1, మే 2009, శుక్రవారం

విన్నపం

మూడు రోజులనుండి ఒకటే ఎదురుచూపులు .....నిద్రపోయేముందు అదే ఆలోచన మెలుకవ రాగానే అదే ....గబగబా నిద్ర కళ్ళతోనే ఏమైనా దానికి సంబంధించి వార్త వుంటాదేమోననిసాయంత్రం వరకు అదే నిరీక్షణ ....అనుకున్నా ఈరోజు రానే వచ్చింది ..కాని ఇదెలా జరిగిందీ ?ఎవరిని అడగాలి ...నాది బహుశా అతి ధీమానో ....మనకి రాక ఇంకేవరికనో ....ప్రశాంతంగా ప్రవహిస్తున్న "ప్రవాహాన్ని "డిస్టర్బ్ చేశానా .....నేనే కదా కారణం ....ఏంచేయాలి ?ఎలా చేయాలి ......జరిగిందంతా కల అయితే ఎంత బాగుండును ....ఇప్పటికి మద్యాహ్నం నుండి ఎన్నోసార్లు ...లేక్కలేనన్నిసార్లు ....కాని ఇది నిజంగానే "నిజం"....
భగవంతుడా ....కనీసం వారికి నూతనోత్తెజన్నయిన ఇవ్వగలవా ....తిరిగి లేచి పోరాడగల శక్తిని ప్రసాధించగలవా .... "గెలిచేవరకు"...నిజ్జంగా నిజం ...ఇంక నిన్నేమి అడగను ...ప్లీజ్.

10 వ్యాఖ్యలు:

ఉమాశంకర్ చెప్పారు...

ఏమయిందండీ?

శరత్ 'కాలమ్' చెప్పారు...

?

చిన్ని చెప్పారు...

@.ఉమా .....నాకు ఆప్తులయిన ఇద్దరు ఈ రోజు డిక్లేర్ చేసిన స్టేట్ సర్వీసు ఇంటర్యు లిస్టు లో లేరండి .....ఖచ్చితంగా సర్విస్ రావల్సినవారండి ...మొదటి ప్రయత్నం తోనే లక్షల మంది లో మెయిన్స్ కి అర్హత సాధించారు .....నాకు ఇది షాక్ .....ఎన్నో ఆశలు ,,కలలు ఒక్కసారే కళ్ళముందు కుప్పకూలిన భావన ........థన్క్యు.

చిన్ని చెప్పారు...

@శరత్
పైన ఉమగారికి చెప్పినదేనండి ..ఇది నాకు చాల పెద్ద విషయమండి...ధన్యవాదములు .

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

డబ్బుతో ప్రయత్నం చేయాలేమో ! అయినా ఇప్పుడు ప్రతిభకు స్థానం ఉందంటారా ? ఏమో ఇది నా అభిప్రాయం మాత్రమే ప్రస్తుత పరిస్థితులబట్టి.

చిన్ని చెప్పారు...

@విజయమోహన్ గారికి
ఇప్పుడు సందేహం లో పడాల్సివస్తుంది ......మరీ అంతటనా....?పదేళ్ళక్రితం ఇంత ఘోరం లేదండి .....

మురళి చెప్పారు...

మీ టపా, వ్యాఖ్యలు చదివాక ఈ మాట రాయాలనిపించింది. వ్యవస్థ మీద నమ్మకం కోల్పోవడం సరి కాదండి.. బాధ సహజమే, బాధలో ఉన్నప్పుడు ఇలాంటి సందేహాలు రావడమూ సహజమే.. కానీ ఇలా...

చిన్ని చెప్పారు...

@మురళి ....
నేను ఇంతేనండి ...నా మనస్సులో వున్నాది అంటాను ..నన్ను నేను మభ్యపెట్టుకోవడం చేతకాదు అలా అని వ్యవస్థని వురకనే అనను ..

Ajay :) చెప్పారు...

chinni...nuvvu deni gurinchi rasavo, enduku ala raasavo, meeratha deni gurinchi maatladutunnaro naake artham kaaledu..

చిన్ని చెప్పారు...

@అజయ్ .......ఒక్కోసారి మనస్సు బాగోపోతే ఇలా పిచ్చి రాతలు రాస్తుంటాను ..అది అర్ధం కాపోతేనే మంచిది .ఇప్పుడు బాగానే వున్నా అర్ధమయ్యే రాత రాస్తాను చూస్కోండి :):):)