోయింది లేకపోతె ఇంత హటాత్తుగా నాలో పెరిగిన ఈ భక్తి శ్రద్దలకికళ్ళు తిరిగి పడిపోయేవాళ్ళు
తను లేపకుండానే అలారం మోతకి మెలకువ వచ్చింది ...చల్లటినీళ్ళు నెత్తిమీద పోసుకుని పూలు పళ్ళు ఆవుపాలు తీసుకుని మా ప్రక్క వీధి లో వున్నా శివాలయం కి వెళ్లాను.అక్కడ చాల ప్రశాంతంగా వుంటుంది అరగంట అభిషేకం పూజ అయ్యాక ,అరగంట ఆ ఆలయ ప్రాంగణం లో వున్నా అరుగుల మీద కూర్చుని ఉసిరిచేట్టుకు పూజలు చేస్తున్న భక్తులను ,వచ్చిపోయేవారిని గమనిస్తూ ఉషోదయాన్ని గడిపేశాను .
గంట తరువాత ఇల్లు చేరిన నన్ను చూసి మావారికి ఒహటే హాచ్చర్యం:) నాకెమైందాఅని .
తనకి మాత్రమె టి చేసి ఇచ్చాను ....తను ప్రశ్న వేయక ముందే చెప్పాను ..ఈ రోజు నేను ఉపవాసం వుండబోతున్నాను అని ...
నువ్వు నువ్వేనా ,....అని ప్రశ్న .
నేను నేనే ....నా జవాబు .
అయితే ఏదో ప్రళయం రాబోతుంది .....తను సాలోచనగా నా వైపు చూస్తూ .
జలప్రళయం వచ్చేసింధిగా ....ఇంకేం వస్తుంది ....నేను .
భూకంపం రావచ్చేమో ....నువ్వేమిటి ,శ్రద్దగా గుడికి వెళ్ళడం అంతటి తో సరిపెట్టుకోక కార్తిక సోమవారం ఉపవాసం ,మీ అమ్మ వెనకపడితెగాని పౌర్ణమికి దీపాలు వెలిగించే నీవు ...హ్మం ...ఏదో అయ్యింది నీకు ......మావారు ఒకింత మురిపెంగా (భక్తి ఎక్కువ )
యెమికాలెధుగాని..మీ పేరున పాప పేరున పూజ చేయించాను మంచిదని .,వంట మీ ఒక్కరికే ...చేయమంటావా ?వద్దా ?......నేను .
టిఫిన్ చేయి చాలు ,బయట తినేస్తాను ....మరి ఆఫీసుకి వెళ్ళవా ?...తను .
ప్చ్ ...వెళ్ళను....రెస్టు తీసుకుంటాను
పోనీ నేను వెళ్ళేప్పుడు మీ అమ్మ వాళ్ళింట్లో డ్రాప్ చేయనా ...తను .
అబ్బ వద్దులే ..నేను వెళ్ళాలంటే వెళ్తానుగా.........నేను. .
నెట్ కూడా చూడవా ?....నవ్వుతు ...తను .
అయ్యో ....అదేకదా మనకి కాలక్షేపం ....
హమ్మో ఒక్కరోజు నా అంతట నేను గుడికి వెళ్ళితే ఎంత ఆనందమో కదా ఈయనకి ....అసలు సంగతి చెపితే ఆయన ఫీలింగ్స్ యెట్లా వుంటాయో ....
గత ఆరునెలల నుండి నేను చాల లేజీ గా తయారయ్యాను .ఉదయం నా షెడ్యులు అస్తవ్యస్తంగా వుంటుంది .బొత్తిగా సెల్ఫ్ డిసిప్లిన్ లేకుండా తయారయ్యాను .పని మీద కూడా శ్రద్ధ తగ్గింది .ఆఫీసు విషయాలు బర్డెన్ గా ఫీల్ అవ్వుతున్నాను ....అలాటి ఆలోచన క్రమమే మార్చుకోవాలని తెగ ప్రయాస పడుతున్నాను .కనీసం ధ్యానం కి ఇరవయ్యి నిమిషాలైనకేటాయించే నేను పూర్తిగా నిర్లక్ష్యం చేసాను ..నన్ను నేను నిర్లక్ష్యం చేసుకుంటున్నాను ...ఇలానే వుంటే ఏమై పోతానో అనే భయం అంతర్లీనంగా ....హెచ్చరిస్తుంది .నిన్నంత బాగా ఆలోచించాను ...సోమవారం నుండి అమలు చేయాలి ...ఎలాను కార్తిక మాసం ...ఒంటికి అలానే మనస్సుకు పట్టిన బద్దకం వదుల్చుకోవాలి .....పూర్వం పు చిన్ని లా మారాలంటే వేకువనే నేనచరించే "భావాతీత ధ్యానమే "మార్గమని నా అంతర్వాణి పదేపదే చెబుతుందీ ...ప్రశాంతమైన వాతావరణం లో పునః ప్రారంభించాను నా ధ్యానం ..
నాకిష్టమైన శీతాకాలపు ఉదయాలు పొన్నాయిచెట్లు రాల్చే పూలను ఏరుకుంటూ మసక చీకట్లలో నడిచే నా నడకను...భాల భానుడి వేలుగురేకల్ని మిస్ కాకూడదనే ధృడమైన సంకల్పం తో నా వెనుకటి జీవితానికి శ్రీకారం చుట్టాను ....ఈ కార్తికసోమవారం ...ఈ రోజు పూర్తిగా నాది ....రాబోయే రోజులకి రచన చేస్తూ ......

