8, అక్టోబర్ 2009, గురువారం

నేనంటే క్రేజ్ ....

నేనంటే ఎంత క్రేజ్ అర్ధం అవ్వుతుందిఈ మద్య బ్లాగ్ లో పదెపదె నన్ను తలుచుకుంటూ నా పేరుతో కామెంట్స్ రాస్తున్నారు,రాసేది ఆడో మగో కూడా బొత్తిగా అర్ధం కావడం లేదుకాని తరచి తరచి ఆలోచించగా ఈ రెండు జాతి కాకుండా మూడో జాతివాళ్ళని అర్ధం అవ్వుతుంది ...
ఏమైతేనేం "చిన్ని"అంటే పిచ్చి క్రేజ్ అనితెలుస్తుంది

12 కామెంట్‌లు:

Hima bindu చెప్పారు...

భా.రా.రే
అదే నా ఉద్దేశం లో ...మీ కామెంట్ పబ్లిష్ చేయడం లేదు ....వాళ్లకి మనకి తేడ వుండదు ...

Bhãskar Rãmarãju చెప్పారు...

??

మరువం ఉష చెప్పారు...

చిన్ని అన్నది చక్కని పేరు. ఏంచేస్తాం వదిలేద్దాం. క్రోధం వదిలి నాతో స్నేహంకి వచ్చేయండిక. వాళ్ళు వీళ్ళూ ఎవరంటా .. పాడేద్దాం :) యేం చేయను మరి చిన్ని, నాకు మాటల కన్నా పాటలే ఇష్టం! ఒక నిమిషమైనా వ్యర్థం చేయటం ఎందుకు? [అర్థమైంది కదా?]

Praveen Mandangi చెప్పారు...

మా చిన్నప్పుడు జరిగిన ఘటన ఇది. ఒక అబ్బాయి అమ్మాయి పేరుతో ఓ వార పత్రికలో ఉత్తరాలు వ్రాసాడు. అతను నిజంగా అమ్మాయి అనుకుని అతనికి రెస్పాన్స్ లు ఎక్కువ ఇచ్చారు. అతను తరువాత నిజం బయట పెట్టాడు. తాను అబ్బాయినని చెప్పుకుంటూ వ్రాసిన ఉత్తరానికి ఒక్క రెస్పాన్స్ కూడా రాలేదు. మన వాళ్ళకి అమ్మాయిలంటే అంత క్రేజ్. నాకు కెనడాకి చెందిన ఒక అమ్మాయితో పరిచయం ఉంది. ఆమెది విశాఖపట్నం. పెళ్ళైన తరువాత కెనడాలో స్థిరపడి అక్కడే ఉద్యోగంలో చేరింది. ఆమె మార్క్సిస్ట్-లెనినిస్ట్. ఆమె తల్లితండ్రులు కూడా మార్క్సిస్ట్-లెనినిస్ట్లే. యాహూ చాట్ లో మేము మార్క్సిజం-లెనినిజం గురించి మాట్లాడుకునేవాళ్ళం. నేను అమ్మాయితో చాటింగ్ చెయ్యడం చూసి కొందరు అది లవ్ అఫైర్ అని, కొందరు పెళ్ళికి ముందు సరదా అని అనుకునేవాళ్ళు. అలాంటిదేమీ లేదు, ఆ అమ్మాయికి పెళ్ళయ్యింది అని చెప్పేవాడిని. యాహూ చాట్ లో ఆ అమ్మాయితో మాట్లాడేవాళ్ళు తక్కువ. ఎందుకంటే ఆ అమ్మాయికి పెళ్ళయ్యింది కాబట్టి. పెళ్ళి కాని అమ్మాయి అయితే అబ్బాయిలు ఆమె మీద అనవసర ఇంటరెస్ట్ చూపించేవారు, అప్పుడు ఆమెకి చాటింగ్ ఫ్రెండ్స్ కూడా ఎక్కువగా ఉండేవారు. ఆడ-మగ రిలేషన్స్ లో ఇలా హిపోక్రిసీ ఉండకూడదు. నా కెనడా స్నేహితురాలికీ, నాకు మధ్య ఎలాంటి రహస్యాలూ లేవు. నా గురించి ఆమె భర్తకి కూడా తెలుసు. మేము వెబ్ కామ్, వాయిస్ చాట్ లో కూడా కనెక్ట్ అవుతుంటామని తెలుసు. కొంత మంది అమ్మాయిల మీద, అది కూడా పెళ్ళి కాని అమ్మాయిల మీద ఎక్కువ ఇంటరెస్ట్ చూపడం వల్ల ఆడ-మగ సంబంధాలు చెత్త అని అభిప్రాయం కలుగుతోంది.

