16, అక్టోబర్ 2009, శుక్రవారం

''అల ''జడి

హమ్మ !యెంత నంగనాచివమ్మకృష్ణమ్మా
నిన్నటి వురుకు పరుగులేమయ్యయమ్మా ..
చేయాల్సినదంతా చేసేసి మౌనంగా సాగిపోతున్నావే
కలలో కూడా ఊహించని కల్లోలం రేపావే
కంటిమీద కూసంత కునుకు తీయనీక కుదిపెసావే
నీ ఒరవడికి తట్టుకోలేనంత ఉక్కిరి బిక్కిరి చేసావే
ప్రశాంతంగా సాగుతున్న జీవితాన్ని కలతబెట్టావే

నీ ప్రేమావేశ మొహంతో వువ్వేత్తరంగాలతో
నీ సందిట భందీ చేస్తే తట్టుకోగాలరనుకున్నవా
చూడు నీవు చేసిన గాయాలు ఇంకా మాయనేలేదు
చేయవలసినధంత చేసి నన్నేరగానట్టు కదిలి పోతున్నావా
నీవు చేసిన అల్లరి ఓపికగా భరించామే కాని నీపై కినుక వహించలేదే
ఎందుకంటావా ......నువ్వంటే మాకెంతో ఇష్టం అని చెప్పమంటావా ..........
14 కామెంట్‌లు:

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

చాలా బాగా రాసారండీ...అభినందనలు.

భావన చెప్పారు...

బాగుంది చిన్ని గారు. ష్హ్.. .గట్టి గా అనకండి అదుగో నేను గాయాలు చేసేనా... నాకు చెయ్యలేదు మీరు అని వాదానికొస్తుందేమో ఆమె. :-)

తృష్ణ చెప్పారు...

నేను అక్కడ పుట్టకపోయినా పెరిగి తిరిగింది కృష్ణమ్మ ఒడిలోనే నండి.... నాక్కూడా కృష్ణమ్మ అంటే గోదావరంత ఇష్టమూనూ...

(కృష్ణ)అమ్మ మీద అలిగినా అమ్మకి కోపం రాదులెండి...!!

Padmarpita చెప్పారు...

నిజమేకదా!!

సురేష్ చెప్పారు...

బాగుందండి.

కృష్ణమ్మకు, ఎంత ప్రేమ ఉప్పొంగిపోతే మాత్రము సాగరుడితో కలవడానికి అంత దూకుడుగా వెళ్లాలా? బిడ్డలకు బాధ కలుగుతుందని చూసుకోనక్కరలా?

SRRao చెప్పారు...

దారి తప్పుతున్న జనానికి ఒక మొట్టికాయ వేసిందండి! నిజానికి చాలామంచిది కృష్ణమ్మ. ఎంతోమందికి అన్నం పెడుతున్న అమ్మలాంటి కృష్ణమ్మంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మీకు దీపావళి శుభాకాంక్షలు.

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు.

జయ చెప్పారు...

కృష్నమ్మా తోటి, నాకు చిన్నప్పటి అనుబంధం. నాగార్జున సాగర్ లో, క్రిష్నమ్మ ఒడిలోనే పెరిగాను. ఇంతటి ఉత్పాతం ఎప్పుడూ చూడ లేదు. మళ్ళీ మంచి రోజులు వొస్తాయన్న ఆశ ఉంది. మీకు దీపావళి శుభాకాంక్షలు.

Hima bindu చెప్పారు...

@శేఖర్
ధన్యవాదాలు
@భావన
నిజమేనా !ఎదురు దాడికి రావొచ్చా ....
@తృష్ణ
కృష్ణమ్మకి మీకును అనుభంధం వుందా .....అందుకే ఆ జాడలా ;):)
@పద్మర్పిత
నిజంగా నిజం

Hima bindu చెప్పారు...

@సురేష్
ధన్యవాదాలు .
సాగరుడు తొందర చేసాడేమో
@ఎస్.ఆర్.రావు
మీకును దీపావళి శుభాకాంక్షలు
@చిలమకురి విజయమోహన్
దీపావళి శుభాకాంక్షలు ..
@జయ
మీరును కృష్ణమ్మ ముద్దుబిడ్డలే!......మొన్నీమధ్య అనుకోకుండా కృష్ణ వారధి పై ప్రయాణం చేసాను ...ఎంత ఆశ్చర్యం వేసిందో ....నిజంగా పన్నెండు క్యూసెక్కులు ప్రవహించిధ అనిపించింది ....ఎండ కి వెండి బంగారం లా మెరుస్తున్న ఇసుకలో ...పిల్లలు ఆడుకుంటూ ...బట్టలు ఆరవేసి ....తీరికగా బ్రిడ్జి నీడల్లో పడుకుని కబుర్లు చెప్పుకుంటున్న గేధలకాపర్లు ...అక్కడక్కడే తిరుగుతున్న గేదలు ...అసలు అక్కడ ఏమి జరగనట్లు ......వండర్ .
తప్పకుండ మంచిరోజులు వస్తాయి .

తృష్ణ చెప్పారు...

పుట్టింది రాజమండ్రీ లో..పెరిగింది విజయవాడలో..కృష్ణమ్మతో 28ఏళ్ళ అనుబంధం..!!
(దేవకీ..యశోదలన్నమాట..)

మరువం ఉష చెప్పారు...

మీలో కలిగిన స్పందన అద్భుతం. అది వెలికి తేవటమ్లో మీకు 10/10

Hima bindu చెప్పారు...

@తృష్ణ
దేవకీ మీదకంటే యశోద మీదే ప్రేమ ఎక్కువనుకుంటాను .-:)
@ఉష
హమ్మో !పదికి పది మార్కులే .......అంత అర్హత వుందంటారా ....ఏదో పిచ్చిది మురిసిపోతుందని వేసారా ?......ధన్యవాదాలు .

మురళి చెప్పారు...

బాగుందండీ.. ఉధృతమైన వరద తర్వాత ఏ నదిని చూసినా (గోదావరి, కృష్ణ) నాకూ అలాగే అనిపిస్తుంది