26 కామెంట్‌లు:

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

ఆల్ ద బెస్ట్..

మాలతి చెప్పారు...

రాబోయే రోజులకి రచన చేస్తూ ... చేయడానికి కార్తీకసోమవారం ఉత్తమమంటారు. ఈరోజు కొత్తవిషయం తెలుసుకున్నాను. చాలా బాగుందండీ. :)

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

అచ్చం ఇలాగే జరిగింది మా ఇంటిలో. ప్రొద్దునే నాలుగింటికి లేపండి రేపటినుంచి నేనే పూజ చేస్తానని నిన్న రాత్రి మా గృహమంత్రి చెప్పింది.హాశ్యర్యం.తను మామూలుగా ఆరు గంటలకు ,నేనేమో నాలుగు గంటలకు లేస్తాము.లేచి పూజయితే చేసింది కానీ గుడికి వెళ్ళలేదు.

ఉమాశంకర్ చెప్పారు...

ఆల్ ద బెస్ట్ అండీ...

Unknown చెప్పారు...

ఆఫీసు పని ని ఎప్పుడు ఇష్టపడే చెయ్యాలి లేక పొతే కష్ట పడాల్సి వస్తుంది .అదీ కాక సమాజం లో మన గుర్తింపు మన వుద్యోగం బట్టే కాబట్టి అందు లో అశ్రద్ద అస్సలు పనికి రాదు .అని మనకి మనమే క్లాస్సు పిక్కోవాలి గాడి తప్పినప్పుడు .మీ లాగే నేను మహేష్ యోగి భావాతీత ధ్యానం ఆపేసి కొన్నేళ్ళు అయ్యింది , మీ పోస్ట్ తో స్పూర్తి పొంది ధ్యానం లో కూర్చుని అప్పటి మంత్రం ఏదో గుర్తు తెచ్చుకుని అయిదు నిముషాలు అయ్యిందో లేదో సెల్ మోగింది నా కల చెదిరింది .

తృష్ణ చెప్పారు...

పొన్నాయి చెట్లంటే తెల్లగా పెద్ద పెద్ద లేతాకుపచ్చ కాదలతో ఉంటాయి అవేనాండీ? వాతిని మేము కాగడా మల్లి అంటాము...అవే అయితే ఆవి మా ఫామిలీ మొత్తానికి ఫేవొరేట్ పువ్వులు..

మీ స్పూర్తి తో నేనూ గాది తప్పిన నా మోర్నింగ్ వాక్ ను మళ్ళీ మొదలెడతాను..(ఇది మూడునెల్ల్కోసారి గడి తప్పుతూనే ఉంటుంది..:))

కార్తీక మాసం లో...రోజూ గడపలో దీపలూ,కార్తీక పౌర్ణమి...క్షీరాబ్ది ద్వాదశి...నాకెంతో ఇస్టం..!!