తృష్ణ చెప్పారు...

మీరు రాసిన సంగతేమిటో నాకు తెలీదు కానీ ఒక పాట మాత్రం గుర్తుకు వస్తోంది..

"సిన్ని ఓ సిన్నీ..ఓ సన్నజాజుల సిన్నీ.. ఓ వన్నె గాజుల సిన్ని...
....ఉరుమురిమి చూసావంటే....ఉత్తరదిక్కూ ఊపేస్తుంది..
జింజిగిజింజిం జింజిగిజింజిం జింజిగిజింజిం జింజిగిజింజిం ...."

(సరదాకి రాసానండి..ఏమనుకోకండేం!)

కొద్దిగా నవ్వుతున్నట్లే కనిపిస్తోంది..

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

హ్మ్మ్...నేను చూశాను మీ పేర్లతో కామెంట్స్ రాయడాన్ని...కొంత మందికి Manufacturing Defect ఉంటుందండీ...అలాంటి Items ని ఏ చెత్తకుండీ లోనో పారేయాలి గానీ వారికి అంత ప్రాముఖ్యత ఇవ్వకూడదు అని నా అభిప్రాయం.

మురళి చెప్పారు...

ఇలాంటి సందర్భాలు ఎవరికీ వచ్చినా నేను చెప్పేది ఒక్కటే.. "పట్టించుకోకండి.."

Hima bindu చెప్పారు...

@భాస్కర రామ రాజు
ఇసరికి అర్ధం అయ్యే వుంటుంది అనుకుంటున్నాను .
@ఉష
పాడదామ ! అలాగే మీ మాట మీదుంటాను ....-:)ఎంచేద్దామండీ చూడగానే ఆవేశం ....అన్నిటికి అతీతంగా కావాలంటే కొన్నేళ్ళు పడుతుందేమోఅయిన ప్రయత్నిస్తాను .
@ప్రవీణ్ శర్మ
ఏమిటో శర్మగారు మనకు నచ్చినోళ్ళతో మనం చాటింగ్ చేస్తే మద్యలో ఎవరికో ఎందుకు ప్రోబ్లేమబ్బా,మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తె కనాడాఅమెరిక వాళ్ళతో ఇండియా లో వుండేవాళ్ళు మాట్లడగూడదా!

Hima bindu చెప్పారు...

@తృష్ణ
మీకు తెలియకపోవడమే బెటర్...
ఎటు చూసి ఉరమమంటారు -:) పశ్చిమ దిక్కా ?..ఉత్తర దిక్కా .....నాకైతే రెండు దిక్కులు వున్నాయని అనిపిస్తుంది .
నవ్వేసాం అసలే మనకు ఇష్టమైన పాట.
@శేఖర్
నిజమేనండి,...చాల అసహ్యం వేస్తుంది ఈ ''పిరికి ''వాళ్ళు చేసే పని. మీ సూచన పాటిస్తాను .
@మురళి
సరేనండీ .

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

చిన్నీ, మీరది పబ్లిష్ చేయాలనే రాసాను. ఏంచేస్తాం మీరు చేయలేదు.. వేరే దగ్గర రాసుకుంటాను :)

Unknown చెప్పారు...

ప్రవీణ్ మీ కెనడా ఫ్రెండ్ కి మీ కంటే కూడా నేను ముందే తెలుసు .ఇద్దరం తను కెనడా వెళ్లి పోయే ముందు చట్నీస్ లో లంచ్ కూడా చేసాము .చాలా స్థిరమైన భావాలూ కల అమ్మాయి .తన రష్యా పర్యటన ఫోటోస్ కూడా పంపింది .యి మద్య చాట్ చేసి రెండు సంవత్సరాలు అయ్యింది .రవిగారు మిమ్మల్ని అడిగారని చెప్పండి . యి పోస్ట్ ద్వార తనని గుర్తు చేసినందుకు , చిన్ని గారి బ్లాగ్ లోనే కామెంట్ రాస్తున్నా .

కలి చెప్పారు...

2001 లో మా వూరిలో మెయిల్స్ లో ఒక జంట కు మధ్య ప్రేమ జరిగింది. కాని కొన్ని అడ్డంకుల ... ఇంకా చెప్పాలి అంటే సంప్రదాయాల వలన సంప్రదాయవాడ శక్తుల మూలంగా నిలిచి పోయింది