20, మే 2009, బుధవారం

మా వంటింటి కథ -2

పదిరోజుల క్రిందట మా వంటిల్లు పరిచయం చేశాను ,అక్కడ నేను రోజు చూసే ప్రపంచం గురించి కూడా చెప్పేసాను ..ఇక పొతే నేను చెప్పబోయేది మా పక్కింటి వాళ్ల కథ (క్షమాపణలు). ఎదురుగా వుండే కిటికీ లోనుండి రావిచెట్టు ,పూలచెట్లు ,సూరీడు మనల్ని కులాసాగా పలకరిస్తుంటారు కాని ప్రక్క కిటికిలోనుండి పక్కింటి కొత్త దంపతులు (ఆరేడు నెలలు )గడిబిడ చేస్తుంటారు .వాళింట్లో జరిగే విషయాలన్నీ లౌడ్ స్పెకర్ లేకుండానే మన వంటగదిలో మనం బుద్ధిగా పని చేసుకుంటున్నా వినిపిస్తూనే వుంటాయి అంత పెద్ద ప్రహరీ గోడ నుండి చేదించుకుంటూ మరి వస్తుంటాయి ,ఈ గొంతు అమ్మాయిగారిదే ఆ అబ్బాయిది మాత్రం నూతిలోనుండి వచ్చే సన్నని గొంతు .


మా పక్కిల్లు ఎప్పుడో కాలనీ కట్టిన మొదట్లో ఒక ప్రభుత్వాధికారి సనాతనంగా కట్టుకున్న ఇల్లు దానిని ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా తక్కువ అద్దెకు ఇస్తుంటారు ..దానిలోకి ఎప్పుడు కొత్త కొత్త వాళ్లు మారిపోతూ వస్తుంటారు . మనం వాళ్ళను ఖాళిగా వున్నపుడు గమనిస్తుంటాము తప్పించి మాట్లాడే చనువు వుండదు .ఒక సాయంత్రం ఆఫీసు నుండి వచ్చేసరికి ప్రక్క ఇంటి ఆవరణలో సందడి సందడిగా చాలామంది వున్నారు ,అప్పటికి రెండు నెలలుగా ఆయిల్లు ఖాళీగా వుండటం వల్ల ఒక్కసారే కళ వచ్చినట్లయింది ,ఇంతకీ ఏమిటంటే ఇరువయిపుల పెద్దోళ్ళు వచ్చి కొత్తగాపెళ్ళయిన ఆ దంపతులతో కాపురం పెట్టించడానికి వచ్చారు .వాళ్లు ఒక వారం వుండి వెళ్లిపోయారు .ఆ అమ్మాయి ఎప్పుడు సందడి చేస్తూ పాటలు పాడుకుంటూ ,టివి గట్టిగ పెడ్తూ చాల సరదాగా వుండేది నేను ఉదయం అయిదున్నరకి లేచేసరికే ఆ అమ్మాయి కిచెన్ నుండి కుక్కర్ విజిల్ వినపడేది .ఆ అబ్బాయి ఎనిమిదింటికల్లా వెళ్ళిపోయేవాడు ,,ఎప్పుడు అతను వున్నా అలికిడి వినపడేది కాదు .


ఒకరోజు నేను ఆఫీసు కి వెళ్ళబోతూ కార్ ఎక్కుతుండగా ఒకతను వచ్చి మర్యాదపూర్వకంగా నమస్కారం చేసి తను పెళ్లి చేసుకుని పక్కింట్లోకి దిగానని ,తను వుద్యోగం సక్రమంగా చేస్తున్నట్లు అలానే శాలరీ పెరిగినట్లు చెప్పాడు ,నాకు మొదట అర్ధం కాలేదు తరువాత గుర్తొచ్చింది నా ద్వారా ఆ అబ్బాయికి ఒక పెద్ద కంపెనీలో వుద్యోగం వచ్చింది ఎవరో తెలిసినవాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఇంజినీరింగ్ చదివిన ఆ అబ్బాయినిసదరు కంపనీలో పెట్టించి అప్పుడే మరచిపోయాను ...కాని ఆ కంపనీ మేనేజర్ అప్పుడప్పుడు చెప్తుండేవాళ్ళు , మంచి వర్క్ చేసే కుర్రాడిని పంపానని ,,ఆ సదరు కుర్రాడే మా పక్కింట్లోకి దిగిన జంటలోని వాడు .ఆ అబ్బాయి చాల నిదానంగా అమాయకంగా కనిపించాడు (రేపు)

5 వ్యాఖ్యలు:

భాస్కర రామి రెడ్డి చెప్పారు...

కొత్తగా పెళ్ళయిందంటున్నారు, కొత్త బిచ్చగాడు పొద్దెరగడని గొడవ గొదవ చేస్తున్నారా? అయ్యో...

చిన్ని చెప్పారు...

@బాస్కర రామిరెడ్డి
చెప్తా ..చెప్తా ...:)

పరిమళం చెప్పారు...

కొత్త పెళ్ళికూతురి కళ్లు మీ జాజి పూలమీద పడలేదా ?

మురళి చెప్పారు...

"పురుషులందు పుణ్య పురుషులు ఉంటా"రని చెబుతున్నందుకు ధన్యవాదాలు :)

చిన్ని చెప్పారు...

@పరిమళం
పాపం కళ్ళు పడిన తల పైకెత్తి ఆస్వాదిన్చాలే తప్ప అందవుగా -:) వాళ్ళ ఇల్లు బాగా డౌన్ లో వుంటాదండి
@మురళి
ఆగండాగండి ....చూస్తారుగా .