Hima bindu చెప్పారు...

@శేఖర్
ధన్యవాదాలు
@తే.తూలిక
మేడం ......మన భక్తెంతో నా పోస్ట్ చదవగానే అర్ధం అయ్యిందనుకుంటాను ...ఈ వంకన మన దగ్గర చేరిన దుష్ట శక్తులని వదుల్చుకోవడం .(...బద్ధకం )..అటు పుణ్యం ఏదైనా వస్తే పుచ్చుకుందామని .ధన్యవాదాలు .
@విజయమోహన్
కార్తికంలో ఈ ఆడోల్లంత ఇంతే కాబోలు -:)

Hima bindu చెప్పారు...

@ఉమా
ధన్యవాదాలు
@రవిగారు
ఉద్యోగం గుర్తింపుకంటే మన భాద్యత అనుకుంటాను ....జీతం తీసుకుంటాం కాబట్టి .
@తృష్ణ
కాగడ మల్లి అంటే చిన్నపూలండీ ..అవి కూడా కార్తికం లోనే వస్తాయి ..పెళ్ళిళ్ళకి జడలకి ఎక్కువ వాడతారు .
పొన్నాయిపూలు పొడవైన కాడలతో లిల్లీ పూలను పోలి వుంటాయి ..గుత్తులు గుత్తులుగా పూస్తాయి మనం నీళ్ళలో పెట్టి ఫ్లోవేర్వసేస్ గ పెట్టిన రెండ్రోజులుంటాయి..మంచి వాసన వస్తుంటాయి ..అమరావతి వెళ్ళినప్పుడు గుడి ప్రాంగణం లో ఎరుకునేదాన్ని ...చిన్నప్పుడు రేకలతో బుడగలు చేసి నుదురికి కొట్టుకునే వాళ్ళం ...కాడలతో మాలలు అల్లోచ్చు ...చెట్లు చాల పెద్దవిగా వుంటాయి ....బాగా చలికాలం వచ్చాక విరగాబూస్తాయి ....మాచ్ అయ్యిందా ;):)

జయ చెప్పారు...

చాలా బాగుంది ప్రణాళిక. పుణ్యం, పురుషార్ధం. అయితే ఇంక చాలా రచనలే మేము చూడచ్హు. All the best.

sreenika చెప్పారు...

మంచిది, శుభమస్తు..
పొన్నాయి పూలంటే..డిసెంబరాలు అంటారు అవేనా..అబ్బ టెంషన్ తట్టుకోలేకపోతున్నాం. వీలైతే మరింత వివరణ..కుదిరితే ఓ ఫోటో...

పరిమళం చెప్పారు...

ముందుగా ఇంతమంచి నిర్ణయం తీసుకున్నందుకు అభినందనలు ! నాకూ కార్తీకమన్నా ,ధనుర్మాసమన్నా ప్రత్యేకమైన ఇష్టం ! అన్నట్టు నిన్న నేనూ ఉపవాసమేనండోయ్ . ఉపవాసం చెల్లించేముందు గుడికెళ్ళి దీపాలు వెలిగించి ...కుక్కకు అన్నం పెట్టాలి ...నిన్న కుక్కకోసం మావారు పడినపాట్లు రాస్తే ఓ టపా అవుతుంది :) తీరా వెదికి పెట్టాకా అది తినదే ...మేమేదో దానిమీద విషప్రయోగం చేయడానికొచ్చిన విలన్ల లా మమ్మల్ని చూసింది :)

Hima bindu చెప్పారు...

@జయ
అయ్యో ! రచనలు అంటే నేనేదో కథ రచనలు చేయబోతున్నట్లు అందరు అపార్ధం చేసుకున్టునట్లున్నారు....అబ్బే ...అదేమీ కాదండీ ...నా భవిష్యత్ ప్రణాళికలు ...అంటే ఆఫీసు ,ఇల్లు ,పిల్ల ..సన్నిహితులు కోసం ,నా సమయం ఎట్ట ఉపయోగించుకోవాలా అని ....-:):) మాత్రమె ....
@శ్రీనిక
డిసెంబెర్ పూలకు సువాసన వుండదుకదండీ ...అవి అన్ని రంగుల్లో వుంటాయి .పొన్నాయిచెట్టు వృక్షం ,పొదలు కాదు ...ఆకులు ఆరెంజి బెల్స్ తీగను పోలి వుంటాయి ..కొంచెం వేపాకులంత చిన్నగా ...పూలు పొడవైన కాడతో ఐదు రేకల్తో ,ఐధవరేక జంటగా వుండిసగము మాత్రమె చీలి వుంటది ...నిజానికి నాలుగు రేకులు అనుకోవచ్చు ,,పుప్పొడి నాలుగు రేణువు గ వుంటుంది ...ఇంకా ఏమి చెప్పను ...హ్మం ...మంచి సువాసన తో చెట్టంత గుత్తులుగా విరగాపూస్తుంది ఈ చెట్లు కాలనీల్లో విరివిగా పెడతారు ఈవెన్ హై వే లలో వుంటాయి ...బొటనికల్ నేమ్ గుర్తులేదు తెలుసుకుని ఫోటో వెదికి పెడతాను .
@పరిమళం
ధన్యవాదాలండీ .మీరు కుక్క మీద విషప్రయోగం రాయాల్సిందే ...మేము చదవాల్సిందే -:):)

మురళి చెప్పారు...

బాగుందండీ నిర్ణయం.. అమలు జరుగుతోందో లేదో అప్పుడప్పుడూ రాస్తూ ఉండండి.. (ఆ భయానికైన అమలు చేస్తారు కదా అని:):) )

CARTHEEK చెప్పారు...

చిన్ని గారూ మీ నిర్ణయం ఫలించాలని మనసారా కోరుకున్తునాను .............
మీరు రాసిన తీరూ నాకు భలే భలే నచేసిందండి
ఇంతకీ ఆ పూలేవిటన్నారు పోన్నాయి పూలు అవేలాఉంతాయో చూడాలని నాకూ ఉంది ఒక ఫోటో పెట్టరు

అజ్ఞాత చెప్పారు...

మీరు వర్ణించిన చెట్ల గురించే నేను రాసినది..ఆ వృక్షలు మేమూ పెంచాము..వాటిని మేము కాగడా మల్లి అని అంటాము..కాగడాల్లా పెద్ద పెద్ద కాడలు ఉంటాయి కాబట్టి.. నేనూ,మా తముడూ ట్యూషన్ నుంచి వచ్చేప్పుడు ఏరుకునివచ్చి గాజుగాసులో నీళ్ళు వేసి పెట్టేవళ్ళం...ఆ పూల వసన అమోఘం.

Hima bindu చెప్పారు...

@మురళి
హ్మం ! ఈ చిన్ని అంటే ఏమనుకుంటున్నారు?...తలుచుకోవాలేకాని చేసి చూపిస్తుందండీ .ఈ రోజు ఉదయానే అయిదు గంటలకే వాకింగ్ కి బయటపడ్డాను..ఆఫీసు పనులు ఇష్టంగా చేసాను ...ఈ వారాం టూర్ మొత్తం ప్లాన్ చేసాను ....ఒకరకమైన సంతృప్తి వచ్చింది .కచ్చితంగా కొనసాగిస్తాను .ఒకటి రెండురోజులు పాత అలవాట్లతో ఇబ్బంది పడిన కూడా ......వారం తరువాత చెప్తానుగా .-:)
@కార్తిక్
థన్క్యు.......గూగుల్ వెదికాను దొరకలేదు ...ఫోటో తీసి పెడతాను .
@
@త్రిష్ణ
అవే చెట్లు ...దానిని కాగడ మల్లి అనరు ...తోకమల్లి అంటారు కూడా .....వాడుకలో పొన్నాయి అంటారు .

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

చిన్నీ గారు, నేను గోడమీదనే ఉన్నా.. పొద్దున 5గంటలకు రోజూ లేవక పోయారో... అంతా టాం టాం.. వినండహో

మాలా కుమార్ చెప్పారు...

మరి ఉపవాసం కార్తీక సోమవారమటుకేనా ? కార్తీక పౌర్ణమి కి కూడా చేయండి .పుణ్యమూ ,పురుషార్ధమూ !
ఆల్ ద బెస్ట్ .

Hima bindu చెప్పారు...

@భా.రా.రె
అందుకేగా నిన్ను బెడ్ రూంలో పెట్టకుండా హాల్లోగోడమీద పెట్టాను ...నీ కూసే కూతలు కూడా శ్రావ్యంగా వుండేట్టు పెట్టాను ..ఇంకేం టం టం చేస్తావమ్మా !....నీవు చూసావో లేదో ఐదు కంటే ముందే లేస్తున్న
పై మాటలు మీక్కాదు .:)
అవును మనలో మాట మొన్న పురందేశ్వరికి ఇరవయ్యి వేల డాలర్లు వరద సహాయం చేసారంట .ఇండియా లో హిందు చెప్పింది ...న్యూ జెర్సీ నుండి భారి వితరణ రామిరెడ్డి నుంచి అని .:):)అభినందనలు .

Hima bindu చెప్పారు...

@మాలాకుమార్
పౌర్ణమి కి వుంటానండి...ఎప్పుడు అమ్మ వల్ల....ఈసారి నెలంతా ట్రై చేస్తున్న ....స్వార్ధం వుంది .:)
ధన్యవాదాలు .

పరిమళం చెప్పారు...

@ తృష్ణ గారు పొన్నాయి చెట్లంటే మన చిన్నిగారి వర్ణన బట్టి చూస్తే పున్నాగపూలేమో అనుకుంటున్నా ...వాటినే తోకమల్లి పూలనికూడా అంటారు మంచి సువాసనతో ఉంటాయి .
అవునాండి చిన్నిగారు ?

Hima bindu చెప్పారు...

@పరిమళం
ఊఁ .అవునండీ ....పున్నాగపూలు అని కూడా అంటారు ....:):)

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

చిన్నీ భలే కనిపెట్టేసారే నా వుద్దేశ్యాన్ని! ముభావంగా వుండే చిన్ని మళ్ళీ తన ఒరిజినాలిటీ కి వచ్చేసింది. మీ పూజలేవో ఫలిస్తున్నట్టే వున్నాయి. సరే కానీ నేను టాంటాం వేద్దామనుకుంటే మీరిలా నాకు సర్ప్రైజ్ ఇస్తే ఎలా? :)

మరువం ఉష చెప్పారు...

మంచి అవలోకనం ఆచరణీయమైన ఆలోచన. ఇక ఏ అభిశంసకీ తావీయక కానీయండి మరి.

భావన చెప్పారు...

చిన్నీ బాగా చేసుకున్నారా కార్తిక సోమ వారం వుపవాసం? నేను చిన్నప్పుడు తెగ భక్తురాలిని. సోమ వారాలు నాలుగు, పౌర్ణమి, శివరాత్రులు తెగ చేసే దానిని. ఇప్పుడు అంత ఓపిక లేదు. బాగుంది మీ నిర్ణయం.
వామ్మో ఈ పొన్నాయి పూల ను ఒకళ్ళు కాగడా మల్లి అంటారు ఇంకొకళ్ళు డెచెంబర్ అంటారు.. వా... నాకు ఏదుపు వస్తోంది రా దేవుడా. ఇదుగో నా పోస్ట్ లో ఫొటో పెట్టెను చూడండి.. http://bhavantarangam.blogspot.com/2009/08/blog-post_11.html

Hima bindu చెప్పారు...

@ఉష
ధన్యవాదాలు
@భావన
నాకు స్వతహాగా భక్తి తక్కువే ,ఏదో గొప్ప శక్తి మనల్ని నడుపుతుంది అని మాత్రం నమ్ముతున్నాను అదయినాకాస్త వయసు పెరిగే కొద్ది .
మీకు చాల చాల ధన్యవాదాలు పొన్నాయి పూలనుచూపించినందుకు .నాకు ఎవరో బ్లాగ్ లో చూసినట్లు గుర్తు కాని మీదని గుర్తులేదు అదీ ఈమధ్యనే మీ పాత పోస్ట్లు చదివినపుడు చూసాను .హమ్మయ్య ఫోటో శ్రమ తప్పించారు :):)